కలయా – నిజమా!?

– అమృతలత

‘రచయిత్రులందర్నీ తీసుకుని నిజామాబాదుకి వస్తే – అట్నుండీ ఆదిలాబాదు అడవుల్లోకి, జలపాతాల్లోకి సరదాగా వెళ్ళొచ్చు. ఓ సారి రండి’ అని చాలాసార్లు చెప్పాను సత్యవతితో.   DSC01449

కొన్నాళ్ళకి ఆచరణ రూపం దాల్చింది నా ప్రపొజల్‌. ఆ రోజు సాయంత్రం హైదరా బాద్‌లో ఏ అయిదింటికో బయల్దేరి – రాత్రి ఎనిమిదింటికి నిజామాబాదు చేరుకున్న రచయిత్రుల్ని విజయ్‌ హైస్కూల్లో రిసీవ్‌ చేసుకున్నాం.

మినీ బస్సులో వచ్చిన పాతిక మంది ప్రతిభావంతుల్ని ఒకేసారి చూడటం సంతోషం కలిగించింది. నిజామాబాదు స్కూల్లో ఓ పది నిమిషాలుండి – ఆ తర్వాత అందర్నీ తీసుకుని శ్రీ అపురూప వేంకటేశ్వ రాలయం చూడటానికి బయలుదేరి, గుడి తలుపులు మూసే సమయానికి ఓ నిమిషం ముందు అక్కడికి చేరుకున్నాం.

అందరికీ గుడీ, పరిసరాలూ బాగా నచ్చాయి. ఎన్ని లైట్లున్నా అవి సూర్యకాంతి ముందు దిగదుడుపే కదా! వాళ్ళు చీకటి కాకముందే వచ్చి వుంటే – ఫోటోలు బాగా వచ్చేవి కదా అన్పించింది.

గుడి ఆవరణలోనే వున్న అతిథి గృహం ‘సాంత్వన’ మెట్లెక్కి…. ఫస్ట్‌ఫ్లోర్‌ నుండి విద్యుద్దీపాల వెలుతుర్లో దేదీప్యమానంగా వెలిగిపోతున్న గుడిని చూసి సంబరపడిపోయారు. అలా గుడిలో పదినిమి షాలు… సాంత్వనలో అయిదు నిమిషాలు.. వెరసి పదిహేను నిమిషాలపాటు… ఆలయంలో గడిపి, అక్కణ్ణుంచి అందర్నీ రాజారెడ్డి గారు స్థాపించిన ‘లాలన’ వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళాం.

అక్కడికి వెళ్ళేసరికి రాత్రి తొమ్మిది న్నరయింది, అప్పటికే వృద్ధాశ్రమంలో చాలామంది నిద్రపోయారు. రచయిత్రుల సమక్షంలో… వృద్ధులకి చిన్న చిన్న గేమ్స్‌ పెట్టాలనీ, వాళ్ళందరితో కలిసి భోంచేయాలన్న నా కోరిక తీరలేదు. కారణం : టైం ప్రకారం ఏడున్నరకే వృద్ధులకు ‘లాలన’లో భోజనాలు పెట్టేస్తారు – వాళ్ళకి ఎనిమిదన్నరకే నిద్రపోవడం అలవాటు.

రచయిత్రులందరికీ లాలన లోని గదులూ, డైనింగ్‌ హాల్‌, మెడిటేషన్‌ హాల్‌, గెస్ట్‌హౌస్‌ అన్నీ చూపించి, అప్పటిదాకా నిద్రపోకుండా మాకోసం ఇంకా ఎదురుచూస్తోన్న కొందర్తో మాట్లాడి… అటు పిమ్మట… లాలన పక్కనే విజయాకిషన్‌రెడ్డి గారు అందంగా కట్టించిన ‘సాయికృష్ణ’ మందిరాన్ని దర్శించాం. అప్పటికే రాత్రి పది దాటింది. ‘అందరికీ ఆకలవుతుందేమో పాపం!’ అనిపించి – వెంటనే అందర్నీ తీసుకొని మరో పది నిమిషాల్లో ‘ఆహ్లాద’కు చేరుకున్నాం. ఆయాలు మా కోసం ఎదురు చూస్తున్నారేమో – వేడివేడిగా భోజనాలు వడ్డించారు. పోర్టికోలో అందరం కూర్చుని రకరకాల ఆటలాడాం. కొన్ని సరదా గేమ్స్‌ రమ కండక్ట్‌ చేస్తే – ప్రభ, వసంత, కవిత, కిరణ్‌బాల జడ్జిలుగా వ్యవహరించారు. అందరూ కలిసి… కొన్ని పాటలకు స్వేచ్ఛగా, హాయిగా, సరదాగా డాన్స్‌ చేశారు.

