కనువిప్పు – పి. రాజ్యలక్ష్మి

పదిమంది పెద్దమనుషులతో పంచాయితి నడుస్తోంది. పేరుకు పంచాయితీనే గాని ప్రపంచ యుద్ధం నడుస్తున్నట్లు వుంది. యిరు వర్గాలు ఎక్కడా తగ్గడం లేదు. చర్చలు నడుస్తున్నా పరిష్కారం కనుచూపుమేరలో కనబడటం లేదు. రెండు రోజుల నుండి యిదే తంతు. యింతకీ విషయం ఏమిటంటే మొగుడు పెళ్ళాల పంచాయితి. యిరు పక్షాలకు ఆమోద యోగ్యంగా వచ్చిన నాకు జుట్టు పీక్కోవాలనిపిస్తుంది.

నేను కలగజేసుకోకపోతే లాభం లేదనిపించింది. నోరు జేసుకొని వీళ్ళిద్దరిచేత కాపురం చేయించాలని వుందా లేదా అని యిరు పక్షాలవారిని గట్టిగా మందలించగానే అందరూ నిశ్శబ్దం పాటించారు. యిదే మంచి సమయమని అందిరిని మాట్లాడవద్దని గట్టిగా వార్నింగు యిచ్చి ముందుగా అబ్బాయిని మాట్లాడమని అవకాశం యిచ్చా. (ఎంతయినా నేనూ మగాడిని కదా. పై చెయ్యి వుండొద్దూ)

ఒరే అబ్బాయి నువ్వు ఆ అమ్మాయితో ఎంతకాలం నుండి కాపురం జేయటం లేదు.

మొదటి సంవత్సరం బాగానే వున్నాం. పెద్ద పిల్లాడు పుట్టిన తరువాత గొడవలు వచ్చి రెండేళ్ళు దూరంగా వున్నాము. మీలాంటి పెద్దమనుషులు పంచాయితీ చేసిన మీదట ఆరు నెలలు బాగా వున్నాము. రెండవవాడు కడుపున పడ్డాడు. మళ్ళీ గొడవలు వచ్చాయి. రెండు మూడు నెలలకు ఒకసారి వచ్చిపోతుండే వాడిని. నాలుగేళ్ళబట్టి అసలు పోవటం లేదు.

బాగుందిరా అబ్బాయి. యిద్దరు పిల్లలను కనటానికి మాత్రం వచ్చావు. హాయిగా మీ అమ్మ వండి పెడుతుంటే సంపాదించిన డబ్బులతో జల్సా చేస్తున్నావన్నమాట. పెద్దావిడ మీ అమ్మ కన్నా బుద్ధి లేదా. కొడుకుని దగ్గర పెట్టుకుని ఎలా వుంది. యింతకీ నీకు కాపురం వెలగబెట్టాలని వుందా లేదా.

బాబాయి నువ్వు పెద్దోడివి. నీకు తెలియనిది ఏముంది. నాకు నా భార్య, పిల్లలు కావాలి.

మరి యింకేం మాయ రోగంరా. లక్షణంగా కాపురం చేసుకోక. నువ్వు వస్తానంటే ఆ పిల్ల రావద్దు అన్నదా. పోనీ నీకేమన్నా కండిషన్సు వున్నాయా అనగానే

వాడి మొహంలో వెలుగులు కనబడ్డాయి.

బాబాయి ముందు ఆ ముసలి రాక్షసి వుంది చూసావు. అది మాత్రం మా దగ్గర వుండకూడదు. ఆ అమ్మాయి జీతం నా చేతికి యివ్వాలి. వాళ్ళ వూరిలో వున్న యిల్లు అమ్మి డబ్బులు యివ్వాలి. మా అమ్మ మా దగ్గరే వుండాలి, ఆమె మంచి చెడ్డలు చూడాలి.

ఓస్‌ యింతేనా. యివన్నీ పెద్ద సమస్యలే కాదు. అనవసరంగా వీళ్ళకి విషయం అర్థం చేసుకోవటం తెలియక పంచాయితీ తెగటం లేదు. ఆ అబ్బాయి అడిగిన దాంట్లో ఏవి సీరియస్‌ విషయాలుగా అనిపించటం లేదు. ఆ అమ్మాయితో కూడా మాట్లాడి కాపురం నిలబెడితే ఒక పని అయిపోతుంది కదా అని అందరిని బయటకు పంపించి ఆ అమ్మాయితో ఒంటరిగా మాట్లాడితే మంచిదనిపించింది.

