భూమిక ఎడిటర్ గారికి!
భూమిక సంచికలో కవనశర్మ గారు వ్రాసిన ‘ఆమె ఇల్లు’ కథ చాలా చాలా బాగుంది. అద్దె ఇంటి కోసం ఆమె పడిన పాట్లు మరియు ఆమె వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఆమె ఇబ్బందిపడిన వారినే ఆలోచింప చేసేట్టుగా చేసింది. నిర్ణయాలు తీసుకోగలిగేలా మహిళలను ఆలోచింప చేసింది. ఈ కథలోని పాత్రలు అన్ని కళ్ళకు కట్టినట్టుగా ఉన్నాయి. ఇలాంటి మంచి కథలను భూమిక పాఠకులకు అందిస్తున్నందుకు భూమికకు ధన్యవాదాలు.
– ఆర్. రమేష్ నాయుడు, హైదరాబాద్
—
భూమిక ఎడిటర్ గారికి!
భూమిక సంచికలో రాసిన చెట్లంటే ప్రాణం – ప్రాణాధారం సంపాదకీయం చాలా బాగుంది. అలాగే చైల్డ్ వెల్ఫేర్ అధికారులు పిల్లల భద్రత సత్యవతి గారు రాసిన సంపాదకీయం చిన్న పిల్లలమీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పిల్లలపై జరిగే లైంగిక హింస నుండి రక్షించుకోవడంలో ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని గుర్తుచేస్తుంది. ఇలాంటి హింస జరగకుండా ప్రజలు స్పందించాలి.
– ఎన్. రమ్య, హైదరాబాద