ఇంకా మాట్లాడాలనీ, కబుర్లు చెప్పుకోవాలనీ, అందర్నీ పరిచయం చేసుకో వాలని వున్నా – ‘మళ్ళీ తెల్లవారుఝామున లేవాలి కదా’ అని బలవంతంగా నిద్రకు ఉపక్రమించాం. అలసిపోయిన వాళ్ళు త్వరగా పడుకున్నారు. మిగతావాళ్ళ కబుర్లు మధ్యరాత్రి దాకా విన్పించాయి. మర్నాడు ఉదయం ఆరుగంటల కల్లా ఆదిలాబాదు వెళ్ళేందుకు అందరూ సిద్ధమయ్యారు.

ప్రయాణం మధ్యలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు చూపించేందుకు రచయిత్రులకి తోడుగా బస్సులో బయల్దేరింది రమ. ఇంట్లో అందరికీ బ్రేక్‌ఫాస్ట్‌ తయారుచేయించి.. రెండు కార్లలో నేనూ, ప్రకాశ్‌, విజయా, ఆయాలు బయల్దేరి… పొచ్చెర జలపాతం దగ్గర వాళ్ళకోసం ఎదురుచూస్తూంటే – తొమ్మిదిన్నర ప్రాంతంలో జాయినయ్యారు వాళ్ళు. పొచ్చెరని చూసి అందరూ ఒకటే కేరింతలు.

పొచ్చెర ఉనికి… తమాషాగా వుంటుంది. దగ్గరికి వెళ్ళేదాకా అక్కడో జలపాతం వున్నట్టే ఎవరికీ తెలీదు. సునాయాసంగా దర్శించవచ్చు. కుంటాల జలపాతం అలాకాదు, జలపాతాన్ని చూడటానికి ఎన్నో మెట్లు దిగి కష్టపడాలి. కాని పొచ్చెర భూమట్టానికి సమానంగా – సాధారణ ఎత్తులో… భూగర్భంలో దాక్కున్నట్లుగా… ఉంటుంది. ఆ జలపాతంలోంచి జాలువారే నీళ్ళని పొదివి పట్టుకునే తటాకం… ఓ ‘టీ కప్‌’లా – అందులోని నీళ్ళు… ‘గ్రీన్‌ టీ’లా కన్పిస్తాయి!

అందరూ తనివితీరా జలపాతం కింద తడిసారు. ఆ హోరులో కలిసేలా నవ్వారు – తోటివాళ్ళని నీళ్ళలోకి లాగి టీనేజ్‌ పిల్లల్లా సంబరపడ్డారు. పసుపులేటి గీత, స్వాతిశ్రీపాద లాంటి కొందరు రచయిత్రులు తటపటాయిస్తూంటే… ‘ఏం కాదు… వెళ్ళండి’ అంటూ నేనూ, చెల్లి విజయా ధైర్యం చెప్పి, అప్పటికే జలపాతంలో తడిసొచ్చిన వారిని తోడిచ్చి పంపాం!

రకరకాల యాంగిల్స్‌లో జలపాత ాన్ని ఫోటోల్లో బంధించి – పొచ్చెరని వదల్లేక వదల్లేక వదిలి వస్తూ – దార్లో కుంటాల జలపాతాన్ని కూడా ఓ పది నిమిషాలు పలకరించి, మొండి గుట్ట గెస్ట్‌హౌజ్‌కి బయల్దేరాం! అక్కడ మా దూరపు బంధువులు రాంరెడ్డిగారు, కల్పన, కరుణ మాకోసం అన్ని ఏర్పాట్లూ చేశారు. ఆ అడవిలో వాళ్ళ పొదరిల్లు, గెస్ట్‌హౌజ్‌ ఎంత బావుంటాయో! అన్నింటికన్నా ముఖ్యం… మేమంతా వస్తున్నామని… మాకు ఇబ్బంది కాకూడదని… ఓ వారం రోజుల్లో వెస్ట్రన్‌ కమోడ్‌ కట్టించడం చూసి – వాళ్ళ కన్సర్న్‌కి మా కళ్ళు చెమర్చాయి!

‘ఇంత మందిని తీసుకెళ్తున్నా కదా’ అని నేను అంతకు ఓ వారం రోజుల క్రితమే మొండి గుట్టకు వెళ్ళి, ఎంతమంది వస్తున్నారో చెప్పి, కావలసిన ఆర్థిక వనరులు సమకూర్చి వచ్చాను.

