భూమిక సంపాదకులిద్దరికీ అభినందనలు.
జూలై సంచిలోని యాత్రానుభవాలు చాలా నచ్చింది. చదువుతున్నంత సేపు నేనే వెళ్ళి చూస్తున్నట్లు అనిపించింది. నేనూ ఎప్పుడెప్పుడు వెళ్దామానిపించింది. కళ్ళుకు కట్టినట్లు రాసారు. చాలసార్లు అహోబిలం వెళ్ళాను కాని ఎప్పుడు ఉగ్ర నరసింహస్వామి దాకా కొండపైకి ఎక్కలేదు. ఇప్పుడు మాత్రం తప్పకుండా వెళ్ళాలని చాలా కుతూహలంగా ఉంది. బండలు కిందికి దొర్లడం, పారుతున్న సెలయేరు. చూడాలన్న ఆశ. కాని అంత ఎత్తు ఎక్కగలనా లేదా అని చిన్న సందేహం. ప్రశాంతి గారిలా నన్నెవరు ఎక్కిస్తారో చూడాలి.
– శ్రీలలిత, హైదరాబాద్.
……..ఙ……..
ఎడిటర్‌కి,
రెండు చేతులు కలిస్తే చప్పట్లు అలాగే ఉంది భూమిక పరిస్థితి అందరితోటి శబాష్ అనిపించుకునేలా రూ. 10లకు తీసుకు వస్తూ రెండు తెలుగు రాష్ట్రాలల్లోని అన్ని మాస పత్రికలకు ఎంతో కొంత నేర్చుకునేలా! ఆ పత్రికల్లో లేని, వాటిని సరిదిద్దుకునేలా అన్ని మాస పత్రికలకు తల మాణికంగా భూమికను తీర్చిదిద్దుతున్నందుకు సంపాదక వర్గానికి కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. జులై నెలలోని భూమిక నిజమైన వర్షంలో పాఠకులను తడిపి ముద్ద ముద్ద చేసేసింది. ఇప్పుడు విద్యా సంవత్సరం మొదలవుతుంది ఎక్కడ ఏ లైబ్రరీలో ఏ విద్యార్థి చేతికి భూమిక అందినా ఇక జీవితాంతం భూమికను వదలద్దు, చదవాలి అనుకునేలా ఉంది ఈ నెల భూమిక. మొట్ట మొదట సంపాదకీయంలో మీరు పాటించిన రాజనీతి నిజంగా ప్రభుత్వాలను, అటు, ఇటు ఆలోచిస్తూ సందిగ్దంలో ఉండే వాల్లను ఒక నిర్ణయానికి వచ్చేలా ఉంది. అధికారంలో భాగమయ్యాక మనుషుల మాటలెలా మారిపోతాయో, రాజ్య విధానం ఎటువైపు మొగ్గు చూపుతుందో, స్త్రీ లోకానికి చాటి చెప్పారు. (ప్రపంచానికి) గీతక్కకు వ్రాసిన ఉత్తరం, స్త్రీ వాదం అంటే చిన్న చూపు చూసే వారికి, స్త్రీ వాదం ఇప్పుడు రాబోవు తరాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఒక తోటి రచయిత్రిని ఎలా ఆకళింపు చేసుకొని మరలా గీతక్కకు కవిత్వం వ్రాయాలనిపించేలా వ్రాసిన శిలాలోలిత గారికి నమస్కారాలు,
పిల్లల భూమిక, పిల్లలా వీల్లు రాబోవు తరాలకు దివ్వెలు అనుకునేలా వ్రాసిన పిల్లలకు ఆశీస్సులు.
నిజాన్ని నిజాయితీగా, బిగ్గరగా చెప్పడమే మనం చేయాల్సింది అన్న ”రోజా లగ్జంబర్”ను గుర్తుకు తెచ్చేలా ఉన్నాయి.అన్ని విషయాలు.
– కలన, హైదరాబాద్.
……..ఙ……..
జూన్ సంచికలో సమస్య పరిష్కారం కథలో సమస్యని చాలా చక్కగా కాచ్ చేసారు. నేటి తరం ఆడపిల్లలు ఎదుర్కొంటున్న పెద్ద విషమ సమస్యకి అద్దం పట్టారు మీ కథ ద్వారా. ఈ విషమ పరిస్థితి నించి బయటపడాలంటే మీరు సూచించిన మార్గమొక్కటే శరణ్యం. ధన్యవాదాలు
– గంటి సుజల, ఇమెయిల్
……..ఙ……..
భూమిక ఎడిటర్స్‌కి,
జూలై సంచికలోని రత్నమాల గారి కథ సాధికారతలో బుజ్జమ్మలా స్త్రీలు మారగలిగితే ఎంత బాగుంటుంది అనిపించింది. అలాగే ప్రశాంతి వానా వానా వల్లప్పా చదువుతుంటే – ఒకసారి ఢిల్లీలో షాపింగ్‌కి వెళ్ళి రిటర్న్‌లో ఆటో ఎక్కాం. మధ్యలో వర్షం. ఆటో ఆగిపోయింది. అలాగే వానలో ఉరుములు, మెరుపుల మధ్య తడుస్తూ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు నేను పొందిన అనుభూతి మళ్ళీ ఫీలయ్యాను. థాంక్యూ భూమిక.
– పి అనురాధ, వైజాగ