నేటి సమాజంలో ఎంతో చులకనంగా, చెడు అభిప్రాయాలతో అందరూ ఆడ వారిని చూస్తున్నారు. మగవారికి ఉన్నంత స్వేచ్ఛ, ఆడవారికి లేదు. ఎందుకు? దీని ఉదాహరణ రిషితేశ్వరి అనే అమ్మాయి ఆత్మహత్య. చదువు కోసం నాగార్జున విశ్వవిద్యాలయంకు తరలివచ్చిన ఆమె, తల్లిదండ్రులకు దూరమై మరలా రాని లోకాలకు వెళ్ళింది. దీని కారణం, అబ్బాయిల మితిమీరిన ప్రవర్తన. ఇలా ఎందరో అమ్మాయిల ప్రాణాలు ర్యాగింగ్ వల్ల బలి అయ్యాయి. విద్యాలయం చదువుల కొలవు, కానీ ఇప్పుడు ఆత్మహత్యల కొలవు. విద్య పట్ల ఇష్టం లేక, ఎన్నో వ్యసనాలకు అలవాటు పడి, పాపాలు చేయటం అవసరమా!? సరదా కోసం అబ్బాయిలు తమ అక్కాచెల్లెల పట్ల చెడుగా ప్రవర్తన చేయగలరా? ప్రతీ మగ వ్యక్తి ఆడవారి పట్ల గౌరవం చూపాలి. విలువైన ప్రాణం అనవసర కార్యాల వల్ల దూరమవుతుంది.
గురువులు అనే వారు పిల్లలకు స్ఫూర్తిగా ఉండాలి. కానీ, ఆ గురువులు నేడు దుర్మార్గులు. అన్యాయాన్ని అరికట్టకుండా, న్యాయాన్ని సమర్థించకుండా విద్య చెప్పటం వల్ల ప్రయోజనం శూన్యం. మనమూ ఆడవాళ్ళం. రిషితేశ్వరి బాధ మన కళ్ళకు కట్టినట్లు ఉంది.
రండీ! అందరం చేతులు కలుపుదాం!
అందరి మోములలో చిరునవ్వు చూద్దాం!
విద్యార్ధుల మనసుల్లోని చెడు భావనను పోగొడదాం?
ప్రతీ ప్రాణాన్ని కాపాడుదాం!
Life is Precious.
Ragging should be a damage to it.