భారతదేశ ఆర్ధిక వృద్ధి, పేదరిక నిర్మూలనకు అనుసరించదగిన భూవిధానాలు పప్రంచబ్యాంకు- అధ్యయన కమిటీ సూచనలు

భూమి సమస్యను అధ్యయనం చేసి, సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారాలకు సూచనలు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ఒక అధ్యయన బృందాన్ని నియమించింది.భూ సమస్యలను విస్తృతంగా, లోతుగా ఈ బృంద నివేదిక చర్చించి ప్రపంచ బ్యాంకుకు పలు సూచనలు చేసింది. ఈ సూచనల సారాంశాన్ని పాఠకులకు ఇస్తున్నాం.
తాను అందచేస్తున్న నిధులు ఎలా ఖర్చు చేయలి, ఎలాంటి ప్రాధాన్యతలు పాటించాలో ఈ అధ్యయన కమిటీ ప్రపంచ బ్యాంకుకు చెపుతోంది. సటిగా చెప్పాలంటే ఈ అధ్యయన సచనలను నిర్ధిష్ట కాలపరిమితితో పూర్తి చేయడానికి ఆసక్తి చూపే రాష్ట్రాల ప్రాజెక్టులను మాత్రమే ప్రపంచ బ్యాంకు ఆమొదించాలని ఈ కమిటీ చెపుతోంది. కమిటీ సంక్షిప్త సూచనలలో మూడు భాగాలు వున్నాయి. అవి 1.సమస్య, 2.ప్రతిపాదించిన కార్యాచరణ, 3. సచిత సమయం. కమిటీ పేర్కొన్న సమస్య, సూచన, పరిష్కార ప్రాధాన్యతను యధా తధంగా ఇచ్చి, వాటికి అనుబంధంగా ఇచ్చిన ఉప సూచనల సారాంశాన్నిచ్చాం. భూ సమస్యలపై పనిచేసే సామాజిక కార్య కర్తల అవగాహనకు ఇది ఉపకరిస్తుందని భావిస్తున్నాం.
ప్రపంచబ్యాంకు అధ్యయన బృందం పేర్కొన్న సమస్యలు, చేసిన సూచన, ఉప సూచనలను చర్చించే ముందు ొభూములకు సంబంధించిన రికార్డుల గురించి కొంచెం తెలుసుకోవాలి.
భూములకు సంబంధించిన రికార్డులను రాత పూర్వక, రేఖారికార్డులుగా వర్గీకరించవచ్చు.
మొదటివి భూమి స్వభావం, వర్గీకరణ తెలిపేవి. అంటే సర్వే నెంబరు, విస్తీర్ణం, మెట్టు (కుష్కి), పల్లం (తరి/వగాణి), అది ప్రభుత్వ భూవ? ఇనావ లేక ప్రైవేటు (పట్టా) భూమా?, పట్టా, ఇనాందార్ల వివ రాలు వంటి సమాచారాన్ని ఇవి తెలియ చేస్తాయి. ఇవి రాత రూపంలో గాని లేదా అచ్చు రూపంలో గాని వుండవచ్చు.
రెండవ  రకం  రికార్డులు  భూమి ఆకారం, భౌతిక స్థితి తెలిపేవి. భూమి ఎకడ వుంది, వైశాల్యం / విస్తీర్ణాన్ని కొలతలు వేయడానికి ఉపయెగపడే సమాచారం వీటిల్లో లభిస్తాయి. వీటిని రేఖా (సర్వే) రికార్డులు అనవచ్చు. తెలంగాణలో నక్ష, టిప్పన్‌, ఆంధ్రాలో ఎఫ్‌.ఎం.బి., గ్రామ పటం అని పిలుస్తారు.
ఈ రెండు రికార్డుల పరిస్థితి, వాటి మధ్య వున్న తేడాలను గురించి మూడు ముఖ్యమైన సమస్యలను, సూచనలను నివేదిక పేర్కొంది. అవి ఈ విధంగా వున్నాయి.
భూమి రికార్డుల సమస్య:
రాత రూపంలో వున్న భూమి రికార్డు లను కంప్యూటరీకరించినా అవి ఆచరణలోకి రావట్లేదు.
ప్రతిపాదిత కార్యాచరణ: రికార్డుల కంప్యూటరీకరణను విస్తరింప చేసి వాటిని సమన్వయపరచాలి. పూర్తిస్థాయిలో వినియెగంలోకి తేవాలి.
కాల పరిమితి : స్వల్పకాలికం

సూచనల సారాంశం: ొభూ పరిపాలనలో రావలసిన విధాన ొమార్పుల గురించి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు స్పష్టత లేదు. అందుచేత మార్గదర్శకాలను రూపొందించ లేకపోతుంది, కనీసం పౖెెలట్‌ ప్రాజెక్టులకు సహితం ముందస్తు ప్రమా ణాలు, షరతులను రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పలేకపోతుంది. దానిని నివారించడానికి నిపుణులతో కమిటీ వేయలి.
భూమి  రికార్డులలో  అచ్చు (ప్రింటింగు), రాత (చేతితో రాసిన), రేఖా చిత్రాల (ొభూమి కొలతల పటాలు, గ్రామ పటాలు వగైరా)కు చెందిన రికార్డులు వుంటాయి. వీటన్నింటినీ కంప్యూటర్లలోకి ఎక్కించే పనికి ప్రపంచబ్యాంకు నిధులు అందచేస్తుంది. ఈ విధంగా కంప్యూటరీ కరించిన రికార్డులను ఉపయెగించడం ఒకదానితో మరొకదాన్ని అనుసంధానం చేయటం జరగటం లేదు.
సమస్య: భూమి ఉన్న ప్రాంతాన్ని వైశాల్యాన్ని సచించే రేఖా చిత్రాలు సమగ్రంగా లేవు. అలాగే వాటికీ, రాతపూర్వక రికార్డులకీ తీవ్రంగా, విస్తృతంగా వున్నదీ విధాన నిర్ణేతలకు అవగాహనలేదు.
ప్రతిపాదిత కార్యాచరణ : ప్రస్తుతమున్న సమాచారానికి ఉపగ్రహ ఛాయచిత్రాలను జోడించి రాష్ట్ర వ్యాప్తంగా భూమి పటాల సూచికను తయరు చేయలి.
కాల పరిమితి: స్వల్పకాలికం నుండి మధ్య కాలికం
సూచనల సారాంశం : భూమి రికార్డులలో సమాచారానికి, భూమి పైన వాస్తవ పరిస్థితులకు గల తేడాలకు రిజిస్ట్రేషన్‌ ఫీజు అధికంగా వుండటం ఒక కారణం. అందుచేత రిజిస్ట్రేషన్‌ ఫీజు తగ్గించి, భూమి శిస్తును వసూలు చేయలి. దీనివల్ల అమ్మకాలు, కొనుగోళ్లు, తనఖాలు, కౌలు రిజిస్టరవుతాయి. తద్వారా భూ యజ మాన్యంలో వచ్చే మార్పులు నవెదు (రికార్డు) వీలవుతుంది.
విస్తీర్ణం చూపే రికార్డులకు, ఇతర రికార్డులకు, ఉపగ్రహ చిత్రాలు అందచేస్తున్న చిత్రాలకు మధ్యగల తేడాల పరిష్కారానికి నూతన సాంకేతిక పద్ధతులను ఉపయె గించాలి. ఖర్చులు రాబట్టుకోవడానికి వినియెగదారుల నుండి వినియెగ చార్జీలు వసలు చేయవచ్చు.
సమస్య : భూమికి సంబంధించిన వివిధ రకాల రికార్డుల మధ్య పొంతన కుదర్చడం, వాటిలో మార్పులు చేర్పులు సరిగ్గా నవెదు చేయడం జరగటంలేదు.
ప్రతిపాదిత కార్యాచరణ : రికార్డుల మధ్య సమన్వయం సాధించేదిశగా కొన్ని నమూనా (పైలట్‌) ప్రాజెక్టులను విస్తృత పరచటానికి, ఇతరులకు వాటిని అందచేయడానికి కావలసిన నిబంధనలను రూపొందించాలి.
సమయం: స్వల్పకాలికం నుండి మధ్యకాలికం.
ొసూచనల సారాంశం : ప్రజలకు భూమి రికార్డులు అందుబాటులోకి రాకపోవడం వల్ల కూడా వాటిలోని తప్పులను గుర్తించి సరిదిద్దటం జరగటంలేదు, దానివల్ల వాటి విశ్వసనీయత దెబ్బతింటుంది. అలాగే భారతదేశ పరిస్థితులకు తగిన సర్వే పద్ధతులు, వాటి ఖర్చుపై సరైన అవగాహన, అంచనాలు లేవు. వీటికోసం నమూనా (పైలట్‌) ప్రాజెక్టులు చేపట్టాలి. భూమి రికార్డులకు, రిజిస్ట్రేషన్‌లకు పొంతన ఉండట్లేదు. వీటిని సమన్వయపరచటానికి కావల్సిన వ్యూహాన్ని నిర్ణయించుకోవాలి.
భూమి హక్కులు
సమస్య : అవకాశాలు అందుబాటులో లేని ప్రజల భూమి హక్కులు అస్పష్టంగా ఉండటం, వాటిని సాధించుకోలేకపోవడం.
ప్రతిపాదిత కార్యాచరణ : ఉన్న చట్టాలను గురించి ప్రచారం, అవసరమైన చోట ఉన్న అవకాశాలపై స్పష్టత తీసుకురావడం లేదా వారికి ఉన్న హక్కులను గుర్తించడం.
సమయం : స్వల్పకాలికం నుండి మధ్యకాలికం.
సూచనల సారాంశం : హింద వారసత్వ చట్టానికి 2005లో తెచ్చిన సవరణ, స్త్రీలకు వారసత్వ ఆస్తి హక్కును గుర్తించినా, వారిలో చైతన్యం లేకపోవడం వలన దాని ఫలితాన్ని పొందలేకపోతుంది. రెవెన్యూ భూముల స్వాధీనం కలిగి వున్నప్పటికీ ఆదివాసీలు, ఇతరుల హక్కులు గుర్తించబడలేదు. ఇందుకు చట్టాలపై అవగాహన కల్పించాలి.
ఆదివాసీలకు వ్యక్తిగత హక్కులు గాక, ఒక సమూహంగా ఉమ్మడి హక్కులు ఇవ్వ వచ్చని, దీనివల్ల ఖర్చు కూడా తగ్గు తుందని అధ్యయన బృందం అభిప్రాయ పడింది. ఇలా అంటనే పెద్ద ఎత్తున భూముల వివరాలు ఎప్పటికప్పుడు నవెదు గాకపోవడం, రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం తో ొభూమి విలువ తగ్గిపోవడం, లీజు (కౌలు/అద్దె) ొమార్కెట్‌కు భూమి సరఫరా తగ్గి పోతుందని కూడా అంటున్నది.
పేదలకు భూమి
సమస్య: ొభూమిని ొమార్కెట్‌లోకి రానివ్వ కుండా అడ్డుకుంటున్న పరిమితుల వల్ల పేదలకు భూమి అందుబాటులోకి రాకుండా పోతుంది. అది ఉత్పత్తిని దెబ్బతీయడంతో బాటు, మహిళలపై ప్రతికూల ప్రభావాన్ని ొచూపుతుంది.
ప్రతిపాదిత కార్యాచరణ : ొభూమిని కౌలు (లీజు)కు ఇచ్చేందుకు గల పరిమితులను, భూమి అమ్మకం మార్కెట్ల ఏర్పాటుకు గల అడ్డంకులను తొలగించి, వాటిని అభివృద్ధి చేయలి.
సమయం : స్వల్పకాలికం నుండి మధ్యకాలికం.
సూచనల సారాంశం : భూసంస్కరణల చట్టాలు, కౌలుదారీ చట్టాలు ఇక ఎంత మాత్రం పేదలకు భూమిని అందించలేవు. సరికదా అవి భూ మార్కెట్ల ఏర్పాటుకు అడ్డంకిగా వున్నాయి. కాబట్టి వాటిని రద్దుచేయలి. అంతేగాక భూసంస్కరణల చట్టాల ద్వారా లబ్ధిదారులకు లభించిన ొభూమిని లీజుకు ఇచ్చుకునే అవకాశం వుండాలి. భూ యజవని – భూమి కావలసినవారు సంప్రదించుకొని క్రయ విక్రయలు జరుపుకోవాలి. అంతేగాక భూ సేకరణ చట్టం ప్రయెగించి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోకూడదు. ఇందుకు ఆ చట్టాన్ని సవరించాలి.
ఆదివాసీ భూ సమస్య
సమస్య : ఆదివాసీల భూపరాయీకరణపై వున్న నిషేధం నిరుపయెగం.
ప్రతిపాదిత కార్యాచరణ : ఈ చట్టాలకు తోడు భద్రతను మెరుగుపరచాలి, పాలన వికేంద్రీకరణల వంటి ఇతర అవకాశాలను కూడా ఏర్పరచాలి.
సమయం: స్వల్పకాలికం నుండి మధ్య కాలికం
సూచనల సారాంశం : ఆదివాసీల చేతినుండి ఆదివాసేతరులకు భూమి వెళ్ళకుండా నిషేధాన్ని అమలుపరచడం ఖర్చుతో కూడినదే గాక, దాన్ని అమలుచేయడం కూడా కష్టం.
ఆదివాసీ ొభూ బదలాయింపు నిషేధం ‘సంరక్షణాతత్వం’. అది ొభూపరాయీకరణను ఆపలేదు, సుస్థిర ొభూ యజొమాన్యాన్ని, అభివృద్ధిని సాధించక పోవడమే గాక భూమిని సమర్ధవంతంగా ఉపయెగించ కుండా అడ్డుపడుతుంది.
‘సంరక్షణాతత్వం’ అంటే ఏమిటి? ఆదివాసీ లను పిల్లలుగాను ప్రభుత్వాన్ని తండ్రిగా భావించి వారిని సంరక్షించే బాధ్యత నెత్తికి ఎత్తుకోవడం. దీనివల్ల ఫలితం లేదని అధ్యయనం అంటుంది. ొభూమి అమ్ముకునే (బదలాయించే) హక్కును ఆదివాసీలకు వ్యక్తులుగా గాక, సమూహంగా ఇస్తే వారికి బాగా బేరవడే శక్తి లభించి ఎక్కువ ఫలితాన్ని పొందుతారని కూడా అంటుంది.
ఈ ఆరు ొసూచనలను కలిపి పరిశీలిస్తే మనకు తేలేదేమంటే,
1. భూమిని ఒక ొమార్కెట్‌ సరుకుగా మార్చాలి. అమ్ముకోవడానికి, కొన డానికి, లీజుకు ఇవ్వడానికి ఎటువంటి ఆటంకం లేకుండా వుండాలి.
2. ఇందుకు అవసరమైన మార్పులు చట్టాలు, నియవలు, పాలన పద్ధతులలో తీసుకురావాలి.
3. భూమి రికార్డులు, వాటిలో సమాచారం యవత్తు కంప్యూటరీకరణ చెంది, ఇంటర్నెట్‌ ద్వారా అందుబాటులోకి రావాలి.
4. ఈ విధమైన పద్ధతులను విధానాలుగా మార్చుకునే (రాష్ట్ర) ప్రభుత్వాలకు మాత్రమే భూకార్యక్రవలకు మాత్రమే ప్రపంచ బ్యాంకు నిధులు మంజూరు చేయలి.
ప్రైవేటు/ కార్పోరేట్‌ సంస్థలకు భూమి ఒక సరుకుగా అందుబాటులోకి రావాలన్నదే వీటి సారాంశం. అయితే ప్రైవేట్‌/కార్పోరేట్‌ అనే ొమాట వుండవలసినచోట పేదలు అనే మాటను వాడటమే ప్రపంచబ్యాంకు అధ్యయన బృందపు తమాషా!
ప్రపంచ బ్యాంకు నివేదికలో మన రాష్ట్ర వివరాలు
 మొత్తం రాష్ట్ర ఆదాయంలో భూమి శిస్తు ద్వారా వచ్చే ఆదాయ శాతం గణనీయంగా తగ్గిపోొతూ వస్తోంది. దీనివల్ల ొభూయజొమాన్యం వంటి విషయలలో ప్రభుత్వ శ్రద్ధ తగ్గిపోతోంది.
  1957-58 1970-71 1989-90
 ఆంధ్రప్రదేశ్‌ 28 17   1.1
 మొత్తం దేశం 30.03 13.52   1.67

భూ సంస్కరణల వల్ల ప్రభావితమైన ొభూముల, కుటుంబాల శాతం
 కౌలుదారీ సంస్కరణల వల్ల 0.75 శాతం జనాభాకి 3.48 శాతం సాగుభూమి సమకూరితే సీలింగు చట్టం వల్ల 3.81 శాతం జనాభాకి 8.34 శాతం ొభూమి సమకూరింది.

మన రాష్ట్రంలో గ్రామ నక్ష/పటాల పరిస్థితి
 గ్రామ నక్ష/పటాలు కమతాల రేఖాచిత్రాలు
 టిప్పన్‌ ఎఫ్‌.ఎమ్‌.బి. మొత్తం
మొత్తం 28400 37.17 లక్షలు 7.67 లక్షలు 84.85 లక్షలు
ఉపయెగకరంగా వున్నవి (శాతంలో) 62.19 49.39 78.89 65.96
చిరిగిపోయి/పాడయిపోయినవి 8.92 19.22 8.35 13.11
అందుబాటులో లేని/పోయినవి 28.89 31.40 12.76 20.93

భూ పరిపాలనా ఆధునీకరణ పరిస్థితి
 భూమి లావాదేవీల రిజిస్ట్రేషన్‌ కంప్యూటరీకరణ ప్రక్రియ పూర్తయ్యింది. ొభూమి రికార్డుల కంప్యూటరీకరణ అయ్యింది కాని వాడుకలో లేదు. 10 శాతం కన్నా తక్కువ గ్రామ నక్ష/పటం, టిప్పన్‌/ఎఫ్‌.ఎమ్‌.బిలకు డిజిటల్‌ ొరూపం ఇచ్చారు. సరైన సమాచారం లేని కారణంగా నగర/ఆవాస ప్రాంతాల సర్వే/ఆస్తుల కార్డుల జారీ జరగటం లేదు.

భూమి కౌలు (లీజు)లో పాల్గొంటున్న కుటుంబాల శాతం
  1971 1981 1991 2001
 ఆంధ్రప్రదేశ్‌ 21.66 16.35 16.5 16.58
 దేశం 25.81 18.45 13.27 11.57

 

ప్రపంచబ్యాంకు నిధులతో కొన్ని రాష్ట్రాలలో భూసర్వే నమూనా (పైలట్‌) ప్రాజెక్టులు జరుగుతున్నాయి. అందులో మన రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లా భభారతి ఒకటి. ఈ ప్రాజెక్టుల పరిశీలన నుండి అధ్యయన కమిటీ ఈ ొసూచనలు చేస్తుంది.
పై మూడు అంశాల విశ్లేషణ : ”ొభూమిని సులువుగా అమ్మి/కొనే, లేదా కౌలుకు ఇచ్చుకునే సరుకుగా ొమార్చాలన్నది ప్రపంచబ్యాంకు ప్రధాన ఆలోచన. మొత్తం సమాచారాన్ని ‘ఆన్‌లైన్‌’లో అందుబాటులోకి తేవాలంటే కంప్యూటరీకరణ చాలా అవసరం. కోనేరు రంగారావు కమిటీ కూడా ఇదే సూచించింది. రికార్డుల ‘ఆటో అప్‌డేషన్‌’ జరగాలని చెప్పింది. అంటే ఏమిటి? ఉదాహరణకు ఒక సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయం కంప్యూటరులో ొభూమి అమ్మకం నమొదు కాగానే, ఆటోమేటిక్‌గా మిగిలిన అన్ని రికార్డులలో మార్పులు రైల్వే రిజర్వేషన్‌ మాదిరిగా జరిగిపోవాలి. కంప్యూటరీకరణ వల్ల భూమి రికార్డుల సమాచారాన్ని ప్రపంచంలో ఎక్కడ వుండైనా తేలికగా చూసుకునే వీలు కలుగుతుంది. పేదలకు సమాచారం సులువుగా అందుబాటులోకి వస్తుందనే వాదనతో ప్రపంచబ్యాంకు రికార్డుల కంప్యూటరీకరణను దీనిని ముందుకు తోస్తుంది. అందుకు రాష్ట్రాలకు నిధులు (అప్పులు) కూడా అందచేస్తుంది. దీనివల్ల కంప్యూటర్లు, ఆన్‌లైన్‌ (ఇంటర్నెట్‌) ద్వారా వ్యవహారాలు నడిపే కార్పోరేట్‌ సంస్థలకు మాత్రం సమమాచారం అందుబాటులోకి వస్తుందనేది నిజం.
 ఈ విధమైన ఫలితాలు సాధిస్తారనే నమ్మకం కలిగించే రాష్ట్రాలకే నిధులు ఇవ్వాలని ప్రపంచబ్యాంకు అధ్యయన బృందం అంటుంది
భూస్వాములు, ధనిక రైతుల వద్ద వున్న భూములను స్వాధీనం చేసుకొని పేదలకు పంచడం, వారి వద్ద కౌలుదార్లుగా వున్న పేద రైతులకు రక్షణ కల్పించడం ద్వారా పేదలకు ొభూములు రావని, ొమార్కెట్‌లో భూమిని ఒక సరుకుగా ొమారిస్తే (అంటే అమ్ముకునే, కొనుక్కునే, లీజుకు తీసుకునే) పేదలకు భూమి లభిస్తుందని అధ్యయన బృందం అంటుంది. ఈ విధంగా చేయడానికి చట్టపరంగా వున్న అన్ని అడ్డంకులను తొలగించాలనేది వారి సూచన. అన్ని రకాల ొభూములు (పట్టా, ఎసైన్‌మెంట్‌ అనే తేడా లేకుండా) స్వేచ్ఛగా ొమార్పిడి చేసుకునే వీలు కల్పించడం ద్వారా భూమిని ొమార్కెట్‌లో వస్తువులా మార్చవచ్చని తద్వారా పేదలకు భూమి/గరిష్టస్థాయిలో లబ్ధి చేకూరుతుందని అంటుంది.

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.