ఐక్యతారాగాన్ని ఆలపిస్తూ… కొండవీటి సత్యవతి

భూమిక ప్రయాణంలో ఇదొక విశిష్టమైన అధ్యాయం. మహిళల హక్కులు, మహిళల అంశాలపై మూడు దశాబ్దాలుగా నిరంతరాయంగా పనిచేస్తున్న భూమిక ఐక్యతారాగమనే విభిన్నమైన కార్యక్రమంలో కీలక భాగస్వామి కావడం ఒక ముఖ్య ఘటం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రాల్లో పనిచేస్తున్న భూమిక, గ్రామ్య, వేదిక సంస్థలు ఐక్యతారాగాన్ని ఆలపిస్తూ 2018 ఆగస్టులో మొదలైన చిరు నడక మూడేళ్ళలో సామూహిక గళాలుగా, చైతన్య స్వరాలుగా విస్తరించి కలిసి నడక వేగవంతం అయింది. తడబడుతూ మొదలైన అడుగులు బలోపేతమై దృఢమైన అడుగులుగా రూపాంతరం చెందిన ప్రస్థానం కథ ఐక్యతారాగ రూపాన్ని సంతరించుకుంది.
భూమిక, వేదిక, గ్రామ్య సంస్థల్లో పనిచేస్తున్న కౌన్సిలర్లు, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారు, కార్యాలయాల్లో పనిచేసేవారు సుమారు 25 మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఇందులో మహిళలు, పురుషులు కూడా ఉన్నారు. తొలి సమావేశంలో ఎంతో బిడియంగా, బెరుకుగా కూర్చున్నవారు ఐక్యతారాగంతో కలిసి చేసిన మూడేళ్ళ ప్రయాణంలో తాము ఏమి నేర్చుకున్నారో ఈ సంచికలో పంచుకున్నారు.
ఐక్యతారాగం శిక్షణలో పాల్గొనడం వల్ల వ్యక్తులుగా తమ ఎదుగుదల, తమ చైతన్యం వల్ల కుటుంబంలో, తాము పనిచేసే సంస్థల్లో ఎలాంటి మార్పుల్ని తీసుకురాగలిగారో చెప్పుకున్నారు. తొలి మీటింగ్‌ నాటి తమ ఆలోచనా విధానంలో వచ్చిన మార్పుల్ని స్పష్టంగా ఆవిష్కరించుకున్నారు. లోపలి పేజీలలో వారి అనుభవాలు, అనుభూతులను చూడొచ్చు.
జెండర్‌, పితృస్వామ్యం, సామాజిక న్యాయం, రాజ్యాంగ హక్కులపై సామూహికంగా గళాలు విప్పడం కోసమే ఐక్యతారాగం ప్రయాణం మొదలైంది. ఇందులో పాల్గొన్నవారందరికీ ఆయా అంశాల పట్ల పూర్తి అవగాహన, చైతన్యం ఇవ్వడమే ఐక్యతారాగం ముఖ్య ఉద్దేశ్యం. ముఖ్యంగా మూడు సంస్థలూ మహిళలు, పిల్లల అంశాలపై పనిచేస్తున్నాయి కాబట్టి వారికి జెండర్‌పై పూర్తి అవగాహన, జెండర్‌ సమానత్వాన్ని అర్థం చేయించడం, సమాజంలోని అన్ని రంగాల్లోను విస్తరించి ఉన్న వివక్షను తగ్గించడానికి ఏమి చేయాలి అనే అంశాల మీద పూర్తి ఫోకస్‌ పెట్టడం జరిగింది. అలాగే స్త్రీలు, పిల్లల అంశాలను లోతుగా అర్థం చేసుకోవడం, తమ పనిలోకి ఆ చైతన్యాన్ని ప్రవహింపచేసుకోవడం, ఆయా సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతగా పనిచేయడం మీద అనేక చర్చలు జరిగాయి.
ముఖ్యంగా ఐక్యతారాగం శిక్షణలో నేర్చుకున్న అంశాలను ప్రతి ఒక్కరు తన జీవితానికి, తన కుటుంబాలకు, తాను పనిచేసే క్షేత్రంకి, సంస్థకి ఎలా అన్వయించుకోవాలి అనే వాటిమీద చాలా కార్యక్రమాలు జరిగాయి. ఈ చర్చలన్నీ ఉపన్యాసాల ధోరణిలో కాకుండా పార్టిసిపెంట్స్‌ సమభాగస్వామ్యంతో వారిద్వారానే జరగడం ఈ శిక్షణలోని ప్రత్యేకతగా చెప్పుకోవాలి.
నాలుగో ఫేజ్‌లో చాలా ముఖ్యమైన అంశాలను చర్చకు తీసుకోవడం జరిగింది. స్త్రీల ఉద్యమ స్ఫూర్తి, స్త్రీల హక్కులకు సంబంధించి అంతర్జాతీయ వేదికల మీద జరిగిన సమావేశాల గురించిన ఉపన్యాసాలు, కులం, వికలాంగత, దళిత నేపథ్యం, ట్రాన్స్‌జెండర్‌, ముస్లిం మైనారిటీ స్త్రీల హక్కులు లాంటి ముఖ్యమైన అంశాల మీద ఆయా రంగాల్లో ఉద్యమ స్థాయిలో పనిచేస్తున్న వ్యక్తుల్ని పిలిచి మాట్లాడిరచడం ద్వారా పార్టిసిపెంట్స్‌ అవగాహనను పెంపొందించే అంశాన్ని ఈ శిక్షణల్లో హైలైట్‌గా చెప్పుకోవాలి. డా॥ రుక్మిణీ రావ్‌, జయ, మీరా సంఘమిత్ర, జమీలా నిషాత్‌, డా॥ వినోదిని, శ్రీనిధి, సిస్టర్‌ లిజి, రేణుక సయోలా, భానుజ, ఖలీదా పర్వీన్‌, సూరేపల్లి సుజాత, ఆశాలత, దేవి, రచన ముద్రబోయిన లాంటి భిన్న ఉద్యమాల్లో మమేకమై పనిచేస్తున్న సోషల్‌ యాక్టివిస్టులు తమ ఉద్యమాలను, తమ అనుభవాలను మేళవించి పంచుకున్న అంశాలు ఈ శిక్షణలో పాల్గొన్నవారందరి మనసుల్లో లోతైన ముద్ర వేయడంతో పాటు ఆయా అంశాల పట్ల వారి అవగాహనను పెంపొందించాయి. ఈ మొత్తం సెషన్‌కి మోడరేటర్‌గా వ్యవహరించగలగడం నాకు దొరికిన అపూర్వ అవకాశంగా నేను భావిస్తున్నాను. ఒకేసారి అనేక ఉద్యమపాయల్ని కలుపుతూ, సమన్వయం చేసుకుంటూ, నేర్చుకుంటూ నేను మోడరేటర్‌ పాత్రని విజయవంతంగానే నిర్వహించగలిగాను.
ఐక్యతారాగం శిక్షణల ముఖ్య రూపకర్తలు నందినీరావ్‌, ప్రశాంతిల శిక్షణా నైపుణ్యాల గురించి ఎంత రాసినా తక్కువే అవుతుంది. ముఖ్య ఫెసిలిటేటర్లుగా వారిద్దరి కృషి, శ్రమ ప్రతి అంశంలోను ప్రస్ఫుటంగా కనబడుతుంది. సంక్లిష్టమైన అంశాలను అర్థం చేయించిన తీరు, అవగాహనల స్థాయిలో ఎక్కువ, తక్కువలున్న వారి పట్ల చూపిన ప్రత్యేక శ్రద్ధ, వారికి పదే పదే వివరిస్తూ ఎంతో ఓపికగా చెప్పడం గమనించి నేను చాలాసార్లు ఆశ్చర్యపోయేదాన్ని. నాలో ఈ నైపుణ్యం లేదు. వారిద్దరిలో పుష్కలంగా ఉండడం వల్లనే ఐక్యతారాగం టీమ్‌ అందరూ సమానస్థాయిలో అన్నింటిలోనూ పాల్గొనగలిగారు. మూడేళ్ళపాటు పార్టిసిపెంట్స్‌తో వాళ్ళిద్దరూ చేసిన ప్రయాణం, వారికి అందించిన సపోర్టు, శిక్షణలో నేర్పిన నైపుణ్యాలను వారెలా అందిపుచ్చుకున్నారో వారి మాటల్లోనే ఈ సంచికలో చదవొచ్చు. నందినీకి, ప్రశాంతికి ప్రత్యేక అభినందనలు.
ఐక్యతారాగం శిక్షణ వల్ల ఇందులో పాల్గొన్న వ్యక్తులు మాత్రమే లాభపడలేదు. ఆయా సంస్థలు కూడా లాభపడ్డాయి. ఇక్కడ లాభాలంటే డబ్బు లావాదేవీలు కాదు సుమా! తాము నేర్చుకున్న జ్ఞానాన్ని, చైతన్యాన్ని తమ సంస్థల్లోకి కూడా వీరు చేర్చగలిగారు. తాము పనిచేసే చోట శిక్షణలు నిర్వహించే స్థాయికి వీరు ఎదిగారు. జెండర్‌ సున్నితత్వాన్ని తమ భాషలోకి, పనిలోకి, కుటుంబాల్లోకి ప్రవహింపచేసుకోగలగడం వీరు సాధించిన గొప్ప ప్రగతి. తద్వారా వీరు సంస్థలకు కూడా తమ జ్ఞానాన్ని, చైతన్యాన్ని అందించగలిగారు. వీరందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
ఐక్యతారాగం మూడేళ్ళ ప్రయాణం సాఫీగా నడవడం వెనుక ఎంతోమంది కృషి ఉంది. ముఖ్యంగా భూమిక టీమ్‌ సామూహిక కృషి వల్లనే ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. అలాగే నాలుగు ఫేజ్‌ల శిక్షణా నివేదికను సమగ్రంగా రూపొందించి ఇచ్చిన జ్యోత్స్న ఆవులను తప్పక అభినందించాలి. జ్యోత్స్నకు రిపోర్ట్‌ రూపకల్పనలో సహకరించిన ప్రశాంతికి ప్రత్యేక అభినందనలు చెప్పాలి. అలాగే కొన్ని రిపోర్టులు రాయడంలో సహకరించిన పద్మ గారికి ధన్యవాదాలు.
చివరగా ఐక్యతారాగం విలక్షణ ప్రయాణాన్ని భూమిక ప్రత్యేక సంచికగా తేస్తే బావుంటుందని ప్రతిపాదించినపుడు అందరూ చాలా ఉత్సాహంగా చప్పట్లతో స్వాగతించారు. రకరకాల కారణాల వల్ల ప్రత్యేక సంచిక తయారవడం ఆలస్యమైంది. ఎక్కడా నిరుత్సాహ పడకుండా లలిత పదేపదే అందరితో మాట్లాడి కావాల్సిన మెటీరియల్‌ తెప్పించింది. లేకపోతే ఇంకా ఆలస్యమై ఉండేది. ఐక్యతారాగం టీమ్‌ అందరూ చాలా కష్టపడి తమ ఆర్టికల్స్‌ను పంపించారు. అందరికీ అభినందనలు. ఐక్యతారాగం శిక్షణ నిర్వహణ కోసం ఆర్థిక సహకారమందించిన రమా వేదుల, ఏజెడబ్ల్యుఎస్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రత్యేక సంచిక తప్పనిసరిగా పాఠకుల అభిమానం చూరగొంటుందని, మన ప్రయత్నాన్ని హర్షిస్తారని ఆశిస్తూ…

Share
This entry was posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.