భూమిక ఉమెన్స్ కలెక్టివ్ ఆధ్వ ర్యంలో సెప్టెంబర్ 2015 నెలలో ఆరు కాలేజీల్లోని 612 మంది విద్యార్థులకు అవేర్‌నెస్ మీటింగ్స్ చేయడం జరిగింది. POCSO చట్టం వరకట్న నిరోధక చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టం. వరకట్న నిరోధిక చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టం. ర్యాగింగ్ నిరోధక చట్టం. యాసిడ్ ఎటాక్ట్స్ వ్యతిరేకంగాను స్త్రీలకు రక్షణ గురించి గృహహింస నిరోధక చట్టం గురించి స్థూలంగా వారికి వివరించాము. స్త్రీలు, పిల్లలపై జరిగే హింసను ఆపటానికి ప్రభుత్వం, పోలీసులు, స్వచ్చంద సంస్థలు చేస్తున్న వివిధ కార్యక్రమలు, సపోర్ట్ సిస్టమ్స్ గురించి వారికి వివరంగా తెలియజేశాము. విద్యార్థులంతా సమాజంలో తమ కుటుంబాల్లో అమలవుతున్న జండర్‌పరమైన వివక్షా రూపాల గురించి చర్చించారు. దీన్ని అపటానికి వారు వ్యక్తిగతంగాను స్నేహితులతో కలిసి తాము చేయవలసిన కృషిని గురించి వారితో చర్చించాము. చివరగా విద్యార్థులంతా స్త్రీలు, పిల్లలపై జరిగే హింసను మౌనంగా చూస్తూ వుండబోమని, తమ దృష్టికి వచ్చిన సంఘటనల్ని తాము అడ్డుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.