మల్లు స్వరాజ్యం (తుంగతుర్తి)

మా కుటుంబం భూస్వామ్యకుటుంబం. భూస్వామ్య కుటుంబంలోనే ఇంకా పెద్ద జాగిర్దార్లను, భూస్వాములను అనుసరించే పద్ధతి ఒకటుండేది. వాళ్ళకంటే ఇంకా పైకి పోవాలనేటువంటి పోటీకూడా ఆ కుటుంబాల్లో వుంటుండేది. పైకిపోవడం అంటే పెత్తనంలో, ప్రిస్టేజి సంపాదించడంలో అట్లాగా నిజాం రాజ్యంలో అధికారాన్ని, గౌరవాన్ని సంపాదించడంలో ఆనాడు పోటీలువుండేవి నేనంత స్పష్టంగా లోతుపాతులు చూడలేదు.

అప్పటికి మా నాన్నగారు చనిపోయారు. ఆంధ్రమహాసభ ఉద్యమరోజులు వచ్చేప్పటికి నేను సరిగ్గా పదకొండేళ్ళున్నా! మా అన్నగారు? పదవ తరగతి చదువుతున్నాడు. నల్గొండలో చదువుతుండె. భారతదేశంలో స్వతంత్రపోరాటం జరుగుతుండె. దానికి బాగా ప్రభావితమయ్యిండుగన్క దాన్నుంచి మనం సంగం బెట్టి అటువంటి పోరాటం తీస్కరావాలె అనే అభిప్రాయంతో వున్నడు. ముఖ్యంగా నిజాంకి వ్యతిరేకంగా, ఈ ముస్లింరాజులు మనపై పెత్తనం చేస్తున్నారు. తెలుగుభాషను, ఈ నాగరికతనంత పడదోస్తున్నారు అనే భావం వుండేది.

అప్పట్లో ఆంధ్రమహాసభ అని వోటువుండేది. దాన్లో మనంచేరాలి ప్రజలపై భూస్వాములు చేస్తున్న పెత్తనాన్ని పడగొట్టాలి, ప్రజల్ని విముక్తి చేయాలి, అనేది చెబ్తుండేవాడు. ఈ లేడీస్‌ ముఖ్యంగా దేనికి ప్రభావితమైనమంటే ఆంధ్రమహాసభ స్త్రీలను పర్దాలచాటున వుండచం, దీన్ని వ్యతిరేకిస్తూ, పోరాటం చేసేవాళ్లు. ఆ ఘోషాలోవుండటం, మా అమ్మట గాజులోల్లొస్తే తెరకిందంగ చెయ్యిచ్చి గాజులు పెట్టుకునేదట, కన్పడగూడదన్న మాట గాజులతనికి. అట్లాగే చాకలి, ఆడమనిషైనా కన్పించేదిగాదు. మా అమ్మ పెళ్లయిన కొత్తరోజుల్లో వీళ్లను చూడాలంటే పనిమాలా ఒకరోజు ఫిక్స్‌ చేసి చూసేదే తప్ప రోజూ చూసేవారుకాదు. వంటకేమో వంటమనుషులుండేవారు. ఘోషాలోవుంచి యేందెల్వకుంట స్త్రీలను అట్టిపెట్టడం సరైందికాదని ప్రచారంవస్తోంది. వీళ్ళు చెప్పినదాంట్లో అదిగూడ వున్నది. అంతేగాక చిన్నప్పుడు మా నాన్నగారితో పాటు మా అన్నయ్య మాకు ఈతనేర్పడం, గుర్రపుస్వారీనేర్పడం, కత్తియుద్ధం, నేర్పేవారు. హైదరాబాద్‌లోని గురుకుల విద్యాలయంకి భూస్వాముల కుటుంబాల్నుంచి లేడీస్‌ని కూడా పంపిస్తుండేవారు. స్త్రీలను యిట్లా అణిచిపెడ్తూ కూడా కొన్ని, కొన్ని కుటుంబాలు యిట్లా పంపిస్తున్నారనే చర్చగూడా వచ్చింది. ఈ కుటుంబాల్లో పురుషులు సమయానికి లేకపోవడమో, చనిపోవడమో జరిఇతే స్త్రీలుగూడా ఆ సమయంలో జమిందారీ నిర్వహించేస్థితిలో వుండాలి. దానికోసం కొంచెం తర్ఫీదు, చదువు తప్పనిసరని చెప్తూవుండేవారు. అట్లా ఇంటిదగ్గర్నే పంతుల్నిబెట్టి చదువుచెప్పించిన్రు. మా న్నాగారు. మా అక్కగారు అయిదవతరగతేమో చదువుతుండేది. నేను సరిగ్గా మూడు, నాలుగు తరగుతులు చదువుతున్న రోజులవి ముఖ్యంగా మా ఇంట్లో రాజకీయాలు చోటు చేసుకోవటానికి మా అమ్మ నెమ్మదిగల మనిషి. కుటుంబంలో కఠినత్వం అవి వుంటేతప్ప పెత్తనం చెలాయించటం కష్టం. తతిమ్మావారి జీవితం బానిసల్లాగా వుండేది. అన్ని రకాలవాళ్ళు పనిపాటలు చేసి పోతుండేవారు. వీళ్ళ పొలాలే ముందు నాటుబెట్టి పోవాలి. అట్లాగే వాళ్ళకేమైనా బాధలుంటే అమ్మా నీ కాల్మొక్త, బాంచెన్‌ అని అడుక్కోవాలే తప్ప వాళ్ళకు హక్కులుండేవి కావు. కాని మా అమ్మ మాత్రం పాపం అని జాలిపడుతుండేది, ఇంత చాకిరీ చేయించుకుంటాము అనేది. కాని ఈ పెత్తనం బానిసచాకిరీ చేయించుకోవడం, దోపిడీకి వ్యతిరేకంగా చెబ్తుంటేమాత్రం విని వూర్కునేది, వ్యతిరేకించకపోయేది.

అప్పట్లోనే మా బావగారు స్వతంత్రపోరాటం గురించి బాగా ప్రభావితమయ్యిండు. స్వతంత్రపోరాటం గురించి ఎప్పుడూ చెప్తుండేవాడు. ఆ రకంగా ఇంట్లో రాజకీయాలు ప్రారంభమైనయి. నన్ను పదకొండేళ్ళకే విజయవాడ పంపించిండు మా అన్నగారు. అది 1943 అనుకుంటా. అక్కడ క్లాసులు ఇస్తున్నారు, నేర్చుకోమని. కాని అక్కడ పోతేపార్టీ, కమ్యూనిస్టు రాజకీయాలే ప్రధానంగా చెప్పింది. మరి మేం విన్ననేమో ఆంధ్రమహాసభ గురించి.

2వ ప్రపంచయుద్ధం. ఒకవేళ వచ్చినట్లయితే మన భారతదేశం గూడ ఈ జర్మను వాళ్ళను, జపాను వాళ్ళను ఓడించటాన్కి ప్రయత్నం చేయాలె అనే పాలసీ వున్నట్టుంది. దాని కొరకు స్త్రీలు ఈరంగంలో వుండాలన్నా, ప్రచారం చేయాలన్నా, ఆత్మరక్షణ పద్ధతులు, గెరిల్లాపద్ధతులు నేర్పారు. స్త్రీలు అవసరం వస్తే యుద్ధంలో పాల్గొనాలే అని ఆ రోజుల్లో ఓ బస్తాగట్టి, ఎట్లాగొట్టాలి, కరాటే ఎట్లాచేయాలి- అని నేర్పించారు. అది నాకు బాగా నచ్చింది. వీరుల్ని తయారు చేసేటువంటి పాఠశాల అది. మనంగన్క ఇందులో వున్నట్లయితే గొప్పపేరు తెచ్చుకోగల్గుతము, గొప్ప కార్యాలు చేయగల్గుతం అనే అభిప్రాయం ఏర్పడింది. ఎందుకంటే స్వతంత్ర పోరాటంలో త్యాగాలు చేసిన ఝాన్సీలక్ష్మీరాణి రుద్రమాంబ, అల్లూరి సీతారామరాజు గురించి చెప్తుండేవారు. ఝాన్సీలక్ష్మీ వీర వనిత అని ఒక ముద్రపడిపోయింది నాకు. పురుషులకన్నా మేం తీసిపోకుండా, ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి అనే నిర్ణయానికి వచ్చాం. అప్పుడు మా అక్కగారు కూడా వచ్చేది క్లాసులకు.

నిలబడమంటున్నారు. ఆకేసు ఏదో మనమీదికి వచ్చినాసరే, ఆ దౌర్జన్యాలు మనమీదికి వచ్చినాసరే అని ముప్పయిమందిని తయారుచేసిరి మా అన్నగారు మొట్టమొదట, నాకు బాగా జ్ఞాపకం, ముప్పయిమందిని తయారుజేసి సమ్మె జేయాలని తోవకు అడ్డందిరిగిన్రు. పోకున్రి, అంటే మే మన్నమంటే మామీద జెప్పన్రి, తప్పించుకొన్రి మీకు భయమైతే, మీరు కూలీకి పోవద్దు అని డొంకకు అడ్డం దిరిగిన్రు. అడ్డం దిరిగితే సామాన్యంగా ఏదోవంక జెప్పి తప్పించుకుంటుండే వాళ్లు. యిగ అట్ల మావూల్లో జరిగిందప్పుడు. జరిగిన తర్వాత ఏంజేసిన్రు, అడ్డందిరిగి వీళ్లను యెల్లగొట్టిన్రు, పోవద్దని. తర్వాత వాళ్లు పోయి పోలీసులకి కంప్లైంట్‌ జేసిన్రు. మా అన్నగారు ఇంట్లోవున్నప్పుడు, రాత్రిపూట పోలీసులు వొచ్చిన్రు పోలీసుల చేతికిపోతే కొడ్తరు. అందులో పెద్ద భూస్వామి కుటుంబమాయె జైళ్ల పడటమంటే, తన్నులు తినటమంటే నామోషి అనుకొని మా అమ్మ ఏం జేసిందంటే ముసిగేసి బైట (దొడ్డి) చెంబు ఇచ్చి ఇంటెన్కనించి దాటిచ్చింది. దాటిచ్చి ఆమె బైట దర్వాజ (తలుపు) దగ్గరకొచ్చి వివాదం పెట్టుకుంది పోలీసుల్తోటి. మీరు ఈ అర్థరాత్రి ఇంట్లోకి రావటానికి ఖానూన్‌లేదు- కొన్ని ఖానూన్లుండేవి అప్పుడు ఇటు కిటికీ వుంటుందనుకొ, కిటికీ అవుతలోడు ఇటు జూడొద్దు ఈయింటి ఆడమనిషి మొహం వాళ్లు జూడొద్దు అటువంటివి కొన్నివుండేవి. అట్లాగే రాత్రిపూట, ఇంటిమీద పోలీసులు దాడిచెయ్యెద్దు- మీరు రాత్రిపూట రానేవద్దు అసలు, నేను దర్వాజ (తలుపు) తీయను కూర్చోండి తెల్లవార్లు కావాలంటే అని అంది- అట్ల పోలీసులు సోదాకొస్తే మొట్టమొదలు జెప్పంపాలె లోపలికి, ఒక గదిలోకి వెళ్ళి రక్షణ, గిక్షణ తెరల గిరలు ఏర్పాటుజేసినంక రక్షణ జేసుకున్నంక సోదాచెయ్యాలె అది అప్పటి ఖానూను- ఈమె వాదిచ్చి ఆరాత్రి వాళ్లను తప్పించింది.

అప్పుడు అన్నయ్య పోతూ, పోతూ నాకేం జెప్పిండంటే, మరి నేను పోతున్న రేపుపొద్దున ఈ కూలీల పనులకి పోతరు, నువ్వుపోయి ఆపు అని చెప్పిండు. చెప్తే మా అక్కగారు కూడ వున్నది. అందర్ని కల్సియెల్లమన్నడు, వెళ్ళి ఆపమన్నడు- అయితే మా అమ్మ ఏమందంటే నువ్వు పోతేపోగని ఆమెని వొద్దంది, ఆమెకి పెండ్లయ్యింది, బైటికి పోవద్దు, బావుండదు నువ్వుపోఅన్నది. అయితే మా బావగారు కూడ ఇంట్లనేవున్నడు- సమస్యేంలేదు అయినా ఆమెను పంపలే. సరే నేనింగవోయి డొంకకు అడ్డం దిరిగిన, మీరు పోవద్దు అన్నయ్య చెప్పిండు, మీరుపోతే పోరాటమే దెబ్బతింటది. కాబట్టి మీరు అట్లానే నిలబడాలె. లేకుంటే సాధించలేం. అప్పుడు సోలెడు జొన్నలుంటె, మానెడు జొన్నలు గావాలె అని మా పోరాటమప్పుడు – చెప్పినమన్నమాట. అని చెప్తే వాళ్ళు చివరికి తప్పుకున్నరు. తప్పుకున్నరంటె సమ్మె జయప్రదమైనట్టే, చివరికి మూడు నాలుగు రోజుల తర్వాత కూలీ వాళ్ళు సమ్మెజేసినందుకు పెంచినమన్నట్టు గాకుండ కొంతరేటు పెంచారు. మూడు సోళ్ళో ఏమో పెంచారు.

నా కప్పుడు పన్నెండు ఏళ్ళున్నాయి- చెప్పినపని చేస్తున్న అంతే, అది పరిస్థితి- మా అన్నగారి మూలంగానే ఇదంతా- ఆయనను అనుసరిస్తూ మా అమ్మ గూడా ఫాలో అయ్యింది- అయితే లోతుగా పరిశీలించినపుడు తేలేదేంటంటే ఈ స్వాతంత్రభావాలనేవి ప్రతి వ్యక్తిలోగూడా వుంటై- యెవరైనా మేలుకొల్పితే తప్పక నిలబడటానికి ప్రయత్నిస్తరు- కుటుంబాలు ప్రజలు అట్లాగే ఉద్యమంలోకి వచ్చిన్రు, అసలు పోరాటం మనం జరిపితే జరగలేదు. పోరాటమే మనల్ని నడిపించింది, ప్రజలే మనల్ని నడిపించిన్రు, ఇది మాత్రం ఖాయం. నాలో చిన్ననాటి నుంచీ ఒక్క ముద్ర పడిందేంటంటే మొదట్నుంచీ ఒక్క విషయంలో గూడా ముందుగ మనం నిర్ణయించుకుని చేయలేదు. కాకపోతే ‘జనరల్‌’గా మాత్రం భూమి, విముక్తి కోసం పోరాడాలి, సోషలిస్టు సమాజం రావాలి, రష్యాలాగ, అటువంటి సమాజం కోసం ఈ బానిస ప్రజలే తిరుగుబాటు చేస్తే అది వొస్తుంది అని ఈ మూడు విషయాలే ముందుగ ముక్కుసూటిగా తెల్సుగని, ఆచరణలో పోరాటం ఎట్లాచెయ్యాలనేది ఎవ్వరూ నిర్ణయించలేదు. జనం మొదలు భయపడ్డరు- ఇట్లాకాదు అని ఒక దళంగ బైలుదేరి, పాటలు పాడుకుంటూ బైలుదేరినం- చేతుల గొడ్డళ్ళు లాక్కుంటే మీకు ప్రతిఘటించండి అని చెప్పలే- కచ్రాలవెంట పరుగెత్తేది- కచ్రం వెంట పరుగెత్తుతుంటే- మా అన్నజూసి ఆవేశంతో రెట్ట పట్టి గుంజేసిండు, నేనుజూస్త ఏం జేస్తరో అని అన్నడు. బండి దిగి కొట్టడానికి వచ్చిండుగని కొట్టలేకపోయిండు…… నీ సంగతి జూస్త అనుకుంటపోయిండు. అనుకుంట బండితోలుకుని యెల్లిపోయిన్రు…… ఇది బాగా జయప్రదమవుద్ది, ఈ పనిజేస్తే జనం మన పక్కల వస్తారని అనుకున్నం- అనుకున్నంక ఫలానాచోట ఇట్లా జేసారట అని తెల్సి గుండాల్ని తయారుజేసిన్రు. తతిమ్మా వాళ్ళు వూర్కుంటారా, వానింటికి పోయిన్రు ఆవూరి దొరే కదా వాడు, వాడెందు కూర్కుంటడు, ఎవ్వరురా వాడు, నువ్విపుడు జుర్మానా కట్టాలిలే కట్టు అని వూర్కున్నరు- సరే ఈ పనిజేస్తే దెబ్బలు గొడ్తున్నరని తెల్సినంక ఏం చేద్దాం మనం, ఏం చేద్దాం అని యెవర్నయితే మనం బైటికి తీసుకొస్తున్నామో వాళ్ళని మళ్ళీ ఆ వూళ్ళకి పోనీయొద్దు. మన వూళ్ళనెవుంచాలే అనుకున్నాం. ఆ వూర్ల పోయి ప్రచారం చేయాలే, ఆ వూర్లల్ల యెట్టి జేసేటోల్లుంటరుగదా, అట్ల అంత ప్రచారం చేసుకుంట పోవాలే, సంగం చిట్టెయ్యాలే చిట్టి దీస్కోనీ ప్రచారం చేసుకుంట పోవాలే.

అట్ల సంబంధం తెగిపోయినంక మామూలు జీవితం గడుపరాదు. వాళ కుటుంబాల మీద హరాన్‌మెంట్‌ వస్తే అతలం, కుతలం అయ్యింది, దాన్తో బాగా, యాక్టివ్‌గా వుంటే, యంగర్‌ సెక్షన్‌ అంతా పూర్తిగా బైటికి వచ్చేసిన వాళ్ళు, యెక్కడడిగినా తిండిబెట్టే వాళ్ళు, వాళ్ల సుట్టాలింట్లో వుంచుకోవటం, ఇట్లా అన్ని కథలు, కథలు చెప్పుకోవటం- అక్కన్నుంచి ఒగూర్ల మేం సంగాల్లల్ల జేరుతం అని ఇది యెప్పుడొచ్చిందంటే, సంగం చిట్టివల్ల- కొంతకాలం వీళ్ళు తప్పించుకుని తిరిగి, యెట్లయితేందీ మొత్తంమీద రాజీకిరావటం మొదలు పెట్టింన్రు. హరాష్‌మెంట్‌ మానుకుని యేదోలే, యేదో కొంతిస్తం…… మాన్యంగాకపోతే, జీతం బెంచుతం, కూలీ బెంచుతం మీరెట్లనో పనిజెయ్యాలిగని యిట్ల కూసుంటె యెట్లా అని రాజీకిరావటం మొదలుపెట్టిన్రు- రాజీకివచ్చిన్రని తెల్సిన తర్వాత….. వచ్చి యెక్కడున్నారు సంగపోల్లు సంగం చిట్టి కావాలె అనే పరిస్థితి వచ్చింది.

ఈ రోజుల్లోనే అక్కడ స్వతంత్రవుద్యమం తీవ్రంకావడం, మనకు స్వతంత్య్రంరావడం, ఇంగ్లీషు, ప్రభుత్వం దిగిపోవటం జరిగింది. దానిప్రభావం కూడా ఈ వుద్యమంపైపడ్డది. పడ్డతర్వాత యెప్పుడైతే ఈ వెట్టివ్యవహారం మీద కొంతవరకు సర్దుబాటు చేయడం జరిగిందో దాన్ని ఒకపద్ధతిలో రాజీకి వచ్చినట్టే ఒక ప్రక్కన వాళ్ళిచ్చిన భూమి, మాన్యాలో, మట్టో, మషానమో వుంటాయి గదా, అవిగూడ లాక్కోటం, బంజర్లమీద గొడ్లను మేపుకోనివ్వకపోవటం, ఇటు వంటివన్నీ జరిగినై. ఓ ప్రక్కనిది, ఓ ప్రక్కనది చేస్తున్నారు వాళ్ళు, చేస్తున్నప్పుడు మనవాళ్ళు మంచి నినాదాలు తీసుకున్నారు. అసలెవరిదీ భూమి, మనని యెల్లగొట్టటాన్కి వీళ్ళెవరు, వాళ్ళభూములాయివి, మనం అద్దెలేకుండానే గొడ్లను మేపుకోవాలి, అద్దెలేదేంలేదు – అని అటువంటి నినాదాల్ని రూపొందించడం జరిగింది. దాని తర్వాత మన వాళ్ళను కార్యకర్తలన్న వాళ్ళను అందులోకి తీసుకుపోవడం జరిగింది. ఇగ తర్వాత కర్రలు తీసుకోని తయారయ్యేటప్పటికి ‘గుత్పల సంగం’ అన్నారు. భూస్వాములు వీళ్ళంతా కూడా పోలీసు రిపోర్టిద్దామని తయారయ్యిన్రు.

ఆ పోరాటంలో ఒక భాగమే ఐలమ్మ. ఐలమ్మ ఆడమనిషేకదా, సంగంలో చేర్చుకున్నారు. మొగోళ్ళు వేరే, ఆడోళ్ళు వేరే. ఇంటికొక్కళ్ళేకాదు, భార్యకిచ్చేది, భర్తకిచ్చేది. ఫైటుచేయడంలో సామాన్య ప్రజలందరు ఒక ఇంట్లో సంగం పుట్టిందంటే ఆడోళ్ళు, మొగోళ్ళు సరిసమానంగానే పోట్లాడేది. మొట్టమొదలేమొ సంగసంస్కరణ గురించి బాగానే ప్రచారం చేసిన్రు. కాని ఎప్పుడైతే పోరాటం వుధృతమైందో అప్పుడు ఈ సంస్కరణ సమస్యే మరుగునపడిపోయింది. భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటమే మెయిన్‌ పోరాటం. దాంట్లో దాదాపు ఆడవాళ్ళెట్లా దూరంగుండాలి, చాటుండాలి, వాళ్ళనెట్లాకొట్టాలి అనేటటువంటివన్నీ గూడా మర్చిపోయిన్రు, వదులుకున్నారు. కొంత సమానంగ గుర్తించడమనేది పోరాటంలోనే వచ్చింది. మామూలు లేబర్‌ సంగతిచెబ్తున్న, లేబర్‌లో ఆడవాళ్ళంతా గూడా, ఒకరికోసం బలం చేకూరుకుని పోరాటంలో నిలబడాలనే భావం ఆ పోరాటంలోనే వచ్చింది. అయితే సామాన్యజనం మాత్రం స్త్రీలు, పురుషులు అనకుండా ఈ భూస్వామ్య దౌర్జన్యవిధానాన్ని, భూస్వాముల దగ్గర వెట్టిచేసే విధానాన్ని ఈ దరిద్రపు బ్రతుకునించి బైటపడటం అనే కోర్కెను అందరూ సమానంగానే వెల్లడించారు. ఆ సమస్యల్లో పోట్లాడటానికి వచ్చినపుడు అందరూ సమానంగానే వచ్చారు. వచ్చినదాంట్లో కొద్దోగొప్పో స్త్రీలని సమీకరించుకోవడం జరిగిందీ అంటే ఆ దశలోనే జరిగింది. అంతకుముందయితే వాళ్ళకేం ఎరుకలే ఆడవాళ్ళు అనే యిదితో వుండేవారు. కాని యిప్పుడు మాత్రం తప్పని సరైంది. ఎందుకంటే వెంటనే వుద్యమంలో చేరటం, సంఘంలో చేరటం, కార్యక్రమాలు చేయటం, అంటే వెంటనే తప్పుకోవలసిరావటం, జైలుకన్నా పోనీ, కేసన్నాకానీ, యేమన్నాకానీ యిగ మిగిలిన కుటుంబం ఆడోళ్ళే. గొడ్లను కాపాడినా, పిల్లల్ని కాపాడినా మొత్తానికి ఓ కుటుంబ జీవితం కాపాడటం వీళ్ళపైనే పడింది. కాబట్టి యేందంటే వీళ్ళకేదైనా సరే తెలియజేసి పోవాలి, వాళ్ళను తయారుచేసిపోవాలనే భావం వీళ్ళల్లో ప్రవేశించింది- అప్పుడే సమానంగా చూడగలిగిన్రు. అంతే కాకుండా మొదటిదశలో మనం చేసిన ప్రచారం కంటిన్యూగా కొనసాగుతూనే వున్నది. ఏదైనా ఆడవాళ్ళని, కొట్టుడు, తిట్టుడు అనేది జరుగుతే సంఘంలోకి పిలిచి పదిమందికి చెప్పేవాళ్ళు. అదివరకేమో భూస్వాముల్ని పిలిచి దండుగలేసే పద్ధతుండేది- కాని మన సంఘం, కొంచెం ప్రాధాన్యత పెరగంగానే కుటుంబ తగాదాలు కూడా మన సంఘం దగ్గరికి వచ్చేవి. కుటుంబ సమస్యలకు బాగా న్యాయం జరగాలనే వైఖరిని మనవాళ్ళు బాగా ప్రదర్శించే వాళ్ళు. అందువల్ల స్త్రీలు కూడా బాగా వచ్చేవారు పోరాటంలో- ఐలమ్మ అందుకు సాక్ష్యం. అటువంటి కుటుంబాలు యెన్నో వున్నాయి. ఐలమ్మ ఒక్కతి నోసుకుంది, ఇంత గొప్పపేరు రావటాన్కి గౌరవం రావటాన్కి, మొన్న నేను మిర్యాలగూడెంలో మహిళాసభ చేసి, సన్మానం చేసి యెర్రచీర పెట్టామన్నమాట. సరే అదిగూడ లేట్‌ చేసామనుకోండి. యెపుడో చేయవల్సివుండె మహిళా వుద్యమం తరఫున! అంతకుముందు జరిగిన పోరాటంలో ఆంధ్రమహిళాసభ వాటిల్లో గూడా అంత సన్మానం జేయకున్నా ఆమె గురించి బాగనే రాసిన్రు, రావి నారాయణరెడ్డి, సుందరయ్య పుస్తకాల్లో, చరిత్రలో వస్తనే వున్నది.

