నూతన సంవత్సరం గురించి అరవింద మోడల్ స్కూల్, మంగళగిరి విద్యార్థులు వ్రాసిన కవితలు
నవ్య సంవత్సరం
కరోనా చీకట్లను తరిమేస్తూ
కొత్త వెలుగులను వెదజల్లుతూ
నవ్య ఆశలను కలుగజేస్తూ
గుండెల్లో ధైర్యం నింపుతూ
ప్రజల్లో చిరునవ్వులు తెప్పిస్తూ
ఆనందాల హరివిల్లు వైపు నడిపిస్తూ
గడిచిపోయిన కాలానికి ముగింపు నిస్తూ
రాబోయే కాలాన్ని స్వాగతిస్తూ
కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ
నూతన జీవనానికి ప్రేరణ కలిగిస్తూ
వచ్చేస్తుంది ఈ నవ్య సంవత్సరం
` ఎం.సాత్విక చౌదరి, 9వ తరగతి
నూతన సంవత్సరం
నూతన సంవత్సరం వస్తూ
అందరికీ ఆనందాన్ని ఇస్తూ
ఒక సంవత్సరం ముగుస్తుంది
అందరూ ప్రతిజ్ఞలు తీసుకొస్తూ
అందరూ గెలుపుని ఆశిస్తూ
కరుణ అనే చీకటిని తరిమేస్తూ
ఒక మంచి వెలుగు వైపు నడుస్తూ
ఆనందంగా జరుపుకునే పండుగ
కొత్త కొత్త ఆలోచనలు ఆలోచిస్తూ
ఎన్నో విషయాలను గెలుస్తూ
ఆనందంగా జరుపుకుంటూ
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
` కె.చరితశ్రీ, 9వ తరగతి
గెలుపునందించే సంవత్సరం
ఏదో సాధించాలనే తపన
ఏదో కోల్పోతున్నామనే ఆవేదన
ఏవేవో కొత్త పరిచయాలు
ఇంకెందరో కొత్త స్నేహితులు
తెలియకుండానే సంవత్సర కాలం గడిచి
నూతన సంవత్సరంలోకి స్వాగతం పలుకుతుంది
కష్టాలెన్నయినా సరే భరిద్దాం
సవాళ్ళెన్నయినా సరే ఎదుర్కొందాం
కలపడదాం కలిసి నిలుద్దాం గెలుద్దాం
ఈ సంవత్సరం నీకు అంకితం
గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిద్దాం
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
` పి.శివపల్లవి, 8వ తరగతి
అందమైన సంవత్సరం
ఈ నూతన సంవత్సరానికి కొత్త అందం రావాలి
అందరి ఇళ్ళలో ఆనంద దీపాలు వెలగాలి
ప్రపంచంలో కరోనా పోవాలి
ప్రస్తుత పరిస్థితులు మారాలి
అందరూ స్నేహభావంతో మెలగాలి
విద్యార్థులు మంచిగా చదువుకోవాలి
మళ్ళీ పండుగల సంబరాలు జరగాలి
` వి.తేజ శివలక్ష్మి, 8వ తరగతి