మహిళా పోలీసస్టేషన్‌లలో సపోర్ట్‌ సెంటర్లు

గృహ హింసతో పాటు వివిధ రకాల హింసలకు గురవుతున్న మహిళలు రక్షణ కోసం పోలీస్‌ స్టేషన్‌లను ఆశ్రయిస్తుంటారు. మన పోలీస్‌ స్టేషన్‌ల నిర్మాణం, పోలీసుల పనితీరు, పరిసరాలు బాధిత మహిళలకు అనుకూలంగా వుండవు. శాంతి భద్రతలు, ప్రముఖుల బందోబస్తు వ్యవహారాల్లో మునిగితేలే పోలీసులు బాధిత మహిళల దు:ఖాన్ని, మానసిక స్థితిని అర్ధం చేసుకోలేరు. హింసకు గురై స్టేషన్‌కొచ్చిన బాధితులను పోలీసులు తమదైన తీరులో ‘కౌన్సిలింగు’ చేసి పంపడం లేదా పట్టించుకోకపోవడం సర్వసాధారణం. ఐపిసి సెక్షన్‌ 498 ఏ ప్రకారం గృహహింస నేరమైనప్పటికీ చాలాసార్లు పోలీసులు బాధిత స్త్రీ చెప్పిన విషయం పట్టించుకోకుండా సర్దుకోమని సలహాలిస్తారు. లేదా అవసరం ఉన్నా లేకపోయినా ఐపిసి 498ఏ కింద కేసు నమోదు చెయ్యడం, కేసుకి సంబంధం లేని కొంతమంది కుటుంబ సభ్యుల్ని కూడా నిందితులుగా పేర్కొనడం జరుగుతోంది. నిజానికి తమను ఆశ్రయించిన బాధితులను రక్షణాధికారుల వద్దకు పంపాల్సిన బాధ్యత పోలీసులదే. వారి పని ఒత్తిడివల్లనైతేనేమి, జండర్‌ సెన్సిటివిటీ లోపిచడంవల్లనైతేనేమి పోలీసులు బాధిత స్త్రీలకు సరైన రీతిలో సలహా ఇవ్వలేకపోతున్నారు.
ఈ నేపధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీస్‌ స్టేషన్‌లలో బాధిత మహిళల కోసం సపోర్ట్‌ సెంటర్‌లను ప్రారంభించాలని ఆక్స్‌ఫామ్‌ భావించింది. ఇలాంటి సెంటర్‌లు ఇప్పటికే టాటా ఇన్సిస్టూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ పర్యవేక్షణలో మహారాష్ట్రలో ప్రారంభమై విజయవంతంగా పనిచేస్తున్నాయి. వీటి పని తీరును అధ్యయనం చేసిన ఆక్స్‌ఫామ్‌ టీమ్‌,  ఆంధ్రలో కూడా ప్రారంభించాలని నిర్ణయించి సి.సి.ఎస్‌లోని మహిళా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2004లో ఒక సపోర్ట్‌ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ సెంటర్‌ ద్వారా ఎంతో మంది బాధిత స్త్రీలు సలహా, సమాచారంపొందుతున్నారు. దీని స్ఫూర్తితో వరుసగా వరంగల్‌, అనంతపురం, కరీంనగర్‌లలో మహిళా పోలీస్‌ స్టేషన్‌లలో సపోర్ట్‌ సెంటర్లు ప్రారంభించడం జరిగింది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో