‘అరవింద మోడల్ స్కూల్’ విద్యార్థులు రాసిన కవితలు
అమ్మంటే ఎంతో ఇష్టం
నాకు మా అమ్మ అంటే ఎంతో ఇష్టం
ఆమె రుణం తీర్చుకోవడం ఎంతో కష్టం
అమ్మ పోసింది సృష్టికి జీవం
ఆమె కంటికి కనిపించే దైవం
ఆమె ఉన్న ఇల్లు అవుతోంది హరివిల్లు
అమ్మ మన ప్రియమైన నేస్తం
ఆమె పక్కనుంటే అర్థమవుతుంది సమస్తం
అమ్మ ప్రేమ వెలకట్టలేనిది
ఆమె బంధం పవిత్రమైనది
అమ్మ మన తొలి గురువు
ఆమె చూపే ఆప్యాయతకు లేదు కరువు
అమ్మ సృష్టిలో విలువైనదని తెలుసుకో
ఆమెను ప్రేమతో జాగ్రత్తగా చూసుకో!!
` ఏనుమాల హారిక, ఆరవ తరగతి
రైతన్నలను గౌరవిద్దాం
వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది
అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది
ప్రపంచానికి కల్చర్ని,
సాయం చేసే గుణాన్ని నేర్పిన
ఒకే ఒక స్ఫూర్తి రైతన్న
స్నేహితులారా మనకి 3జి 4జి అనే నెట్వర్క్
ఎక్కడైనా దొరుకుతుంది.
కానీ మన కడుపు నింపడానికి
‘‘గంజి’’ కావాలంటే
రైతన్న దగ్గర మాత్రమే ఉంటుంది,..
కాబట్టి రైతన్నలను కాపాడుదాం,
గౌరవిద్దాం, చేయూతనిద్దాం!
` మృదుల. కె, ఏడో తరగతి
రైతన్నకు వందనాలు
నువ్వు మట్టిలో బతుకుతావు
మా కోసం బతుకుతావు
మట్టిని దైవంగా కొలుస్తావు
పైరును ప్రాణంగా భావిస్తావు
నీ స్వేదంతో నేలను తడుపుతావు
నేల నుంచి సిరులు పండిస్తావు
వాన చుక్క కోసం పడికాపులు కాస్తావు
కష్టపడి పంట పండిస్తావు
మా ఆకలి మీరు మాత్రమే తీరుస్తారు
అందుకే మీకు మా వందనాలు.
`పడవల సాయి శ్రీసాయి, ఏడవ తరగతి
అమ్మ
అమ్మకన్నా మంచిది
అమ్మ వంటి పెన్నిధి
ఎంత వెతికి చూసినా
లేదు లేదు ఎక్కడా
అమ్మ కంటి
వెలుగులో
అమ్మ చేతి చలువతో
అమ్మ మనసు ప్రేమతో
ఆమె మాట తీపితో
అమ్మ ఉంటే జీవితంలో
బ్రతుకు పూల బాటలో!
` ఆర్. హేమ సాయి హాసిని, ఆరవ తరగతి