ప్రైవసీనా… పలాయనమా…!పి. ప్రశాంతి

శ్రావణ మాసం… ఆహ్లాదంగా ఉంది. ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు పడడం వల్ల చెట్లన్నీ పచ్చబడి కొత్త చిగుళ్లు, పూల గుత్తులతో అందంగా ఉన్నాయి. అమెరికాలో ఉండే నీల వాళ్ళ పిన్నిగారబ్బాయి పెళ్ళికని సెలవుపెట్టి పిల్లల్ని తీసుకుని వచ్చేసింది. వచ్చే రెండ్రోజుల్లో మిగతా కజిన్స్‌ అంతా పిల్లల్తో వచ్చేస్తారని, చాలా కాలం తర్వాత అందరూ కలుసుకుంటున్నామని చాలా

ఉత్సాహంగాను, ఉద్వేగంగాను ఉంది నీలకి.

పెద్దమ్మలు, పిన్నమ్మలు, మేన మామలు, వాళ్ళ పిల్లలు అందరూ కలిసి పాతికమందికి పైగా ఉన్నారు. మూడొంతుల మంది పిల్లలకి పెళ్ళిళ్ళై వాళ్ళకీ పిల్లల వడంతో జనాభా నలభై దాటింది. ఈ పెళ్ళి సందర్భంగా అందరూ ఒక దగ్గర చేర బోతున్నారన్న ఊహే ఎంతో ఉత్సాహంగా ఉంది.

చిన్నప్పుడు దసరాకో, సంక్రాంతికో, వేసవి సెలవులకో ఏడాదికి రెండుసార్లన్నా అందరూ అమ్మమ్మ గారింట్లో చేరేవారు. కబుర్లు తరిగేవి కాదు. జోకులు పేల్తూనే ఉండేవి. ఒకర్నొకరు సరదాగా ఆట పట్టించుకోవడం, ఒకరిపై ఒకరు చెణుకులు విసురుకోవడం, అందరూ కలిసి కింద కూర్చుని భోజనాలు చేయడం, ఆటలు, పాటలు, పరుగులు… చీకటి పడేటప్పటికిి గుంపుగా చేరి చందమామ కథలు, భేతాళ కథలు చెప్పుకోడాలు, భయపడ్డ చిన్నపిల్లలు పెద్దపిల్లల ఒళ్ళో చేరిపోడం, హాల్లో ఆ చివర్నించి ఈ చివరిదాకా బొంతలు పరిచి రెండు వరసల్లో తలలకి తలలు ఆనించి పడుకుని అర్థరాత్రిళ్ళదాకా నిద్రపోకుండా కబుర్లు… ఒకటేమిటి, ఎన్నో అనుభవాలు, మధురస్మృతులు.

పై చదువులకని, ఉద్యోగాలకని, పెళ్ళిళ్ళై అందరూ తలో దిక్కుకూ వెళ్ళిపోయినట్లయింది. సగం మంది విదేశాలలోనే ఉన్నారు. ఇప్పుడు మాత్రం అందరూ కలవాల్సిందే అని నిర్ణయించు కుని, పెళ్ళికి నాల్రోజులు ముందే అందరూ చేరుకోవాలని ప్లాన్‌ చేసుకున్నారు. ముందు నీల కుటుంబంతో సహా వచ్చేసింది. పిన్నికి ఇంట్లో పనుల్లోను, షాపింగ్‌ పనుల్లోను సాయం చేస్తోంది. భర్త, పిల్లలు కూడా ఇంట్లో వాళ్ళతో కలిసిపోయి సరదాగా గడుపుతున్నారు.

రెండ్రోజులైంది. మరో ఇద్దరు కజిన్స్‌ కుటుంబాలతో వచ్చేశారు. పిల్లలంతా కలిసిపోయి, ఆటలతో, మాటలతో సందడి చేస్తున్నారు. ఎవరెక్కడున్నారో ఒక కంట కనిపెడ్తూనే ఉన్న పిన్ని పరుగులు పెడ్తున్న పిల్లల్ని ‘జాగ్రత్తర్రా పడతారు’ అని హెచ్చరిస్తూనే మధ్య మధ్యలో పిలిచి

చిరుతిళ్ళు పెడ్తోంది పిల్లలకి. నాలుగు బెడ్రూంలు, హాలు, ఇంటి ముందు, మేడమీద… అన్నీ పిల్లల ఆటస్థలాలై పోయాయి. మూడో రోజుకి మిగతా కజిన్స్‌ కుటుంబాలూ దిగిపోయాయి.

