ఉత్తరాంధ్రలో వృద్ధ బాలికలు… తప్పెవరిది? – పి. ప్రశాంతి

మే నెలాఖరు…

ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న శాంతి గ్రామాల సందర్శనకి బయలుదేరింది. సూర్యుడు ప్రకాశవంతంగా వెలుగుతున్నాడు… ఉదయం ఏడున్నరే అవుతున్నా చల్లటిగాలి వేడెక్కుతోంది… ఎక్కడా పచ్చదనం లేదు… వాడి పొడిబారిన ఆకులు గలగలమంటున్నాయి. రోడుప్రక్క అక్కడక్కడా ఉన్న పాత నిద్రగన్నేరు చెట్లుమాత్రం తమ శక్తిమేర చల్లటి నీడ నివ్వడానికి ప్రయత్నిస్తున్నాయి.

అల్లంత దూరంలో సీతాకోక చిలుకల గుంపులా… రంగురంగుల లంగా జాకెట్లు, లంగా ఓణీలు వేసుకున్న అమ్మాయిలు… గుంపుగుంపులుగా కబుర్లు చెప్పుకుంటూ ఒకే వైపెళ్తున్నారు. దగ్గర్లో హైస్కూలుందేమో అనుకుంటూనే… వేసవి సెలవులిచ్చారు కదా అని గుర్తొచ్చి వాళ్ళవైపు చూసింది. ఎవ్వరి చేతుల్లో పుస్తకాలు లేవు. అందరి చేతుల్లో చిన్న బుట్టలు, ఒక టిఫిన్‌ బాక్స్‌, నీళ్ళ సీసా, ఒక తువ్వాలు ఉన్నట్లున్నాయి. జీపులో వెళ్తున్న శాంతి వాళ్ళని చూస్తూ చెయ్యూపింది. జవాబుగా అక్కడక్కడా కొంతమంది అమ్మాయిలూ నవ్వుతూ చేతులూపారు. సుమారు ఐదారు నిమిషాల పాటు గుంపులు గుంపులుగా ఎదురౌతూనే

ఉన్నారు. ఊర్లోకెళ్ళాక తెలిసింది వాళ్ళంతా దగ్గర్లో ఉన్న జీడిపిక్కల ఫ్యాక్టరీలో పనికెళ్తున్నారని!

సాయంత్రం 6.30 సమయంలో మరో గ్రామానికెళ్తుంటే మళ్ళీ కనిపించారు… గుంపుగుంపులుగా ఇళ్ళకెళ్తున్న అమ్మాయిలు. జీపులో ఉన్న శారదని చూసి ‘అక్కా…’ అంటూ చేతులూపారు ఒక గుంపులోనుంచి… ‘భీమునివలస ఎల్లున్నాం’ అన్న శారద మావూరికి ‘ఆ ఊరోళ్ళు ముందెల్తన్నారక్కా… ‘ అంటూ అరచి చెప్పిందొకమ్మాయి. కొంతదూరం వెళ్ళాక ఆ ఊరి అమ్మాయిల గుంపొకటి కనిపిస్తే జీపులో ఎక్కించుకొని ఏడవుతుండగా ఊరు చేరుకున్నారు. ఒక గంట తర్వాత ఆనాటి సమావేశం యుక్తవయసు బాలికలతోనే జరిగింది. దాదాపు నలభైమందొచ్చారు. అందరూ 12-18ఏళ్ళ మధ్య వయసువారే.

వాళ్ళల్లోంచి ఏడెనిమిది మంది మాత్రమే హైస్కూలుకెళ్తున్నారు. మరో పదిమంది వరకు హాస్టళ్ళలో ఉండి చదువుకుంటున్నారు. మిగిలిన వాళ్ళంతా బడి మానేసి, పెళ్ళి కోసం వారి కట్నం డబ్బు వారే సంపాదించుకునే పన్లోఉన్నారు. ఎంత తొందరగా పని చేయడం మొదలుపెడ్తే అంత ఎక్కువ కట్నం డబ్బులు కూడబెట్టొచ్చు. ఎంత ఎక్కువ కూడబెడ్తే అంత ‘గొప్ప సంబంధం’ వస్తుంది! అందుకేనేమో అక్కడ ఎవ్వరికీ 17, 18 ఏళ్ళలోపు పెళ్ళిళ్ళు, అంటే బాల్యవివాహాలవ్వవు!!

