మూలవాసులదే సజీవ శిల్పం – డా|| కత్తి పద్మారావు

ఆ శిల్పం అపురూపం

ఆ మట్టిలో వెన్నెల కలసింది

శిల్పి మౌనంగానే శిల్పించాడు

కాని అందరూ తదేకంగా దానివైపే చూస్తున్నారు

ఆరూపం నిశ్శబ్దంగా ఉంది

లోకం చేత మాట్లాడిస్తుంది.

ఆ శిల్పం కళ్ళల్లో ఏదో వెలుగు

సూర్యచంద్రుల్ని మరిపిస్తుంది

అవును! శిల్పాలు చరిత్రకు గుర్తులు

వీరంతా అబద్ధాలే మాట్లాడుతున్నారెందుకు

ఎన్నో వాయిద్యాలతో

వినిపిస్తున్న ఆ సంగీతంలో

శ్రుతి తప్పింది.

ఆ కొలను ఒడ్డునే ఒకే ఒక

చెట్టు మీద కోయిల పాట

ప్రపంచగీతం అయ్యింది.

అవును! వార్డ్స్‌వర్త్‌ చిన్న పువ్వులో

అంత సౌందర్యాన్ని ఎలా చూశాడు

లండన్‌లో హౌసాఫ్‌కామన్స్‌ ఆయనకు నచ్చలేదా!

ఆ ప్రక్కనే వున్న పెద్దచర్చి

బంగారు తాపడంతో ధగధగ లాడుతోంది.

అక్కడ వందలమంది

తెల్లని వస్త్రాలు ధరించి

కేరల్‌ సాంగ్స్‌ పాడుతున్నారు

కాని, ఆయన ఆవూరి

పచ్చని తోటలోని

తుమ్మెదల గుంపు గురించే

అక్షర స్వరాలు వినిపించాడు.

నిజమే! ఆ ఎత్తుగా వున్న గణపతి కంటే

ఆ టాంక్‌ బండ్‌ మీద చూపుడువేలుతో

నిలబడ్డ నీలంకోటు శిల్పం

రాజ్యాంగాన్ని మనకు బోధిస్తుంది.

కొన్ని భావోద్రేకాలు

కొన్ని తరాల జీవన సౌందర్యాలు

ఏమిటి! అంత ఎత్తుగా చేసిన

ఆ విగ్రహానికి రాజ్యాధిపతులు

మోకరిల్లుతున్నారు.

నిజమే! మనిషి ఎంత ఎత్తు ఎదిగినా చూడడం లేదు

వినుకొండ అంచుల్లో కూర్చోని

సాలీడు కథ చెప్పిన

మహాకవి ఆయన కథ చెప్తునే వున్నాడు.

అవును! కలకత్తా కాళిక నాలుకకు

ఎన్నో నెత్తుటిగాథలు వున్నాయి

ఆ కాఫీ క్లబ్‌లో కూర్చున్న ఆ ఇరువురు

పెళ్ళి గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకొన్నారు.

కాఫీ చల్లారిపోయింది

మళ్ళీ మాటలకు ఒక గజం నేల లేదు

బొమ్మల పెళ్ళిళ్ళు, ఊరేగింపులు

అవ్వాయి సువ్వాయలు

మానవ సంబంధాల్లోని నైర్మల్యానికి కూడా

బూతు నిర్వచనాలు

ఆ హిమాలయాల్లో కూడా మీరు

రాతి బొమ్మల కోసమే ప్రయాణిస్తున్నారు

ఆ ప్రకృతి అందాలు

మీ శబ్దాల హోరులో

నిశ్శబ్దం సౌందర్యాన్ని కోల్పోతున్నాయి

విగ్రహాలు వేరు, శిల్పాలు వేరు

ఊటిలో మేఘాలు

మన చేతుల కందుతున్నాయి

ఆ పొడవాటి పొన్నాయిచెట్లు

పూలవర్షం కురుస్తుంది

ఉన్నితో నేసిన శాలువలు

ధరించిన కాంతలు

గుంపు నృత్యం చేస్తున్నారు

అడుగు అడుగుకు

చెట్లు వంగి నమస్కరిస్తున్నాయి.

వారి చిరునవ్వుల్లో

ప్రకృతి వికాశం వుంది.

తేనెల్లో ముంచిన రొట్టె ముక్కలు

వారిలోని సౌందర్యాన్ని

ఇనుమడింప జేస్తున్నాయి

ఆ ముఖాల్లో విరబూస్తున్న నవ్వులకు

ఆ పూలు వికాసం ఓడిపోతుంది

ఆ రాచ దేవేరిముఖంలో కళలేదు

ఆమె తన్ను తాను

ప్రకాశవంతం చేసుకోవడానికి

ఎన్నో నగలు ధరించింది

ఆ గిరిజన స్త్రీల ముక్కుపుడకల ముందు

అవి వెలవెలబోతున్నాయి

మూలవాసులదే సహజ సౌందర్యం

సముజ్వలత, సముత్తేజం

సజీవ శిల్పాలు వారే

వారే చరిత్రకు గుర్తులు

ఆ శిల్పాలు వన్నెలు తరగనివి సుమా

ప్రగతి కాంతులు అందులో నిక్షిప్తాలు

కృత్రిమమైనవన్ని కూలుతాయి

సహజమైనవన్ని నిలిచి వెలుగుతాయి.

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.