ఆ అడవిలో ఎవరికీ ఏ లోటూ లేకుండా యాభై మందికి సరిపడా ఏర్పాట్లు చేయడం అందరికీ అబ్బురం కలిగించింది. రాంరెడ్డిగారికి ఆ అడవిలోని పల్లెవాళ్ళల్లో, గోండుల్లో మంచి పేరుండటం వల్లనే అది సాధ్యపడిందనిపించింది.

వెజిటేరియన్స్‌కీ, నాన్‌ వెజిటేరి యన్స్‌కీ ప్రత్యే కంగా భోజనాలు అరెంజ్‌ చేయడమే కాదు, స్వీట్‌, పక్కపొడి లాంటివి కూడా ఆ అడవిలో అందించి నందుకు కరుణా, కల్పనా సోదరీ మణులను అభినందిం చాలి! ముఖ్యంగా… ఇంటికి బంధువులొస్తేనే విసుక్కునే ఈరోజుల్లో… తనకి పరిచయమే లేని మా అందరికీ… కొసరికొసరి వడ్డిస్తూ… వాళ్ళు చూపించిన ఆప్యాయతకు అందరం ఉక్కిరిబిక్కిరయ్యాం! భోంచేసాక – కొందరు ఎలుగుబంట్లనూ, ఇంకొందరు జింక పిల్లలనూ మురిపెంగా చూస్తూ అటూ ఇటూ తిరిగారు. మరికొందరు చెక్కలతో కట్టిన మెట్ల మీదుగా మంచె ఎక్కి కబుర్లలో పడ్డారు. చుట్టూ పూలతీగలూ, కూరగాయల పాదులూ వున్న విశాలమైన పందిరికింద అందరం కూర్చున్నాం!

ఇంతలో… మాకన్నా ముందే అక్కడికి విచ్చేసి – ఎక్కడ, ఎప్పుడు రెడీ అయ్యారో గానీ… ప్రభ, వసంత, సుజాత, కవిత, లలిత చక్కటి మేకప్‌తో… ‘సక్కదనం జాలు నాకు కట్నమొద్దనీ… వాడు కట్టినాడే పుస్తె నాడు నా బిడ్డకూ’ అంటూ తమ నృత్య ప్రదర్శనతో అందర్నీ అలరించారు.

భుక్తాయాసం తీరక ముందే రెండు ట్రాక్టర్లలో దట్టమైన అడవుల్లోకి బయల్దేరాం. చుట్టూ చెట్లూ, ఎగుడుదిగుడు దారి, పెద్ద పెద్ద బండరాళ్ళ మీదుగా… ఆ కుదుపుల్లో ఒకరిమీదొకరం పడిపోతూ సాగిన ప్రయాణం… ‘మీకేం భయంలేదు’ అంటూ మా తలల మీదుగా మాకు తోడుగా వస్తోన్న సూరీడు… టైముంటే మధ్యలో మజిలీ చేసేందుకు వీలుగా కన్పించిన మూడు సెలయేళ్ళూ… అదో అద్భుతమైన అనుభవం! ఓ అరగంట తరువాత… ‘బుర్క రేగడిపల్లి’ చేరాం. ఆధునికత ఏ మాత్రం సోకని, ఎలాంటి సౌకర్యాలూ లేని, గిరిజన ప్రజలకి చెందిన ఓ చిన్న కుగ్రామం అది. విశాలంగా ఉన్న ప్రాంతంలో… ట్రాక్టర్లలోంచి దిగాం మేము. కాళ్ళు పట్టేసి దిగలేక అవస్థపడుతూంటే… కుర్చీ తెచ్చి వాళ్ళ ఆసరాతో దింపారు నాలాంటి కొందర్ని!

ఓ పెద్ద మర్రిచెట్టు కింద చుట్టూ నులక మంచాలూ, మధ్యలో గోనె పట్టాలూ పరిచి… మాకోసం ఎదురుచూస్తున్నారు గిరిజనులు. దుంగలతో కట్టుకున్న ఇళ్ళల్లోంచి కుతూహలంగా… బిలబిల మంటూ గిరిజనుల పిల్లలూ, ఆడవాళ్ళు మాకేసి రావడం, మావాళ్ళంతా వారి వంక, వారి ఆచార సాంప్రదాయాల పట్ల ఆసక్తిగా చూడటం… మరిచిపోలేని దృశ్యం!

తలలపై నెమిలి ఫించాల కిరీటా లూ, కాళ్ళకు గజ్జెలూ… డప్పువాయిద్యాల కనుగుణంగా లయబద్ధంగా వాళ్ళు నృత్యం చేస్తూంటే… మా అందరికీ ఉత్సాహం పొంగుకొచ్చి, వాళ్ళతో హుషారుగా అడుగులు కలిపాం.

