నేను ఐక్యతారాగంలో జరిగిన అన్ని శిక్షణా కార్యక్రమాలకు హాజరయ్యాను. నేను మహిళా సమతలో పనిచేసినప్పుడు చదువు, ఆరోగ్యం, సహజ వనరులు, పంచాయతీరాజ్‌లో స్త్రీల భాగస్వామ్యం, జెండర్`హింస కౌన్సిలింగ్ నైపుణ్యాల మీద శిక్షణలు తీసుకున్నాను, అలాగే
తిరిగి ఇచ్చాను. భూమికకు వచ్చిన తర్వాత జెండర్‌కు సంబంధించిన హింస (వయొలెన్స్), ట్రాన్స్ జెండర్, జోగిని వ్యవస్థ, పితృస్వామ్య వ్యవస్థ ఎలా బలపరుచుకుంటూ వస్తున్నాయి, అధికారం, కుల వ్యవస్థ వీటన్నింటి ప్రభావం స్త్రీలపై ఎలా పడుతుంది అనే అంశాలను మళ్ళీ ఒకసారి నేర్చుకోవడానికి ఐక్యతారాగం ద్వారా అవకాశం లభించింది.
ఈ శిక్షణలు తీసుకోవడం వలన నాకు కౌన్సిలింగ్‌లో చాలా ఉపయోగపడుతున్నాయి. రెస్పాండెంట్స్‌కు లింక్ చేస్తూ అర్థం చేయించగలుగుతున్నాను. గ్రామ్య, వేదిక, భూమిక టీంలతో చాలా క్లోజ్ అయ్యాను. నన్ను కోర్ గ్రూప్‌లో ఒక మెంబర్‌గా అందరూ నామినేట్ చేసి ఎంపిక చేసినందుకు చాలా సంతోషపడ్డాను. అలాగే నాకు బాధ్యతలు పెరిగాయని అనిపించింది. అందుకే ప్రతి విషయాన్ని ఐక్యతారాగంలో వెంటనే స్పందించగలుగుతున్నాను. ఐక్యతారాగం నాకు ఆ అవకాశం కల్పించింది.
మిగతా సభ్యులకు శిక్షణలు ఇవ్వడానికి నాకు ఒక టూల్ కిట్‌గా ఉపయోగపడుతుంది. శిక్షణలో నేర్చుకున్న పద్ధతులు, మాడ్యూల్, అంశానికి అనుకూలంగా మెటీరియల్‌ను తయారు చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. జెండర్ ఆధారిత హింస గురించి వృత్తిలోనే కాకుండా వ్యక్తిగతంగా, కుటుంబంలో, సమాజంలో కూడా సందర్భాన్ని బట్టి మాట్లాడ గలుగుతున్నాను. నాకు మరింత సమాచారం, ధైర్యం పెరిగింది. సందర్భాన్ని బట్టి అంశాలను చర్చించగలుగుతున్నాను. వివిధ గ్రూప్స్‌కి కూడా అర్ధం చేయించగలుగుతున్నాను. ఇప్పుడు నేను పిల్లలకు, మహిళలకు, యువతకు ఆత్మవిశ్వాసంతో శిక్షణలు ఇవ్వగలుగుతున్నాను. ఐక్యతారాగం నాకు మరిన్ని నైపుణ్యాలను పెంచుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.