సామాజిక బాధ్యతను మరింతగా పెంచిన టూర్‌

– గీత

ఆదిలాబాద్‌ అడవుల్లోకి ప్రయాణం ఎప్పటినుండో అనుకుంటున్నా కుదిరింది ఇప్పటికి. ఇదివరకే అందరం కలిసి చేసిన వైజాగ్‌, కర్నూలు ప్రయాణాలు గుర్తుకు వచ్చి ఆదిలాబాద్‌ అడవుల్లోకి ఉరకలెత్తింది మనసు. ఈసారి కొత్తగా నాతోపాటు అక్కలిద్దరు, చెల్లి, నా ఫ్రెండ్‌ ఇందిర తనతో పాటు ఉష అందరూ మేము కూడా అన్నారు. సరే నని సత్య అందరికి సరిపడా బస్సు మాట్లాడేసి ప్రయాణానికి సిద్ధమవమంది. అయితే ఎంత ఉత్సాహంగా రెడీ అయ్యానో అంత డిస్టర్బ్‌డ్‌ మూడ్‌తో ఒద్దన్నాను కారణం అంతకు ముందు రోజు నా స్నేహితురాలు వాణి హజ్బెండ్‌ హఠాత్తుగా గుండెపోటుతో నిద్రలోనే శాశ్వత నిద్ర పోవడం. అసలు మనిషి జీవితం ఇంతేనా? ఈ మాత్రం దానికి ఎన్నెన్ని తాపత్రయాలు, ఆశలు అనే ఒక నిరాసక్త భావన ఒక వైపు, ఉద్యోగ ప్రయాణంలో ప్రమోషన్‌ హడావుడి ఇంకొక వైపు. డిస్టర్బెన్స్‌కి కారణం బయటకు చెప్పి అందరి మూడ్‌ చెడగొట్టడం అసలు ఇష్టం లేదు. తెలిసిన సత్య నన్ను నార్మల్‌గా ఉండేలా స్నేహాన్ని పంచింది. సరే అనుకున్న టైముకి బస్సు ప్రయాణం మొదలవాలని నేనెంత హడావుడి పెట్టినా చివరికి చేటీ (కాస్త) గా ఎక్కింది మిటాకు ప్రశాంతి, సత్యలే. ఏంచేద్దాం? వదిలేసి వెళ్దామంటే ప్రయాణం ప్లాన్‌ చేసిందే వాళ్లిద్దరు కదా. అందుకే పెనాల్టీతో అనుకున్నాం. అలా భూమిక ఆఫీసు నుండి మొదలై సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లిలో ఆగుతూ అందరిని కలుపుకొని ఆర్మూరు వైపు పరుగుపెట్టాం. అక్కడ అమృతలత గారి ఆప్యాయం ఆదరణ రుచి చూడటానికి. అందరూ తొందరగా వచ్చేయాలనే ఆరాటంతో అమృతలత గారు అయిదువందల లంచం కూడా ఆశపెట్టారు 7 గంటల లోపు వస్తే ఇస్తానని. ప్చ్‌. మా ఆశ తీరలేదు. కాస్త ఆలస్యంగా చేరాము స్వీట్స్‌ తింటూ స్వీట్‌గా పాటలు వింటూ, నిజామాబాద్‌లో అడుగుపెట్టగానే అమృతలత నాకు పంపిన వాహనం దారిచూపగా విజయా స్కూలు ఆవరణలో అడుగు పెట్టిన మాకు మొత్తం అమృత ఆతిథ్య టీం ఆప్యాయంగా ఆదరించారు అందరిని. అందులో మేమెవరము వారికి అప్పటివరకు పరిచయం లేసినప్పటికిని. అది అమృతలత అండ్‌ టీం గొప్పతనం. ఎదిగినకొద్ది ఒదిగి ఉండటం అలవర్చుకున్న వారి విద్యా సంస్థలు మరెంతో మంది విద్యార్ధులకు మార్గదర్శకమవుతున్నాయి. అక్కడినుండి అమృతలత గారు కట్టించిన వేంకటేశ్వర గుడి, పెద్దల కొరకు నిర్వహిస్తున్న హోం, గెస్ట్‌హౌస్‌ చూస్తూ అమృతలత గారి ఇంటికి వచ్చాం. హోం నిర్వహణ చాలా బాగుందనిపించింది. కాకపోతే మేం ఆలస్యంగా వాళ్ళు నిద్రపోతున్న వేళ వెళ్ళి డిస్టర్బ్‌ చేశాం. ఇక గుడి ఆవరణలో అడుగు పెడుతున్నారో లేదో నా ప్రమోషన్‌ కన్‌ఫర్మ్‌ అయిన విషయం తెలిసి నేనెంతో ఆశ్చర్యానందాలకు లోనయ్యాను.

ఇక అమృతలత గారు వారి ఇంట్లో అందరికీ అమృతమే పంచారు. తను స్వయంగా వండి వడ్డించిన రొయ్యల కూర, ఆలూ ఫ్రై తింటూ అందరూ భుక్తా యాసంతో ఉంటే ఆటలు పాటలు, గెలిచిన వారికి బహుమతులంటూ, డ్యాన్స్‌లతో ఉషారెత్తించి అసలు ప్రయాణం బడలిక అనేది కాని సమయం ఎంతయిందని కాని ఎవరికి గుర్తు రానంతగా చేశారు. సరే ఉదయమే పొచ్చెర జలపాతం అంటూ ఊరిస్తే ప్రక్కలు చేరాము.

అంకాపూర్‌ గ్రామ ప్రజలు అభివృద్ధి ఎలా పొందారో తెలుసుకుంటూ ఉదయమే మళ్ళీ అందరూ హుషారుగా టూర్‌ గైడ్‌ నెల్లుట్ల రమాదేవి వివరణలతో వస్తే రెడీ అయిపోయారు. కాఫీలు త్రాగి శ్రీరామ్‌ సాగర్‌పై మార్నింగ్‌ వాక్‌ చేసి ఇందిర చిన్ననాటి స్కూల్‌ చూస్తూ పొచ్చెర జలపాతం చేరాం. అంతే ఎప్పుడెప్పుడు జలపాతం చేరుదాం. అంతే ఎప్పుడెప్పుడు జలపాతం నీళ్ళల్లో జలకాలాడాలని పరుగెడుతుంటే నథింగ్‌ డూయింగ్‌ అంటూ పూరీలు చికెన్‌, మక్క గారెలు ఇలా ఒకటేమిటి మళ్ళీ మా కడుపులు నింపేసి, ఆయాసపడే కుట్ర చేసేశారు అమృతలత. మమ్మల్ని ఆటల్లో పెట్టి టిఫిన్స్‌ ఫుల్‌గా లాగించేసి ఇక పొచ్చెర జలపాతంలో చిన్నపిల్లల్లా కిందపడుతూ ఫోటోలకు ఫోజిస్తూ ఈ ప్రపంచాన్నే మరిచిపోయాం. ఇక అక్కడనుండి కుంటాల జలపాతంకి వస్తే అక్కడి ప్రకృతి ఎంత అందంగా ఆలరించిందో చెప్పలేం. కిందకి ప్రయాణం చేస్తూన్న జలపాత అందాలు, ఆ కొండ బండలలో ఆ నీళ్ళు నిజంగా ఎంత అందమైన లోకం కదా. కాకపోతే సమయాభావం, ఇంకా అడవుల్లోకి వెళ్ళాలనే కోరికతో కుంటాలను వదిలినా మాకు చుట్టూ పొలాలు, అడవి అందులో ఒకే ఒక ఇల్లు ఆ ఇంటి వారు పెట్టిన భోజనం అసలు ఇవన్నీ సాధ్యమేనా అనేంతగా అమర్చారు అమృత అక్కడ… వారి సహకారంతో. ఈ కాస్త సమయంలోనే తాగొచ్చి కొట్టే ఈ మొగుడు నన్నొదిలి మస్కట్‌ పోయినా నేను కైకీలు (కూలి) చేసుకుని అయినా సంతోషంగా ఉంటానంటూ వినోదాత్మకంగా చెప్పిన స్కిట్‌తో చక్కగా పాత్రాభినయంతో అందరికీ ఆహ్లాదాన్నిచ్చారు. వారు అక్కడ పెంచుతున్న ఎలుగుబంటి పిల్లలు, జింకలూ అన్నింటిని పలకరిస్తుండగానే రెండు ట్రాక్టర్లు తెచ్చి పెట్టి అడవుల్లోకి వెళ్లొద్దామంటే కిందా మీదా పడి ట్రాక్టర్లు ఎక్కి ఒకళ్ళ మీద ఒకళ్ళం పడుతూ దారిలోని వాగులతో కేరింతలు కొడుతూ అడవి అందాలూ ఆస్వాదిస్తూ చేసిన ప్రయాణం మరచిపోవడం ఈ జన్మకి సాధ్యం కాదు. ఇక అడవిలోని బుర్కంపహాడ్‌ లోని ట్రైబల్‌ వారి ఆచారంతో నెమలి ఈకల తలపాగాలు ధరించి చేసిన నృత్యాలు అందరిని వారితో కలిసి స్టెప్స్‌ వేయించాయి. వారితో కలిసి ఆ నివాసాల తీరుతెన్నులు ఆచార వ్యవహారాలు తెలుసుకొనే ప్రయత్నం చేశాం. వేడి వేడిగా పెసర గారెలు తింటూ. ఆ అడవిలో అవెక్కడివి అని అడగద్దు ఎందుకంటే అమృత హస్తం ఉంది కదా.

