స్త్రీల పట్ల అన్ని రకాల వివక్షతలు నిర్మూలన ఒప్పందం (సిడా) మీద భారతదేశం సంతకం చేసిన క్రమంలోంచి మహిళల రక్షణ కోసం అనేక సంస్థల, వ్యవస్థల ఆవిర్భావం జరిగింది. జాతీయ స్థాయిలోను, రాష్ట్రస్థాయిలోను ఈ సంస్థలు మహిళలకోసం పనిచేయడానికి పూనుకున్నాయి. జాతీయ మహిళా కమీషన్, రాష్ట్ర మహిళా కమీషన్ ఈ కోవలోవేే. అలాగే రాష్ట్ర స్థాయిలో మహిళలపై అమలయ్యే నేరాలను, ముఖ్యంగా వరకట్న, కుటుంబ హింసకు సంబంధించిన నేరాల విషయమై ఫిర్యాదులు స్వీకరించడానికి పోలీసు శాఖలోని సిఐడి విభాగం ఆధ్వర్యంలో ”ఉమెన్ ప్రొటెక్షన్ సెల్” ఏర్పాటయింది. బాధిత స్త్రీలు ఈ సెల్‌లో తమ ఫిర్యాదులు దాఖలు చేయవచ్చు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల పోలీస్ స్టేషన్‌లకు ‘ఉమెన్ ప్రొటెక్షన్ సెల్’ నుండి ఈ ఫిర్యాదులను పంపడం, బాధితుల కేసులు నమోదు చేయించడం, సంబంధిత పోలీస్ స్టేషన్ ద్వారా బాధిత మహిళకి రక్షణ కల్పించడం, ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయించడం ఈ సెల్ ముఖ్య బాధ్యతలు. చాలా కాలంగా ఈ సెల్ కార్యక్రమాలు ”ట్రాఫికింగు” కే పరిమితమవ్వడంవల్ల కుటుంబ హింసకు సంబంధించిన కేసుల నమోదు తగ్గినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ బాధిత మహిళలకు అన్ని రకాల సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ సిఐడి కార్యాలయంలో 2004 లో ఒక సపోర్ట్ సెంటర్‌ను ప్రారంభించింది. బాధిత మహిళలకి కౌన్సిలింగు, రిఫరల్ సదుపాయాలను ఈ సెంటర్ సమకూర్చుతోంది. ఆక్స్‌ఫామ్ సపోర్ట్‌తో 2010లో మరొక సపొర్ట్ సెంటర్ కూడా సి.ఐ.డి కార్యాలయంలో మొదలైంది. అప్పటి ఐ.జి.సిఐడి ఉమాపతి, ఐపిఎస్ గారి సహాయ, సహకారాలతో ఈ సెంటర్‌ను ప్రారంభించడం జరిగింది. అనంతపూర్‌లో పనిచేసే ఏపిపిఎస్ సంస్థద్వారా ఇది ప్రారంభమై భూమిక పర్యవేక్షణలో ఈ సెంటర్ నడుస్తోంది. ఇద్దరు సోషల్ వర్కర్లు ఇక్కడ పని చేస్తున్నారు.
ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ రాష్ట్రస్థాయి సంస్థ కాబట్టి రాష్ట్రం నలుమూలల నుండి బాధిత మహిళలు ఈ సెంటర్‌లో తమ ఫిర్యాదులను దాఖలు చేయవచ్చు. వివిధ పద్ధతుల ద్వారా వారికి రక్షణ, న్యాయం జరిగేలా చూడడం ఈ సెల్ ప్రధాన బాధ్యత. ఆ దిశలో పనిచేయడానికి సపోర్ట్ సెంటర్ కృషి చేస్తోంది. ఈ క్రింది నంబరుకు ఫోన్ చేసి బాధితులు తమ ఫిర్యాదు దాఖలు చేయవచ్చు. సంప్రదించవచ్చు. సహాయం పొందవచ్చు. నేరుగా వచ్చి సెంటర్‌లో కౌన్సిలర్‌లను కలవవచ్చు.
ఆంధ్రప్రదేశ్ మహిళా కమీషన్
జాతీమ మహిళా కమీషన్‌ను వ్యవస్థీకరించిన రీతిలోనే రాష్ట్ర మహిళా కమీషన్ రూపకల్పన చేయబడింది. రాష్ట్ర శాసనసభ సెప్టెంబర్ 1996లో 32వ నెంబరు చట్టానికి ఆమోదముద్ర వేసింది. స్త్రీలపై దుష్ప్రభావం చూపించే అనుచితమైన, అన్యాయమైన ఆచరణలపై పరిశీలన, విచారణ, స్త్రీల అంశాలపై పరిశోధన, చాలామంది స్త్రీలపై ప్రభావం చూపే అంశాలపై న్యాయస్థానాలలో పోరాటానికి, వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించటానికి, విధాన నిర్ణయాలలో సలహాలు, స్త్రీల కార్యక్రమాల అమలుపై సమీక్ష మొదలైనవి కమిషన్ లక్ష్యాలు. కేసు విచారణలో న్యాయస్థానానికున్న అధికారాలన్నీ మహిళా కమీషన్‌కి ఉంటాయి. స్త్రీల అంశాలని, వాటికి సంబంధించిన సిఫార్సుల డాటాబాంక్‌ను కమిషన్ నిర్వహించాల్సి ఉంటుంది. ఇన్ని ఉన్నత ఆదర్శాలతో, బాధ్యతలతో రాజ్యాంగ హోదాతో ఏర్పాటైన కమీషన్ గతంలో ఎలా వ్యవహరించిందో మనకు విదితమే. మహిళల సమస్యలపట్ల నిజాయితీతో, నిబద్ధతతో పనిచేసే, రాజకీయ జోక్యంలేని కమీషన్‌ను నియమించాల్సిందిగా మనందరం విజ్ఞప్తి చేద్దాం.
చిరునామా : బుద్ధ భవన్, కవాడిగూడ, సికింద్రాబాద్
ఫోన్ : 040-27540414/27542017/9966981333
జాతీయ మహిళా కమీషన్ ఫర్ ఉమెన్
చిరునామా : 4, దీన్ దయాల్ ఉపాధ్యాయ మార్గ్, న్యూఢిల్లీ-110002
ఫోన్. 91-011-23237116
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags