ఎడిటర్ గారికి,
భూమికలో ఈనాడు స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు ఒక్కొక్కటి వ్యాసాలుగా ప్రచురిస్తే బాగుంటుందని నాఅభిప్రాయం.
……..ఙ…….. – వి.ప్రభావతి, భద్రాచలం
భూమిక ఎడిటర్‌కి,
మార్చి సంచికలో వ్రాసిన ‘రోహిత్ ఇప్పుడు రెక్క విప్పిన ఉప్పెన’ ఆర్టికల్ నిజానికి యీ వ్యవస్థలో యీ రాజుల పాలనలో ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. అలానే జూపాక సుభద్ర గారు వ్రాసిన ‘మా నోట్లో మట్టి కొట్టిన యెట్టి కొలువులు ‘ నూరుపాళ్ళు నిజం.
……..ఙ…….. – బుచ్చిరెడ్డి గంగుల, ఇ-మెయిల్
భూమిక సంపాదకులకు,
నమస్కారం. ఏప్రిల్ సంచిక ద్వారా చాలా కొత్త విషయాలు తెలిసాయి. జోళెపాలెం మంగమ్మ, వకుళాభరణం లలిత వంటి వారి గురించి తెల్సుకున్నాం. వీరి జీవితాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ‘ఉత్తరాంధ్రలో వృద్ధ బాలికలు’ చదివి కళ్ళు చెమర్చాయి. వాళ్ళకోసం నేనేదైనా చేయాలన్పించింది. ప్రయత్నిస్తా!
మొత్తంగా విజ్ఞానాన్నందించే భూమికకోసం ప్రతి నెలా మొదటి వారం ఎదురు చూస్తుంటాము. మా ఎదురుచూపులకి మంచి ఫలితాల్నందిస్తున్న మీకు ధన్యవాదాలు.