ఈసారి చీకట్లో అడవి ఎలా ఉంటుందో చూస్తూ మేం చేసిన గోలకి అడవిలోని జంతువులు మేమే నయం అనుకుని ఉంటాయి. ట్రాక్టరు దిగిన మాకు వారికి సహాయపడే కుటుంబంలోని పాప పుట్టిన రోజు, సెలబ్రేషన్‌, రమాదేవి అండ్‌ టీం వేసిన బందాలు మాకొద్దంటూ సందేశాత్మక స్కిట్‌, బహుమతుల ప్రదానం, కలబోసుకుంటూ డిన్నర్‌ చేసి ఇక అక్కడితో అమృతలత గారి టీంతో వీడ్కోలు తీసుకొని మర్చిపోలేని అనుభూతుల్ని మూటకట్టుకుని ఉట్నూరు వైపు బయల్దేరాము.

ఉట్నూరు ఆర్‌డిఓ రామచంద్రయ్య గారు ఎదురొచ్చి అక్కడ ఉన్న ఐటిడిఏ గెస్ట్‌ హౌజ్‌లో మమ్మల్ని చేర్చి ఉదయం టీకి వాళ్ళింటికి రమ్మని ఆహ్వానించి వెళ్ళారు. ముందుగా అనుకున్నది ఏదైనా ట్రైబల్‌ విలేజిలో మహిళా సమత గ్రూప్‌ సహకారంతో ఆ రాత్రి గడపాలని. కాని చివరి నిమిషంలో మార్పు. అందుకే ఐటిడిఏ గెస్ట్‌ హౌజ్‌లో సర్దుకొన్నాం. ఉదయం టీకి పిల్చిన పెద్దమనిషి అమ్మో మా వాళ్ళు టీ పెడితే మీరు తిడతారు తాగలేక అంటూ మాచేతే టీ పెట్టించారు. మొత్తానికి ఉట్నూరు నుండి ప్రయాణం ఇక మరో కోణంతో మొదలైంది.

మహిళా సమతా డైరక్టర్‌ ప్రశాంతి ఆధ్వర్యంలో తెలంగాణ పోరాట వీరుడు కొమురం భీం స్మారక చిహ్నంని దర్శించి అప్పటి విషయాలు తెలుసుకొని ఆ ప్రదేశాన్ని ఇంకొంచెం శ్రద్ధగా తీర్దిదిద్దాలని అనుకుంటూ బయల్దేరి దారిలో బస్సు ‘టైర్‌’ పంక్చర్‌తో చింతచెట్టుపై దాడి చేసి చింతకాయ కంఠాభరణాలు ఎత్తుకొని స్టార్ట్‌ అయిన బస్సులో పరుగెత్తాం మహిళా సమతా గ్రామాలకు. ఇక్కడ మాకు ప్రశాంతి ప్రతి విషయాన్ని తన మృదువైన, పేరుకు తగినట్లు ప్రశాంతంగా వివరించడం, తన టీం వారితో కలిసి మెలిగిన విధానం, వారి ఆప్తురాలిగా ఉండటం అందరికి ఇష్టమైంది. ఈసారి దారి చూపింది మా ప్రయాణానికి ప్రశాంతి మహిళా సమత గ్రూపు కార్యకర్తలైన… ఝరి గ్రామానికి వెళ్ళి పొంగల్‌, కుసుమ గింజల పొడి, ఆర్గానిక్‌ పళ్ళు, గింజలు, పప్పులు అన్ని ఆహాఆహో అని మింగేసి మళ్ళీ వాళ్ళని అడిగి మరి పొడి పొట్లం కట్టించుకొన్నాం. వారు ఎంతో ఇష్టంగా, శుభ్రంగా పెట్టిన విధానంతో వచ్చిన రుచి అది. మాకెంతో అదృష్టం వచ్చింది ప్రశాంతి వచ్చి. అదే వూపులో ఆర్గానిక్‌ పంటలు పండించడం, విత్తనాలు వివిధ రకాలను సేకరించి భద్రపరిచి ముందు తరాలకు అందించడానికి చేస్తున్న ప్రయాణాలను అక్కడి….. వారి ద్వారా తెలుసుకొని కందిచాలనం ప్రత్యక్షంగా చూసి అందరం ఇక పప్పే తిందాం అని ఒప్పేసుకొని ఉషేగాం చేరాము. మా బస్సు దిగిన వెంటనే వారు సాంప్రదాయకంగా డప్పులతో పూలదండలతో వూరు వూరంతా మమ్మల్ని ఆహ్వానించడం అందరికి ఎంతో ఆనందం కల్గించింది.

ఇక అక్కడి వారు చేతిలో రూపుదిద్దుకొంటున్న కళాకృతుల్ని ప్రదర్శించి, వాటి గురించి వివరించారు. అంతే అందరూ బాగున్నాయంటూ చెప్తుంటే సత్య ఆదిలాబాద్‌ ప్రయాణ గుర్తుగా అందరికి ఇద్దామని చెప్పి వారికి అందరికి సరిపడా పంపమని చెప్పింది. ఊరందరితో కూర్చుని చేసిన భోజనం గురించి మాటల్లో చెప్పలేం. మాకందరికి మొక్కజొన్న అన్నం, సంక్రాంతి పండుగకు చేసుకునే బెల్లం పల్లీల పాయసం ఇలా వారి ఆప్యాయతను కలిపి మాకు పెట్టి మా కడుపులు నిండిన ఆనందం అనిర్వచనీయం. ఇక వీడ్కోలుతో ప్రశాంతిని వారింటి కూతుర్ని సాగనంపినట్లుగా పెరట్లోని కూరగాయలు, మొక్కజొన్న కంకులు ఇలా ఏది వీలయితే అది సారె పెట్టు మళ్ళీ ఎప్పుడు కన్పిస్తుందో అని ఆరాటపడిన విధానం ప్రశాంతి పట్ల ప్రేమను కల్గించింది. ఆ ప్రేమలో మునిగి తేలుతూ వర్ణి బయల్దేరాం. ఆ ప్రయాణంలో అందరికి అందరూ తెలిసేలా క్విడ్‌ పెట్టుకొని ప్రతి ఒక్కరూ వారి గురించి మాట్లాడేలా చేసి గ్రూప్‌గా కలిసి వెళ్ళడానికి అర్థాన్ని అర్థం చేసుకున్నాం. వర్ణి వెళ్ళేటప్పటికే పిల్లలందరూ ఎదురు చూస్తున్నారు. ప్రశాంతక్క, అమ్మమ్మ (సత్య) ఎప్పుడు వస్తున్నారా అందరు చుట్టాలను తీసుకొని అంటూ. ఇక్కడ వర్ణి గురించి భూమిక పాఠకులందరికి తెలుసు. భూమికలో చదివినందుకే వర్ణి చూడాలనుకున్నాను. మహిళా సమత ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ హోం లోని పిల్లలకి వారికొక ఇల్లు, అమ్మ, అక్క, అన్న, తమ్ముడు, చెల్లి అంటూ కుటుంబం ఏర్పడి చక్కటి విద్యను నేర్పిస్తున్న విధానం అందరికి నచ్చింది. అయితే పిల్లలూ అలా ఎందరున్నారో అని ఆలోచిస్తే గుండె బరువెక్కింది. ఎవరికి తోచిన బాధ్యతను వారు సమాజం పట్ల తీసుకోవాలని గుర్తు చేసింది.

మొత్తం మీద నిజామాబాద్‌ – ఆదిలాబాద్‌ ప్రయాణం అడవి, జలపాతాల అందాలతో ఆహ్లాదపరచడమే కాదు సమాజమంతా వివిధ తెగల వారు మారుమూల ప్రదేశాల్లో ఎలా ఉన్నారో, వారి సాంప్రదాయాలు అన్నీ ప్రత్యక్షంగా చూడగలిగేలా చేసింది. ఈసారి ట్రిప్‌ ఎవరూ కూడా ఎలాంటి విసుగు కాని, సమస్య కాని పెట్టలేదు. ఇంత చక్కగా మరపురాని విధంగా ఉండటానికి అమృతలత గారి ఆతిథ్యం, ప్రశాంతి ప్రసన్నత అందరికీ దొరకాలని, తనకి మాత్రమే ఉంచుకోవాలనే ఆలోచన లేని సత్య స్నేహశీలత వల్లనే కదా!

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.