2014 మే నెల ముగిసేందుకు ఇంకా మూడు రోజులుంది. ఆ రోజు వేక్ ఫారెస్ట్ విశ్వవిద్యాలయం, వింస్టన్ సెలo, నార్త్ రోేలీనా ఫాకల్టీ క్వార్టర్స్ లోని పసుపు పచ్చని గోడల మీద ఉదయ కిరణాలు మెరుస్తున్నాయి. దట్టమైన చెట్ల గుబుళ్ళని ఛేదించుకుంటూ మే నెల ఉదయపు ఎండ పెందలాడే భూమిని తాకుతుంది. ఎండ పడి చెట్ల ఆకులు బంగారు రంగు అద్దుకున్నాయి. ఆ ఇంట్లో కాస్త సందడిగా ఉంది. ఎనభై ఆరేళ్లుగా సంఘర్షణ, శ్రమ, దుఃఖం, అనారోగ్యం, బాధలూ, సన్మానాలూ, అవమానాలూ, నిర్లక్ష వైఖరి, అలసటా సహిస్తూ వచ్చిన మాయా ఏంజెలో పార్థివ శరీరాన్ని సాగనంపే క్షణం అది. మాయా ఏంజెలో చిన్నప్పటి పేరు మార్గరీటా జాన్సన్. మాయా అన్న పేరు ఆమె సోదరుడు ఆమెకి పెట్టాడు.
ఆ గదిలో యాభైకి పైగా గౌరవ పట్టాలూ, బోలెడన్ని జాతీయ అంతర్జాతీయ పురస్కారాలూ అందంగా అమర్చి ఉన్నాయి .మాయ తన జీవితం మలి దశలో గొప్ప అధ్యాపకురాలిగా పేరు తెచ్చుకుంది, కానీ ఎప్పుడూ అంతర్గతంగా మౌనంగా ఉండడమే ఆమె అసలు స్వభావం. పైకి అందరితోనూ కలుపుగోలుగా, నవ్వుతూ సరదాగా మాట్లాడే మాయ లోలోపల ఒంటరిది. తన సవతి తండ్రి ఫ్రీమన్ తన మీద లైంగికంగా అత్యాచారం చేసినప్పుడు ూడా ఆమె మౌనంగానే ఉండిపోయింది. 1928, ఏప్రిల్ 4 న జన్మించిన మార్గరీటా మూడేళ్ళ వయసులో తన తలిదండ్రులు విడాకులు తీసుకోవడం చూసింది. ఫ్రీమన్ చేసిన నేరాన్ని ఆమె తన మేనమామలకి చెప్పింది. దాని పర్యవసానంగా ఫ్రీమన్ హత్య చెయ్యబడ్డాడు. తనవల్లే కదా ఇలాంటి ఘాెరం జరిగిందని ఆమె అపరాధ భావంతో కుంగిపోయింది. పెరిగి పెద్దయాక ూడా, నేను నోరు విప్పకపోతే ఫ్రీమన్ చనిపోయేవాడు కాదు కదా అని బాధ పడుతూనే ఉంది. మార్గరీటానీ, ఆమె సోదరుడు బెలీనీ చూసుకునే బాధ్యత వాళ్ళ నానమ్మ, మిసెస్ హాండర్సన్ మీద పడింది. పొట్ట నింపుకునేందుకు ఆమె ఒక చిల్లర దుకాణం నడిపేది. తెల్ల ప్రభువుల ఇళ్ళకి ఈ అభం శుభం తెలియని చిన్నపిల్లల చేత సామాను పంపేది. నల్లగా, బలహీనంగా, బక్కపలచగా ఉండే మార్గరీటా ఆ తెల్లవాళ్ళ నోటివెంటే, ‘ఏయ్ పిల్లా … నల్లమ్మాయి !’ లాంటి నిర్లక్షంతో ూడిన సంబోధన మొదటిసారి విన్నది. ఏడేళ్ళ ఆ అమాయకపు పిల్లకి నల్ల చర్మం కలిగి ఉండడమంటే ఏమిటో నెమ్మది నెమ్మదిగా అర్థం అవడం మొదలుపెట్టింది. అంతకన్నా ూడా పేదరికం ఎంత దురదృష్టకరమో అర్థం కాసాగింది . ఇలా అడ్డమైన పేర్లతోనూ పిలిచినప్పుడు ఎదురుతిరిగితే నానమ్మ చేత తన్నులు తినాల్సి వచ్చేది. అసలు ఇలా పిలవడం తాను నల్లజాతిలో పుట్టడం వల్లే ననీ, చేసేదేమీ లేదనీ అర్థం అయింది ఆ పిల్లకి.
”ఒక కవితలో ఆమె ఇలా అంటుంది –
నా గురించి ఆలోచిస్తే నామీద నా నవ్వొస్తుంది
పగలబడి నవ్వి నవ్వి ప్రాణం పోయినంత పనవుతుంది
నా జీవితమే ఒక పెద్ద పరిహాసం
నా జీవితంలో అడుగుల లయ మాత్రమే ఉంది
అభినయం లేని నాట్యం లాగ
పాట ఉన్నా రాగయుక్తంగా కాదు వచనంలాగే ఉంది
నన్ను చూసి నవ్వీ నవ్వీ ఉక్కిరిబిక్కిరి అయిపోతాను
ఇంకొకరికోసం చాకిరీ చేస్తూనే గడిచింది
నా అరవైయేళ్ళ జీవితం
ఇన్నేళ్ళు వచ్చినా నన్ను వాళ్ళు ‘ఏయ్ పిల్లా ‘ అనే అంటారు
నేను మాత్రం, ‘చెప్పండి మేడం’ అనాలి
స్వాభిమానం వంగనివ్వదు
కానీ పేదరికం అసహాయురాలిని చేస్తుంది
నా గురించి ఆలోచిస్తే
నవ్వీ నవ్వీ కడుపు నొప్పి వస్తుంది !”
తనని చూసి తనే నవ్వుకునే సామర్థ్యం సంపాదించు కునేందుకు చిన్నప్పటినుంచే మాయ ధైర్యం చేసింది. చిన్నపిల్ల మాయ ఫిర్యాదులని వినేందుకు న్యాయస్థానం కాని, వకీలు కాని లేరు. బస్సులో ప్రయాణం చేసేప్పుడు మిగిలిన నల్లవారిలాగే మాయకి వెనక సీటే దొరిదిే. అతని పురుషాంగం ఆమెని తాట్టుే కండక్టర్ అక్కడికొచ్చి ఆమెకి ఆనుకుని నిలబడేవాడు. ఆమె అటూ ఇటూ కదులుతూ, కుంచించుకుపోతూ ూర్చునేది. నల్లపిల్లని నిరంతరం వెంటాడే బాధలు పట్టించుకునేదెవరు! ఎంత అవమానించినా, నిర్లక్ష్యం చేసినా నాన్నమ్మ ఖాతాదారులు, తెల్లవాళ్ళ ముందు వినయం ప్రదర్శించక తప్పేది కాదు. నానమ్మ అలుపెరగకుండా పగలనక రాత్రనక కష్టపడి పనిచెయ్యడం చూడడం వల్లేనేమో మార్గరీటా భవిష్యత్తులో ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోగలిగింది. రెండవ ప్రపంచయుద్ధం తరవాత నెలకొన్న ఆర్ధిక మాంద్యం ఆమెలో లోకజ్ఞానాన్ని నింపడమే కాదు, ఎవరైనా తమ భవితవ్యాన్ని తామే తీర్చి దిద్దుకోవడం సాధ్యమేనని ూడా తెలియజేసింది. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నప్పటికీ, ఎంత ఒత్తిడిని కలగజేసినప్పటికీ ఆత్మాగౌరవాన్ని ఎలా నిలుపుకోవాలో ూడా ఆమె తెలుసుకుంది. ‘స్టిల్ ఐ రైజ్’ అనే కవితలో ఆమె ఇలా అంటుంది –
”నువ్వు తీవ్రమైన, వికృతమైన అబద్ధాలతో
కలుపుకోగలవు నన్ను నీ చరిత్రలో ఒక భాగంగా
నీ నడవడితో తోసివేయగలవు నన్ను మురికి ూపంలోకి
అయినా నేను పైగుెరుతూ వస్తాను ధూళిలా”
మాయ తన జీవితంలో ఎన్నో పాత్రలు పోషించింది. వాటిలో కొన్ని ఇష్టంగానూ మరికొన్ని అయిష్టంగానూ పోషించినప్పటికీ నవ్వు ఆమెకి కవచంలా ఉపయోగపడింది. దాన్ని ఛేదించుకుని లోపలి నిజాన్ని తెలుసుకోవడం ఎవరికైనా అసాధ్యమనే అనిపించేది. యుక్తవయసులో ఉండగా మాయకి కాయకష్టం చేసుకునే నల్లవాళ్ళకి దొరి స్కాలర్షిప్ లభించింది. నృత్యం సంగీతం పట్ల ఉన్న ఆసక్తివల్ల వాటినే వృత్తిగా చేసుకోవాలని కలలు కన్నది ఆమె. కానీ ప్రేమలో పడి, పెళ్లి కాకుండానే గర్భవతి అయి ఆర్థికంగా నిలదొక్కుకోలేక నలిగిపోయింది. ప్రేమించి ఇబ్బందిలో ఇరుక్కున్నాక దాని ఆవేశం చల్లారింది. బతుకుతెరువు గురించి విచారం మొదలైంది. చేతిలో పురిటికందుతో , ఖాళీ జేబుతో ఆమె వేరే ప్రపంచంలోకి అడుగు పెట్టింది. నీతీ-అవినీతీ అనే మాటలకి అర్థమే లేని ప్రపంచం అది. బతకడం ముఖ్యం, అందుకోసం ఈ పని హీనమైనది, అనుకోడానికి లేదు. ఆకలీ, అసహాయతా అలా అనుకోనీయవు. పిల్లవాడి పెంపకం, తన ఖర్చుల సమస్య ఎదురై చదువు మధ్యలో ఆగిపోయింది. ¬టల్లో వెయిటర్‌గా, క్లబ్ లో డాన్సర్ గా, ఏ పని దొరికితే అదే చేసేది. పొట్టపోసుకోవాలి, పెద్ద పెద్ద కలలు కనే ప్రశ్నేలేదు. తెలవారుతూ ఉండగా డస్సిపోయి ఇల్లు చేరేది, పిల్లవాడికి పాలూ, మందులూ కొనేందుకు డబ్బు సంపాదించడం, ఇంటి అద్దె చెల్లించేందుకు దొరికిన పనల్లా చెయ్యడం, బస్సుల్లో పడుతూ లేస్తూ ప్రయాణాలూ, ఇవన్నీ ఆమెని మరింత కరకుగా తయారు చేశాయి. స్నేహితులు పెళ్లిళ్లకీ, పుట్టినరోజు పండగలకీ, న్యూ ఇయర్ పార్టీలకీ పిలవడం మానేశారు. వాళ్లకి కానుకలిచ్చేందుకు మాయ దగ్గర డబ్బుంటే కదా? క్రిస్మస్ పార్టీలో ఒసాేరి పొట్టనిండా తినేస్తే ఇంక జన్మలో తిండి తినాల్సిన అవసరం ఉండదని అనిపించేది ఆమెకి. ఆమె వేసుకునే శాటిన్ గౌన్లలో అతుకులు ఎక్కువగా కనబడసాగాయి. తెగిపోయిన చెప్పులు ఇక మరమ్మతుకి నిలవమని అనసాగాయి. అణచివేతకి తలొగ్గకపోతే పని ూడా దొరకదు. సగంలో ఆగిపోయిన సంగీత పాఠాలూ, చర్మం రంగువల్ల ఎదుర్కొనే కష్టాలూ మనసులోనే భరిస్తూ, జరుగుబాటు కోసం ఒకానొక సమయంలో ఆమె తన శరీరాన్నే అమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడింది. దుకాణాల్లో, రెస్టారెంట్లలో వేళా పాళా లేని ఉద్యోగాలకన్నా, ఒళ్లమ్ముకోవడం కన్నా ఒక వేశ్యాగృహం తెరవడం మంచిదనిపించి మరో ఇద్దరు స్త్రీలతో కలిసి ఆ పని ప్రారంభించింది. పోలీసుల తో ఎప్పుడూ గొడవలూ, అభం శుభం ఎరుగని చిన్న పిల్లల శరీరాలతో వ్యాపారం, రోగాలూ రొష్టులూ, నిరక్షరాస్యతా, నిస్సహాయత నిండిన ప్రపంచం అది. మాయ ఎదుట ఆ ప్రపంచం నగ్నంగా సాక్షాత్కరించింది. ఆమె దానితో ఆటలాడడం నేర్చుకోసాగింది.
ఇంకొక కవిత చూడండి –
”చాటునుంచి చూసేదాన్ని
వీధిలో వెళ్ళే ముసలి తాగుబోతు మొగవాళ్ళని
చురుగ్గా ధీమాగా నడిచే యువకులని
ఎప్పుడూ కనిపించేవాళ్ళు,ఎక్కడికో వెళుతూనో వస్తూనో
నేనక్కడ ఉన్నానని తెలుసు వాళ్లకి
పదిహేనేళ్ళ వయసులో వాళ్ళకోసం ఎదురుచూస్తూ…
నా కిటికీ దగ్గర ఆగేవాళ్ళు
యుక్తవయసు అమ్మాయిల రొమ్ముల్లా
ఎత్తుగా ఉండేవి వాళ్ళ భుజాలు
ఏదో ఒక రోజు ఆ భుజాలు నిన్ను నలిపివేస్తాయి
ఈ లోకంలోని ఆఖరి పచ్చి గుడ్డువి నువ్వే అయినట్టు చిదిమివేస్తాయి
ఆ తరవాత వాళ్ళ పట్టు బిగుస్తుంది కొద్దిగా … అతి కొద్దిగా…”
మాయ ఈ లోకంలో తనకి సరిపోయే పాత్ర కోసం వెతుకుతోంది. ఈ విశాల ప్రపంచంలో తన అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. కలలు కనాలంటే జీవితాన్ని ఇంకా బాగా, లోతుగా అర్థం చేసుకోవాలి. పీడితులకీ, పీడించేవారికీ మధ్య ఉన్న సంబంధం ఎలాంటిదో తెలుసుకోవాలి. స్త్రీ పురుష సంబంధాల్లోని యుద్ధతంత్రాన్ని గ్రహించాలి. నల్లవాళ్ళకీ తెల్లవాళ్ళకీ మధ్య ఉన్న రకరకాల తేడాలని సమీకరించి చూసుకోవాలి. తన పొడవాటి, పొందికైన శరీరాన్ని రాత్రిళ్ళు క్లబ్బుల్లో ప్రదర్శిస్తూ, నాట్యం చేస్తూ, పాటలు పాడుతూ, అక్కడికి వచ్చే జనాన్ని ఆకర్షించి డబ్బు సంపాదించుకోగలదు కాని, ‘తను’ అంటే ఏమిటో నిరూపించడం సాధ్యం కాదని తెలుసుకుంది. జీవితంతో ఆడుకుంటుంది, అలసిపోతుంది, కుప్పూలిపోతుంది, దుమ్ము దులుపుకుని మళ్ళీ లేచి నిలబడుతుంది. లెక్కలేనన్ని గాయాలూ, దెబ్బలూ – ఎవరితో చెప్పుకోగలదు? అందు వాటిని మరిచిపోవడమే మేలు. హాస్యం ఇప్పుడు పైపైన తొడుక్కున్న ముసుగు కాదు, ఆత్మలో భాగమైపోయింది. ఇది తనని తాను వెతుక్కుంటూ తెలుసుకునే ప్రక్రియ. లోకజ్ఞానం పెళ్లి చేసుకుని స్థిరపడమంటుంది, కానీ మనసు ఊగిసలాడుతుంది.
1951 లో విద్యుత్ విభాగంలో పనిచేస్తూ, ఇప్పుడిప్పుడే పైకొస్తున్న సంగీత విద్వాంసుడు, తోష్ ఏంజెలోని వివాహం చేసుకుంది. అప్పట్నుంచీ మార్గరీటా పేరు మాయా ఏంజెలో గా మారిపోయింది. ఎల్విన్ ఎలి, రూత్ బెక్ ఫోర్డ్ లాంటి నృత్య దర్శకులతో కలిసి ‘అల్ అండ్ రీటా’ అనే బృందాన్ని తయారుచేసింది. ఎన్నో నల్లజాతి సంస్థలు వీళ్ళని ప్రదర్శన లిమ్మని పిలిచాయి, కానీ వీళ్ళు ప్రేక్షకులని ఆకట్టుకోలేక పోయారు. ఆ బృందానికి అయ్యే ఖర్చులు భరించలేక పోయేవారు, ఇక వ్యక్తిగత జీవితంలో సంసార నౌక ఒడిదుడుకులకి గురైంది. తోష్ స్వభావం, నడవడీ మాయ భరించేలేకపోయింది. కొత్త దంపతుల సంబంధం విరిగి ముక్కచెక్కలయింది. పొట్టనింపుకునేందుకు మాయ మళ్ళీ నైట్ క్లబ్బులని ఆశ్రయించవలసి వచ్చింది.
