ద్రాణ హర్షం
నిలువెత్తుగ లేచి నిలబడుతుంది.
అల్లుకున్న కోరికలెన్నో
ద్రాక్షాఫల గుళుచ్ఛాలై
రుచులూరిస్తాయి.
నయనాల నిండా
కమనీయ దృశ్య తరంగాలు
స్వరరమ్యంగా పలుకరిస్తాయి.
ఇంతకూ అదేదో
ఈ నాలుక తెరపై ప్రతిబింబించలేదు.
కథన కౌతుకం తొందరపెడుతున్నది.
అభివ్యక్తి
మేధావలయాన్ని దాటి రావటం లేదు.
ఈ జ్ఞాపకం సుతిమెత్తని వ్యాపకం మాత్రం
సరికొత్త రసానుభూతులకు
సరిగమలు పాడుతున్నది.
అనుకున్నవన్నీ అక్షరాకృతులై
మనముందర నిలువవు.
ఎంత మననం చేసుకుంటే
వాటి పర్యవసానం
అంత తన్మయత్వం కలిగిస్తుంది.
ఆకాంక్షించిన లక్ష్యం
నిర్విరామ మథనం తర్వాత
అమృతాయమానంగా ఎదుట నిలిచింది.
స్మరణ మాత్రంగా
సంలబ్ధమైన సమ్మోదం
ఉన్నతాదర్మాల కెత్తిన పతాకగా
కండ్లముందు రెపరెపలాడినందుకు
హృదయం పొందిన పారవశ్యంతో
గగనం కరచాలనం చేసింది.