If man could menstruate …!!! ఉమా నూతక్కి

If I had a hammer I’d smash patriarchy

నేను పురుష ద్వేషిని ఏమీ కాదు కానీ…

”నెలసరిలో ఉన్న స్త్రీ వంట చేస్తే మరు జన్మలో ఆడకుక్కగా పుడుతుంది” అన్న గుజరాత్‌ లోని భుజ్‌ పట్టణంలోని స్వామి నారాయణ్‌ గుడిలోని స్వామి కృష్ణస్వరూప్‌ దాసాజీ ఉవాచ చదివాక చాలా కోపంగా ఉంది.

Gloria Steinem మరీ మరీ గుర్తొస్తోంది. వ్యంగ్యంగా అన్నా.. ఎంత బాద ఉండి ఉంటే ఈ మాటలొస్తాయి?

“So what would happen if suddenly, magically, men could menstruate and women could not?

Clearly, menstruation would become an enviable, worthy, masculine event.

Men could brag about how long and how much.

Young boys would talk about it as the envived beginning of manhood.

To prevent monthly work loss among the powerful. Congress would fund National Institute of Dysmenorrhea. Doctors would research little about heart attacks from which men would be hormonally protected. but everything about cramps. Statistical survey would show that men did better in sports and won more olympic medals during their periods.”
If men could Menstruate అనే వ్యాసంలో గ్లోరియా అంటుందిలా.

నిజమే. ఏదో ఒక అద్భుతం జరిగిపోయి ఉన్న పళాన పురుషులకీ ఋతుస్రావం మొదలై, స్త్రీలకి ఆగిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది?

ఋతుస్రావం అనేది మగతనానికి సంబంధించిన ఒక గొప్ప విషయంలా, అంద రూ అసూయపడే అద్భుతమైన విషయంలా మారిపోయేదా?

మగవాళ్ళంతా ”తామెంతసేపు ఎంత బాగా” అన్న లెవల్‌లో మాట్లాడుకునేవారా.

… … …

మాకు సైకిల్స్‌ మొదలైనపుడు

ఉడుకుడుకు నీళ్ళతో హాయిగా స్నానం చేయించి సాఫ్ట్‌ ఫుడ్‌, మెత్తటి బట్టలు వేసి, సేదతీర్చిన మా అమ్మమ్మ కాలిగోటికి కూడా వీళ్ళు సరిపోరు కదా.

ఇదంతా పక్కనబెడితే అసలు స్త్రీ ఋతుస్రావం అన్నది ఎప్పటికప్పుడు ప్రధాన వార్తగా ఎందుకు మారాల్సి వస్తుంది. లింగ భేదాన్ని బట్టి మనిషికి ఉండే శారీరక ధర్మాలలో స్త్రీకి సంబంధించిన శరీర ధర్మమది. ఋతుచక్రంలో అదొక భాగం.

అదేదో పాపం అని భయపెట్టి యుగయుగాలుగా స్త్రీని ఒక ఆత్మరక్షణలోకి నెట్టివేసి వేడుక చూసింది ఇక చాలు.

గోవు ఇంట్లోకి వస్తే శుభమంటూ దాన్ని ఇంట్లో ఉన్న గదులన్నీ తిప్పి దానికి సాష్టాంగ నమస్కారం చేసే సమాజం, అదే ఇంట్లో పొద్దుటినుండి రాత్రి వరకూ రెక్కలు ముక్కలు చేసి కష్టపడే స్త్రీకి మాత్రం ఆ మూడు రోజులూ తన ఇంట్లోకి ప్రవేశం లేదట. ఏమి ధర్మమిది? ఎవరు రాసిన ధర్మమిది?

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో రౌత్‌ గరా అనే ఊళ్ళో స్థానికంగా ఉన్న బడికి నెలసరి రోజుల్లో అమ్మాయిలు వెళ్ళరట. ఎందుకంటే వాళ్ళు వెళ్ళాల్సిన దారిలో చాము అమ్మవారి గుడి

ఉందట. నెలసరి రోజుల్లో ఆ గుడి దాటితే అమ్మవారి ఆగ్రహానికి గురవుతామనే భయం అట. ఎక్కడి నుండి పుట్టింది ఈ భయం? ఇది ఒక్కనాటిదా?

