నేను కర్నూలులోని ‘వేదిక’లో ఫెసిలిటేటర్‌గా చేస్తున్నాను. గతంలో నేను వేర్వేరు ఎన్జీఓలలో చేశాను, కానీ స్త్రీలతో కానీ, ప్రజలతో కానీ మాట్లాడాలంటే సిగ్గు పడేవాడ్ని. కానీ ఐక్యతారాగం శిక్షణలో చేరిన తర్వాత అక్కడ జరిగిన 4 సెషన్‌లలో ఎన్నో విషయాలు
నేర్చుకున్నాను. శిక్షణలో ఎంతోమంది నిజ జీవిత చరిత్రలు తెలుసుకున్నాను. నా జీవితంలో, నా కుటుంబానికి సంబంధించిన ఎన్నో మంచి విషయాలను నేర్చుకున్నాను. స్త్రీలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి ఉన్న చట్టాలు, హక్కుల గురించి తెలుసుకున్నాను. జెండర్ మరియు ట్రాన్స్‌జెండర్ గురించి కూలంకషంగా తెలుసుకున్నాను. స్త్రీలను ఎలా గౌరవించాలి, ఎందుకు గౌరవించాలి అన్నది తెలుసుకున్నాను. శిక్షణకు రావడం వల్ల ట్రాన్స్ జెండర్, మహిళల పట్ల గౌరవం మరింత పెరిగింది. శిక్షణ ద్వారా ఎలా మాట్లాడాలి, సెషన్ ఎలా చేయాలి అని ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఐక్యతారాగంలో 3 సంస్థలు ఉన్నా మేమందరం ఒకే కుటుంబంలా కలిసి మెలిసి ఒకరి అభిప్రాయాలను ఒకరం అడిగి తెలుసుకుని సమస్యలు, సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునేవాళ్ళం.
ఐక్యతారాగం శిక్షణ ద్వారా నాలో ఈ రోజు చాలా ఎదుగుదలను చూశాను. నాలో ఉన్న సిగ్గు, బిడియం పోయి అందరితో కలిసిపోయాను. ఐక్యతారాగం ఇలాంటి మరెన్నో శిక్షణలు నిర్వహించాలని, తద్వారా మేము మరెన్నో కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. ఐక్యతారాగం శిక్షణలో మాకు ఎన్నో విషయాలు తెలియచేసిన నందిని గారికి, ప్రశాంతి గారికి, అలాగే సత్యవతి మేడమ్ గారికి, రుక్మిణి మేడమ్ గారికి, జయ మేడమ్ గారికి ధన్యవాదాలు.