తొలకరి చినుకులతో మొదలయ్యి
పచ్చదనాన్ని వ్యాపింపజేస్తూ,
పాడిపంటలకు నీటి ఆవశ్యకతనూ తీరుస్తూ,
సంతోషాలను పెంపొందింపజేస్తూ,
తీవ్రతను పెంచి,
తాగునీటి కరువును తీరుస్తూ,
ఆనందాలను అందిస్తూ,
రైతుల భాదలకు పరిష్కారం చూపిస్తూ,
నీటి కొదవకు పరిష్కారం చూపిస్తూ,
కొన్ని కొన్ని సార్లు తన ఉగ్రరూపాన్ని చూపిస్తూ,
తుఫానుగా మారి
వినాశానానికి కూడా దారి తీయగలదు వర్షం.
– బి. పూజిత, 10వ తరగతి