ఆగని మృగస్వామ్యాల హత్యాకాండలు- జూపాక సుభద్ర

రోజు మహిళల మీద, బాలికల మీద జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, కిడ్నాపులు, లైంగిక వేధింపులు, పని స్థలాల్లో వేధింపులు, కుటుంబాల్లో హింసలు, దాడులు, దౌర్జన్యాల వార్తలు, ఘటనలు సంఘటన లుగానే చూస్తున్న ప్రభుత్వాలకు, పాలకులకు తోలు మందం వ్యవస్థలకు నాలుగు రోజుల్నాడు నేర గణాంకాల జాతీయ సంస్థ (ఎన్‌ఎస్‌ఆర్‌బి) వెల్లడించిన లెక్కల్ని విప్పిన డొక్కల్ని చూస్తే కనువిప్పు కలుగుతదా! గుండె ఆగిపోతదా! బాలికలమీద మహిళల మీద జరిగే నేరాలు ఒక్క రోజువి కాదు. రోజు వందల వేల సంఖ్యలో జరిగే యీ హింసా కాండల మీద ప్రభుత్వాలకు సీరియస్‌నెస్‌ లేదు. యీ హింసాకాండల మీద సామాజిక చర్చ లేదు. యీ నేరాల తీవ్రతకు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక కారణాల మీద చర్చ లేదు. మహిళా సంఘాలు, మహిళలు రోడ్డెక్కి ధర్నాలు చేసి ప్రభుత్వాల్ని నిలేస్తే గాని నేరస్థుల్ని జైల్లో తోయడంలేదు. అట్లా ఒకరిద్దర్ని జైల్లో వేసి చేతులు దులుపుకొని మహిళా రక్షణ కోసం మా ప్రభుత్వాలు పనిజేస్తున్నాయని ఊదర గొట్టుకుంటుండ్రు, జనాల్ని మాయ జేస్తుండ్రు. కాని మహిళల మీద హింసాకాండ, అత్యాచార, హత్యాకాండలు విజృంభించి పెరుగుతున్నాయే గాని ఆగడం లేదు. యుగాలు మార్తున్నయి, కాలాలు మార్తున్నయి, పాలకులు మార్తున్నరు, కొత్త కొత్త చట్టాలొస్తున్నయి గానీ మహిళల మీద మారణకాండ మార్త లేదు, ఆగుత లేదు. మహిళలు మనుషులుగా బతికే పరిస్థితుల్లేని నేరవ్యవస్థగా మగ ప్రపంచముంది.

సమాజంలో వ్యవస్థీకృతంగా వున్న ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక జెండర్‌ ఆధిపత్య మూలాల్ని కాకుండా మహిళల మీద జరిగే క్రూర నేరాల్ని చట్టం, నేరం, శిక్ష చట్రంలోనే పరిష్కారాలు వెతికే పరిమితుల వల్ల మహిళల మీద నేరాలు ఆగకుండా యేటేటకి పెరుగుతున్నయి.

ఒకవైపు మగ సమాజం నుంచి నిత్యం బతుకు భయంగా ఆడ సమాజముంటే భారత పాలక నేతలు ప్రపంచంలో ఎక్కడలేని గౌరవ మర్యాదలు భారత మహిళలకే వున్నాయని నరంలేని నాలికైతరు. ఓర్నీ ‘యత్ర నార్యస్తు పూజ్యతే’ అని వేల తరాల కాంచి వల్లిస్తూ సాటి మనిషిని మహిళ అనే భిన్న జెండర్‌ అని నారీ మేధం చేస్తుంది మదోన్మాద మైన మగోన్మాదం. యింత విధ్వంసకాండ, యింత టెర్రరిజం చేస్తున్నా ప్రభుత్వాలు, పాలకులు, రాజకీయ పార్టీలు అంతా మగమయ మౌనాలుగా వున్నయి. అసమ సమాజంలో ఏ రెండు సమూహాలు సమానంగా వుండనట్లే మహిళలు కూడా సమానంగా లేరు. వారి మీద జరిగే హింసాకాండలు కూడ మూసలుగా లేవు. పాలక కులాల స్త్రీలకు కనీసం వ్యవస్థల్ని ప్రభావితం చేసే బలాలైనా వున్నయి. వారి మీద జరిగే హింసాకాండ, దాడులపై సమాజమంతా దద్దరిల్లుతది. ఒక్క గొంతుకై అల్లకల్లోలం జేస్తది. అవి చరిత్ర లైతయి. కాని బహుజన కులాల ఆడవాళ్ల మీద రోజు జరిగే కోకొల్లల దాడులు హత్యలు, అత్యాచారాలు కనీసం వార్తలు కూడా కావు. వ్యవస్థల సపోర్టులు దొర్కవు.

నేర గణాంకాల జాతీయ సంస్థ మహిళల మీద జరుగుతున్న నమోదు నేరాల్నే లెక్కగట్టి చెప్పింది. కాని అంతకు పదింతలుగా నమోదుగాని నేరాల లెక్కల మాటేంటి? ఆ నమోదు కాని నేరాల బాధితులైన మహిళలు ఏ సామాజిక కులాలో చెప్పే సంస్థలేవి? వ్యవస్థలేవి?

ఆడమగ సమానత్వాల కోసం పనికాన్నుంచి పాలనదాకా మహిళలు అన్ని రంగాల్లో సమాన ప్రాతినిధ్యాల కోసం వేల తరాలనుంచి పోరాడుతున్న ఫలితంగా రాజ్యాంగం ‘ఆడ మగ యిద్దరు సమానమనీ మహిళల్ని బాంచల్లా చూసినా, బాదించినా, ఆమె హక్కులకు భంగం కలిగించినా శిక్షార్హులే’ అని అందమైన అందని రాత హామీలొచ్చినయి. బాంచ తనాల్ని పక్కన బెట్టండి అసలు బతికే పరిస్థితుల్లేవు మహిళలకు.

బైట రక్షణ లేదు, యింట్ల రక్షణ లేదు. తండ్రి, తాత భర్త అన్న తమ్ముడు, కొడుకు మనవడు ఎవడు ఎప్పుడు ఏ రూపంలో యెముడవుతడో తెలియని బత్కు భయం ఆడ సమాజాన్ని వెంటాడుతుంది.

యిక సమాజం పట్ల, మహిళలపట్ల బాధ్యతగా వుండాల్సిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు మహిళల మీద, బాలికల మీద జరిగే హింసాకాండలకు మహిళల్నే, బాలికల్నే బాధ్యులుగా చూపెడ్తున్నరు. గుడ్డలు సరిగ్గా లేనందువల్ల అని ఒకడు, ఆడపిల్లకు సాయంత్రాల షాపింగులెందుకు, సెల్లులెందు కు అని విరుచుకపడుతూ అబ్బాయిలు ఏదో సరదా పడిండ్రని నిందితుల్ని వెనకేసు కొస్తున్నరు.

బాలికలమీద ఆడవాల్లమీద యింత హింసాహననం జరుగుతున్నపుడు ప్రభుత్వా లు, కోర్టులు, పోలీసు వ్యవస్థలు తమ స్వామ్యా లు విడిచి మనిషి తనాలుగా యీ మగ, మద టెర్రరిజాన్ని సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక కారణాల్ని వెతికి ఆ దిశగా మహిళా రక్షణ వ్యవస్థలు రూపొందించాల్సి వుంది. మహిళా పోరాటాల ఫలితంగా వచ్చిన రాజ్యాంగ పరమైన మహిళా హక్కుల రక్షణకు, జెండర్‌ సమానత్వాల కోసం ప్రభుత్వాలు ప్రణాళిక బద్దంగా పనిచేయాలి. పోలీసు, న్యాయ వ్యవస్థల్ని పగడ్బందీగా పటిష్ఠం చేయాలి. మగ ప్రపంచాన్ని చైతన్యం చేయాలి. మహిళలు ఆత్మగౌరవంగా బతికేందుకు అన్ని వ్యవస్థల్లో మార్పు తేవాలి.

 

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.