-అనామిక
గుండెకి పడ్డ చిల్లులకీ
మాటలతో చీరుకుపోయిన గాయాలకీ
నాకు నేనుగానే లేపనం రాసుకోవాలి.
నాకెన్నడూ పూలు కానుకగా రాలేదు.
మామూలు మాటలని కూడ
తీవ్ర స్వరంలో ఉచ్ఛరిస్తేనే కాని పైశాచికానందం పరాకాష్టనంటదు.
ముద్దివ్వమనడం కూడ ముటముటలాడుతూనే అడుగుతాడు.
ప్రతీరాత్రి ఎవరో ఒకరు తగవుపడుతూనే వుంటారు.
రాత్రనే కాదు పగలనీ కాదు
చేయని నేరాలకు తల దించుకుంటూనే వుంటాను
అనునిత్యం మాటలు పడుతూనే వుంటాను
అయినా….
నాకెన్నడూ పూలు కానుకగా రాలేదు…
కనురెప్పల మాటున దాచుకున్న ఉప్పెనలని
ఆపి ఆపి గొంతు నరాలు తెగిపోతున్నాయి…
ఎప్పుడో గుండె పగిలే తీరుతుంది
మృత్యువు నన్ను ముద్దాడుతుంది
అయినా సరే….
నాకు పూలు కానుకగా రావు.
పశ్చాత్తాపమనే పదానికితడి నిఘంటువులో చోటులేదు.
కవిత హ్రుద్యం గా వుంది.కవితా శైలి అద్భుతం గా వుంది.