కాస్త దుఃఖాన్ని ఆపండి!
నివాళుల
పూలమాలలు వేసింది చాలు!
మొన్న ఉయ్ మిస్ యూ విజ్జీ! అంటూ… నన్ను మెస్మరైజ్ చేసి అంతరిక్షాన విహంగమై
ఇక సెలవంటూ…
చిక్కని మేఘాల్లోకి దూరి నవ్వుతోంది
కొందరితో కల్సినా
కొందరిని విమర్శించినా
మరికొందరిని వీడినా
మూలవాసుల ముంగిట
నినాదమై మోగింది
క్షణక్షణం
మనసు తలుపులు తడుతూ
అందరి గుండెల్లో
గోదారి వరదను ముంచెత్తి
జ్ఞాపకాల తెరలను లేపుతూ
గత చరిత్రలోకి ఒరిగిపోయింది
మానసామనోజ్ఞల చేతివ్రాతై
సుధాకర కావ్యనాయికగా
అనంతలోకాలకు…
ఇక అమ్మను నేనేనంటూ…
అస్థిత్వవాద ఊపిరులూద
కలిసి నడవండని చెప్పి
చిరుదరహాసాన్ని ఒలికిస్తోంది
ఆ… నిష్కల్మష ప్రేమను అందుకుందాం మీరూ రండి…!