రాజా బొగ్గుగని- రమణిక గుప్తా అనువాదం: సి. వసంత

మనియాం, ఒరిస్సాల కూలీలను మట్టి పురుగులు అని అంటారు. వీళ్ళు రాళ్ళను వేగంగా పగలగొడతారు.అందువలన వాళ్ళకి ఈ పేరు వచ్చింది. బిలాస్‌పుర్‌ వాళ్ళు కూడా ఎక్కువగా పనిచేస్తారు. సలామూకి చెందిన కేవట్‌, చౌధరీలు లోడింగ్‌, అండర్‌గ్రౌండ్‌లో అధికంగా పనిచేసేవారు. కాని రాంచి, చాయ్‌ బాసాలలోని ఉరాంవ్‌, ముండా, హీ మొ|| ఆదివాసీల ఆడవాళ్ళు లోడింగ్‌ పనిలో నిపుణులు. గోరఖ్‌పుర్‌ కూలీలు (వీళ్ళని ”పచ్ఛమహా” మజుదూర్‌ అని అంటారు) ఎక్కువగా పని చేస్తారు. వీళ్ళు కాంపులలో ఉండకుండా సరాసరి యజమాని ద్వారా పనులు చేపడతారు. అందువలన యజమాని వైపు నుండి తక్కిన వాళ్ళపై అజమాయిషీ చేస్తూ ఉంటారు. వీళ్ళ కూలీరేటు తక్కిన వాళ్ళ కన్నా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి మెస్‌లో భోజనం పెడతారు. ఈ కూలీలను ఈ జిల్లాలో టాటా, కర్మచంద్‌ థాపర్‌ కంపెనీల వాళ్ళు పెట్టుకునేవారు. శివరామ్‌ సింహ్‌ అండ్‌ కంపెనీ ఈ పచ్ఛ మహమజుదురలను ఝార్‌ఖండ్‌లో ఉంచేవాళ్ళు.

భారతదేశానికి స్వతంత్రం వచ్చాక ప్రభుత్వంరాజుల అధికారాలనన్నింటిని రద్దు చేసింది. రాజు కామాఖ్యా నారాయణ్‌కి కూడాతన ఆస్తిపాస్తులమీద అధికారం లేకుండా పోయింది. ఆయన భూములను రైయత్‌ పేరున ప్రభుత్వం తీసుకుంది. గనుల అసుమతికి పట్టాలు ఇవ్వడం, రవెన్యూ, రాయల్టీ వసూలు చేయడం అడవులను లీజ్‌కివ్వడం మొదలైన అధికారాలను బీహారు సర్కారు చేజిక్కించుకుంది. ఇక రాజుగారి పరిస్థితి చెప్పేదేముంది. ఆయన మొత్తం దివాలా తీసారు. ఒక చతుర ధూర్తుడైన దివాలా తీసిన వ్యాపారి రాజ్‌ బహదూర్‌. తన అడవులు భూములు ఇప్పుడు ఆయనకు చెందవు. అయినా ప్రజల పేరున పట్టాలుగా రాసి ఇచ్చారు. దీని వలన ప్రజలకు ప్రభుత్వానికి మధ్య యుద్ధం మొదలయింది. ”రాజా సాహెబ్‌ తన ప్రియమైన ప్రజలకు తనకున్నదంతా దానం చేసారు. కాని ప్రభుత్వం లాగేసుకోవాలని చూస్తోంది.” అని ప్రచారం జరిగింది. ఈ విధంగా రాజుగారు ప్రజలందరిని తన వైపు తిప్పుకున్నారు.

రాజా సాహెబ్‌గారు చేసిన అద్భుతాల గురించిన ఎన్నో కథలను ప్రజలు అల్లారు. రోజు రోజుకీ ఆయన పరపతి పెరగ సాగింది. దీనివలన ఆయనకు మరింత లాభం చేకూరింది. ఆయన జనతాపార్టీ అన్న పేరున ఒకపార్టీని స్థాపించారు. ”భూములు, అడవలు ప్రజలవి” అని ఆయన ఒక స్లోగన్‌ని మొదలు పెట్టారు. రాజుగారు ప్రభుత్వంపై ఎన్నో కేసులు నమోదు చేసారు. ప్రభుత్వం కూడా ఆయన పైన ఎన్నో కేసులు పెట్టింది. దాదాపు ఇరవై సంవత్సరాలు వరకు అమాయకులైన వెనకబడ్డ తరగతుల వారిపై తనదంటూ ఓ ముద్ర వేసి వాళ్ళని తన వైపు తిప్పుకోవడమే కాదు వాళ్ల ఓటుబ్యాంక్‌ని తన గుప్పిట్లో ఉంచుకున్నారు. అందరి దృష్టిలో ఆయన ఓ గొప్ప వ్యక్తి. ఆయన చనిపోయినప్పుడు అసలు ఆయనకి చావు ఉందని వాళ్ళు కలలోకూడా అనుకోలేదు. ఆయన మృత్యువు తరవాత కూడా ఆయన పేరు అందరి నోట్లల్లో నానుతునే ఉంది. రాజు దగ్గర పని చేసే సిబ్బంది ఆయన దగ్గర ఉన్న పట్టాలను ఆయన బతికి ఉండగానే దొంగలించారు. ఇప్పటి వరకు వాళ్ళు అమాయకులైన రైతులను మోసం చేస్తునే ఉన్నారు. రైతుల నుండి డబ్బులు వసూలు చేస్తూ పాత తారీఖుల ప్రకారం భూముల సెటిల్‌మెంట్‌ చేస్తున్నారు. వీళ్ళు ప్రభుత్వంతో చేతులు కలిపి కేసులలో వీళ్ళని ఇరికించి తమ పబ్బం గడుపుకుంటున్నారు.

1952 సం||లో కౌదలా -ఝార్‌ఖండ్‌ గనుల తవ్వకాలు ప్రారంభం అయినాయి. ఎంతో మంది కాంట్రాక్టర్లు, కూలీలు తాటాకులతో గుడిసెలు వేసుకుని ఉండేవాళ్ళు. వీళ్ళల్లో అన్ని భాషల వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ ఆకుల గుడిసెలు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఉండేవి. ఇవి ఏడడుగుల పొడవు, నాలుగడుగుల వెడల్పు ఉంటాయి. నులక మంచం మీద కూర్చుంటే తల కప్పుకి తగులుతుంది. చిన్న-చిన్న నులక మంచాల కింద కోళ్ళు, మేకలు, మేక పిల్లలు, పందులు మొ||లైన వాటిని ఉంచేవారు. గుడిసెలు వరసగా వేసుకుంటారు. ప్రతీ గుడిసె బయట అరుగు ఉంటుంది. ఈ అరుగు పేడతో అలికి ఉంటుంది. దీనిమీద ఓ పెద్ద పొయ్యి ఉంటుంది. ఇది ఎండాకాలం అయినా, వర్షాకాలం అయినా, చవికాలం అయినా, ఎప్పుడు మండుతునే ఉంటుది. గుడిసెల గోడలు ఆకులతోనూ లేకపోతే మట్టితోను కడతారు. వీటిని ఛాయా (బూడిద) తో లతలు, అందమైన పూలు వేసి ఎంతో చక్కగా అలంకరిస్తారు. బయట నుండి వచ్చిన కొత్తకూలీలు మొట్ట మొదట్లో ఆకులతోనే గోడలు కట్టేవారు. తరువాత వాటిపైనే మట్టితో మెత్తేవారు. ఆదివాసీల గుడిసెలు విలాస్‌పుర్‌, మనియాలవారి గుడిసెలకన్నా కొంత ఎత్తుగా ఉండేవి. కాదలాకి చుట్టు పక్కల బంజీకి పక్కన కొందరు బిర్‌హేర్లు కూడా ఉండే వారు వీళ్ళ గుడిసెలను బైబైయు (బయా) అని అంటారు. ఇవి గూళ్ళ లాగా ఉంటాయి. బిర్‌హార్‌లు సంచారీ జాతివాళ్ళు. ఒకచోట ఉండరు. వాళ్ళు వేరేవాళ్ళ గుడిసెలలో కాని పక్కా ఇళ్ళల్లోకాని ఉండేవారు కాదు. టాటా కంపెనీ వాళ్ళు వీళ్ళ కోసం ఈ మధ్య మంచి ఇళ్ళు కట్టించారు. కాని వీటి పక్కన మళ్ళీ గూళ్ళ లాంటి గుడిసెలు వెలిసాయి. వీళ్ళ ఇళ్ళు కింద నుండి గుండ్రంగా

ఉంటాయి. చివరన గుడి గోపురంలా ఉంటాయి. ఒక గుండ్రటి ద్వారం భూమి నుండి కొంచెంపైన ఉంటుంది. కింద నుంచి కొంచెం వెడల్పు ఉంటుంది. పైన ఇరుకుగా ఉంటుంది. పోను పోను కొసగా ఉంటుంది. దీంట్లో కిటికీలు ఉండవు. ఈ ప్రదేశంలోఉండే తక్కిన ఇళ్ళకి కూడా కిటికీలు పెట్టే ఆచారం లేదు.

పల్లెటూరు వాళ్ళు ముఖ్యంగా ఆదివాసీలు మహలా (ఇప్పపూలు) ని ఏరుతారు. దానితో సారా తయారు చేస్తారు. అమ్మి ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. తురీ జాతి దళితులు అడవుల నుండి వెదురు తెస్తారు. వెదురు కర్రలను వెదురుతో చేసిన బుట్టలను అమ్ముతారు. పల్లెటూరి వాళ్ళ వృత్తి ముఖ్యంగా కర్‌ములీ (ఆదివాసీలలోఒక జాతి)లు అడవుల నుండి కట్టెలు కొట్టి తెస్తారు. వీటితో నులక మంచాలు మరికొన్ని పనిముట్లుని తయారుచేస్తారు. గనుల నుండి ఇనుమును పోగు చేస్తారు. వీటితో మేకులను తయారు చేస్తారు. అడవులు కొట్టి వేయబడినా సారా తయారు చేయడం, అమ్మడం జరుగుతునే ఉంది. కాని వాళ్ళకి గనులలో కూడా చాకిరీ చేయాల్సి వస్తుంది. ఇది తప్పని పరిస్థితి.

నునియా, భుయియాం జాతివాళ్ళు చతరా గయల నుండి వచ్చేవాళ్ళు. వీళ్ళు మట్టిని, రాళ్ళని పగల గొట్టడంలో నిపుణులు. అందువలన వీళ్ళు మట్టి పురుగులు అని ప్రసిద్ధి కెక్కారు. వీళ్ళు నాటుసారా తాగిపురుగుల్లాగా చస్తూ ఉంటారు. ఈ సారాకి బానిసలవడం వలన వీళ్ళు టిబి రోగగ్రస్తులయ్యేవారు. వీళ్ళలో టి.బి. రోగం రానివాళ్ళంటూ లేరు. ఇళ్ళలో సారా తయారు చేయడం (స్పిరిట్‌తో) సారా అమ్మడం, తాగడం, గనులలో చచ్టేలా పని చేయడం, టి.బి.తో చావడం ఇదే జీవితం ఇదంతా, వారి నిస్సహాయత. వీళ్ళందరు ఈ వ్యాపారాలు చేయడంలో కూడా దిట్టలు.