అంత ప్రధానంగా ఐలమ్మ రావడాన్కి కారణం యేంటంటే, మొట్టమొదటి పోరాటం, భూమి సమస్యపైన, ఆ మొట్టమొదటి పోరాటంగూడ ఆమె ధైర్యంచేసి చాలా ముందట నిలబడింది. ఆమె వచ్చి మన సంఘం వాళ్ళకి జాడ జెప్పి నర్సింహంగార్ని అందర్ని కూడగట్టి పొలంగోసుకొచ్చింది. ”దొరోడు ఏం బీకుతడో జూస్త” అని అనగల్గింది. తర్వాత ఆయన గూడ నిలబడ్డడు. తర్వాత మన వాళ్ళతోపాటు ఆమె భర్తను గూడ పట్టుకున్నరు. పట్టుకుని ఆయనను జనగాం జైళ్ళపెట్టి ఆసనాల్లో కారంబోసి కొట్టి, మూత్రందాపి, బాగా కొట్టి బాధలు పెట్టిన్రు వెంటనే ఆమె సద్ది కట్టుకొని హైద్రాబాద్‌కి వచ్చి, రావినారాయణరెడ్డిని కల్సుకుని, పెద్దవాళ్ళందరికి తెలియజేసి, పేపర్లల్ల పడేసి, ప్రెజంటేషన్‌యిచ్చి, మనోల్లంత స్టేషన్‌ దగ్గరజేరి హరాస్‌మెంట్‌ గురించి విచారించి జమానతు గట్టించి విడుదల జేసేందుకు ఇవన్నీ చేసిందన్నమాట, ఆ రోజుల్లో స్త్రీలు అంత యిదిగా వున్నారంటే మాటలా? మన వాళ్ళందరికి జెప్పి ఈ పనులన్నీ జేయించింది. అట్నే భూమి దక్కేవరకి నిలబడ్డది- తర్వాత వచ్చే మంచి, చెడ్డలకు కూడ నిలబడి భూమి దక్కించుకున్నది. మొన్న సచ్చిపోయినప్పుడు ఆమె అంత్యక్రియలకు నేనుబోతే, నేను అక్కడికి బోంగనే, నేనక్కడ ఉయ్యాలేసిన సంఘటన గుర్తొచ్చింది, ఉయ్యాల పాటలు యేసుకుంట పోయినం ఒక దశలో దేవురుప్పల, కడివెండి, సిద్దనాపురం, పాలకుర్తి ఈ ఊర్లన్నీ తిరిగినం ఉయ్యాలేసుకుంట, ప్రచారం చేయటాన్కి భూస్వాములకి వ్యతిరేకంగా అది వెట్టిచాకిరీకి వ్యతిరేక పోరాటం జయప్రదం అయ్యింది వెట్టి వాళ్లు తగ్గిన్రు, భూమి మీదకి తిరిగింది పోరాటం, ఆ దశలో నేను వుయ్యాలపాట లేసుకుంట పోయిన్నన్నమాట. అప్పుడు నాకు పదకొండు, పద్నాలుగేళ్ళో వుంటై.

అప్పట్లో ”యెంత పాపకారి వుయ్యాలో, విసునూరి దొరోల్లు వుయ్యాలో” అనే పాటలే నాకిప్పుడు గుర్తొస్తున్నయి. పాలియ్య తోలిమ్మంటే తల్లుల్ని, సేపులకొస్తే గట్లమీద పాలు పిండిచ్చేవాడు, నాటు పెట్టేతందుకు ఎట్టికి నాటుకుపోవాలె, ఆ నాటుకు పోయిన స్త్రీలను పాలియ్యనిచ్చేవాడు కాదు. ఈ పాటలు రావినారాయణరెడ్డి గారు రాసిన పుస్తకాల్లో వుంది. ఒంగుకుంటూ వెయ్యాలిగా పాటలు, ఎవరేస్తారట్ల, సరే మేం కార్యకర్తలుగా రూపొందినం కాబట్టి పెద్ద సమస్యలేదు. అయితే లేబర్‌ అందరుగూడ జాతీయ పాట యిక్కడ ప్రతి వెన్నెల రోజుల్లో పాడేది. అయితే దేవుడి పాటో, రాముడి పాటో పాడుతుండేవారు, మనం మాత్రం, ఈ భూస్వాములు ఎట్లా దౌర్జన్యం చేస్తున్నారో, దానివల్ల స్త్రీలెట్లా బాధపడ్తున్నారో, అట్లాగా భూములెట్లాపోయినై, తిండికెట్లా లేకున్నది, దీనికంతా కారణమేంటి, అసలు యెవడు పుట్టి పెట్టిండు, భూమి యెవర్ది అనే విషయాలు ఆ పాటల్లో పెట్టి పాడటం జరుగుతుండేది. మొన్న పాలకుర్తికి పోయినప్పుడు అదే గుర్తొచ్చింది.

నాకు వాళ్ళందరు, ఐలమ్మ పోరాడి దక్కించుకున్న భూమి చూపించిన్రు. ఆ భూమి యిపుడు మండల కేంద్రం అయ్యిందట. ఆ పాలకుర్తిల యిప్పుడు ఆ భూమికి బాగారేటొచ్చిందట – ఆ కొడుకులు అనుభవిస్తున్నారు. అమ్ముకొంటున్నారట కూడ- ఈ సన్మానాలు, గిన్మానాలు పెద్ద పట్టిచ్చుకోవద్దనుకుంటం కని ప్రజల్ని మళ్ళి మేల్కొలపటం కోసం అది పనికొస్తుంది. నాయకులు కొందరు అదేపనిగ సన్మానాలు చేయించుకుంటాన్రు. అట్లాంటి వాళ్ళను సన్మానాలు చేసుకుంట పోయేదానికన్నా, ప్రజల్లో యెవరైతే పాల్గొన్నారో వాళ్ళని సన్మానించటం చాలా గొప్ప విషయం-

అంతే గాకుండా కాంగ్రేసు వాళ్ళు క్యాంపుల సెంట్రల్‌ గవర్నమెంట్‌ గుర్తించి, ఆ క్యాంపుల్లో వీళ్ళున్నారని సర్టిఫికెట్స్‌ యిచ్చి, ఫ్రీడమ్‌ యిచ్చి, ఫించన్‌ యిస్తన్నారన్నమాట. ఇది చాలా ఘోరం. మొత్తం తెలంగాణా వ్యతిరేకత పోరాటాన్ని కాంగ్రెసు వాళ్ళు యెంత వెతుక్కుని దేవులాడుకున్నా అయిదుపైసల వంతు చేయరు- కాని యివ్వాళ వాళ్ళే ఫ్రీడము ఫైటర్స్‌మని పోజు పెడ్తున్నారు. ఆనాడు పనిచేయనివారు పుట్టనివాడు కూడా, ఫ్రీడమ్‌ ఫైటర్స్‌మని పోజు పెడ్తున్నారు. అందులో వుండి యెంతో తెల్సి, పనిచేసినవానికి కూడ సర్టిఫికెట్స్‌ యివ్వమని అడిగితే, మా క్యాంపులో వున్న వాళ్ళకే యిస్తం అని చెప్తున్నారు. అసలు తెలంగాణా ప్రాంతంలో జనగాం తాలుకాగానీ, సూర్యాపేటగానీ, వరంగల్‌ ఏరియాగానీ అసలు ఫ్రీడమ్‌ ఫైటర్స్‌ని చూపాలంటే మందలకి, మందలని దీస్కపోయి తోలిన్రు జైల్లల్ల జనాన్ని, మామూలుజనాన్ని. వాళ్ళీనాడు ఒక్కరోజు జైలు చేసినా చాలని చెప్తున్నారే, ఆ మాటగన్క చెప్తే సగం వూరికియ్యాలె. సావంగ మిగిలినోల్లే సగం వూరు. ఊరికి వందమందికిస్తెగాని అది న్యాయం గాదు.

అసలు ఒక్కొక్క వూర్లల్ల ఎంత మందిని కాల్చిన్రు. చెట్టు చెట్టుకీ, గుట్ట గుట్టకీ కాల్చేయబడ్డ జనమే గుర్తొస్తరు. నిజంగా యీ నాటికీ నేలరక్తంతోటి తడిసినట్టు అన్పిస్తదన్నమాట- ఎన్నిరకాల హింసలు, కాల్చివేతలు తగుల బెట్టడాలు, యెన్ని ఘోరాలు చేసిన్రు.

అప్పుడు మా గ్రామంలోనే ఒక సంఘటన- మైసయ్య అనే హరిజనుడు కంచెలో గొడ్లకాస్తుండగా మా అన్నగారు పోయిండు. అప్పటికే దళాలు తయారైనై; బుడ్డిల అన్నం తెచ్చుకుని ఆ హరిజనుడు చెట్టుకు గట్టిండు. ఈయన తుపాకేసుకుని పోయిండు, పోయి ఆకలైతుందంటె యిప్పి అన్నం బెట్టిండు- పెట్టినంక, ఈయనతోవన ఎల్లొచ్చిండు. ఆయన మల్ల ఊర్లకి పోంగనే పోలీసులు వొచ్చి పట్టుకున్నారు- పట్టుకొని వస్తే అన్నం పెట్టినవటగదా, యెక్కడ పోయిండు, యెట్ల వచ్చిండు అని; యెన్ని చిత్రహింసలు పెట్టినా చెప్పలేదు. చివరికి బ్రతికున్న మనిషిని, కింద రేక్కంపయేసి, పండబెట్టి, పైన ముళ్ళకంప బెట్టి, బూట్లు పెట్టి తొక్కిన్రు, తొక్కినగని చెప్పలేదు- నేనన్నంబెట్టిన, యెల్లిపోయిండు అని చెప్పిండుగని, యిగ యేం జెప్పలే. అట్నే చిత్రహింసలు పెట్టి చంపేసిన్రు- ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి ఫించన్‌ రాదు అట్లా తయారైంది.

(మనకు తెలియని మన చరిత్ర పుస్తకం నుండి)

(ఇంకావుంది)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 
S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 
తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.