భూమిక ఆధ్వర్యంలో సెప్టెంబర్ 19వ తేదీన వివిధ ఎన్‌జిఓలలో పనిచేస్తు సభ్యులకు కొత్తగా వచ్చిన చట్టాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించాం. ఇందులో ముఖ్యంగా పిల్లలపై లైంగిక వేధింపుల రక్షణ చట్టం , 2012 గురించి యునిసెఫ్‌తో కలిసి పనిచేస్తున్న డేవిడ్ సవివరంగా చర్చించారు. తరువాత భూమిక నుండి సత్యవతి పనిచేసే చోట స్త్రీలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం గురించి వివరంగా తెలిపారు. ఇందులో ముఖ్యంగా స్త్రీలు పనిచేసే ప్రతిచోట ఈ చట్టం అమలు కోసం ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీల ఏర్పాటు ఆవశ్యకత గురించి, కమిటీ బాధ్యతల గురించి వివరించారు. తర్వాత స్త్రీ శిశు అభివృద్ధి శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి తెలంగాణ ప్రభుత్వం స్త్రీలకు అన్ని రకాల సహాయాలను ఒకేచోట అందించటానికి ఏర్పాటు చేసిన ”సఖి సెంటర్లు” (ఒన్ స్టాప్ క్రైసిస్ సెంటర్) గురించి, వాటి ఉద్దేశ్యం, పని విధానాలు, స్టాఫ్ నియమాకం గురించి తెలిపారు.
స్త్రీలు, అమ్మాయిలపై జరుగుతున్న సంఘటనలపై వెంటనే స్పందించి చర్యలు చేపట్టడానికి వీలుగా ఈ అంశాలపై పనిచేసే సంస్థలు అన్ని కలిసి ఒక ఫోరంగా ఏర్పాటు అవ్వాలని, ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది.