– జి. సాకృబాయి, ఆదిలాబాద్.
22.01.2014 తేదినాడు, భూమిక ఆధ్వర్యంలో వచ్చిన రచయిత్రులను కలుసుకున్నాం. గిరిజనుల సాంప్రదా యాలు, పండుగలు, పెళ్ళిళ్ళు, డెలివరి పద్దతులు, మరియు వారి వృత్తి, దేనిపై జీవనం కొనసాగిస్తున్నారు అనేది రచయి త్రులు తెలుసుకొని, కథలు, కవిత్వం, వ్రాసి, ఉన్న ఆచార సాంప్రదా యాలను,
వారి రచనల ద్వారా అందరికి తెలియడం కోసం, అది తెలుసుకొవడానికి వచ్చారు.
ఆదిలాబాద్ జిల్లాలో కులాలు, తెగలు వారు, చేస్తున్న వృత్తుల గురించి తెలుసు కున్నారు. ఇంతకు ముందు పెళ్ళిళ్ళు, ఎన్ని సం||ములో జరుపుకునేవారు ప్రస్తుతం ఎలా మార్పు వచ్చింది. సదుపా యాలను ఏవిధంగా ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను అందుబాటులోకి తెచ్చుకోవటం, ఎలా ముందుకు రాగలగుతు న్నారు. పూర్వ ప్రస్తుతం అనేది, పండుగులు, పెళ్ళిళ్ళు, ఎన్ని రోజులు చేస్తుండే, ప్రస్తుతం ఆర్ధిక ఖర్చువల్ల, రోజులను తగ్గించారు అనేది మాట్టాడుకున్నారు. కుమురం భీము పుట్టిన నివసించిన గ్రామం – దోబా, సిర్పూర్ (యు) మండలంలో నివసిస్తు, గిరిజనులకు ప్రభుత్వ పథకాలు ఏవి అందటం లేదు సమాచారానికి దూరంగా ఉన్నారు అనేది గుర్తించిన కుమురం బీముగారు (జల్, జంగల్, జమ్మిన్) కొరకు – నిజాం సర్కార్ వాళ్ళతో పోరాడినారు. ఇది నచ్చని నిజాం సర్కార్ వాళ్ళు – జోడెన్ ఘట్‌లో హతమార్చారు.
ఇక్కడ పంటల రకాలు, గిరి జనుల ఆహారపు అలవాట్లు గురించి తెలుసుకుని వారు కూడా తిని చాలా బాగుంది, కలిసి తినడం, గిరిజనుల గురించి, నమ్మ కాలు, అన్ని తెలు సుకుని చాలా సంతోషము అని పించింది. జిల్లా వరకు సమాచారం తెలియక ఇప్పుడు అన్ని రకాలుగా అందరికి తెలిసిలా చేయటం అనేది – సంతోషంగా ఉంది. అక్కడ మహిళా సంగం వారు, మేము చేసిన ఆహరం తిన్నారు. సంతోషమును వ్యక్త పరచారు. ఉషేగాంలో మెటల్ వస్తువులు, వారి వృత్తి ఎంత కూలీ పడుతుంది అనేది తేలుసుకుని మెటల్ వస్తువులు కొనుగొలు చేసినందుకు ఆర్ధికంగా మాకు లాభం వచ్చినందుకు కొన్నారు అనేది సంతోషపడ్డారు. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా, స్వాగతం పలకడాన్ని చాలా ఆనందించారు. అక్కడ సంఘం స్త్రీలతో కలిసి డాన్స్ చేశారు. కలిసిపోవడం చాలా బాగుంది.
నన్ను సేద తీర్చిన యాత్ర
అబ్బూరి ఛాయాదేవిగారు భూమిక వారి విహారయాత్ర గురించి చెప్పినప్పడు నేను వెళ్ళడానికి అంత ఉత్సాహం చూపించలేదు. నాకు వారిలో ఎవరితోనూ స్నేహం గాని పరిచయం గాని లేవు. బోర్ కొడుతుందని ఊరుకున్నాను కాని ఆవిడ భూమిక – వారి యాత్రలు చాలా బాగుంటాయని, సత్యవతిగారికి అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయని, వివిధ ప్రదేశాలాలో తనకున్న పరిచయాల ద్వారా, ఎవరికి ఏమీ ఆర్గనైజింగ్ లోటు లేకుండా చూసుకుంటారని చెప్పినపుడు, సరేనని వెళ్ళాను. తర్వాత అనిపించింది ఆవిడ మాటలలో ఆతిశయోక్తి ఏమి లేదని, ఒకవేళ నేను వెళ్ళకపోతే, ఒక అద్భుతమైన యాత్రానుభవం కోల్పోయేదాన్ని. ఆర్మూర్ దాక సత్యవతిగారు, తర్వాత అమృతలతగారు, తర్వాత గిరిజన గ్రామాలలో ప్రశాంతిగారు ఎంతో సమయపాలనతో, క్రమశిక్షణతో ఎక్కడా, ఎవరికి విసుగు కలగకుండా, మారుమూల కుగ్రామాలలో కూడా రుచికరమైన వంటలతో దారి పొడుగునా ఆటపాటలతో అందరినీ అలరించారు.
ఒక ఏడాది నుండి, మా కుటుంబంలో, ప్రతి నెల-2 నెలలకి సంభవించిన మరణాల కారణంగా కలత చెంది ఉన్న నన్ను ఈ యాత్ర చాలా సేద తీర్చింది.
నేను సోషియాలిజీలో చదివిన గిరిజన జీవన విధానం దానికి ఎటువంటి అభివృద్ధి ప్రయత్నాలు, చేసినా వారికి నచ్చకపోవడం గురించి విని ఆశ్చర్యపోయాను.
పొచ్చెర జలపాతంలో స్నానాలు, వర్ని పిల్లలు ఎంతో ఆప్యాయంగా స్వయంగా చేసి అందించిన గ్రీటింగ్ కార్డ్సు, ట్రాక్టర్‌లో ఈ యాత్ర ఇంత విజయవంతంగా సాగడానికి శ్రమపడ్డ అందరికీ సాకృబాయికీ నా కృతజ్ఞాతాభివందనములు.