కొడవటిగంటి నవలాలోకం

రామమోహనరాయ్‌
కథారచనకు సాంఘిక ప్రయోజనం ఉండాలని గుర్తించిన రచయితలు కొద్దిమందే. వారిలోనూ సాంఘిక ప్రయోజనంతోనే వ్రాయాలని సంకల్పించినవారు మరీ అరుదుగా కన్పిస్తారు. ‘కానరాకే కదలించటం’ అనేది కవిత్వానికివలెనే సాహిత్య ప్రక్రియలన్నింటికీ వర్తిస్తుంది. కదలించే కథలతో శిల్పం చెడకుండ, బోధచేసినట్లుగా గాకుండ సంస్కారాన్ని నరనరాల్లోకి ఎక్కించగలిగిన కథారచయితలు తెలుగులో చాల కొద్దిమందే ఉన్నారు. వారిలో శ్రీ కొడవటిగంటి కుటుంబరావు అగ్రగణ్యులు.
 ‘ఆళిలిశిజీగి రిరీ శినీలి బీజీరిశిరిబీరిరీళీ ళితీ జిరితీలి’ అనే సూక్తిని నవల విషయంలో మరింత చక్కగా అన్వయించవచ్చు. జీవిత ప్రతిబింబమే నవల. అయితే జీవిత వైవిధ్యాన్నంతటినీ ప్రదర్శించాలి నవల. జీవితానికున్నంత గాంభీర్యమూ, లోతూ నవలకీ ఉండాలి. కొన్ని సంఘటనల నేరుకొని ఎంత చక్కగా మలిచినా అవి కథానిక అవుతాయేగాని నవల కావు. సంఘటనలను కళాత్మకంగా ప్రదర్శించటంలో నేర్పు చూపించినంత మాత్రాన, వాటిని ప్రవచించి, అద్భుత సత్యాలను మనస్సుకు పట్టేలాగ చెప్పినంత మాత్రాన, వాటిని ప్రపంచించి, అద్భుత సత్యాలను మనస్సుకు పట్టేలాగ చెప్పినంత మాత్రాన నవలారచయిత కృతకృత్యుడైనట్లు కాదు. జీవితాన్ని కళాత్మకమైన వాస్తవికత (జుజీశిరిరీశిరిబీ జీలిబిజిరిశిగి) తో దర్శింపజేయటం ప్రతిభతో కూడుకొన్న పని. ఎంత తక్కువలో ముగించినా జీవితం పట్ల ఒక అవగాహన కలిగించగలిగితే నవలారచన సార్థకమైనట్లే. ఈ విషయాన్ని గమనించి ఉత్తమ నవలా రచయితలుగా గణుతికెక్కిన వారు తెలుగులో కొద్దిమందే ఉన్నారు. వారిలో శ్రీ కుటుంబరావు సారస్వతంలో విత్తనాల ధాన్యం పండించిన కృషికుడు.
శ్రీ కుటుంబరావు సారస్వత జీవితం ప్రారంభించి నాలుగు దశాబ్దాలు పైమాటే. సుదీర్ఘమైన యీ కాలంలో ఆయన కలం క్రింద పెట్టింది లేదు. కథలు, కథానికలు, స్కెచ్‌లూ, గల్పికలూ, నాటికలూ, వ్యాసాలేగాక నవలలు, నవలికలూ వ్రాశారు. గుణంలోనే గాక రాశిలోనూ అపరిమితమైన ఆయన రచనలన్నీ జీర్ణించుకున్న వారుండటం కష్టం. రచనలు ప్రారంభించాక తెనుగు పత్రిక లన్నింటికీ ఆయన రచనల నందించారు. చిన్నా పెద్దా తేడాలేదు. వాటిలో కొన్ని పత్రికలు యిప్పుడు వెలువడటం లేదు. ఆ పత్రికలలో పడి ఆ తరం పాఠకుల ఆదరాన్ని సంపాదించుకొన్న రచనలు యిప్పుడు సంపుటాలుగా దొరకటం లేదు. ఉదాహరణకు శ్రీ కుటుంబరావు వ్రాసిన ‘తల్లిలేని పిల్ల’ అనే కథాసంపుటం యిప్పుడు లభించటం లేదు. కాలంకంటే ఎప్పుడూ ఒక పదేళ్లే నా ముందు ఉంటారు కుటుంబరావు. ప్రచురణకర్తలొకరు చెప్పినట్లు సారస్వతంలో వెనుకబడి ఉండటానికి గుర్తు శ్రీ కుటుంబరావు కథలు చదివి ఉండకపోవటమే. నాలుగు దశాబ్దాలుగా సాగిన ఆయన రచనా వ్యాసంగం అంతా ఒకచోటనే లభించకపోవటం తెలుగుజాతి దురదృష్టం రచయితల ‘్పుళిళీచీజిలిశిలి ఇళిజీదిరీ’ ప్రచురించటం ఎంత అవుసరమో యీనాటికి పాఠకులూ, ప్రచురణకర్తలూ గుర్తించటం లేదు.
