స్త్రీ
తరువాతి తరాన్ని నిలిపేది స్త్రీ
సమాజాన్ని ముందుకు నడిపేది స్త్రీ
ప్రేమానురాగాలు పంచేది స్త్రీ
అనేక పాత్రలు ధరించేది స్త్రీ
అందరి మంచి కోరేది స్త్రీ
అన్ని రంగాల్లో ముందుండేది స్త్రీ
అందరి సుఖం కోసం కష్టపడేది స్త్రీ
చిన్నపిల్లలకు అన్నీ నేర్పించేది స్త్రీ
పెద్దవాళ్ళని ఆదరించేది స్త్రీ
అటువంటి స్త్రీని మనం గౌరవిద్దాం
తనకు ప్రథమ స్థానాన్ని ఇద్దాం
` కె.లియా సుసన్న, 9వ తరగతి
అందానికి మారుపేరు అతివ
తన నడక హంస నడక
తన కళ్ళు మీన నేత్రాలు
తన మాటలు చిలుకపలుకులు
తన పాటలు కోయిల రాగాలు
తన నాట్యం మయూర నాట్యం
తన మోము చంద్రబింబం
తన నవ్వు లోకానికి వెలుగు
తన చేతులు ఇల్లంతా గలగలలు
తనకు ఈ లోకంలో ఎవరూ సాటిలేరు
తన అందానికి హద్దులు లేవు
అలాంటి మహిళలు గొప్ప మగువలు
` వి.రేష్మిత అఖిల, 8వ తరగతి,
ఓ వనిత! నీకు వందనం!
నీ కర్తవ్య నిర్వహణకు
నీ సహనశీలతకు
నీ ప్రేమానురాగాలకు
నీ శక్తిసామర్ధ్యాలకు
నీ ధైర్యసాహసాలకు
నీ ప్రతిభాపాటవాలకు
నీ ప్రేరణాత్మకమైన ప్రోత్సాహానికి
నీ ఆప్యాయత అనుబంధాలకు
నీ మంత్రాలోచనలకు
నీ వినయవిధేయతలకు
నీ మేధాశక్తికి
నీ జయాపజయాలకు
వందనం! పాదాభివందనం!
` ఎం.సాత్విక చౌదరి, 9వ తరగతి
సాటిలేని శక్తి
ఓ మహిళ
ఆటంకాలు వెళ్ళగొట్టి
విజయాలు తెచ్చిపెట్టి
చేతిలో చీపురు పట్టి
అదే చేతితో పెన్ను పట్టి
లోకానికి వెలుగు నిచ్చి
ప్రతి విషయంలో ఓర్పు ప్రదర్శించి
ప్రతి రంగంలోనూ రాణించి
క్షమతో ఉద్భవిస్తావు శక్తిగా
త్యాగంతో ఉద్భవిస్తావు ఆదిశక్తిగా
క్రోధంతో ఉద్భవిస్తావు మహాశక్తిగా
నీ శక్తికి ఎవరూ సాటిరారుగా
` జి.తేజ్ ప్రమోద్, 7వ తరగతి