ఆ సాయంత్రం టీలు తాగుతూ అందరూ కూర్చున్నప్పుడు పిన్ని, బాబాయ్‌ ఒక మాట చెప్పారు. ”హోటల్లో రూమ్స్‌ తీసుకున్నాము. కాసేపట్లో కార్లు వస్తాయి. నాలుగు రోజులు అక్కడే ఉండొచ్చు. పడుకోడానికి, స్నానాలకి పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది” అంటున్న బాబాయ్‌ని ఆశ్చర్యంగా చూసింది నీల. అక్క కాంతి, చెల్లి లీల కూడా తెల్లబోయి చూస్తున్నారు పిన్నిని. ఏ భావం లేకుండా టీ తాగుతున్న పిన్ని ‘టైమూ పాడూ లేకుండా ఒకటే ఆటలంటే పిల్లలు అలిసిపోతారు. వాళ్ళకేమన్నా తేడావస్తే మీరూ ఇబ్బంది పడ్తారు. అందుకే ఇలా..’ అంటుంటే వీళ్ళు ముగ్గురూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ప్రియ, శ్రియ కూడా ‘ఎందుకు పెద్దమ్మా మనిల్లు సరిపోతుందిగా! హోటల్‌ రూమ్‌లు.. అంత ఖర్చెందుకిప్పుడు’ అన్నారు. పెద్దాళ్ళు ‘మేముంటాంలే ఇక్కడ, పిల్లల్తో ఇబ్బంది పడ్తారు. మీరెళ్ళండి’ అంటుంటే ‘నయమేలే’ అని వెళ్ళిన

వాళ్ళు వెళ్ళిపోగా ‘మేమిక్కడే ఉంటాం’ అని ఉన్నవాళ్ళు ఉండిపోయారు.

తర్వాత తెలిసిందేంటంటే – ఇంత మందిలో పిల్లలు మా మాట వినట్లేదని, ఎక్కడపడితే అక్కడ కింద కూర్చుండి పోతున్నారని, మట్టిలో ఆడుతున్నారని, చేతులు కడుక్కోకుండా, శుభ్రం లేకుండా ఏది పడితే అది తింటున్నారని… తమకీి ప్రైవసీ లేదని, రాత్రిళ్ళు పడుకోడానికి ఇబ్బంది పడాల్సొస్తుందని రకరకాల మాటలు వినిపించడం వల్లే పిన్ని, బాబాయ్‌ ఆ నిర్ణయం తీసుకోవాల్సొచ్చిందని తెల్సింది. అందరూ కలవడమంటేనే ఎటువంటి భేషజాలు, నియమాలు, కట్టడులు లేకుండా స్వేచ్ఛగా, సరగాగా, కలుపుగోలుగా గడపాలని కదా! మరిదేంటి అని ఆశ్చర్యపోయింది నీల.

చిన్నప్పుడు అమ్మమ్మ ఇంట్లో చెట్లెక్కి జామకాయలు కోసుకుని, లంగాతో తుడిచేసి ఒకే కాయని అందరూ కొరుక్కు తిన్నది, పశువుల దగ్గరి పేడ తెచ్చి పనామె పిడకలు చేస్తుంటే పేడముద్దల్ని గోడకి కొట్టడం, దొడ్లు అలకడానికి పేడ, మట్టి నానబెడ్తే పోటీపడి కలియతొక్కడం, కింద కూర్చుని అన్నాలు తినడం, వెన్నెల్లో వసారాలో నేలమీద పడుకుని ఎన్నెన్నో కథలు చెప్పుకోడం, నిద్రొచ్చినప్పుడు ఎక్కడ చోటు దొరికితే అక్కడ పడుకుండిపోవడం… అన్నీ గుర్తొస్తున్నాయి. పిల్లలే కాకుండా పెద్దాళ్ళంతా కూడా ఎప్పుడూ ‘ప్రైవేటు’గా ఉండాలనుకున్న గుర్తు లేదు…

మరిప్పుడు… ఈ జనరేషన్‌… ఈ పరిస్థితులు… ఎందుకని అయినవాళ్ళైనా అందరితో కలిసుండలేకపోతున్నారు? ప్రైవసీ పేరుతో ఎవరి గూళ్ళల్లో వారు దూరిపోవాలనుకోవడం ఎందుకని? పంచుకోడం, ఇచ్చిపుచ్చుకోడం దూరమై పోయాయెలా? ఒక పక్క ప్రపంచమంతా ఒక కుగ్రామమంటూ వాట్సాప్‌, టిక్‌టాక్‌ లలో మాత్రం అవధులు లేకుండా ‘అన్నీ’ పంచుకోడం… మనుషుల మధ్య ఉండాల్సొచ్చేసరికి ప్రైవసీ కావాలనిపించడం… ఇది కాదా మనసుల్ని దుర్భలం చేస్తున్నది? ఇది కాదా ఆవేశంతో ఆత్మహత్యలకి ప్రేరేపిస్తున్నది?? ఇది ఉమ్మడి జీవనం నుంచి పలాయనం కాదా?? నాది-నేను నుంచి మనం-మనది భావనకి మళ్ళొకసారి రావడం సాధ్యం కాదా???

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.