బహుముఖంగా శ్రీ కొడవటిగంటి రచనా వ్యాసంగం సాగిపోయినా ముఖ్యంగా ఆయన చూపు కథలూ, నవలలూ, నవలికల పైననే. అందునా ఆయన నవలలూ, నవలికల రచనాతత్వాన్ని పరామర్శించటం కష్టసాధ్యం. ఐతే ఏవొక్క రచన చదివినా రచయితగా శ్రీ కుటుంబరావు వ్యక్తిత్వం వెల్లడౌతుంది. ఆయన వ్రాసిన రచనలెన్ని చదివినా ఆయననుండి తెలిసికోవలసింది యింకా ఎంతో ఉన్నట్లనిపిస్తుంది. మాట్లాడినంత సహజంగా వచన రచన చేయటం ఆధునిక రచయితలలో ఆయనలాగా మరెవ్వరికీ కుదరలేదు. కాని తెలుగు వచనంలో కుటుంబరావు వొరవడి యేమీ యేర్పడలేదు. దానికి కారణం ఆ రచనలలోని అసాధారణమైన సాదాతనం. తన ప్రక్కనే జరుగుతున్న జీవిత నాటకాన్ని చెవివొగ్గి విని వెన్వెంటనే వ్రాసుకుపోయినంత సహజంగా ఉంటాయి వారి నవలలో సంభాషణలు. జీవితమెంత రసవంతమైన నాటకమో ఆయన నవలలూ అంతటి రసవత్తరాలు. ‘శ్రీళిఖీలిజి రిరీ బి చీళిబీదిలిశి శినీలిబిశిజీలి’ అనే సూక్తి అక్షరాల ఆయన నవలలకు సరిపోతుంది.
నలభైయేళ్ల పైబడిన సారస్వత వ్యాసంగంలో ఆయన రచన లన్నింటినీగాక, కొన్ని నవలలూ, నవలికలూ పరిశీలించి వాటిలో రచయిత అజ్ఞాతంగానే ఉండి వెల్లడించిన జీవిత సత్యాలనూ, అనుస్యూతంగా పాఠకుడి ఉత్కంఠను రేకెత్తింపజేసి చదివించే రచనాశిల్పమూ ఆకళించుకోవచ్చు. ‘చదువు’ అనే నవల వ్రాసిన కొంతకాలందాకా ఆయన మరెన్ని కథలు వ్రాసినా ఆ నవలాశిల్పం తెనుగువారి హృదయాలలో మాసిపోలేదు. ఈనాటికీ ప్రౌఢవయస్కులు ఆ నవలను తెలుగులోని ఉత్తమ నవలల్లో వొకటిగా కళ్ల కద్దుకుంటున్నారంటే ఆ నవలలో ఏ విషయాలు అంతగా ముగ్ధుల్ని చేశాయో చూద్దాం.
సుందరం అనే యువకుడు ద్వితీయ ప్రపంచయుద్ధం ముందటివాడు. ఆ కాలపు స్వాతంత్య్రోద్యమంతోనూ, కరువురోజులైన ‘డిప్రెషన్‌’ రోజులలోనూ, ఉషోరేఖలు తొంగిచూస్తున్న సాహిత్యంతోనూ సాన్నిహిత్యం కలవాడు. తల్లి వొళ్లో అక్షరాలు దిద్దటం నేర్చిన పసివాడు పెద్ద చదువరియై, స్వాతంత్య్రోద్యమంలో అంటీఅంటనట్లుండి, ఎమ్మే ఎలెల్బీ చదివి నిరుద్యోగిగా మిగిలిపోతాడు. కాని చదువుల పరమార్థం ఆలస్యంగా అతడి కప్పటి కర్థమౌతుంది. ‘చదువు’ నవలలో శేషగిరి విశిష్టమైన పాత్ర. సత్యాగ్రహోద్యమంలో చేరి, ఉద్యోగం చాలించి, పిల్లల చదువులు చాలించి, జాతీయ పాఠశాల నడిపి ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న తరువాత గూడ అతడిని సమాజం అర్థం చేసికొని గౌరవించకపోతే ఖిన్నుడౌతాడు. బలవంతపు బ్రహ్మచర్యంవలె తప్పనిసరియై సత్యాగ్రహోద్యమంలో జైలుకు పోతాడు. అదేమంటే తన పిల్లలనుకూడ శ్రీకృష్ణ జన్మస్థాన మలంకరించక పోవనివ్వట మటుంచి ‘నా కెలాగూ తప్పదుగదా’ అంటాడు. ఆ తరువాత కోరికలు చంపుకున్న ముని మోస్తరుగా బయటికిరాని కీర్తికాంక్షతో వేగిపోయి దారిద్య్రాన్ని కోరి వరించి, విధిలేక అట్టే పెట్టుకుంటాడు. శేషగిరి దయనీయమైన వ్యక్తి. సీతమ్మ గారంటే సుందరం తల్లి. ఆమె వ్యక్తిత్వం విలక్షణమైనది. మాతృత్వం తొణికిసలాడే తెలుగు తల్లి ఆమె. తన బిడ్డకు తానే చదువు నేర్పించటం ప్రారంభించి అమోఘమైన ఆనందం పొందుతుంది. తనకురాని ఇంగ్లీషు కొడుకు నేర్చుకుంటున్నపుడు తాను చెప్పలేకపోయినందుకు చెప్పలేనిబాధ పొందుతుంది. భర్త పోయాక ఏకాకిగానే, బంధువుల సాయం అడపాదడపా పొందుతూ కొడుకును పెంచి, పెద్దవాణ్ణి చేసి చదివిస్తుంది. కొడుకుతో యెడబాటు సహించలేని తల్లిపేగు ఆమెది. సీతమ్మగారిలాటి వ్యక్తిత్వమే వా రిటీవల వ్రాస్తున్న ‘అనుభవం’లోని ‘పార్వతి’కి ముమ్మూర్తులూ సరిపోతుంది.
శ్రీ కుటుంబరావు గారి నవలాశిల్పంలో చదువు మరీ ప్రాథమిక దశ. జీవితచిత్రణ కిచ్చిన ప్రాముఖ్యము జీవితసత్యాల నద్భుతంగా వెల్లడించటంలో చూపించలేదు. చదువు నవల వ్రాసిననాటికి ఆయన అభూతకల్పన లెరుగడు! మిధ్యాదర్శాలను వల్లించడు  అతిలోకపాత్రచిత్రణ ఆయన కలంనుండి రాదు. అన్నిపాత్రలూ, సంఘటనలూ సమాజంలోవే. సంభాషణల నాయన కూర్చలేదు. విని వ్రాశారేమో ననిపిస్తుంది. సమాజపు నడక ఉన్నది ఉన్నట్లుగానే ఆయన రచనలో రూపురేఖలు దిద్దుకొన్నది. ప్రతిభ ఆయన సొత్తు కావటంవలన, కళలను రాజకీయాల నుండి విడివడ నివ్వటం సుతరామూ ఆయన అంగీకరించకపోవటంచేత, వర్గకలహం ద్వారా సమసమాజ నిర్మాణంలో అపారమైన విశ్వాసం కలవాడు కావటంచేతా, నవలలోని పాత్రల నాయన తన వాదాని కనుగుణంగా మలుచుకుంటాడు. ఇదే వారి నవలల్లో లోపమైతే యీ లోపం బెర్నార్డ్‌షా నాటకాలలోనూ ఉన్నది. శ్రీ కుటుంబరావు – చెప్పినట్లుగానే వినేవీ, ఆయన వాదంలాగే గడుసుగా వాదించి నెగ్గేవీ అయిన పాత్రలూ, వర్గకలహాన్ని పనిగట్టుకొని సంఘటనల మధ్య నిరికించి, పాత్రల మనసుల్లో దూరి, పెట్టుబడిదారీ సమాజంపైన చావుదెబ్బలు కొట్టి, జీవితంలో రాజకీయాల కత్యధిక ప్రాధాన్య మివ్వటమూ, ఆయన రచనలలో కొరుకుడుపడని కొన్ని విషయాలు.
