నేను ఐక్యతారాగం ట్రైనింగ్‌లో ‘‘ఇంటర్ సెక్స్‌వాలిటి’ని బాగా అర్థం చేసుకున్నాను. ఒక వ్యక్తి చుట్టూ వున్న అనేక ప్రభావాలు తనపై ఎలా పనిచేస్తాయో ‘‘అధికార చక్రం’’ అనే పద్దతి ద్వారా వివరంగా అర్థం అయ్యింది.
రకరకాల సమూహాలతో నేను పనిచేస్తున్న క్రమంలో పరిస్థితులను విశ్లేషించడానికి నేను నేర్చుకున్న ఈ అనుభవం నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
‘సమ్మతి’ అనేది క్రిమినల్ అమెండ్‌మెంట్ యాక్ట్ 376లో అత్యంత కీలకమైన విషయంగా చెప్పబడిరది. ఆ అంశాన్ని ఈ ట్రైనింగ్‌లో చేర్చటం దాన్ని విడమర్చి చెప్పటం నాకు చాలా నచ్చింది. నేను పనిచేస్తున్న క్రమంలో చాలా మంది ఆడపిల్లలు/స్త్రీలు ` వారు మోసబోయారని, వారు పోలీసులని, న్యాయవ్యవస్థని ఆశ్రయించినప్పుడు, చాలా సార్లు చట్టాన్ని సంరక్షించే పోలీసులు చట్టం తెలిసిన న్యాయవాదులు వారి మాటలను కొట్టివేసి ` వారి (స్త్రీల / ఆడపిల్లల) అంగీకారం ఉన్నందునే వారి కేసులకి ఐపిసి 376 సెక్షన్ వర్తించదని, చాలా వరకు ఐపిసి 420 సెక్షన్ క్రింద కేస నమోదు చేస్తున్నారు. నాకు చాలా సార్లు నమ్మించి మోసం చేయడం / ప్రలోభ పెట్టడం / లైంగికంగా లొంగదీసుకోవడం తప్పేకదా అని అనిపించినా, ఆ బాధిత స్త్రీలకు / ఆడపిల్లలకు ఏమి చెప్పలేక పోయేదాన్ని చేసిన తరువాత బాధిత స్త్రీలకు సమ్మతి అనేది వారు ఎటువంటి పరిస్థితుల్లో ఇచ్చారు ` సమ్మతిని ఇచ్చే క్రమంలో ఉండాల్సిన స్పష్టత, స్పష్టమైన వ్యక్తీకరణ, భద్రత అనే ముఖ్యమైన అంశాలని పరిశీలించుకొని తమ కోసం తాము పోరాడల్సిందిగా చెప్పగలుగుతున్నాను.