గోండుల్లో ముందుగా మగవాళ్ళూ, ఆ తర్వాత ఆడవాళ్ళు – తమ సాంప్రదాయ నృత్యం చేస్తూంటే – వారి గుడిసెల్లో… స్వయంగా కల్పన కట్టెల పొయ్యిమీద పెసర గారెలు తయారుచేసి, అందరికీ ఆప్యాయంగా అందించడం… మా అందరికీ… మా అమ్మలని గుర్తుకు తెచ్చింది!

ఎద్దుల బండిమీద, గుడిసెల ముందు, గిరిజనులతో రకరకాల పోజుల్లో ఫోటోలు దిగడం… వాళ్ళతో కలిసి టీ, కూల్‌డ్రింక్స్‌ తాగడం… చీకటిపడిపో తోందని తిరిగి గెస్ట్‌హౌజ్‌కి బయల్దేరడం… గిరిజనులు తమ గ్రామ పొలిమేరలదాకా వచ్చి మాకు వీడ్కోలు చెప్పడం మాకు మరపురాని అనుభూతి! తిరుగు ప్రయాణంలో అంత్యాక్షరి, జోక్స్‌, మిమిక్రీ ఒకటేమిటీ… ట్రాక్టర్లో ప్రయాణిస్తోన్నంత సేపూ నవ్వులే నవ్వులు… అయితే ఇంకో ట్రాక్టర్లో… మిగతాగ్రూపు వాళ్ళు ఏం చేస్తున్నారో… మాకు తెలీదు!

ఆ రాత్రే ఉట్నూరు వెళ్ళాలనీ, ఆ మర్నాటి ప్రోగ్రాం ఫిక్సయిపోయిందనీ చెప్పడంతో… మొండిగుట్ట గెస్ట్‌హౌజ్‌ చేరగానే… అందరం గబగబా డిన్నర్‌ ముగించేసి… బయల్దేరడానికి రెడీ అయ్యాం. ఈలోగా… ప్రభా అండ్‌ పార్టీ ప్రదర్శించిన ‘బంద్‌’ నృత్యరూపకం అందరికీ నవ్వుల్ని పంచింది! బైబైలూ, ఫోన్‌నెంబర్లు ఇచ్చుకో వడాలూ, మళ్ళీలుద్దామన్న ప్రామిస్‌ల మధ్య… ఆ రాత్రి ఎనిమిది గంటలకి హైదరాబాదు గ్రూపు బస్సు కదిలి… ఉట్నూరు రోడ్డు మార్గం పట్టింది. రాంరెడ్డిగారికీ, కల్పనకీ, కరుణకీ థాంక్స్‌ చెప్పి, మేము కూడా ఓ కార్లో ఆర్మూరు, మరో కార్లో నిజమాబాదు బయ ల్దేరాం.

అందర్నీ ఒకచోట కలిసామన్న ఆనందము న్నా – మొత్తం ప్రయాణ ం… హడావిడిగా… ఎవరో తరిమినట్టుగా అయిపోయిందే అన్న అసంతృప్తి నన్ను వెంటాడింది! ఈ ప్రయాణంలో వారితో కలిసివున్న కాలం ఇరవై నాల్గంటలు! అందులో ఎనిమిదిగంటల నిద్ర – ఒకర్నొకరితో కలిసి మాట్లాడుకోవడానికి వీల్లేని ఆరుగంటల ప్రయాణం మినహాయిస్తే – కలిసి ఎంజాయ్‌ చేసింది కేవలం ఓ పదిగంటలే!

అదివరకే పరిచయమున్న సత్యవతి, స్వాతి శ్రీపాద, శిలాలోలిత, వారణాసి నాగలక్ష్మి, గీత, ప్రశాంతి, సుజాత పట్వారి, శాంతి ప్రభోద, రేణుకా అయోలగార్లు తప్ప… చాలామందిని నేను అప్పుడే మొదటిసారిగా చూడటం! గుర్తు పెట్టుకునేంతగా కొత్త వాళ్ళతో పట్టుమని పది నిమిషాలైనా మాట్లాడలేకపోయానే అని కించిత్‌ బాధేసింది! అయితే, గిరిజనుల నృత్యం చూస్తూ ఓ అయిదు నిమిషాల పాటు… నా పక్కన నులకమంచంలో కూర్చున్న ప్రతిమ… నెల్లూరి ‘ప్రతిమ’ అని మాత్రం గుర్తుంది! ఇంతకీ, రచయిత్రులతో కలిసి చేసిన ఇరవైనాల్గంటల ట్రిప్‌… కలా – నిజమా? ఏమో – ఇప్పటికీ తేల్చుకోలేక పోతున్నాను!

 

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.