‘ఎండమావులు’ అనే నవలికలోనూ రాజు అనే ప్రెస్‌ కార్మికుడు కమ్యూనిజాన్ని గూర్చి, కమ్యూనిజావిర్భావంతో మరో ప్రపంచపు మంచిసమాజాన్ని గూర్చి దీర్ఘోపన్యాసాలు చేస్తాడు. ఈ విధంగా కమ్యూనిస్టు సిద్ధాంతాలు వల్లించటం శిల్పానికి లోపంగా శ్రీ ఆరుద్ర అభిప్రాయపడ్డారు. కాని యిది పొరబాటు. వ్యక్తులు రాజకీయ సంభాషణలను వల్లించటం శిల్పలోపమెలాగౌతుంది? అందునా కార్మికులలో అటువంటి రాజకీయ విశ్వాసాలు గలవారుండటం సర్వసహజం. ‘ఫాసిజమ్‌’ స్థానాన్ని కమ్యూనిస్టు వ్యతిరేకత కాజేసిందని శ్రీ కుటుంబరావు తమ రచనలలో అడుగడుగునా హెచ్చరిస్తూనే ఉన్నారు. ప్రెస్‌ పనివాళ్లలో కమ్యూనిస్టు భావాలున్న వాళ్లుండటంలో అబ్బురమేమున్నది? ప్రెస్‌ పనివాడుగా జీవితం ప్రారంభించి సినిమాలో సంభాషణలు వ్రాసేదాకా ఎదిగి, ధనంతోబాటు అంతస్థును గూడ పెంచుకుంటాడు రంగారావు. అతడి తాళిగట్టిన భార్య అనుకూలవతి కాకపోగా, ప్రతికూలవతి గూడ కావటంతో సుందరం అనే తన చిన్నప్పటి స్నేహితురాలితో సంబంధం యేర్పరచుకొంటాడు. ఈ యిద్దరి జీవన సాహచర్యం రచయిత సమర్ధిస్తున్నట్లు కన్పిస్తుంది. ఈ సంబంధాన్ని సహించగలిగిన పాఠకులున్నా హర్షించగలిగిన వాళ్లుండటం అరుదు. సినిమా వ్యక్తులు రంగారావును దూరంచేసిన తరువాత, తన యథార్థస్థితిని గుర్తించేటట్లు చేసినవాడు తనతోటి కార్మికుడూ, కమ్యూనిస్టు అయిన రాజే. లయతప్పిన రంగారావు జీవితాన్ని మళ్లీ గాడిలో పడేసిన ‘అర్ధాంగి’ సుందరమే. తనను కాటందిన సినిమా జీవితం మీదికే తిరగబడాలనుకొంటాడు రంగారావు. ఇటీవలి నవలా సాహిత్యంలో ఎన్ని అభిప్రాయభేదాలకు గురియైనా ఎండమావులు నిస్సందేహంగా ఉత్తమ నవలిక.
కమ్యూనిస్టు సిద్ధాంతాలపై అపారవిశ్వాసం కలిగిన ప్రజ్ఞాశాలి కుటుంబరావు కమ్యూనిజం ఒక ఆదర్శం మాత్రమే కాదనీ అవశ్యం అవలంబనీయమైన జీవితవిధానమనీ దృఢంగా విశ్వసించి ‘అరుణోదయం’ నవలలో స్థాపించారు. ఇది ఏకపక్షచిత్రణ అనడానికి సంకోచింప నక్కరలేదు. అందులోని కథ నాయన క్రొత్తగా వ్రాయలేదు. ‘స్వర్గసీమ’ సినిమా కథనే తీసుకున్నట్లు చెప్పారు. స్వర్గసీమలా సాగే నడిమి తరగతి సంసారం ఆర్థికచిక్కులలో పడినప్పుడు, అతడి పెంకుటిల్లు క్రుంగిపోయి, లేమి ముంచెత్తినప్పుడు అతడికి దిక్కును చూపేదీ, ఆదరించేదీ తనలో కలుపుకొని ఐకమత్యపు శక్తిని చాటేదీ కమ్యూనిజం వొక్కటే నంటారు. చిత్రణ ఎంత బాగున్నా కమ్యూనిజం వొక్కటే రక్షించగలదనటం శంకాస్పదం. అరుణోదయమయ్యేదాక నడిమి తరగతి వేచి ఉండక తప్పదనీ, అదొక్కటే శరణ్యమనటం జీవితాన్ని వొకవైపునుంచి చూడటమే.
‘అనామిక’ అనే చిన్న నవలలోనూ స్నేహితుల మధ్య చిన్న రాజకీయ చర్చ నేర్పరచి అందులో కూడ కమ్యూనిజపు విశిష్టతను పనిగట్టుకొని ఉగ్గడించారు. చురుకైన యువకుడు గోవిందరావు సారస్వతాభిలాషి. ఒక సంపన్నుడు తన రచన ననువదించమని కోరగా అందుకు సమ్మతించాడు. అతడి భార్య సీత అభిమానాన్ని చూరగొంటాడు. ఆమె చనిపొయ్యేముందు అతడికొక మంచి ఉద్యోగం వచ్చే యేర్పాటు చేస్తుంది. అంతేకాక తన వ్రేలి ఉంగరాన్ని ఆ యువకుడి కాబోయే భార్యకు కానుకగా పంపిస్తుంది. ఈ చిన్న నవలికలోనే విషయంలో ఐక్యత లేదు. ఎక్కడికక్కడే రచయిత తన వాదాలను వెల్లడించుకోవటానికి చిన్న చిన్న చర్చావేదిక లేర్పరిచారు. చదువుతున్నప్పుడాయన రచనాశక్తి చదివించినా, పుస్తకం మూసి ఆలోచిస్తే యీ చర్చ లీనవలలో లనవసరమనిపిస్తాయి.