ఆది నుండి స్త్రీ పురుషుల మధ్య సాంఘి క సర్దుబాటు పురుషులకే అనుకూలంగా

ఉన్నాయి కాబట్టే కదా ఈ భయాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి? సమాజంలో చాలామంది మంచి మగవాళ్ళు ఉండొచ్చుగాక స్వామి కృష్ణస్వరూప్‌ దాసాజీ లాంటి కుళ్ళు కూడా ఇదే సమాజంలో ఉందిగా. వేలికి కొంచెం ఇన్‌ఫెక్షన్‌ వస్తే చాలుగా కాలు మొత్తం పాకడానికి. ఇలాంటి మనుషులూ అంతే. వీళ్ళకి అన్నీ అపవిత్రమే..

సహజ ప్రక్రియ అయిన ఋతుస్రావాన్ని చూపించి స్త్రీ పై ‘అపవిత్ర’ అని ముద్ర వేయడం ఏ అనాగరిక యుగపు లక్షణం? స్త్రీ గర్భసంచిలో నుండి వచ్చే రక్తమే అపవిత్రం అయినప్పుడు అదే గర్భసంచిలో తొమ్మిది నెలలు ఉండి వచ్చిన మగవారు ఎలా పవిత్రం? మరి పుట్టుకతోనే అపవిత్రమైన మీరు ప్రవచించే ధర్మాలు ఎలా పవిత్రమవుతాయి? ఎలా ఆచరణీయం అవుతాయి?

ఒక పక్క అర్థనారీశ్వరతత్వమంటూనే మరో పక్కన

”పితాః రక్షతి కౌమారే

పతి రక్షతి యౌవనే

పుత్రో రక్షతి వార్దక్యే

న స్త్రీ స్వాతంత్రమర్హతి’

అంటే ‘కౌమార దశ వరకు తండ్రిచే రక్షింపబడాలి, యౌవనంలో భర్తచే రక్షింపబడాలి, వార్దక్యంలో కొడుకులచే రక్షింపబడాలే కానీ, స్త్రీ స్వాతంత్య్రానికి అర్హురాలు కాదు’ అని చెప్పేదీ వీరే.

అంటే స్త్రీకి తనని తాను రక్షించుకునే హక్కు లేదనే కదా?

అసలు స్త్రీ రక్షింపబడాల్సింది ఎవరి నుండి? వారి నుండి ప్రమాదం ఎందుకు పొంచి ఉంటుంది? మరో ఇంటికి తండ్రి నుండో, ఇంకో ఇంట్లోని భర్త నుండో, లేదా వేరే ఇంటిలోని కొడుకునుండో…? మరి వాళ్ళకి లేవా ఏ ధర్మాలూ? ఒకవేళ ఉండి ఉంటే అవెందుకు సంఘంలో ప్రాచుర్యం పొందలేదు?

స్త్రీ బహిష్టు అయితే వంట చెయ్యకూడదు

స్త్రీ బహిష్టు అయితే ఇంట్లోకి రాకూడదు

స్త్రీ బహిష్టు అయితే గుడిలోకి వెళ్ళకూడదు

స్త్రీ బహిష్టు అవ్వడమే పాపం అని సంఘం అనుకుంటున్నప్పుడు ఆ పాపం చెయ్యాలని మాకు మాత్రం ఎందుకుంటుంది?

కానీ మా శరీరం నుంచి స్రవించే రక్తాన్ని ఆపగలిగే స్థితిలో మేము లేము. రక్తం స్రవిస్తూనే ఉంటుంది. అలా స్రవించడం మా తప్పు… అదే కదా మీరు అనేది?

అందుకే ఒకే ఒక్కసారి లోకంలో ఉన్న చిన్న, పెద్దా స్త్రీలందరూ మూకుమ్మడిగా గర్భసంచి తీయించేసుకుంటే… మాకు ఇక ఏ పాపాలూ అంటవు… మా గురించి కొత్తగా ధర్మాలు రాయడానికి ఏ మనువులూ పుట్టరు…

Share
This entry was posted in మంకెన పువ్వు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.