‘మందు’ అనే మాటను మనం రెండు రకాలుగా ఉపయెగిస్తుంటాం. మొదటిది అనారోగ్యం వస్తే వేసుకునేది, రెండవది అనారోగ్యం తెచ్చుకోవడానికి వేసుకునేది. భూ సమస్యల పరిష్కారానికి ప్రపంచ బ్యాంకు నిర్వహించిన అధ్యయనం, దాని సూచనలను లోతుగా పరిశీలిస్తే తప్ప అది ఏ మందో చెప్పడం కష్టం.
సంస్కరణలు అంటే ఏమిటి? రిటైర్డు ఐ.ఎ.ఎస్. అధికారి శ్రీ ఎస్.ఆర్. శంకరన్ ప్రకారం ‘భూమి సంబంధాలను భూమిలేని పేదలకు అనుకూలంగా మార్చడమే భూసంస్కరణలు. అంటే భూస్వాముల వద్ద, ప్రభుత్వం వద్ద వున్న భూములను భూమిలేని పేదలకు పంచడం. పేదల వద్ద భూములు వారి చేజారకుండా పరిరక్షించడం.
లక్ష్యాలను సాధించడానికి మన భూ సంస్కరణల చట్టాలను రూపొందించారు. జమీందారీలు, జాగీర్దారులు, ముఠాలు, ఇనాంలు వంటి దోపిడి భూ సంబంధాల రద్దుకు చేసిన భూమి చట్టాలు వాస్తవ సాగుదారుకు భూమిపై హక్కు కల్పించడానికి ఉద్దేశిస్తే, భూ సంస్కరణల చట్టం, బిఎస్‌ఓ- 15 వంటి నియవలు భూ స్వాముల, ప్రభుత్వ భూములను పేదలకు పంచేందుకు ఉద్దేశించినవి. ఇక ఆంధ్రప్రదేశ్ ఎసైన్ మెంటు భూముల (బదలాయింపు) నిషేధ చట్టం 9/77, తెలంగాణా, ఆంధ్ర కౌలుదారీ చట్టాలు, నివేశ స్థలాల హక్కుల చట్టం, షెడ్యల్డ్ ప్రాంతాల భూపరాయికరణ నిషేధ చట్టం (1/70) వంటి చట్టాలు బడుగులు, పేదలు, పేద కౌలుదార్ల స్వాధీనంలో వున్న భూములు వారి చేజారకుండా కాపాడేందుకు ఉద్దేశించినవి.
రాజ్యాంగం ప్రకారం సభూనత్వం – సోషలిజం రాజ్యం యొక్క ముఖ్య లక్ష్యాలు కాబట్టి చట్టాలను అమలుపరిచే యంత్రాంగం భూ పరిపాలనను పూర్తిగా తన ఆధీనంలోనే వుంచుకుంది. భూమి కొలత – రికార్డుల తయరీ (సర్వే – సెటిల్‌మెంట్), వాటి నిర్వహణ, అజవయిషీ (రెవెన్య), బదలాయింపుల నమొదు (రిజిస్ట్రేషన్), ఈ మూడు శాఖలు పూర్తిగా ప్రభుత్వంలోనే అంతర్భాగాలుగా వున్నాయి.
వెనుకబడిన పేదదేశాల అభివృద్ధికి వారు అడిగినా, అడగకపోయినా సూచనలు చేయడం ప్రపంచ బ్యాంకు వారు తమ మీద వేసుకున్న బాధ్యత. అనాగరిక ప్రజలకు నాగరికత నేర్పడం తెల్లవాని బాధ్యత అని పూర్వం అనేవారు). తన వద్దకు అప్పు కోసం వచ్చేవారికి తప్పక ఈ ొసూచనలు చేస్తారు. రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో వున్నప్పుడు వాటిని షరతులు అంటారు. అదే అధికారంలో వుంటే ొసూచనలు (ొమాత్రమే) అంటారు. భూ సమస్యల పరిష్కారానికి కూడా ప్రపంచ బ్యాంకు కొన్ని సలహాలు ఇవ్వదలచింది.
ప్రపంచబ్యాంకుకు వున్న మరో సుగు ణం ఏమిటంటే వారు ఏ రంగంపై సలహా ఇవ్వాలనుకున్నారో ముందుగా దాన్ని అధ్యయనం చేయిస్తారు. అయితే తాము ఎలాంటి సూచనలు చేయదలుచుకున్నారో అలాంటి నివేదికలను ఇచ్చేవారికే ఆ అధ్యయనాలు అప్పగిస్తారనేది లోపాయి కారిగా అనుకునే ొమాట.
”భారతదేశ ప్రగతి, పేదరికం తగ్గు దలకు భూ విధానం” అనే ప్రపంచ బ్యాంకు అధ్యయన నివేదికలో భారతదేశంలో అభివృద్ధికి ఆటంకంగా వున్న భూ సమస్యపై అధ్యయనం చేసి పరిష్కారానికి కొన్ని సూచనలు చేసింది. ొభూపరిపాలన, న్యాయపరిపాలన, పరిశోధనల రంగంలో ఇప్పటికే పలు రాష్ట్రప్రభుత్వాలు బ్యాంకు నుండి దండిగా ఆర్థిక (అప్పు) సహాయం పొందుతున్నాయి. గత ప్రభుత్వ హయంలో మన రాష్ట్రం ఈ విషయంలో చాలా ”ముందుకు పోయింది”. ఈ అధ్యయనంలో తీసుకున్న దృక్పధం, వచ్చిన నిర్ణయలు, చేసిన సూచనలు రాష్ట్రాల ొభూపాలనను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.
ప్రపంచ బ్యాంకు నివేదిక, దేశంలోని భూసమస్యలను ఆమూలాగ్రంగా విశ్లేషించింది. అందులో తిరుగులేదు. మన రాష్ట్రంలో మొత్తం సర్వే నెంబర్లు ఎన్ని, ఎన్నింటికి ఎఫ్.ఎం.బి./టిప్పన్‌లు (ఎఫ్.ఎం.బి. – ఫీల్డ్ మెజర్‌మెంట్ బుక్ – పొలం కొలతల పుస్తకం) లేవు, ఎన్ని గ్రామ పటాలు గల్లంతైనాయి మొదలైన సక్ష్మ సమాచారం (మన రాష్ట్ర భూ పరిపాలన కమీషనరుకైన తెలుసో లేదో) ఈ నివేదికలో వుంది. ప్రతి సమస్యను గుర్తించి, చర్చించి, అంతిమంగా పరిష్కారాన్ని సూచించడం ఈ నివేదిక గొప్పతనం. అయితే ఆ పరిష్కారం వద్దే అసలు (మడత) పేచి వుంది.
వీటిని చర్చించే ముందు సమస్యల పరిష్కారంలో ప్రపంచ బ్యాంకు దృష్టి కోణం ఏమిటో తెలుసుకుందాం. ొభూసమస్యలకు మనకు గల చారిత్రక నేపధ్య లక్ష్యాలను ముందుగా ప్రస్తావించుకున్నాం. భూమిని వర్కెట్‌లో ఒక సరుకుగా మార్చాలని, అలాచేస్తే పేదలకు భూమి అందుబాటులోకి వస్తుందని నివేదిక అంటుంది. ఈ అందుబాటులోకి రావడాన్ని భౌతికంగా భూమి లభించడంగా భావిస్తే పప్పులో కాలేసినట్లే. భూమి స్వేచ్ఛా మార్కెట్‌లో సరుకుగా మారితే దాని నుండి వారు (ప్రస్తుతం వున్నదాని కంటే) గరిష్టంగా లాభం పొందుతారని, ఆ విధంగా అది దేశ అభివృద్ధికి, పేదరిక నిర్మలనకు దోహద పడుతుందని అంటుంది. ఒక మాటలో చెప్పాలంటే భూమి అమ్మకం- కౌలుకు ఎలాంటి విధానపరమైన, పాలనా పరమైన ఆటంకం వుండకూడదు.
మరి, అలా జరిగేందుకు సమస్య ఏమిటి అని ప్రశ్నించుకొని కొన్ని నిర్ధారణలు చేసుకుని భూర్పులను సూచించింది. ప్రపంచబ్యాంకు నివేదిక మూడు ప్రధాన రంగాలలో ొమార్పును కోరుతుంది. ఇవి. 1. భూ పరిపాలనలోని సాంకేతిక అంశాలు, 2. విధానాలు, 3. ప్రైవేటు భాగస్వామ్యం.
భూములు (హాయిగా) అమ్ముకోవా లంటే ఎలాంటి వివాదానికి ఆస్కారమివ్వని స్పష్టమైన యజమాన్య హక్కు (టైటిల్) వుండాలి. ఈ హక్కులను నిర్ధారించే రికార్డులు అస్పష్టంగాన, అగమ్యగోచరం గాన వున్నాయి. ఆ సమస్యను ముందుగా పరిష్కరించాలి. అందుకు మార్గం కంప్యూటరీకరణ/యంత్రీకరణ. రైల్వే కంప్యూటరు రిజర్వేషన్ ఫక్కీలో భూ రికార్డుల యంత్రీకరణ (ఆటో అప్‌డేషన్) జరగాలి. ప్రస్తుతం వున్న రిజిస్ట్రేషన్ స్టాంపు డ్యూటీని బాగా తగ్గించాలి (తద్వారా కొనుగోళ్ళు, అమ్మకాలు పెరిగి ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుందని ప్రపంచ బ్యాంకు అంటుంది). కావాలనుకుంటే ఆ నష్టాన్ని భూమి శిస్తు ద్వారా పూడ్చుకోవచ్చని నివేదిక చెపుతుంది.
భూమిని ‘సరుకు’గా మార్చడానికి (అమ్మకం-కౌలు) అడ్డంకిగా వున్న విధానాలు, చట్టాలను మార్చాలి. ఉదా హరణకి 9/77 చట్టం డిపట్టా భూములను, 1/70 చట్టం ఆదివాసీ భూముల అన్యా క్రాంతాన్ని, తెలంగాణా, ఆంధ్ర కౌలు చట్టాలు స్వేచ్ఛా కౌలును, భూ సంస్కరణలు, పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టాలు ఒక పరిమితిని మించి భూములను కలిగి వుండడాన్ని అనుమతించవు. అదేవిధంగా భూమి హక్కులకు సంబంధించిన కొన్ని సాంప్రదాయ హక్కులు, వాటికి లభించే న్యాయపరమైన రక్షణ (ఉదాహరణకు స్వాధీన, అనుభవహక్కు)లు కూడా ఇందుకు ఆటంకం.
సూటిగా, సంక్షిప్తంగా చెప్పాలంటే అనుమానానికి, అభద్రతకు వీలులేని యజమాన్య (టైటిల్) హక్కుల నిర్ధారణ, స్వేచ్ఛగా కొనడం, అమ్మడం, కౌలు (లీజు)కు ఇచ్చుకునే అవకాశం వుండాలి. తద్వారా భూమి అంగడిలో ఒక సరుకుగా మారుతుంది.
ఇక ఆఖరుది భూ పరిపాలనలో ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యం వుండాలి. సర్వే, భూమి రికార్డుల నిర్వహణ వంటి అంశాలలో కొత్త సాంకేతిక పద్ధతులు తేవడంతో పాటు వాటిని తెచ్చి, నిర్వహించే ప్రైవేటు సంస్థలను గుర్తించాలి. ఒకవేళ అటువంటివి లేకపోతే ప్రభుత్వమే శిక్షణ ఇచ్చి అవి ఏర్పడేందుకు ప్రోత్సహించాలి.
ఈ నివేదికలో ఉపయెగించిన భాషా, సాంకేతిక పదాలు భూ పరిపాలనలో రావలసిన మార్పుల సూచనలు కోనేరు రంగారావు కమిటీ నివేదికలో కూడా మనకు కనిపిస్తాయి.
నిజామాబాద్ జిల్లాలలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన భూ భారతి (దాన్ని రాష్ట్రం అంతా విస్తరిస్తామని రెవెన్యూ మంత్రి ప్రకటించి వున్నారు) జిల్లా కలెక్టరు కార్యాలయలు, సబ్ రిజిస్ట్ట్రారు కార్యాలయలలో రికార్డుల కంప్యూటరీ కరణ, ఇందిరక్రాంతి పథం పేదరిక నిర్మలన సంస్థ – సెర్ప్‌లోని భూవిభాగం – ఇత్యాది కార్యక్రవలు ప్రపంచ బ్యాంకు నివేదిక చెప్పిన వ్యవస్థాగత మార్పులలో అంతర్భాగాలు. వీటికి నిధులు సమకూర్చేదీ వారే. విధాన/చట్టాల మార్పులు, ప్రైవేటు భాగస్వామ్యాన్ని వేగిరపర్చాలని వారు తొందరపెడుతున్నారు. పాలనాపరమైన నిధుల అవసరాలకు ”ప్రాజెక్టుల”తో వచ్చే వారికి ఈ విషయమై ”టార్గెట్స్” పెట్టాలని నివేదిక బ్యాంకుకు నర్మగర్భంగా సచించింది.
గతంలో సామాజిక ఉద్యమకారులు ‘దున్నేవాడిదే భూమి’ అన్నారు. నేడు ప్రపంచబ్యాంకుకు అప్పు పడ్డ ప్రభుత్వాలు మాత్రం ‘కొనేవాడిదే భూమి’ అంటున్నాయి. భూసమస్యను పరిష్కరించేది సామాజిక శక్తులా! మార్కెటు శక్తులా! చరిత్ర ఇవ్వవలసిన జవాబు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
భూముల విషయంలో ప్రపంచ బ్యాంకు సూచించినా సూచించకున్నా స్పష్టమైన టైటిల్ ఉండాలి. సాంప్రదాయక హక్కుల గుర్తింపును చట్టాలలో పొందుపరచాలని మనం డిమాండ్ చేయవచ్చు. మన రైతులు అప్పుల్లో కూరుకు పోవడానికి కారణం సంస్థాగతంగా అప్పులు పుట్టకపోవడమేనని ఎవరైనా ఒప్పుకుంటారు. బ్యాంకులు రుణాలివ్వలంటే స్పష్టమైన టైటిల్ ఉండాలి. సమగ్రమైన, స్పష్టమైన సమాచారం లేకుంటే లిటిగేషన్లకు మాఫియాలకు అవకాశం ఉంటుంది. దానికి కంప్యూటరైస్డ్ డేటాబేస్ ఉపయోగించుకొంటేనే మంచిది. ప్రపంచ బ్యాంకు సూచించే తిరకాసులను మాత్రం అర్ధం చేసుకోవలసిందే. అవసరమైతే వ్యతిరేకించల్సిందే.