అభయం ఎక్కడుంది…?
ఎక్కడ చూసినా భయమే…!
కంచే చేను మేస్తూ
కనురెప్పలు విషవలయమై కనుపాపను
కాటేస్తుంటే…
అడుగడుగునా అభద్రతా భావం
ఆధారమైన దారం ఉరిత్రాడై వ్రేలాడమంటుంది.
చూపులన్నీ పువ్వులై నవ్వుతూనే ఉంటాయి…
ఆ పరిమళాల వెనుక పాషాణం
పడగవిప్పిన నాగై పొంచి ఉంటాయి
ఎవరిని నమ్మాలో… ఎక్కడ ఉండాలో
ఎవరి మాటల్లో ఏ అర్థం దాగున్నదో తెలియదు
చూపుల్లో నవ్వుల్లో నడకల్లో అంతా
విషం విరుచుకు పడుతుంది
ఆడపిల్ల అడుగు వేయాలంటే భయం
స్వార్థపు ముసుగు తొడిగిన
మనుషులు మధ్య మానవ
సంబంధాలను మరిచిన
నేటి సమాజం అభయమిస్తుందా…
అపనమ్మకాల భయాన్ని తొలగిస్తుందా…
జవాబు చెప్పరేం…?