ఆ అమ్మాయి వచ్చి కూర్చుంది. వయస్సు చిన్నదయినా బాగా అనుభవం వున్నట్లు, వేదాంతం తెలిసిన పెద్ద మనిషిలా, ఆత్మ విశ్వాసం మెండుగా వున్నట్లు అనిపించింది. అడిగిన దానికి తప్పితే ఒక్క ముక్క ఎక్కువ మాట్లాడటం లేదు. చూడంగా చూడంగా ఆ అమ్మాయి మొహంలో ఏదో కసి కనబడుతూ వుంది.

చూడమ్మా. కొన్ని విషయాలకు సర్దుకుపోవాలి. తెగేదాకా లాగకూడదు. కాపురం అన్న తరువాత యిలాంటి కష్టాలు తప్పవు. ఎంతయినా ఆడవాళ్ళు సర్దుకోక తప్పదు. యింతకీ ఆ అబ్బాయి కండిషన్సు యివి. మీ అమ్మను నీ దగ్గర ఎందుకు వుంచుకోవటం. నీవు ఒక్కదానివే కూతురు అయితే వేరే విషయం. అన్నయ్య వున్నాడు కదా. అక్కడికి పంపిచ్చు.

వూళ్లో యిల్లు నీకే యిస్తామని పెళ్ళికి ముందు చెప్పారట కదా. యింకా పల్లెలో యిల్లేమిటమ్మా. హాయిగా ఆ అబ్బాయి చెప్పినట్లు అమ్మేస్తే పోలా, పల్లెటూళ్ళలో ఎంతకాలం వున్నా పట్నాలలో లాగా రేట్లు పెరగవు కదా.

ఎంత ఉద్యోగం జేస్తున్నా మొగుడి మాట వినకపోతే ఎట్లా చెప్పు తల్లీ చూస్తుంటే అబ్బాయి గూడ మంచోడిలా వున్నాడు. నీ జీతం ఆ అబ్బాయికి యిస్తే నష్టం ఏమిటి. లేదా నీ చేతుల్లో వుంటే పెత్తనం వుంటుందనుకుంటున్నావా.

మగపిల్లాడి దగ్గర తల్లి వుండటం లోకసహజం. మీ అత్తగారు మీదగ్గర వుంటానని అంటుందంట. పాపం ఆ అబ్బాయి అడిగిన దాంట్లో నాకేమి తప్పు కనిపించటం లేదు. యింక చిన్న చిన్న విషయాలకోసం పట్టుదలకు పోయి చిన్న వయస్సులో దూరంగా వుంటున్నారు.

చెప్పటం పూర్తికాగానే ఆ అమ్మాయి చూసిన తీక్షణమైన చూపులకు భస్మం అయిపోతానని అనిపించింది. కొంచెంసేపు మౌనంగా వుండి, గట్టిగా వూపిరి పీల్చుకొని చాలా ప్రశాంతంగా మాట్లాడటం మొదలు పెట్టింది.

నిజమేనండి. మీరు చెప్పినట్లు చాలా సింపిల్‌. అలాగే వదిలించుకోవటం కూడా చాలా ఈజీ. మీరు పెద్ద మనుషులు కాబట్టి నేను చెప్పేటంతటి దాన్ని కాదు. కాని చెప్పక తప్పదు.

మా నాన్న అటెండరు ఉద్యోగం చేస్తూ చాలీచాలని జీతంతో మా యిద్దరిని కష్టపడి చదివించాడు. అన్నయ్య బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం వచ్చిన తరువాత ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళి చేసుకున్న విషయం కూడా మాకు తెలియదు. ఒకరోజు యిద్దరూ వచ్చి విషయం చెప్పటం ఆ రాత్రికే విమానం ఎక్కటం జరిగిపోయింది. ఈనాటికి మా అన్నయ్య గురించి మాకు ఏమీ తెలియదు. అన్నయ్య అంటే నాన్నకు ప్రాణం. వాడు మంచి తెలివిగలవాడు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాడు. తనకి మంచి పేరు తెస్తాడని తెగ మురిసిపోయేవాడు. అన్నయ్య చేసిన పనికి నాన్న కుమిలి కుమిలి పోయి నాలుగు నెలలు అన్నయ్య కోసం ఎదురు చూసి చూసి మమ్మల్ని వంటరి వాళ్ళను చేసి పోయాడు. కొడుకు దూరం అయ్యాడని నాన్న అసలే లేడని అమ్మ పుట్టెడు దుఃఖంతో మంచం ఎక్కింది. నాన్న ఉద్యోగం నాకు వచ్చింది. ఎంతో కష్టపడి అమ్మను బతికించుకున్నాను.

ఉద్యోగం వచ్చిన రెండు సంవత్సరా లకు నాకు పెళ్ళయింది. మా అత్త ఆరు నెలలు మాయింటి చుట్టూ తిరిగింది నన్ను జేసుకోవ టానికి. మగదిక్కులేని మాకు కొడుకైనా, అల్లుడైనా యితనే కదా అని ఏలోటు రాకుండా చూసుకునే వాళ్ళం. నాన్నకు వచ్చిన డబ్బులు, పెన్షను, నా జీతం మొత్తం అతనికే యిచ్చి యిల్లు చూసుకొమ్మని అతనికే మొత్తం పెత్తనం యిచ్చాము. తమ్ముళ్ళను చదివించుకున్నాడు, చెల్లెలికి మా డబ్బులతో పెండ్లి చేసాడు.

ఎంతజేసినా అతనికి తృప్తి లేదు. నాలుగు సంవత్సరాల నుండి యింటి గుమ్మం తొక్కడం లేదు. నేను చాలాసార్లు అత్తగారింటికి పోయి కాళ్ళా వేళ్ళా పడ్డాను. కొంచెం కూడా కనికరం చూపించలేదు.

యిద్దరు పసిపిల్లలు. నా ఉద్యోగం లో ఎప్పుడూ క్యాంపులు వుంటాయి. ఒక టైమంటూ వుండదు. నా మెటర్నిటి లీవు అయిపోయినప్పటి నుండి అమ్మే యిద్దరు పిల్లలను కంటికి రెప్పలా సాకింది. అమ్మకి ఆరోగ్యం బాగాలేక, నానా బాధలు పడుతుంటే అత్తయ్యను నాలుగు రోజులు వచ్చి వుండమని బతిమిలాడాను. మీ అమ్మ చచ్చినాక వస్తానని కబురు పంపింది. అతనికి యింటి బాధ్యతలు పిల్లల బాధ్యత వుండదు. ఎప్పుడన్నా ప్రశ్నిస్తే అన్నీ చూసుకోవటానికి మీ అమ్మ వుందిగా అంటాడు.

యిప్పుడు పిల్లలు కొంచెం పెద్దయి స్కూల్సుకు వెళుతున్నారు. అందుకని అమ్మ అవసరం తీరిపోయింది. ఆమె అడ్డంగా వుంది. అమ్మను ఎక్కడకు పంపాలి. అంటే పెన్షన్‌ వస్తుంది కదా మంచి వృద్ధాశ్రమంలో చేర్పించు. మనము ఎప్పుడన్నా వెళ్ళి చూసి రావచ్చు అంటాడు.

మా అమ్మకు మాత్రం కోరికలు లేవా, లక్షణంగా కొడుకు, కోడలు మనవళ్ళతో వుండాలని వుండదా, అన్నాడు.

ఆమెను వచ్చి మనతో వుండమని చెప్పాను. నా పిల్లలు యిటు అమ్మమ్మ, నాయనమ్మల దగ్గర చాలా సంతోషంగా వుంటారని ఆశపడ్డాను, అలా వీలు కాదట. వుంటే ఎవరో ఒక్కరే వుండాలట. ఆడపిల్ల దగ్గర తల్లి వుండటం ఏమిటి వుంటే కొడుకు దగ్గర లేదంటే వల్లకాడికి పోవాలట. యిది న్యాయమేనా. పాడి యిచ్చినన్నాళ్ళు పాలు పితుక్కొని వట్టిదయి పోయిన తరువాత కబేళాకు పంపే కసాయిని గాను నేను, యిన్నాళ్ళు నాకు చాకిరి జేసి తన సర్వస్వాన్ని ధారపోసిన తరువాత మా అన్నయ్య దగ్గరకు ఎలా వెళుతుంది. నేను ఎలా పంపిస్తాను. ఆడ పిల్లలకు ఆస్తి హక్కు ఎలా వున్నదో దానితో పాటు బాధ్యత కూడా వుండాలని ఎందుకని ఎవ్వరూ చెప్పటం లేదు. మగ పిల్లాడితోపాటు నన్ను సమానంగా పెంచి చదువులు చెప్పించి, పెళ్ళిళ్ళు పురుళ్ళు పోసి నానా బండచాకిరి చేసింది నాకే కదా. బతికినన్నాళ్ళూ నాకోసం త్యాగం చేసింది. ఆఖరి దశలో ఆమెను చూడటం నా బాధ్యత కాదా?

