వివిధ జెండర్‌ అస్థిత్వాలూ ఒక వాస్తవమే -పి. ప్రశాంతి

ఇంటిముందు పార్కులో పున్నాగ చెట్టు క్రింద తలపట్టుకుని కూర్చుంది మోహన. చల్లటిగాలి శరీరాన్ని తాకుతున్నా సాంత్వనగా లేదు. కళ్ళల్లో నీళ్ళు చెంపలమీదుగా కారిపోతున్నా చలనం లేకుండా కూర్చుంది. ఉరుములు, మెరుపులతో వర్షం మొదలయ్యే సరికి పెద్ద గొడుగుతో

పరిగెత్తుకొచ్చి మోహన పైన వర్షం పడకుండా గొడుగు పట్టుకొని నిలబడ్డాడు ఆనంద్‌. ‘ఎందుకిలా చేశావు?!’ ఉన్నట్టుండి అడిగింది మోహన. ‘సారీ రా’ అంటూ ఏడ్చేశాడు ఆనంద్‌. కొద్ది సేపు మౌనంగా ఉన్న మోహన ‘తెల్లారాక మాట్లాడు కుందాం, పద’ అంటూ ఆనంద్‌ చేతిని తన చేతిలోకి తీసుకుంది. ఆనంద్‌ ఏడుపు ఉధృతి ఆ చేతిని అలాగే పట్టుకుని కూర్చుంది. తర్వాత లేచి ఇంట్లోకెళ్ళారు.
పొద్దున ఎనిమిదవుతుండగా మెలకువ వచ్చింది ఆనంద్‌కి. టైమ్‌ చూసుకుని ఒక్కుదుటున లేచి కూర్చున్నాడు. బెడ్రూంలోంచి బైటికొచ్చాడు. మోహన రెడీ చేస్తుంటే మూడేళ్ళ చైతూ సంబరంగా చూస్తున్నాడు, మధ్యమధ్యలో మోహన ముఖాన్ని చేతుల్లో తడుముతూ. రోజూ ఆ పని ఆనంద్‌ చేస్తాడు మరి. సైలెంటుగా అక్కడ్నుంచి వెళ్ళిపోయి బ్రష్‌ చేసుకుని ఫ్రెష్‌ అయ్యేసరికి మోహన చైతూకి టిఫిన్‌ తినిపిస్తోంది. కిచెన్‌లోకి వెళ్ళి రెండు కప్పుల్లో కాఫీ కలుపుకు వచ్చాడు ఆనంద్‌.
‘ఆఫీసుకి సెలవు పెట్టాను. వీడ్ని డ్రాప్‌ చేసి వస్తాను. నువ్వు కూడా ఫ్రీ చేసుకో’ అని పొడిపొడిగా మాట్లాడ్తున్న మోహన వైపు సూటిగా చూడలేక తలొంచుకుని ‘అలాగే’ అన్నాడు ఆనంద్‌. లోపల మాత్రం ఏం జరగబోతోంది, మోహన ఏం చెయ్యబోతోంది, తనేం చెయ్యాలి… అనే ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి.
మోహన, ఆనంద్‌లది కులాంతర ప్రేమ వివాహం. వయసులో ఇద్దరికీ పెద్ద తేడా లేదు. డిగ్రీ చదువు తుండగా పరిచయమయ్యారు. పీజీ పూర్తయిన ఏడాది లోపే ఇద్దరూ ఉద్యోగాల్లో చేరారు. ఇరువైపుల పెద్దల అంగీకారంతో ఇరు కుటుంబాలు, స్నేహితులు, శ్రేయోభి లాషుల సమక్షంలో దండలు మార్చుకుని ఒక్కటయ్యారు. పెళ్ళై ఆరేళ్ళవుతోంది. ఇద్దరూ ఎప్పుడూ సరదాగా
ఉంటారు. బంధువుల్లో, స్నేహితుల్లో అందరూ వీళ్ళిద్దర్నీ అన్ని విషయాల్లోనూ ఆదర్శంగా తీసుకుం టుంటారు. ఇంట్లో కానీ, బయట కానీ… వారిద్దరి మధ్య హెచ్చు తగ్గుల్లేవు, అభిజాత్యాలు లేవు. అన్ని పనులు ఇద్దరూ కలిసి చేసుకుంటారు. వారాంతాలు ఇంటి పట్టున
ఉండనే ఉండరు. ఇద్దరూ భార్యాభర్తల్లా కంటే గాఢస్నేహి తుల్లా ఉంటారు కొడుకంటే ప్రాణం ఇద్దరికీ. వారాం తాల్లో మాత్రం వాడు అమ్మమ్మ ఇంట్లోనో, నానమ్మ ఇంట్లోనో… అది వాడికెంతో ఇష్టం.
గత ఏడాదిగా ఆనంద్‌ ప్రవర్తనలో ఎక్కడో కాస్త తేడా అనిపిస్తోంది మోహనకి. అది తనపట్ల ఆనంద్‌ చూపించే గాఢతలో… వారాంతాల్లో అప్పుడప్పుడూ పాత ఫ్రెండ్స్‌ని కలుస్తున్నాననో, అనుకోకుండా ఆఫీస్‌ పని పడిరదనో, ఎక్కడ్నించో ఎవరో ఫ్రెండ్‌ వచ్చాడు కలిసొ చ్చేస్తాననో చెప్పి పొద్దునెళ్ళి సాయంత్రం ఎప్పుడో రావడంలో కనిపిస్తోంది. తన ఆలోచన తప్పేమో అనుకున్నా సరిపెట్టుకోలేకపోతోంది. ఒక శనివారం అలాగే ఆనంద్‌ బైటికెళ్ళిపోయాక కజిన్స్‌ ఫోన్‌చేస్తే లంచ్‌కి పోదాం అని అందరూ శివారుల్లో ఉన్న రిసార్ట్‌కి వెళ్ళారు. జోక్స్‌, టీజింగ్స్‌తో అల్లరల్లరి చేస్తున్నారు. మోహన అత్తగారు ఫోన్‌ చేస్తే మాట్లాడుతూ బైటి కొచ్చింది. దూరంగా పార్కింగ్‌లో ఆనంద్‌, ఇంకో స్నేహితుడితో మాట్లాడుతూ కనిపించాడు. ఫోన్‌ పెట్టేసి పిలుద్దామనుకునేలోపు వారి సన్నిహితపు చర్యలు ఎబ్బెట్టుగా అనిపించి ఆగిపోయింది. కజిన్స్‌తో కాస్త ముభావంగా గడిపి తొందరపెట్టి ఇంటికొచ్చేసింది.
సాయంత్రం ఇంటికొస్తూనే ఆనంద్‌ ‘హేయ్‌ మోనా, మీరంతా లంచ్‌కి ఎక్కడికెళ్ళారు? మేము ఒక రిసార్ట్‌ కెళ్ళాం. చాలా బావుంది…’ అని ఉత్సాహంగా చెప్పుకు పోతున్నాడు. సడన్‌గా మోహన ‘రిసార్ట్‌ బాగుందా? ఫ్రెండ్‌తో బాగుందా?’ అనేసరికి ఆనంద్‌కి ఒక్క క్షణం ఏమీ తోచలా. తేరుకుని ‘ఫ్రెండ్‌తో రిసార్ట్‌కి వెళ్ళడం బాగుంది’ అంటూ గట్టిగా నవ్వేసి ‘ఈసారి మనం వెళ్ళాల్సిందే’ అన్నాడు. ఏదో అనబోయి తమాయించు కొంది మోహన. తనకే స్పష్టంగా లేనప్పుడు మాట్లాడొద్దు అనుకుంది.
ఇంకోసారి కూడా ఒక హోటల్‌లో ఇలాంటిదే ఎదురైంది. మరోసారి ఏజెన్సీ పార్ట్‌నర్స్‌తో వీకెండ్‌ పార్టీకి తప్పకుండా వెళ్ళాలని వెళ్ళాడు. ఎలాగూ తను
ఉండట్లేదు కదా అని కొడుకుని తీసుకుని తను కూడా ఒకరోజు అత్తగారింట్లో ఉండొస్తానని చెప్పింది. ‘సో హ్యాపీ’ అన్నాడు ఆనంద్‌. ఆదివారం రిటర్న్‌లో పికప్‌ చేసుకుంటానన్నాడు. కొడుకు అల్లరి చేస్తున్నాడని ఆదివారం పార్కుకి తీసుకెళ్ళి అట్నుండి ఇంటికొచ్చేసింది. పార్క్‌నుంచి బయల్దేరే ముందు ఆనంద్‌కి మెసేజ్‌ చేసింది తను ఇంటికెళ్ళిపోతున్నానని.
బెడ్రూం తలుపు తెరవగానే గుప్పున పెర్‌ఫ్యూమ్‌ వాసనొచ్చింది. ఫ్రెష్‌గా వాసనొస్తోందేంటా అని ఆశ్చర్యపోయింది. ముందు రోజు తను వెళ్ళేముందు మార్చిన బెడ్‌షీట్‌ నలిగి ఉంది. జాగ్రత్తగా సర్దినట్లుగా అర్థమైపోతోంది. బాత్రూం డోర్‌ తెరిచింది. అక్కడక్కడా తడితడిగా ఉంది. కోపంగా, చిరాగ్గా, అసహనంగా
ఉంది. ఫ్యాన్‌ వేసి ఫుల్‌ స్పీడ్‌ పెట్టింది. మంచం కింద నుంచి ఏదో చిన్నగా ఎగిరి ఇవతలికొచ్చినట్లనిపించి వంగి చూసింది. కండోమ్‌ రేపర్‌ ముక్క. షాకయ్యి అక్కడే కూలబడిరది. రెండు మూడుసార్లు ఎదురైన సంఘటన లు కళ్ళముందుకొచ్చాయి. ఆనంద్‌ ఇంకో ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాడని అర్థమైంది. కానీ అది ఒక పురుషుడి తో అనేది జీర్ణించుకోలేకపోతోంది. అది నిజం కాదేమో అన్న అనుమానం కూడా ఒక పక్కన ఉంది. కానీ అది నిజాన్ని తను ఒప్పుకోలేనితనం వల్ల కల్పించుకున్న అనుమానం మాత్రమే అని తెలుస్తోంది. ఆనంద్‌తోనే తేల్చుకోవాలని నిర్ణయించుకుంది.
ఆ రోజు ఆనంద్‌ బాగా ఆలస్యంగా వచ్చాడు. అప్పటికే కొడుకుని నిద్రపుచ్చి హాల్లోనే టీవీ పెట్టుకుని కూర్చుంది మోహన. వస్తూనే మామూలుగా పలకరిం చడానికి చూశాడు ఆనంద్‌. అవకాశం ఇవ్వకుండా ‘అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు ఆనంద్‌? నీ ఫ్రెండ్‌ ఏ జెండర్‌?’ సూటిగా అడిగేసింది. ఖంగు తిన్నాడు ఆనంద్‌. ఇక దాచదల్చుకోలేదు. తలొంచుకుని ‘నేను బైసెక్స్యువల్‌ మోనా. ఇంటర్‌లో ఫ్రెండ్‌. బిజినెస్‌ మీద ఆ ఫ్యామిలీ సింగపూర్‌ వెళ్ళిపోవడంతో అక్కడే కట్‌ అయిపోయింది. కృంగిపోతున్న నాకు నువ్వు పరిచయమయ్యావు. నేను ‘గే’ అనుకున్నా. నీ పరిచయం, స్నేహంగా మారాక నాలో