ఈ గనులలో మట్టి రాళ్ళు (ఓవర్‌ బర్డెన్‌) బొగ్గులను కొట్టడానికి వేరు వేరు కూలీలను పెట్టారు. కులీలందరు అన్ని పనులు చేస్తారు. గనులు నేషనలైజ్‌ అయ్యాక వీళ్ళకి సరి అయిన పని, పదవిని ఇప్పించడానికి నేను దాదాపు 20సం||లు పోరాడాను. లోడింగ్‌ కోసం వేరే కూలీలు ఉండేవారు. లోడింగ్‌ రాత్రింబవళ్ళు నడిచేది. బట్టలను మోబిల్‌ ఆయిల్‌లో మంచి వాటిని అంటించే వాళ్ళు. అప్పుడు అక్కడ వెలుతురు వచ్చేది. భట్టీలను ఆర్పడానికి బగలగీర్‌ ఊరివాళ్ళు వచ్చేవాళ్ళు. బొగ్గుల భట్టీలను రాత్రింబవళ్ళు కాపలా కాయాలి. సమయానికి వాటిమీద నీళ్ళు పోసి మంటలను ఆర్పేయాలి. బిలాస్‌పూర్‌ కూలీలు బొగ్గులనుకొట్టడానికి పని చేసే సమయానికి ముందే వచ్చేసేవాళ్ళు? పని చేయడం మొదలు పెట్టేవాళ్ళు? చాలామంది తెల్లవారు ఝాముననే చేరిపోయేవారు. ఈ పనిని కాంట్రాక్టు బేసిస్‌ మీద చేసేవాళ్ళు. ఎన్ని టన్నుల బొగ్గులను కొడితే అన్ని టన్నులకు కూలీ డబ్బులు వస్తాయి. గనులలో మల్‌కట్టా జాతి వాళ్ళు బొగ్గులను కొట్టేవాళ్ళు. ఆడవాళ్ళు వాటిని మోసుకుంటూ పైకి తీసుకువెళ్తారు. వీటిని 1’I10’I10′ కొలతలతో చట్టంగా తయారు చేస్తారు. ఇవి కట్టె లేక ఇనప ఫర్మేతో తయారవుతాయి. రాళ్ళు కొట్టాక, మట్టిని తవ్వాక ఎవరికైనా బొగ్గును కొట్టే పని ఈయకపోతే శిక్షగా భావించేవాళ్ళు.

బిలాస్‌పూర్‌ కూలీలు సారాను తాగుతారు కాని తయారు చేయరు. జూదం ఆడటం, వడ్డీకి ఇవ్వడం, తెచ్చుకోవడం అనే చెడు అలవాటు వీళ్ళల్లో బాగా ఉంది. వీళ్ళు తమ ఆడవాళ్ళను సైతం వీటిల్లో ఫణంగా పెట్టేవారు. ఈ దురలవాటు తక్కిన కూలీలకు మఖ్యంగా ఆదివాసీలకు కూడా అలవాటు అయింది. బిలాస్‌పూర్‌ కూలీలలో సర్‌దా ఆచారం ఉంది. వీళ్ళు తమలో తాము ఒకరితో ఒకరు వడ్డీ వ్యాపారం చేస్తారు. వడ్డీ 100 నుండి 200 దాకా

ఉంటుంది. ప్రతి నెల ఉంటుంది. బొగ్గు గనులలో పని చేసే కార్మికులు కొంత ధనం సంపాదించాక తమ తమూళ్ళకు వెళ్ళిపోయి భూములను కొనుక్కుంటారు. బిలాస్‌పూర్‌, రాయగఢ్‌లలో వీళ్ళ భూములలో నీళ్ళు లేకపోవడం వలన పంటలు పండేవి కావు. డబ్బు అవసరం వస్తే, జూదంలో ఓడిపోయినా, రెండో పెళ్ళి చేసుకోవాలను కున్నా (రెండో భార్యను డౌకీ అని అంటారు) వెంటనే భూమిని అమ్మేస్తారు. కొన్నది కాస్తా స్వాహ అయిపోతుంది. ఇట్లా కొనడం, అమ్మడంలోనే వీళ్ళ జీవితం గడిచిపోతుంది. భూమితో పాటు ధనం-దస్కం ఉంటే డౌకీని తెచ్చుకుంటే ఇంకా గౌరవం పెరుగుతుంది. తవ్వకాలలో పనిచేసి అలసిపోయి ఉంటే పాతిపడిపోతే, పడుచుతన, కోల్పోతుంటే డౌకీని మార్చాలనుకుంటే వాళ్ళ – వాళ్ళ ఊళ్ళల్లో వీళ్ళని వదిలేసి మళ్ళీ ఒక నవ యవ్వనవతిని తమతో తీసుకువస్తారు. ఇది వీళ్ళ ఆచారం. వీళ్ళ డౌకీలు కూడాపెళ్ళి చేసకుంటారు. ఈస్వేచ్ఛ వాళ్ళకి ఉంది. పంచాయితీ వాళ్ళు డౌకీలు కొత్త ప్రేమికుడికైనా లేక భర్తకైనా సరే 20 రూ||ల 25 రూ||లు దండన కట్టమని ఆజ్ఞాపిస్తారు. లేక రామాయణం ప్రవచనం ఎనిమిది రోజులు పెట్టిస్తారు. ఆ ఖర్చు వీళ్ళు భరించాలి. ఎందుకంటే ఇప్పుడు బొగ్గు గనులు ప్రభుత్వానికి చెందుతాయి. పాత డౌకీలను తమ ఊళ్ళల్లో వదిలివేయడం కుదరదు. ఇద్దరు ముగ్గురు డౌకీలను తెచ్చుకునే ఆచారం ఇప్పుడు పోయింది. ముగిషీ (గుమాస్తా)లకి లంచాలిచ్చి వాళ్ళను క్వాష్యుల్‌ లేబరుగా పనిలో పెట్టడం మొదలయింది. తమ శత్రువులకు గుణపఠం నేర్పడానికి శత్రువు డౌకీ (భార్య)పై మంత్రకత్తె అని ముద్ర వేసి ఆవిడను ఇష్టం వచ్చినట్లు హింసించేవారు. హత్య కూడా చేసేవారు.

కాంట్రాక్టు ఉన్న సమయంలో ఏ కూలీలైతే తమ ఊళ్ళకి వెల్తారో అప్పుడు దంగల్‌ సర్‌దార్‌ వాళ్ళ బదులు కొత్త కూలీలను తీసుకువచ్చి ఇంతకు ముందు వాళ్ళ పేర్లమీదే పని చేయించేవాళ్ళు. చట్టంనుండి రక్షణ కోసం కాంట్రాక్టరు అందరి పేర్లను మార్చేసేవారు. పిల్లల పేర్లమీద తల్లి తండ్రుల చేత పని చేయించే వాళ్ళు. దీనివలన అక్కడ ఏ కూలీ పర్మనెంట్‌గా ఉండలేడు. సంవత్సరంలో గనులపైన చేసే పనులలో 240రోజులు భూగర్భ గనులలో 180 రోజులు పనిచేస్తే ఆ కార్మికులని 111 పర్మినెంటు చెయ్యాలన్న నియమం

ఉంది. ఈ నియమాల నుండి రక్షించుకోడానికి 111 హాజరీ తీసుకునేవాళ్ళు కాదు. బి.పార్మ రిజిస్టర్‌ నింపేవాళ్ళు కాదు. వేజెస్‌ షీటులో కూలీ వివరణ ఉండదు. జాలీ (నకిలీ) రిజిష్టర్‌లో నకిలీ పేర్లు రాసి, నకిలీ వేలిముద్రలు వేసేవాళ్ళు బాగా నమ్మకస్తులయిన కార్మికులతోటే వేలి ముద్రలు వేయించేవారు. పాదాల ముద్రలు కూడా వేయించేవారు. 100 కార్మికులు పనిచేస్తే రిజిస్టరులో 30-35 మందిని మాత్రమే చూపించేవాళ్ళు. ఒకవేళ లేబర్‌ ఇన్‌స్పెక్టర్‌, గనుల విభాగపు ఇన్‌స్పెక్టర్‌ ఖాతాలను జప్తు చేసినా కార్మికుల పేర్లు తెలుసుకోలేరు. వీళ్ళని పర్మనేంట్‌ చేయాలని వాళ్ళు నొక్కి చెప్పలేరు. దావా వేయలేరు. (ఇంకావుంది)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.