యిక యిల్లు అమ్మను గాక అమ్మను. నాకు వున్న ఒక్క ఆధారం అదే. అది అమ్మితే నిలబడను నీడ కూడా లేకుండా జేయాలని వాళ్ళ ఆలోచన. అది మా తాతల కాలం నాటి యిల్లు. అమ్మ చచ్చిపోతే అనాధ శవంలా రోడ్ల మీద పెట్టుకోవాలి. తరతరాల నుండి వస్తున్న యిల్లు, వాటి తాలూకా జ్ఞాపకాలు నా పిల్లలు అనుభవించాలి. అతనికి ఈ మానవ స్పర్శలు, అనుబంధాలు తెలియని మూర్ఖుడు.

యిక అతని కండిషన్స్‌లో నా జీతం అతనికి యివ్వాలా. చాలా బాగుంది. పెళ్ళయిన తరువాత వచ్చిన నా జీతం అమ్మ పెన్షన్‌ అతని చేతులకే యిచ్చాము. కాని ఏం జరిగింది. యింట్లోకి ఏది కావాలన్నా అడుక్కు న్నట్టు అయింది. చిన్న చిన్న అవసరాలకు నసిగి, నసిగి డబ్బులు విదిల్చేవాడు. నాపేరు మీద లోన్సు తీసుకుని ఆ డబ్బులతో తన పేరు మీద ఆస్థులు కొన్నాడు. నా జీతంలో లోన్సు పోగా వచ్చే జీతం సరిపోక అమ్మ పెన్షన్‌తో కుటుంబం లాగుతున్నాను. ఈ సిటీ లో మేము ఎలా బ్రతకాలి. అతని జీతంలో పైసా యివ్వ డు. యిద్దరు పిల్లలను కని బాధ్యత లు వదిలి పోయాడు. మమ్మల్ని నిలువు దోపిడి చేసాడు.

ఏది ఏమయినా ముందు నా తల్లి తరువాత నా పిల్లలు. ఆ తరువాతే అతను. నన్ను అర్థం చేసుకొని సహకరిస్తే బాగుంటు ంది. యింతకాలం ఒంటరిగా బ్రతికిన దాన ను. పిల్లలు పెద్దయితే వాళ్ళే ఆధారం అవుతా రు. కాని సమాజానికి నాకు ఒక మొగుడున్నాడు పిల్లలకు అబ్బ వున్నాడని తెలియాలి కదా. అంతకంటే అతనినుంచి ఆశించేది లేదు.

ఆ అమ్మాయి మాట్లాడుతున్న ప్రతి మాటలో ఈ సమాజం మొత్తాన్ని అద్దం పట్టి చూపించినట్లు అనిపించింది. ఆడవాళ్ళు చదువుకొని, ఉద్యోగాలు చేస్తుంటే స్వేచ్ఛ వస్తుందని అనుకునే నాలాంటి బడుద్దాయిలకు మెత్తని చెప్పుతో సమాధానం చెప్పినట్లు అనిపించింది. ఆలోచించే కొద్దీ నాకల భూమిలోకి జారిపోతున్నట్లు అనిపించింది. సమాజం మారింది, అభివృద్ధి చెందిందని అనుకున్నానే గాని, ఎక్కడ మారాలో అక్కడ మారలేదని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుందనిపించింది. యింతే ఈ ఆడవాళ్ళ బతుకులు. సమస్యల రూపాలు మారుతు న్నాయి కాలానుగుణంగా, కాని సమస్యలయితే అలానే వున్నాయి అనిపించింది. ఆ అమ్మాయికి సమాధానం చెప్పలేనన్న విషయం తెలిసి సిగ్గుపడుతూ యింతకి చివరగా నీ అభిప్రాయం చెప్పమ్మా అనగానే

మా అమ్మ పోయిన తరువాత అతనితో కాపురం చేయాలా వద్దా అన్నది ఆలోచిస్తాను. అప్పుడు మీ అందరిని పిలిపిస్తాను అని చెప్పి రెండు చేతులు జోడించి సవినయంగా నమస్కరించి వెళ్ళిపోయింది.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

One Response to కనువిప్పు – పి. రాజ్యలక్ష్మి

  1. కథ చాలా చక్కగా ఉంది కుక్కికాటుకి చెప్పు దెబ్బ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో