మహావృక్షం

రాజీవ
నేనొక మహావృక్షాన్ని
షష్టిపూర్తి చేసుకున్నా
నేను మొగ్గవిరిసి పిందె కట్టినప్పుడే
మొదట పిల్ల కాయలు చూసారు
నన్ను చూసి అబ్బుర పడ్డారు
ఆరాధనతో బోదితవ్వి నీళ్ళుపోసి
నన్ను కంటిపాపలా కాపాడారు.
కొమ్మకొమ్మకు రెమ్మ రెమ్మకు
తీయటి పండ్లు వెలకట్ట లేనివి
పిల్లల వడిలో మమతల నవ్వులు నింపి
తినబెట్టి మురిపించి మురిసాను.
పిల్లలు నా చుట్టూ విత్తనాలు నాటారు.
మరిన్ని మొక్కలు – వృక్షాలు – పండ్లు –
ఆ చుట్టూ నా పండ్లు – బడిలో గుడిలో
సమతకు మానవతకు మాతృత్వానికి
అదిష్టానమయింది – నా గుండె నిండుకుంది
నేను – నా వారసత్వం – గొప్పదని కాదు !
యీ చైతన్యం అందుకున్న స్ఫూర్తి
పచ్చదనం – పండ్ల తీయదనం – నా
ప్రాంతమే గాక విశ్వవ్యాప్తం అవుతుందని !
మొక్కలు వృక్షాలై – వృక్షాలకు మొక్కలు
యిన్ని మరిన్ని – యింకెన్నో వేల ఎకరాలు
వనాలు, పంపకాలు, భాగాలు అయ్యాయి.
ఒకటి కొకటి క్రాస్‌బ్రీడ్‌ పండ్లు – ఏడాది కోమారు –
కాక – ఏడాది పొడుగునా దొరుకుతున్నాయి.
కాలంతో వచ్చిన కొత్త షోకులు
అసహజంగా, అనాగరికంగా కనిపిస్తున్నాయి.
నా కొమ్మలు విరిచి మరో కొమ్మతో అంటుకట్టి
చేదు పుట్టిన తరుణంలో నన్ను నిందించారు.
ఈ చెట్టు ఉంటే మిగిలిన మొక్క ఎదగవన్నారు.
దీని స్వార్థపు నీడలు కొత్త మొక్కల
అభ్యుదయానికి సమాధి కడుతుందన్నారు.
పురుగుల మందు వేసి ఈ పీడ చెట్టుని
విరిచెయ్యలన్నారు.
అలా చావదు – గొడ్డలితో ముక్కముక్కలు
చేసి పొయిలో కాల్చాలన్నారు.
మిగిలిన మొక్కలు వేటికీ దీని గాలి కూడా
సోక కూడదు – పాపిష్టి చెట్టు అన్నారు.
ఏదైనా నేనొక మహా వృక్షాన్నా
ఆనాటి నుండి యీనాటి వరకు ఓ ప్రేక్షకురాల్ని
నా చుట్టూ ఉన్న ప్రతీ మొక్క నా ఊపిరిపోసుకున్నదే
నా పండ్ల తీయదనం ఆస్వాదించిందే !
నా నీడలో సేదదీరి అమ్మా – వందనం
అని నా దీవెనలందుకున్నదే !
మీరు కూల్చినా నేను కూలినా
నాలో నా పిల్ల మొక్కల పట్ల ప్రేమ చావదు
చల్లని నీడనిచ్చి – తీపి పండ్లనే
పంచాలనీ భావిలో మరింత మధురంగా
ఉండాలని నా దీవెన సదా ఉంటుంది.

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.