మూడేళ్ళ తరవాత ‘పోర్జీ అండ్ బెస్స్’ ఓపెరా తయారుచేసేందుూ, ప్రదర్శించేందుూ ఆమెకి యూరప్ లో ఎన్నో దేశాలు తిరిగే అవకాశం దొరికింది. ఆ దేశాలన్నీ తిరిగే తరుణం లో తనలో తన తెలియకుండా దాగిఉన్న ప్రతిభని ఆమె గుర్తించింది. కొత్త భాషలని అలవోకగా నేర్చుకోగల అద్భుతమైన ప్రతిభ తనకి ఉందని గ్రహించింది.
మాయ పాటలు పాడుతుంది. ఆఫ్రికన్ జానపద సంగీతాన్ని జాజ్ తో మేళవించి ఆమె పాడే పాటలు సూటిగా శ్రోతల మనసులని తావిే. ‘మిస్ లిేప్సో’ అనే ఆమె ఆల్బం గొప్ప ప్రజాదరణ పొంది 1996లో సీడీ గా విడుదలైంది. ‘లిేప్సో హీట్ వేవ్ ‘ అనే చిత్రానికి మాయ సంగీత దర్శకత్వం వహించింది. చిత్రంలోని పాటల్లో నల్లజాతి వాళ్ళ సంఘర్షణనీ, జీవితంపట్ల వాళ్లకి ఉన్న నిండు ఆశాభావాన్నీ వ్యక్తంచేసి భావస్ఫోరకంగా ఆమె పాడిన పాటలు ఆమెకి డబ్బూ, పేరూ సంపాదించిపెట్టాయి. అయినా మాయకి ఏదో చెప్పలేని అసంతృప్తి. రకరకాల భాషలు నేర్చుకుని తన గ్రంథాలయాన్ని మరింత వృద్ధి చేసుకునే ప్రయత్నం చెయ్యసాగింది. తన చిన్నతనం లో తెల్లదొరలు వాళ్లకి అక్కర్లేని చిరిగిపోయిన పుస్తకాలు తమకి ఇచ్చెయ్యడం ఆమెకి ఇంకా గుర్తుంది. వాటి స్థానంలో చక్కటి ఎరుపు నీలం బౌండు పుస్తకాలతో తన గది నిండి పోసాగింది. మిత్రుల సలహా పాటించి ఆమె ‘హార్లెం రచయితల సంఘం’ లో సభ్యురాలిగా చేరింది. 1959లో ఆ సంఘంలోని ఎంతోమంది ప్రముఖ రచయితలని ఆమె కలుసుకోగలిగింది.హెన్రిక్ క్లార్క్, రోసా గై, పాల్ మార్షల్, జూలియన్ మేఫీల్ద్ లాంటి గొప్ప రచయితలని అక్కడే కలుసుకుంది. వీళ్ళందరూ మేధావులు. మాయ మీద వీళ్ళ ప్రభావం బాగా పడింది. 1960లో నల్లజాతి ఉద్యమాన్ని పెద్దెత్తున ప్రారంభించిన మార్టిన్ లూథర్ కింగ్ ని కలుసుకోవడం ఆమె జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. ఆ తరవాత ఆమె ‘సదరన్ క్రిష్టియన్ లీడర్‌షిప్ కాంగ్రెస్’ నిర్వాహకురాలిగా మారింది. నైట్ క్లబ్బుల్లో రాత్రంతా మేలుకుని పాటలు పాడిన మాయ ప్రస్తుతం రాత్రంతా మేలుకుని చదువుకోవడం, రాసుకోవడంలో మునిగి పోయింది. ‘ద అరబ్ అబ్జర్వర్’ సంపాదకత్వం, లేదా ‘ద ఆఫ్రికన్ రివ్యూ’ లో ఫీచర్ రాయడం. ఒక్కోసారి ఘానా విశ్వవిద్యాలయంలోని ‘స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్రామా’ లో పాఠాలు చెప్పడం లాంటివి ఆమెని అకాడెమిక్ ప్రక్రియలవైపు తీసుళ్లెసాగాయి.
1964 లో ఆమె మేల్కాం ఎక్స్ ని కలుసుకున్న తరవాత ఆఫ్రో అమెరికన్ సంఘటన లో పనిచేసేందుకు అమెరికాకి వెనక్కి వచ్చింది. మేల్కాం ఎక్స్ అంటే ఆమెకి గొప్ప గౌరవభావం. మేల్కాం హఠాత్తుగా హత్యకి గురికావడంతో ఆమెకి తీవ్రమైన మనస్తాపం కలిగింది. ఆ వ్యథనుంచి కోలుకునేందుకు ఆమెకి సాయం చేసినవాడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఆయనతో కలిసి ఆమె ఉద్యమంలో పూర్తిగా ూరుకుపోయింది. కానీ విధి ఆమెకి స్నేహితులు ఎవరూ లేకుండా చేసేందు నడుం కట్టుకున్నట్టు, ఎప్పట్లాగే ఆమె మళ్ళీ ఒంటరిదైపోయింది. 1968 లో మాయ పుట్టినరోజునే మార్టిన్ లూథర్ కింగ్ హత్య చెయ్యబడ్డాడు.
ఆ తరవాత ఎన్నో ఏళ్ళు ఆమె తన పుట్టినరోజు పండగ జరుపుకోనేలేదు. ఆ రోజు నుంచీ 2006 దాకా ప్రతి ఏటా కింగ్ భార్య కి ఆయన జ్ఞాపకార్థం బొ పంపిస్తూనే ఉంది. ఆ సమయంలో జేవ్స్‌ు బాల్డ్విన్ ఒక స్నేహితుడిలా, సోదరుడిలా ఆమెకి తోడున్నాడు. మనసులో ఎన్నో ఏళ్లుగా గూడుకట్టుకున్న భావాలన్నీ ఆయనతో ఏమాత్రమూ సంకోచం లేకుండా మాయ విప్పి చెప్పుకునేది – దుఃఖం, ఆనందం, కన్నీళ్ళూ, బాధా అన్నీ ఆయనతో పంచుకునేది. బాల్యం ఎప్పుడో దాటి వచ్చేసింది, అయినా అప్పుడు అనుభవించిన బాధల గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ‘రాయడం నీ బాధలకి ఉపశమనం కలిగిస్తుంది. నీ అనుభావాలన్నిటినీ రాయి. చిన్నతనం నుంచీ పడుతున్న కష్టాల గురించి, రక్తసిక్తమైన నీ యుక్తవయసు గురించి, పేదరికం, ఒత్తిళ్ళు, సంఘర్షణ అన్నీ అక్షరాల్లో పెట్టు. నల్లజాతివాళ్ళ జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో నలుగురికీ తెలియజేయి,’ అని బాల్డ్విన్ ఇచ్చిన ప్రోత్సాహంతో మాయకి ఒక కొత్త మార్గం దొరికినట్టయింది. ఏకంగా తన ఆత్మకథనే రాసేసింది.
‘ఐ నో వై ద జ్డ్‌ే బర్డ్ సింగ్స్’ అనే శీర్షికతో 1970లో ప్రచురింపబడిన ఆమె ఆత్మకథ, అంతవరూ ఎప్పుడూ లేనంత పేరు తెచ్చుకుని, ఆఫ్రో అమెరికన్ రాసిన మొట్టమొదటి బెస్ట్ సెల్లర్ గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ఇది మాయ మరో రూపం. మార్పు ఆమెకి సహజ గుణం. యథాస్థితిని ఆమె ఏనాడూ అంగీకరించలేదు. బాధలు శాశ్వతమని ఎప్పుడూ అనుకోలేదామె. పరిస్థితి ఏదైనా అందులో తన పాత్ర ఏమిటో వెతికి తెలుసుకునేది. జీవితం కన్నా నమ్మకం గొప్పది, అనే భావనతో అలాంటి నమ్మకం కోసమే నిరంతరం వెతిదిే. నల్లజాతి వాళ్ళకీ, స్త్రీలకీ, అసహాయులైన పిల్లలకీ అలాంటి నమ్మకాన్ని కలిగించేందుకు, వాళ్లకి దక్కవలసిన హక్కులని అందజేసేందుకు ప్రయత్నిస్తూనే ఉండేది.
ఒక ఇంటర్వ్యూలో ఆమె ఇలా అంటుంది; ”అన్ని విలువలలోకీ అన్నిటికన్నా గొప్పది సాహసం, ధైర్యం. ధైర్యం లేకపోతే మిగతా విలువలని వేటినీ మీరు రక్షించుకోలేరు. నిజంగా మీలో దయా, ఆత్మవిశ్వాసమూ, ఆత్మీయతా లాంటి గుణాలు ఎన్నైనా ఉండచ్చు గాక, కానీ వాటిని నిలుపుకునేందుకు మీకు ఎల్లప్పుడూ ధైర్య సాహసాలు అవసరమౌతాయి. అంటే నా ఉద్దేశం మీరు రణరంగంలో యుద్ధానికి వెళ్లాలని కాదు. సాహసం అంటే మీలో ఉండే మనోధైర్యం, మీ అంతరాత్మని ఇతరులకి నిజాయితీగా చూపగల సాహసం.”
ఈ ధైర్యమే 1963లో మార్టిన్ లూథర్ కింగ్ నేతృత్వంలో వాషింగ్టన్ లో రెండులక్షలమంది నీగ్రోలు జరిపిన ఊరేగింపులో ఆమె ూడా పాల్గొనేట్టు చేసింది. నీగ్రోల మనసులోని ఆకాంక్షలూ, సమాన హక్కులు కావాలన్న కోరికా ఈ ఊరేగింపుకి ప్రేరణ కల్పించాయి. ఈ ప్రేరణ తరువాతి ఇరవై ఏళ్ళ చరిత్రనీ పూర్తిగా మార్చివేసింది. ప్రపంచమంతటా నీగ్రోలు తమ సంగీతానికీ, కళలకీ, సాహిత్యానికీ ప్రత్యేకమైన గుర్తింపుని పొందసాగారు. వారితోబాటు సంగీతంలోనూ, సాహిత్యంలోనూ మాయ ూడా స్థానం సంపాదించుకుంది. 1960 నుంచి 75 వరూ నీగ్రోల ఆత్మకథలు విరివిగా వచ్చాయి. వాటిలో సామాజిక ఉద్యమాల ప్రసక్తి తోబాటు తమ హక్కుల కోసం చేసిన ఉద్యమాల ప్రసక్తి ూడా ఉంది. ఇరీనా రాతూషిన్స్క్యా రాసిన ‘గ్రే ఇస్ ద కలర్ ఆఫ్ ¬ప్ ‘, రిజోర్బెతా మేన్చ్యూ రాసిన ‘ఐ’ ఇంకా ‘ఎన్ ఇండియన్ వుమన్ ఇన్ గ్వాటమాలా’, మేరీ కింగ్ రాసిన ‘ఫ్రీడవ్‌ు సాంగ్’, ఏంజెలో డేవిస్ రాసిన, ‘ఎన్ ఆటోబయోగ్రఫీ’, మాయా ఏంజెలో రాసిన, ‘ఐ నో వై ఎ జ్డ్‌ే బర్డ్ సింగ్స్’ వంటి ఆత్మకథలలో జాతి వివక్ష, శరీరం రంగు పట్ల వివక్ష, స్త్రీల పట్ల వివక్ష మొదలైన అంశాలమీద నీగ్రో రచయిత్రులు చర్చించారు. విప్లవ భావాలతో నిండిన ఈ ఆత్మకథలు స్వేచ్ఛకీ విద్యకీ గల విడదీయలేని సంబంధాన్ని చూపిస్తాయి. విద్యావంతులు కావడమే నీగ్రో రచయితలకి తమ జాతి పట్ల చైతన్యాన్నీ, రాజకీయ, సామాజిక, సాహితీ ప్రపంచంలో ఉత్సాహంగా పాల్గొనే మార్గాన్నీ చూపింది. మాయ లాంటివాళ్ళు రాసిన కవిత్వమూ, ఆత్మకథలూ ఒక కొత్త తరాన్ని సృష్టించాయి. ఆ తరవాత శరీర వర్ణం అనే సమస్య వేర్వేరు రూపాలని సంతరించుకుంది – ఒక్కోసారి పూర్తిగా రాజకీయాలకి సంబంధించిన విషయంగా, మరోసారి సామాజిక సమస్యగా, లేకపోతే వ్యక్తిగతమైన సమస్యగా పాఠకుల ముందుకి రాసాగింది. మాయా ఏంజెలో తన ఆత్మకథ రాయడంవల్ల రెండురకాల ప్రమాదాలని ఎదుర్కోవలసి వచ్చింది. దాన్ని గురించి రెజీనా బ్లాక్ బర్న్ మాటల్లో ఇలా చెప్పాల్సి వస్తుంది, ‘నల్లజాతి స్త్రీలు తమ ఆత్మకథలు రాయడంవల్ల రెండు రకాలుగా ప్రమాదానికి గురవుతారు. ఒకపక్క అమెరికన్ సమాజంలో ఎక్కువగా వ్యాప్తిచెందిన వర్ణ వివక్ష వెనక ఉన్న రాజకీయాల ముసుగుని తొలగిస్తారు, మరోపక్క తమ జాతి పురుషుల లైంగిక అత్యాచారాలని ూడా బట్టబయలు చేస్తారు.’
తన కథ చెప్పుకునేందుకు మాయ కవిత్వాన్ని ూడా ఎంచుకుంది. లయన్ బ్లూవ్‌ు ఈ కవితలని సమీక్షిస్తూ, ‘వీటిలో వర్ణ వివక్ష, జాతి పట్ల వివక్ష, అణచివేత కలిగించిన బాధా, తమ వర్గం కోసం శుభాకాంక్షలూ ఉన్నాయి,’ అంటాడు. మాయా ఏంజెలో రాసిన కవితల్లో నీగ్రో స్త్రీల సమస్యలని ంద్రంగా చేసుకుని రాసిన కవితలు చాలా ప్రసిద్ధి పొందాయి. ‘బోర్న్ దట్ వే ‘ లో లైంగిక దోపిడీ, వేశ్యావృత్తి ఇతివృత్తం, ‘పెనోమినల్ వుమన్ ‘, ‘వుమన్ వర్క్’ వంటి కవితలు స్త్రీల గురించి రాసినవి. గృహహింస ఇతివృత్తంగా రాసిన కవిత, ‘ఎ కైండ్ ఆఫ్ లవ్ సవ్‌ు సే’. బాలకార్మికుల దోపిడీ గురించిన కవిత, ‘టు బీట్ ద చైల్డ్ వాస్ బాడ్ ఎనఫ్ ‘. ఇవికాక తాగుడు, నీగ్రో అస్మిత మీద ూడా మాయ ఎన్నో కవితలు రాసింది. ఆమె రాసిన కవితల్లో తక్కువ నిడివి గల కవితలే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ లయాత్మకత ఆమె కవితల్లోని గొప్ప విశిష్టత. ‘మోడరన్ అమెరికన్ వుమన్ రైటర్స్’ లో జాన్ బ్రైక్ స్టన్ మాయ కవితల గురించి ఇలా అంటాడు, ‘ఆమె కవితలు చదివే పాఠకులు వాటిలోని కావ్యలయ, గేయాత్మకత, కల్పనలూ, యథార్థవాదానికి ముగ్ధులౌతారు. ఈ కవితలు జాజ్ సంగీత లయలో ఉన్నాయి, అందు అవి సూటిగా చదువరుల హృదయాలని తాకుతాయి.’
మాయ కవితల్లో కల్పనా, యథార్థం మాత్రమే కాదు, స్త్రీ జీవితానికి అద్దం పట్టినట్టుంటాయి ఆ కవితలు. మాయ వ్యక్తిగత జీవితం ఎన్ని దెబ్బలకి ఓర్చుకుని ముందుకి సాగిందో చూశాం. స్వాభిమానం గల స్త్రీకి నైట్ క్లబ్బుల్లో డాన్సు చెయ్యడం, వేశ్యావృత్తిని ఆశ్రయించడం అంత సులభం కాదు. రోజువారీ ఖర్చుల గురించి బెంగ పడకుండా గడిచిన కాలం తన జీవితంలో చాలా తక్కువ అని ఆమే స్వయంగా తన ఆత్మకథలో రాసుకుంది. జాజ్ సంగీతానికి అద్భుతంగా నృత్యం చేసే మాయని చూసి, ఈమె చిన్నతనంలో లైంగిక అత్యాచారాలకీ, పురుషులు చేసిన దుర్మార్గాలకీ, అవమానాలకీ బలైందని ఊహించడం కష్టమే. ఇన్ని కష్టాలు పడి, చివరికి ప్రేమించి మోసపోయిన మాయ తనని తాను ఒక విశిష్టమైన, అసాధారణమైన మహిళగా భావిస్తుంది.
నీగ్రో, ఆపైన స్త్రీ కావటంవల్ల ఆమె జీవితమే ఒక సవాలుగా మారింది. నిరంతరం సంఘర్షణకి లోనై , ఒక నల్లజాతి రచయిత్రిగా తను జీవిస్తున్న భౌతికవాద సమాజంలో, మనసువిప్పి మాట్లాడే, రాసే స్వేచ్ఛని ూడా కోల్పోయే అవకాశం ఉన్నప్పటికీ, ఆ పరిమితులనే తన రచనలకి అనువుగా మార్చుకోగలిగింది మాయ. ఉదాహరణకి నల్లజాతి స్త్రీలు వేశ్యావృత్తిని ఆశ్రయించడంలో దేహవ్యాపారం వెనుక ఉన్న నేర వ్యవస్థ, తాగుడు అలవాటూ, పేదరికం, స్త్రీ నిరక్షరాస్యతా అంశాలమీద ఆలోచించేందుూ, రాసేందుూ ఒక దారి దొరికింది. ‘గేదర్ టుగెదర్ ఇన్ మై నేవ్‌ు’ లో ఆమె తను వేశ్యావృత్తి చేపట్టినందుకు ఎంతమాత్రం సిగ్గుపడదు. అలాగే దాన్ని గ్లామరైజ్ ూడా చెయ్యదు. తన అనుభవాలని విప్పిచెప్పి, చుట్టూ ఉన్న సభ్యసమాజంలోని ఇరుకు సందు గొందుల్లో ఇంకా వయసుకి రాని ఆడపిల్లల్ని అపహరించి ఎలా వేశ్యావృత్తిలోకి దింపుతారో, బాలకార్మికులని ఎలా తయారుచేస్తారో, స్త్రీలని ఒక క్రమపద్ధతిలో ఎలా దోపిడీకి గురిచేస్తారో స్పష్టంగా తెలియజేసింది. అందు ఆమె ఇలా అంటుంది,’ స్త్రీలకి ఎప్పుడూ చెపుతాను… ”చదవండి, పైకి అందరికీ వినిపించేలా గట్టిగా చదవండి. అలా గట్టిగా చదివితేనే భాషలోని ధ్వనులని గ్రహించగలుగుతారు. మీ భాషలోని లయని, సంగీతాన్ని, మాధుర్యాన్ని చెవులారా వినండి. మీరు పంతొమ్మిదో శతాబ్దంలో స్త్రీలు రాసిన కవితలు చదవండి. వాటిలో ఆఫ్రికన్లూ , అమెరికన్లూ , నీగ్రో లూ, తెల్లవాళ్ళూ, స్పెయిన్ దేశస్థులూ, ఆసియా స్త్రీలూ రాసిన కవితలు ఉన్నాయి. ఆ కవితలని చదవడమే కాదు, మీ అమ్మాయిలకీ, మీ మేనకోడళ్లకీ చదివి వినిపించండి. అప్పుడే వాళ్లకి తమకన్నా ముందు ఈ అనుభవాలు మీకు జరిగాయని అర్థమవుతుంది. నాలాగ ఇంతకుముందు ూడాకొందరు ఒంటరితనాన్ని అనుభవించారని తెలుస్తుంది.”
మాయ స్వీయ అనుభవాని ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేది. దాన్ని ఆధారం చేసుకునే ఆమె నిరంతరం రచనా వ్యాసంగాన్ని కొనసాగించింది. మనోధైర్యం ూడా ఆ అనుభవాలవల్లే ఆమెకి వచ్చింది. ఒక చోట ఆమె ఇలా అంటుంది, ”నా జీవితంలో నేను నేర్చుకున్నది ఏమిటంటే జనం మీరు చెప్పిన విషయం మర్చిపోవచ్చు, మీరు వాళ్లకి చేసిన సాయం ూడా మర్చిపోవచ్చు, కానీ వాళ్లకి మీరు కలిగించే అనుభూతులనీ, అనుభవాలనీ ఎప్పటికీ మర్చిపోరు. అలాగే మనమే సొంతంగా పూనుకుని చెయ్యని ఏ పనీ పూర్తికాదన్నది నా దృఢ నమ్మకం.”
జీవితం ఎప్పుడూ మాయకి సమస్యలనీ, సవాళ్లనీ సృష్టిస్తూనే ఉంది. వాటిని ఆమె అంగీకరిస్తూనే ఉంది. చివరి రోజుల్లో భయంకరమైన హృద్రోగం ఆమెని కుంగదీసింది. శరీరం పోరాడుతూనే ఉంది, కానీ మాయ రాయడం మానలేదు. డాక్టర్లు ఆమె శరీరానికి చికిత్స చేస్తూనే ఉన్నారు, ఆమె 2014 ఏప్రిల్ సెమిస్టర్ లో బోధించేందుకు, ‘రేస్ కల్చర్ అండ్ జెండర్ ఇన్ ద సౌత్ అండ్ బియాండ్ ‘ లాంటి విషయాలని పాఠ్యాంశాలలో చేర్చేందుకు ప్రయత్నిస్తూ ఉంది. ఆ కాలానికి చెందిన, ఇక్బాల్ అహమద్, ఎడ్వర్డ్ సయీద్, జాక్ దెరిదా వంటి మేధావులు, కార్యకర్తలు, విమర్శకుల పేర్ల జాబితాలో మాయా ఏంజెలో పేరు ూడా చేరింది.ఆమె చనిపోయినప్పుడు ఆ వార్త వినగానే లక్షల సంఖ్యలో స్త్రీలూ, విద్యార్థులూ, కార్యకర్తలూ విపరీతంగా చలించి పోయారు. వాళ్ళ దుఃఖం వర్ణనాతీతం! ఘనాలో ఉండే నీగ్రో అమెరికన్లు తమ దేశానికి తిరిగి రావడం గురించి మాయ ఇప్పుడిప్పుడే చెప్పడం ప్రారంభించింది, ”ఎవరైతే ఆనందంగా ఉంటారో వాళ్ళే తాము చేసే పనులకి బాధ్యత వహించగలుగుతారు. నిజానికి ఆనందం పంచుకోవలసిన ఒక భావన. పంచుకున్నకొద్దీ ఆనందం మరింత పెరుగుతుంది ! ఘనా లో ఉన్న నీగ్రోలు ఆనందానికి దూరమ య్యారు. ఆనందం ఒక్కటే వాళ్లకి విముక్తి మార్గం!”
మాయా ఏంజెలోకి వీడ్కోలు చెప్పాల్సిన సమయం ఆసన్నమయింది. ఆమె ఇంటి పసుపుపచ్చని గోడలు సూర్యుడి వెలుగులో మెరుస్తున్నాయి. కిటికీలోనుంచి సూర్యకిరణాలు ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆమె ముఖం మీద పడుతున్నాయి. సగం మూసిన రాగిరంగు కళ్ళు చర్చిలో ప్రార్థన చేస్తున్నట్టు ఉన్నాయి. నవ్వుతూ మధ్యలో అలాగే ఉండిపోయినట్టు ఆమె పెదవులమీద చిరునవ్వు అలాగే ఉంది. ఒకప్పుడు ఆరడుగులు ఉండిన శరీరం కుంచించుకు పోయినట్టు చిన్నదిగా అయింది. వెడల్పాటి ముక్కుపుటాలు అడవి వాసనలని ఆఘ్రాణిస్తున్నట్టు ఉన్నాయి. ఉంగరాలజుట్టు పూర్తిగా నెరిసిపోయింది. బరువైన చెవి రింగులు యౌవనంలో చెవులకి నప్పేవి. ఇప్పుడు ఆ చెవితమ్మల్లోని రంధ్రాలు ఒక వేలు దూరేంత పెద్దవైపోయాయి. మెడకింద చర్మం వడిలిపోయి వదులైపోయింది. ఛాతీ ముడతలు పడింది. కాలంతో ఆమె చేసిన పోరాటం తాలూకు ముడతలు అవి. ఒకప్పుడు ఉన్నతంగా ఉండిన వక్షస్థలం ఇతరుల కష్టాలలో, కన్నీళ్ళలో కరిగిపోయింది. ఆ ఛాతీ లోపలి గుండె కొట్టుకోవడం మానేసింది. ఆమె రెండు చేతుల్నీ ఛాతీ మీద ఉంచారు. ఎప్పుడో స్కూలు పుస్తకంలో పెట్టి మర్చిపోయిన ఆకులా ఆ చేతులూ, వేళ్ళూ, పల్చగా దాదాపు పారదర్శకంగా కనిపిస్తున్నాయి. కుడిచేతి చూపుడువేలు కొద్దిగా బొటనవేలివైపు వంగింది. మరుక్షణం లేచి కలం పట్టుకుని మనుషులమధ్య గల వివక్ష తాలూకు చరిత్ర గురించీ, లైంగిక అత్యాచారాల గురించీ- ఇంకా రాయవలసింది ఎంతో ఉండిపోయింది – అనుకుని రాయడం మొదలెడుతుందా అనిపించేట్టు ఉంది. విద్యార్థులకోసం నోట్సు రాసే పని ూడా
ఉండిపోయింది! ‘ఇష్టమైన పని ఎలాగైనా చేసెయ్యాలి, కానీ శరీరం సహకరిస్తేగా?’ అనుకునేది ఆమె చివరి రోజుల్లో. ఒకప్పుడు జాజ్ సంగీతానికి అద్భుతంగా నాట్యం చేసే ఆమె పాదాలు ఇప్పుడు కదలక మెదలక కర్రల్లా ఉండిపోయాయి. ఆమె శరీరాన్ని శవపేటికలో ఎత్తి ఉంచేందుకు ఎక్కువ కష్టపడలేదు… అంత ఎత్తున్న భారీ శరీరం చిక్కి శల్యమైపొయింది.
ఆమె శవం వెంట వచ్చిన విద్యార్థులూ, పాఠకులూ, స్నేహితులూ, అభిమానులూ అందరూ మాయ నిద్రపోతున్నట్టూ, ఆమెకి నిద్రాభంగం కలిగించడం ఇష్టం లేనట్టూ, గొంతు తగ్గించి మాట్లాడుకుంటున్నారు. ‘లెట్స్ నాట్ డిస్టర్బ్ హర్’ అనే భావం అందరిలోనూ నెలకొంది. గట్టిగా మాట్లాడకండి, తన కవితలతో, పాటలతో ఇక్కడ మాయా ఏంజెలో నిద్రపోతోంది! అన్నట్టుగా
ఉంది వాళ్ళ ప్రవర్తన…
చివరిగా మాయా ఏంజెలో రాసిన ‘మతాధికారి’ అనే కవితనుంచి కొన్ని పంక్తులు:
”యూదులుండే పేటలో నేను మరణిస్తే
ఆకాశంలోకి పంపకండి నన్ను
అక్కడ
చిరుతల్లాంటి ఎలుకలు తినేస్తాయి పిల్లులని
మొలకధాన్యాలు వడ్డిస్తారు ఆదివారం భోజనంలో
ఉపదేశాలు ఇచ్చేవాళ్ళలారా!
దయచేసి నాకు
బంగారం తాపడం చేసిన వీధుల గురించీ
ఉచితంగా దొరి పాల గురించీ వాగ్దానాలు చెయ్యకండి
నాలుగేళ్ల వయసునుంచీ పాల రుచి ఎరగను నేను
ఇక ఒకసారి చనిపోయాక బంగారంతో నాం పని?
నాకు కావలసినది ఎలాంటి చోటో తెలుసా?
స్వచ్ఛ మైన స్వర్గం కావాలి నాకు
కుటుంబసభ్యుల మధ్య నమ్మకం ఉండాలి
సహృదయులైన అపరిచితులు ఉండాలి
జాజ్ సంగీతం ఉండాలి
వాతావరణం ఎప్పుడూ తడిగా ఉండాలి
అలాంటి చోటికి తీసుళ్తాెనని మాటివ్వండి
లేదా ఏమీ ఇవ్వకండి నాకు !”