మోముపై ఎప్పుడూ
చెరగని చిరునవ్వు
ప్రశాంతత నిండిన
జీవనసౌరభాల గుబాళింపు
ఆత్మీయత నిండిన
ప్రేమపూర్వక పలకరింపు
విద్యార్థుల యెదగుడిలో
నిరంతరం నిలిచే సద్గురువు
సన్నిహితుల మదిలో
తరగని మధుర జ్ఞాపికల వీచిక
మాటలలో
చేతలలో
పొల్లుపోని దీక్షత
జీవన గమనంలో
అలుపెరుగని
వ్యవహార దక్షత
కనుమరుగైపోతున్న
మానవ సంబంధాల
సదా నిలిపి ఉంచే
స్నేహ వాత్సల్యాల
చెలిమి… చెలిమి… స్నేహిత…