స్పందనలు మారాయి. మనస్ఫూర్తిగా వందశాతం నిన్ను ప్రేమిం చాను. ఇప్పటికీ అందులో ఏ మాత్రం తేడాలేదు. కానీ లాస్ట్‌ ఇయర్‌ మీ చెల్లి పెళ్ళికి వారం రోజులు నువ్వు ఊరెళ్ళిన టైంలో సడన్‌గా కలిశాడు. బిజినెస్‌ ట్రిప్‌లో వచ్చాడు. ఇన్నేళ్ళ తర్వాత కలవడంతో చాలా ఎగ్జైట్‌ అయ్యాం. వాడ్ని కలిసేవరకూ చాలా ఘర్షణ పడ్డాను. కానీ అటే మొగ్గింది మనసు. నేను బైసెక్స్యువల్‌ అని నిర్ధారించుకున్నాను. నీకు నేనేమీ అన్యాయం చేయను మోనా, ప్లీజ్‌’ అంటూ కాళ్ళ దగ్గర కూర్చుండిపోయాడు. ‘కానీ నేను నా పార్టనర్‌కి లాయల్‌గా ఉండాలని, నా పట్ల తను కూడా అలాగే ఉండాలని కోరుకుంటాను. నిన్ను అడ్డగించను. కానీ మనం విడిపోదాం లీగల్‌గా’ స్థిరంగా చెప్పింది మోహన. సర్దిచెప్పడానికి, ఒప్పించ డానికి ఆనంద్‌ చేసిన ప్రయత్నం ఫలించలేదు. ‘నీ రిలేషన్‌ని నా దగ్గర దాచి మోసం చేశావు. నాకు చాలా అవమానంగా అనిపిస్తోంది. మనిద్దరం భార్యాభర్తలుగా కలిసుండలేం. నీ రిలేషన్‌షిప్‌ని నేను అర్థం చేసుకుం టాను. విడిపోయి ఫ్రెండ్స్‌గా ఉందాం. దానిక్కూడా నాకు మెంటల్‌ స్పేస్‌ కావాలి. నన్ను ఒంటరిగా ఉండ నివ్వు కాసేపు’ అంటూ పార్కులోకెళ్ళి కూర్చుంది.
ఇద్దరూ చర్చించుకున్నారు, నిర్ధారించుకున్నారు. మాట్లాడుకున్నారు. చివరగా నిర్ణయించుకున్నారు. ఇద్దర్లో ఎవరూ ఎవర్నీ చిన్నబుచ్చుకోరాదని, రెస్పెక్ట్‌తో, డిగ్నిటీతో విడిపోవాలని, కొడుకు బాధ్యత ఇద్దరూ తీసుకోవాలని… ఆర్థిక లావాదేవీలన్నీ సెటిల్‌ చేసుకుని విడాకులకి అప్లై చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
వివాహేతర సంబంధాలు ఏర్పడకూడదన్న సమా జపు నియమాల్ని దాటుకొని వివిధ జెండర్‌ అస్థిత్వాలతో ఉన్న వ్యక్తుల మధ్య ఏర్పడే రిలేషన్స్‌ని అపహాస్యం చెయ్యకుండా అటువంటి సందర్భంలో హింసకి తావు లేకుండా డిగ్నిఫైడ్‌ సొల్యూషన్‌ని ఆలోచించలేమా? ఎంపథటిక్‌గా చూడలేమా? సమాజంలో అతి సహజం గా తరతరాలుగా ఉన్న ఈ సంబంధాల గురించిన చర్చ ఇప్పటి సందర్భంలో అత్యవసరం కాదా? సమాజపు అంచులకు నెట్టివేయబడుతున్న సెక్స్యువల్‌ మైనారిటీస్‌ పట్ల వివక్ష రహితంగా, హింస రహితంగా సమాజం స్పందించడమే అనేక రకాల లైంగిక దాడులకు సమాధానం కాదా??

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.