అయితే, చేతులకి గోళ్ళులేని, వెళ్ళ చివర్లు తినేసిన అమ్మాయిలకి తొందరగా సంబంధాలు కుదరవు, కుదిరినా లక్షల్లో కట్నం అడుగుతారంటుంటే వాళ్ళ చేతులు పట్టుకుని చూసింది శాంతి. దాదాపు అందరి చేతులు నల్లగా, పగుళ్ళొచ్చి, మొద్దుబారి, గొళ్ళు అరిగిపోయి, వేళ్ళ చివర్లు చెదలు తిన్నట్టుగా…

ఆ ప్రాంతంలోని యుక్తవయసు అమ్మాయిలు, యువతులు చాలా మంది జీడిపిక్కల ఫ్యాక్టరీలో పనిచేస్తారు. తెల్లటి జీడిపప్పు… కాజు గుళ్ళు తియ్యడానికి, గట్టిపెచ్చుతో ఉండే జీడిపిక్కల్ని కాల్చి, పగలగొట్టి పప్పు తీయాలి. పెంకులాంటి పెచ్చుని పగలగొట్టేటపుడు నూనేలాంటింది చిమురుస్తుంది. అది నల్లగా చేతులకి పట్టేయడమేకాక, కొన్ని రోజులకి వేళ్ళని, గోళ్ళని తినేస్తుంది. లేద వేళ్ళు మొద్దుబారిపోతాయి. పుండ్లు పడుతాయి… అయితేనేం, మంచి సంబంధం కోసం కట్నం కూడబెట్టుకొవాడానికి ఆ వేళ్ళు నల్లగా నవ్వుతూ తెల్లటి జీడిపప్పుని చకచక ఒలిచేస్తాయి.

అంతేకాదు, కిలోల్లెక్కన లెక్కకట్టిస్తారు కనుక మూత్రానిక్కూడా లేవకుండా నేలమీదే కూర్చుని పని చేయడం వలన కాళ్ళు, నడుము నొప్పుల్తో పాటు కడుపు నొప్పీ సాధారణమే. మూత్రసంచి, గర్భసంచిలపై ఒత్తిడి వల్ల భవిష్యత్తులో వచ్చే సమస్యలు తెలియట్లేదు… పట్టిఇంచుకోవట్లేదు.

ఇవన్నీ మనస్సులోకి రాకుండా

ఉండడాన్కి గాలి, వెలుతురు లేని షెడ్లల్లో అంతెత్తున పిల్లర్లకి వేలాడేసిన పొర్టబుల్‌ టి.విల్లో వేసే సినిమాలే ఫ్యాక్టరీ వారిచ్చే తాయిలం. గంటల తరబడి కింద కూర్చుని చేతుల్తో పనిచేస్తూనే ఆ సినిమాలు, సీరియళ్ళు చూస్తుండటంతో మెడనొప్పి, వెన్నునొప్పి… కంటి చూపుకి సంబంధించిన సమస్యలు సరేసరి.

పగుళ్ళొచ్చి, పచ్చిబారిన వేళ్ళతొ… నల్లబారి ఒక రకమైన ఘాటు వాసానొచ్చే చేతుల్తో… ఏం తింటున్నామో తెలియకుండా… టి.వికి కళ్ళప్పగించి… అసలు ఆకలే వేయదు… తిందామన్నా సయించదు… నీళ్ళూ తాగేదుండదు… అందరూ కుపోషణతో, శారీరకంగా కుచించుకుపోతూ, మానసికోల్లాసం లేకుండా… 20లకే 60ల్లా… ఒకరిద్దరు కాదు, ఉత్తరాంధ్ర అంతటా వేలల్లో… వృద్ధ బాలికలౌతూ…

వీరీస్థితికి కారకులెవరు? పెళ్ళికి కట్నం మీరే సంపాదించుకోండనే కుటుంబామా? విద్యాహక్కుని అందించలేక పోతున్న బడులా? బాలల హక్కుల్ని భంగపరుస్తున్న వ్యవస్థా? ఏ సౌకర్యాలు కల్పించకుండా చీప్‌లేబర్‌తో లాభాల్ని వెనకేసుకుంటున్న ఫ్యాక్టరీలా? చట్టాలెనున్న … అమలులో అలసత్వం చూపే అధికారులా? చూస్తూ ఊరుకుంటున్న సమాజమా??

 

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.