రైతుల కన్నులు ఆనందభాష్పాలతో నిండాయంటే,
పిల్లల ఒళ్ళు చల్లని నీళ్లతో తడిచిందంటే,
అమ్మ వేడి వంట గుమగుమలు ఇల్లంతా నిండాయంటే,
తాతయ్య గొడుగు బయటకి తీశాడంటే,
అమ్మమ్మ పెదవులపై చిరునవ్వు పులకరించిందంటే,
ఆహా! వర్షం అది నీ మహిమే.
ఆనందం అనే బట్టలు వేసుకున్న
మమకారపు మాధుర్యం నింపుకున్న
ఉత్సాహమనే రంగు పూసుకున్న
నిజాయితీ అనే నిట్టూర్పు కావాలన్న
హృదయం అనుభూతి తెలుసుకోవాలన్న
వర్షం నువ్వే నా ఆనందం
వర్షపు చుక్కల హర్షం పొందాలంటే
మనసు తలుపులు తెరుచుకోవాలంటే
తడవండి వర్షంలో..
– కె. మౌనిక, 9వ తరగతి