ఐశ్వర్యం మనుష్యులను వేరుచేస్తుంది. క్రిమినల్‌ లాయర్‌గా అనేకమంది నేరస్థులను, హంతకులను శిక్షనుండి తప్పించి, చాల డబ్బు సంపాదించిన లాయరొకాయన తన కొడుకు డాక్టరై డబ్బు సంపాదనకు విముఖుడై ప్రజాసేవ చెయ్యాలనుకోవటం సహించలేడు. అంతేగాక ఆ కుమారుడే తన దగ్గరకు పేషెంటుగా వచ్చిన ఒక వ్యక్తి చనిపోగా అతడి వితంతువును భార్యగా స్వీకరించాడు. ఇది సహించలేక కొడుకును దూరం చేసుకొంటాడు. సంతృప్తితో బ్రతుకుతున్న కొడుకును చూసి దారిద్య్రానికి రంగు పూసి జీవించటమని హేళన చేస్తాడు  చీదరించుకుంటాడు  మమకారాన్ని తెంచుకోలేకపోయినా భౌతికంగా దూరంగానే జీవిస్తాడు. విశ్వసాహిత్యావలోకనం చేసిన డాక్టరు తన వృత్తిధర్మాన్ని నిర్వర్తించటంలో నియమబద్ధంగా మాత్రమే జీవిస్తాడు. అందువలన డబ్బు రాకపోగా పేషెంట్లు నుండి దూరమై ప్రాక్టీసు లేని డాక్టరుగా మిగిలిపోతాడు. కత్తిమీద నడిపించినట్లు ఆయన తన భార్యాబిడ్డలను సాదాగా, ఉన్నతమైన ఆదర్శాలతో జీవించేటట్లు చేస్తాడు. కాని కథ అడ్డం తిరుగుతుంది. ఆయన కుమార్తె ‘నర్సు’ తాత పంచనచేరి భోగభాగ్యాలనే అభిలషిస్తుంది. అందుకు డాక్టరు బాధగా నిట్టూర్పు మాత్రమే విడుస్తాడు. ధనికులైన మధ్యతరగతి మనుష్యుల మనస్తత్వంతో ఐశ్వర్యానికున్న లంకెను చక్కగా వర్ణించారు. వాళ్లు తాత్కాలికంగా డబ్బులేనివారైనా సమయమూ, అవకాశమూ వచ్చినప్పుడు మాత్రం ధనికుల పంచనే చేరతారంటారు రచయిత. డాక్టరూ, డాక్టరును ప్రేమించిన ఆదర్శాలున్న యువకుడు, ‘నర్సు’ను పెళ్లాడి ఆమె స్వార్థానికి విస్తుపోయిన యీ యువకుడూ ఆదర్శాలలో విఫలమైనట్లు వాస్తవాలనే రచనలో రూపం దిద్దారు.
వ్యక్తుల బలహీనతలనూ, భయాలనూ అతి చమత్కారంగా వొడుపుగా – బెదిరిన మనుష్యులు, భయం కథలలో బయటపెట్టారు. దేవుడి భయం  కార్మికభయం  దొంగలభయం యిటువంటి భయాలే గాక సంఘంలో తెలివిగా, నేర్పుగా బ్రతుకుతున్న వాళ్లను చూసి, బెదిరిపోయే మనుష్యుల మనస్సులనూ, చేతలనూ, మాటలనూ మంచి జరుగబోతున్నప్పుడు కీడును శంకించి, అనవసరంగా అమిత భయపడే మనస్తత్వాన్ని అద్వితీయంగా వివరించారు. సీతప్ప  రావమ్మ  సత్తెం  సోవిఁదేవి, ఆ కుటుంబంలో అందరూ వింతైన బెదిరిన మనుష్యులే. సీతప్ప వంటి ఉయస్థులూ, అసమర్థులూ, అల్పజీవులు ఎందరో ఉన్నారు. వారిని రచనలో ప్రవేశపెట్టి విజయం సాధించినవారు కొద్దిమందే. వారిలో శ్రీ రాచకొండ విశ్వనాథశాస్త్రి చిత్రించిన సుబ్బయ్య వొకడు (అల్పజీవి). భయం కథలు చదువుతూంటే పాఠకులు ఆ బలహీనతలు తమలో ఉండగానే ఒక భయంతో వాటిని మళ్లీ చదివి, చప్పరించి ఆ భయం తమలో లేదని సరిపెట్టుకోజూస్తారు. మొదట్లో వొట్టి ‘కారికేచర్‌’లాగే శ్రీ కుటుంబరావు సీతప్పను గూర్చిన రచన ప్రారంభించారట కాని అది సజీవమైన పాత్ర. జీవమున్న ఆ పాత్రను కారెక్టర్‌గా గుర్తించి కొనసాగించారు. శ్రీ కుటుంబరావు రచనల నభిమానించే వారి కాయన రచనలలోని జీవితసత్యాలను నెమరువేసుకొన్నంతగా ఆయన చిత్రించిన పాత్రలు చిరస్మరణీయంగా కన్పించవు. ఆ కొరత బెదిరిన మనుష్యులు  భయం కథల వలన తీరింది. ఆ రచనలలోని వ్యక్తులందరూ సజీవమైనవారుగ కలకాలం తెలుగువారిలో మెసలుతారు. అసలు వాళ్లు సమాజంలోనివారేగా. కాకపోతే కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ బెదిరిన మనుష్యులు కావటం వింత. ఈ బెదిరిన మనుష్యులకు సరియైన గడుసరి శ్రీమతి భానుమతి గారి ‘అత్తగారు’. బలహీనతలు పెరిగితే సీతప్పలాగ మారిపోతామనే భయాన్ని చదువరులలో కలిగించారు.
వాస్తవసమాజజీవనంలో నుండి కొంతదూరం ముందుకు నడిచి ‘కొత్త అల్లుడు’  ‘కొత్త కోడలు’ ఏ విధంగా ఉండాలో ఆదర్శంగా తీర్చిదిద్దారు. సంకుచిత భావాలుగల నడిమి తరగతి జీవులను కాలాతీతంగా ఊహిస్తూ, ఆదర్శంగా తమ జీవితాన్ని తామే కావలసిన విధంగా తీర్చిదిద్దుకోగలిగేవారిని చూసి సహించకపోవటమూ, ఐతే ఆదర్శజీవులు యీ దివాంధుల చేతిలో బందీలుకాక, తామే విజయం పొందటమూ యీ నవలలో ద్యోతకమవుతాయి. ఈ నవలలు సహజంగా లేవని అనిపించవచ్చు. కాని రాబోవు యుగం దూతలైన యువకులకు మార్గదర్శకాలు.
కొత్త అల్లుడులో కమలమ్మా, ముకుందుడూ సంకుచితత్వానికి ప్రతీకలు. అనుమయ్య మంచివాడే – వశ్రీళిశినీరిదీవీ లీతిశి బి వీళిళిఖి ళీబిదీవ. అల్లుడు కుశాలరావు కాలాతీత వ్యక్తి. యువకు లందరికీ ఆదర్శప్రాయుడు. కొత్త కోడలులో సరోజిని ఆడపిల్లలలోనే మణిదీపం. ఆ అమ్మాయి గుణగణాలు చూసి యీనాటి ఆడపిల్లలు ఎంతైనా నేర్చుకోవాలి. హనుమాయమ్మ గారు ఇంటికి పెత్తనం చలాయించుకోవాలనే పిచ్చి పట్టుదల గలది. కుటుంబం కలిసిమెలిసి ఉంటే కలిగే ఆనందం ఆమె యెరుగదు. పిల్లలందర్నీ పిరికివాళ్లుగా, అసమర్థులుగా పెంచాలని ప్రయత్నిస్తుంది. కాని కాలమే వాళ్లను కాలానుగుణంగా పెంచుతుంది. ఆమె భర్త వస్తుతః మంచివాడైనా, హనుమాయమ్మ నోటికి జడిసి మంచి సూచన లివ్వబోయీ మానుకుంటాడు. చలపతి, సరోజినిని ప్రేమించీ, ఆ అమ్మాయికంటె ముందుగా వెల్లడించలేని అసమర్ధుడు.
పై నవలలో గుర్తుంచుకోదగిన జీవితసత్యాలు కోకొల్లలు. ‘మాకు దారిద్య్రభయం జాస్తి. అందుకని వీలైనంత దరిద్రంగా బ్రతుకుతుంటాం’ అంటాడు చలపతి. కొనుక్కోగలిగీ వాచీ, రేడియో లయినా కొనుక్కోకుండానే ఎన్నో మధ్యతరగతి కుటుంబాలు కల్పించుకొన్న దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారు. బాల్యంలో నేరాలు చేసినవాళ్లు పెద్దయ్యాక బుద్ధిమంతులైనా సంకుచితులైన మనుష్యులు మాత్రం వాళ్లను వేటాడ్డం మానుకోరు. ఈ అజ్ఞులను, అజ్ఞతను తొలగించుకొని, పెద్దవాళ్ల ప్రమేయం తగ్గించుకొని, స్వతంత్రించి వివాహాలు చేసుకోవచ్చు నంటారు. కుశాలరావు తన మామగారినుండి బంధుత్వాపేక్షను తప్ప దేనినీ ఆశించడు. ఇది ఎంత దొడ్డగుణం!
స్నేహితుల మధ్యనుండే రాగబంధం ఎంతటి బలీయమైనదో, పవిత్రమైనదో వివరిస్తారు ‘స్నేహితులు’ అనే నవలికలో. ‘సృష్టిలో తియ్యనిది స్నేహమే.’ ఐతే బాల్యస్నేహం మరీ తియ్యనిది. ఈ బాల్యస్నేహానుబంధాలు పెరిగి పెద్దవాళ్లయాక, వివాహాలై జీవితాలలోకి కొత్త వ్యక్తులు ప్రవేశించాక, మనస్సులలో ఏవిధంగా అడ్డుగోడలు పెరిగి, పెద్దవై, రాకపోకలూ, పలుకరింపులూ, చూపులూ తగ్గిపోతాయో చక్కగా చెప్పుకుపోయారు. ఈ అనర్థాలకు మూలకారణం ఆర్థిక సమస్యలే. ఆడవాళ్ళు కూడ మరికొంత కారణం కావొచ్చునంటారు. తన భర్త స్నేహితులను, వాళ్ళ వాళ్ళ సంపదనుబట్టే చాలమంది మధ్యతరగతి కుటుంబీకులు స్నేహితులను అంచనా కట్టటాన్ని చూచి ఆయన విస్తుపోతారు.
ఆర్థికమైన చిక్కులు లేనివాడు మధ్యతరగతిలో పెద్ద అదృష్టవంతుడి కింద లెక్క. ఆర్థికమైన చిక్కులున్న వాడేమో శాపగ్రస్థుడున్నూ. ఆప్తమిత్రుల నుండి ధన సహాయం స్వీకరించవలసినప్పుడు అభిమానియైన సంసారి బాధ వర్ణనాతీతం. శ్రీ కుటుంబరావు వర్ణనల కతీతంకాదని యీ నవలిక నిరూపిస్తుంది. కుటుంబ స్నేహాలను పటిష్ఠంగా ఉంచుకోవటానికి పెద్దవాళ్లు పిల్లల పెళ్లిళ్లు నిశ్చయింప జూస్తారు. వాళ్ల మనస్సులు తెలుసుకోరు. తెలుసుకున్నా అది పెళ్ళిళ్ళకే దారితీస్తాయనుకోవటం           కాదంటారు.
విడ్డూరమైన మనస్తత్వం గలిగిన ‘ఇందిర’ అనే అమ్మాయి తనకు తన తండ్రి యివ్వలేని చీరలూ, నగలూ, కారూ, మేడా యివన్నీ ధనవంతుడిని పెళ్లాడి తీర్చుకోవాలనుకొంటుంది ‘తిమింగలంవేట’ అనే నవలికలో. బుద్ధిమంతుడూ, పత్రికాఫీసులో చిన్న ఉద్యోగం చేస్తున్న యువకుడి సంబంధం తండ్రి తెస్తే తిరస్కరిస్తుంది. తనకంటె ఎంతో పెద్దవాడూ, భార్యపోయినవాడూ అయిన తన దూరపు బంధువు రఘురామయ్యను పెళ్లాడలనుకొంటుంది. ఎంతకీ రచయితలు తల్లిదండ్రుల డబ్బాశనూ, స్వార్థాన్ని బయటపెట్టి దుయ్యబడతారేగాని కన్నెపిల్లల మనస్సులలోనూ ఉండే దురాలోచనలు, దూరాలోచనలను వ్రాయరు. కాని శ్రీ కుటుంబరావు యీ నవలికలో కొత్తకోణంనుండి వివాహసమస్యను మన ముందుంచారు. తిమింగలం వంటి రఘురామయ్య పెళ్ళికి సమ్మతించకపోగా, ఇందిర తండ్రిని చెడతిడుతూ ఉత్తరం వ్రాస్తాడు. ఇందిర తండ్రి తన కుమార్తె ఆలోచనలకు క్రుంగిపోతాడు. తల్లిమాత్రం హర్షిస్తుంది. కాని సాధ్యపడనందుకు మాత్రమే విచారిస్తుంది. విధి లేక ఇందిర, తండ్రి ఏ సంబంధం కుదిర్చినా సరేనని సిద్ధమౌతుంది. ఇటువంటి ఇందిరలు మన సమాజంలో ఎందరో!
పై కథలో తిమింగలం రఘురామయ్య కంటే ‘పెళ్ళికూతురు’ కథలో వెంకటేశ్వర్లే మెరుగు. పిల్లతండ్రీ, తన సహాధ్యాయీ కుత్సితపు బుద్ధితో డబ్బాశతో కుమార్తెను తనకు, మూడోపెళ్ళి వాడికి కట్టబెట్టబోగా ఆ అమ్మాయి గడుసుగా బుద్ధి చెప్పింది. అంద రాడపిల్లల లాగా నూతిని గోతిని వెతక్కుండా, ఏడ్చి శోకాలు పెట్టకుండా వెంకటేశ్వర్లు మనస్సు మార్చేస్తుంది. ఆ అమ్మాయి మనస్సు తెలిసికొన్న వెంకటేశ్వర్లు తన కొడుకుకే ఆ అమ్మాయినిచ్చి పెళ్ళి జరిపిస్తాడు.
తెలుగు కథలలో యువతీయువకు లెప్పుడూ అందమైన వాళ్లే. వాళ్ల తల్లిదండ్రులు కూడ అందం మిగిలి, యౌవనం జారిపోయిన అందగాళ్లే. వాళ్ల బంధువర్గమూ అంతే. కురూపులకు కథలలో స్థానం లేదు. శ్రీ కొడవటిగంటి సాహసంతో కురూపుల కథలు వ్రాశారు. కనకం అనే యువకుడు బస్సులో తనను చూసి నవ్విన అమ్మాయి కురూపియని అసహ్యించుకుంటాడు. పని ఉండి వాళ్ళింటికే వెడతాడు. క్రమంగా పరిచయం పెరుగుతుంది. అది స్నేహం మాత్రమే. ఆ అమ్మాయికి వచ్చిన విపత్తులో అంటే ఆ అమ్మాయి ప్రాణాదికంగా ప్రేమిస్తున్న వాళ్ళ అన్న కూతురు బేబీ చనిపోయినప్పుడు ఆ ‘షాక్‌’ తట్టుకోలేకపోతుంది. ఆ ఆపదలో కనకం ఆమెను నోదారుస్తాడు. ఆప్యాయతతో దగ్గరకు తీసుకొంటాడు. జాలి ప్రేమగా పరివర్తనం చెందుతుంది. ఆ అమ్మాయి కనకం డొక్కలోదూరి పండుకొంటుంది. ఆ అమ్మాయిని మాతృభావంతో చూసి తన తలపుకు సిగ్గుపడి నవ్వుకొంటాడు. ‘కురూపి’ అనే యీ పేరు గలిగిన పెద్దకథను ఉత్తమ కథల జాబితాలో చేర్చవచ్చు. కథలలో యిది నూతన ప్రయోగం. సమర్ధుడైన రచయిత తీర్పు. కురూపులకే కాదు. మంచి కథలు చదవాలనుకొని అవి రావటం లేదనే సహృదయులకు కూడ వోదార్పు.
మరొక కురూపిని గురించి చీరీగిబీనీళిబిదీబిజిగిరీరిరీ తో గల్పిక వ్రాశారు. నిజమైన ప్రేమ కురూపికి, సౌందర్యానికీ మధ్య జనిస్తుందని వాదించి వొప్పిస్తా రీగల్పికలో. అది ప్రేమో-కామమో మనమే తేల్చుకోవాలని అసందిగ్ధంగా వొదిలేస్తారు.
శ్రీ కుటుంబరావు వ్రాసిన మంచి కథలను వ్రేళ్లమీద లెక్కించాలంటే వ్రేళ్లు చాలవు. ఆయన కథలన్నింటినీ చదివిన వాళ్ళెందరో ఉండరు. నేనూ అన్ని కథలనూ చదవలేదు. ఏ కథ మంచిదనటం కంటే ఏ కథ మంచిదికాదో ఆలోచించాలి. నచ్చిన కథలు, నచ్చని కథలుగా విభజించుకోవచ్చునుగాని ప్రయోజనంలేని కథలనాయన వ్రాయనే లేదు. ‘సూరి సిద్ధాంతం’ పేరుతో ఆయన వ్రాసిన నాలుగు కథానికలూ జాతిరత్నాలు. సూరి సూపర్‌మాన్‌. కాలాన్ని శాసించగలడు. తాను ప్రగతిపథంలో నడుస్తూ యితరులను నడిపించగలడు. సనాతనమతం అన్న వాడినల్లా జైల్లో పారేస్తే కొన్నాళ్ళకు హరిజనుల్లోనే గాంధీ మహాత్ముడు పుట్టుకు రావచ్చు నంటాడు. దగాపడిన తమ్ములైన హరిజనుల ఉద్ధరణ జరగాలంటే సనాతనులను శిక్షింపక తప్పదంటాడు సూరి.
మూఢ నమ్మకాలను హేళన చేసి, ఖండించిన రచయితలు చాలమంది ఉన్నారు. కాని సున్నిత మనస్కు లనుకొనేవారి అంతరాత్మ దాస్యాన్ని  పవిత్రులనుకొనే వాళ్ళిచ్చిన ధనం దాచిపెట్టి, ఆ డబ్బు ఖర్చయినప్పుడు వాళ్ళకు కష్టాలొస్తాయనుకొనే నవీన మౌఢ్యాన్ని (అనుబంధం నవలలో) తూర్పారబట్టటం శ్రీ కుటుంబరావు విశిష్టత. ఆచారపరులుగా, శీలవంతులుగా, పెద్ద మనుష్యులుగా నటించే పెద్దలు లొసుగుల నాయన యెన్నటికీ సహించరు. ఉపేక్షింపరు : కలంపట్టి కథ వ్రాయక వొదిలిపెట్టరు. సంఘంలోని లోపాలను కళాత్మకంగానే కథలలో జొప్పించి, వాటి పరిష్కారమార్గం ఆలోచిస్తే అందే విధంగా వదిలేస్తారు. ఇంతటి సారస్వత సేవ చేసిన తెలుగు కథకుడు మరొకడు లేడనటం అతిశయోక్తి కాదు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో