‘మా నాన్నగారి మరణం వల్ల నా జీవితంలో ఏ లోటు ఏర్పడిరదో, ఆ లోటును నా జీవితంలో గురువులు పూడ్చారు. కానీ నా గురువులు నాకు దూరమైనప్పుడు కూడా నాకు నా తండ్రి దూరమైనంత వేదన కలిగింది’ అంటుంది లత. ఆ తరువాత మాస్టర్ వినాయక్ మరణంతో లతకు మళ్ళీ జీవిక కోసం పోరాటం ఆరంభించాల్సి వచ్చింది. శాస్త్రీయ సంగీతం నేర్చుకోవటం కన్నా సినీ సంగీతం పాడే విధానం నేర్చుకోవాల్సి వచ్చింది.
లత సినీరంగంలో ప్రవేశం గురించి, నిలద్రొక్కుకోవటం గురించి చర్చించేకన్నా ముందు ఒక అప్రియమైన, కానీ ఆవశ్యకమైన విషయం ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఆవశ్యకం ఎందుకంటే, లత మరణం తరువాత, తెలుగుతో సహా అన్ని భాషల మీడియాలు లత కళ కన్నా, ఆమె అధూరే ప్రేమ కథనాలకే ప్రాధాన్యం ఇచ్చాయి. ఒక పేరున్న తెలుగు జర్నలిస్టు మామూలు ఇతర జర్నలిస్టులకన్నా ఒక అడుగు ముందుకెళ్ళి, లేని ప్రేమగాథను ఊహించి, ఆమెకు అంటగట్టాడు. అత్యంత ఘోరం, దౌర్భాగ్యకరం, గర్హనీయమైన విషయం ఇది. భారతరత్న గురించి, సరస్వతీ దేవిగా భావించి గౌరవించే వ్యక్తి గురించి, ఒక పరమాద్భుతమైన గాయని, కొన్ని వేల సంవత్సరాలలో ఒక్కసారి అరుదుగా జన్మించే ప్రతిభావంతురాలైన గాయని మరణిస్తే, ఆమెకు నివాళిగా రాసిన రాతలు చదువుతుంటే తెలుగు జర్నలిజం ఏ స్థాయిలో
ఉందో బాధకన్నా ఆవేశం కలుగుతుంది. ‘యాకుందేందు తుషార హార ధవళ’ అని మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ ఆమె పాటలు వినే అదృష్టం కలిగినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఆమె ద్వారా ప్రకటితమైన సరస్వతీ స్వరూప ప్రతిబింబంలాంటి అద్వితీయం, అమోఘం, అలౌకికమైన కళను అనుభవించి, పలవరించి, ఆ కళలోని ఔన్నత్యాన్ని తమ కలం ద్వారా లక్షలాది మంది చదివి ఆనందించే పత్రికల ద్వారా విస్తరింపచేసే బదులు, శుభ్ర వస్త్రాన్విత అయి ఆకాశంలో ఉన్న ఆ కళాకారిణిపై అశుద్ధాన్ని విసరాలని నైచ్యం, దుర్మార్గం ప్రదర్శిస్తున్న జర్నలిస్టు రచయితల రాతలు చూస్తుంటే ప్రజలను ప్రభావితం చేయగల మేధావి వర్గంగా పరిగణనకు గురయ్యే మెదళ్ళ దౌష్ట్యం పట్ల పట్టరాని ఆవేశం కలుగుతుంది. ఆకాశ మార్గాన పయనించే రాయంచను మురికి కాలవలోకి లాగి పారేసి ఆనందించాలన్న వీరిని చూసి అసహ్యం కలుగుతుంది. ఒక మనిషి గురించి ఏ మాత్రం తెలుసుకోకుండా, ఆ మనిషి ఔన్నత్యం, ఉత్తమత్వాల గురించి ఎలాంటి అవగాహన లేకుండా ఎవరో ఏదో చేశారని పచ్చకామెర్ల దృష్టితో అది నిజమనుకుని వ్యక్తి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా, ఆ వ్యక్తి ‘ఇలాంటిదా?’ అని ఆమెని గౌరవించి, అభిమానించేవారు బాధపడేలా కొందరు రాస్తే, మరికొందరు మదోన్మత్తోన్మత్త దురూహశాలులు తామేదో ఊహించి, ఊహను నిజమని నమ్మి చేతిలో పత్రిక ఉంది, తానేం రాసినా పట్టించుకోని యాజమాన్యం ఉంది, ఏం రాసినా నమ్మే లక్షలాది పాఠకులున్నారు, ‘ఇదేమిటని’ అడిగేవారు లేరు, దేనికీ జవాబుదారీ లేదని, జర్నలిస్టులు తమకు తోచిన వారితో, లతకు లేని ప్రేమ కలాపాలు ఊహించి రాసేసి, ఉన్నత వ్యక్తిపై, అత్యుత్తమ కళాకారిణిపై, భారతరత్నపై, సరస్వతీదేవి స్వరూపంపై బురద జల్లుతున్నారు. అమాయకులు ఇది చదివి ‘లతా మంగేష్కర్ ఇలాంటిదా?’ అని ఆశ్చర్యపోయి బాధపడుతున్నారు. ఇందుకు ఉదాహరణలు ‘సాక్షి’ దినపత్రికలో లతకు నివాళిగా రాసిన వ్యాసంలోని బాక్స్ ఐటమ్, స్వాతి మాసపత్రికలో లతకు శ్రద్ధాంజలి అర్పిస్తూ వ్రాసిన వ్యాసంలోని ఓ పేరా. కనీసం స్వాతిలో రాసినవి గతంలో ఎందరో ప్రస్తావించినవి. అయితే కిశోర్ కుమార్ సంఘటనను ప్రేమకథల్లో రాయటం, రచయిత అవగాహనా రాహిత్యాన్ని సూచిస్తుంది. కిషోర్ ఆమెకు భయ్యా. కిషోర్ దా!!!
‘సాక్షి’ వ్యాసంలో ‘లత మంగేష్కర్`సి.రామచంద్ర, రాజ్ సింగ్ దుంగార్పూర్, సాహిర్ లూథియాన్వీలు సన్నిహితులు’ అంటూ లాహోర్‌కు చెందిన అద్భుత గాయకుడు సలామత్ అలీఖాన్ ప్రస్తావన చేశారు. ‘‘ఆయన గానం ఆమెకు వెర్రి. పెళ్ళి ఆలోచన వరకూ వెళ్ళింది’’ అని రాస్తూ సలామత్ ఖాన్‌కు అప్పటికే పెళ్ళయింది, పిల్లలున్నారు. పైగా దేశవిభజన గాయాలు తాజాగా ఉన్నాయి. హిందూ, ముస్లిం వివాహం వల్ల గొడవలవుతాయని సలామత్ అలీఖాన్ పాపం వెనక్కు తగ్గాడని అద్భుతంగా ఊహించి, లేనిది సృష్టించి, ఓ ఎద కరిగే ప్రేమ కథను అత్యంత సృజనాత్మకంగా రాశాడు బాక్స్ ఐటమ్ రచయిత.
ఇది లక్షలాది మంది పాఠకులు చదివారు. చదివిన వారిలో అధికులకు లత గురించి తెలియదు. ఆమె పాట గురించి తెలుసు. కానీ ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తుల దిగజారుడు ప్రవర్తనను సులభంగా నమ్ముతారు. ఇది చదివి ఎందరు సంతోషంగా ‘లత కూడా’ అనుకుని బుగ్గలు నొక్కుకున్నారో. అందరికీ ఇంత ఆనందం కలిగించిన ఆ జర్నలిస్టోత్తమత్త చిత్తుడికి, దాన్ని ప్రచురించిన సాక్షి పత్రిక సంపాదక వర్గానికి, యాజమాన్యానికి, లేని ‘ప్రేమగాథ’ను సృష్టించినందుకు ఉత్తమ సృజనాత్మక ఫాల్స్ స్కూప్ జర్నలిజం అవార్డులివ్వాల్సి ఉంటుంది. ఇది తెలుగులో రాశారు కాబట్టి ఎవరూ నోరు మెదపటం లేదు. ఇదే ఇతర ఏ భాషలో రాసినా ఆ పత్రిక యాజమాన్యంతో బహిరంగంగా క్షమార్పణలు చెప్పించేవారు. మరోసారి ఇలాంటి రాతలు రాయకుండా చూసేవారు. ఇంతకీ ఎవరీ సలామత్ ఖాన్? లత అతని దగ్గర పాట నేర్చుకుని అతని పాటకు వెర్రి అయి పెళ్ళి చేసుకోవాలనిపించేంత అద్భుతమైన గాయకుడు ఎవరు? పాఠకులను నమ్మించేందుకు సలామత్ అలీఖాన్ బొమ్మ కూడా వేశారు.
ఇంతకీ ఎవరీ సలామత్ అలీఖాన్? ఈయన లతకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా పాఠాలు నేర్పించాడని పరిశోధిస్తే, లత ఏ ఇంటర్వ్యూలో కూడా ఇతని ప్రసక్తి కనబడదు. ఆమె ప్రస్తావించిన ఇద్దరు ఉస్తాద్‌ల గురించి మనం తెలుసుకున్నాం. ఇద్దరూ ఆమెపై పుత్రిక వాత్సల్యం కనబరిచారు. వారిద్దరూ దూరమైనప్పుడు తన తండ్రి దూరమైనంతగా బాధపడ్డానని లత పలు ఇంటర్వ్యూలలో చెప్పింది. లత గురువుల గురించి పలువురు పలు పరిశోధనలు చేశారు. లత గురించి తెలుసుకోవాలంటే, లత పాట గురంచి తెలుసుకోవాలంటే, లత పాటను అర్థం చేసుకోవాలంటే ఆమె గురువుల గురించి తెలుసుకోవటం తప్పనిసరి. ఎందుకంటే ూa్aఃం స్త్రబతీబం aతీవ ంబస్త్రస్త్రవర్‌ఱఙవ శీట షష్ట్రa్ ంష్ట్రవ పతీశీబస్త్రష్ట్ర్ ఱఅ్‌శీ ష్ట్రవతీ ంఱఅస్త్రఱఅస్త్ర ఱఅ a ్‌శ్‌ీaశ్రీశ్రీవ సఱటటవతీవఅ్ స్త్రవఅతీవ-్‌ష్ట్రa్ శీట టఱశ్రీఎ ంశీఅస్త్ర (నఱఅసఱ టఱశ్రీఎ ంశీఅస్త్ర, ఎబంఱష పవవశీఅస పశీబఅసaతీఱవం పవ Aంష్ట్రశీస ణa. Raఅaసవ, జూaస్త్రవ అశీ 403). లత తండ్రి దగ్గర హిందుస్తానీ సంగీతంలో పాటియాలా ఘరానా గానంలోని మెరుపులు, విరుపులు, చమక్కులు నేర్చుకుంది. అమాన్ అలీఖాన్ భేండీ బజార్ వాలా దగ్గర భేండీ బజార్ ఘరానాలోని నృత్యగీతం లాంటి గాన పద్ధతి, పదాల విరుపుల గాన పద్ధతిని నేర్చుకుంది. వీటన్నిటికీ తనదైన సృజనాత్మకతను జోడిరచి ప్రత్యేక గాన శైలిని ఏర్పాటు చేసుకుంది. కాబట్టి, లత గాన సంవిధానాన్ని అర్థం చేసుకోవాలంటే ఆమెపై ఆమె గురువుల ప్రభావం విశ్లేషించటం తప్పనిసరి. అందుకని ఆమెకు సంగీతం నేర్పిన గురువులందరి గురించి పలు పరిశోధనలు జరిగాయి.
మాస్టర్ వినాయక్ మరణం తరువాత లత కొన్నాళ్ళు పాటియాలా ఘరానాకు చెందిన ఉస్తాద్ బడేగులామ్ అలీఖాన్ శిష్యుడు పండిత తులసీశర్మ వద్ద శిష్యరికం చేసింది. ఆమెకు గులామ్ హైదర్ నుంచి అనిల్ బిశ్వాస్, శంకర్ జైకిషన్, ఎస్.డి.బర్మన్ వరకు ఎందరో సంగీత దర్శకులు పాటలు పాడటం నేర్పించారు. ముఖ్యంగా హుస్న్‌లాల్, భగత్ రామ్ సంగీత జంటలో హుస్న్‌లాల్ లతకు ప్రత్యేకంగా, పాట పాడే విధానం నేర్పించాడు. రోజూ ఉదయం నాలుగు నుంచి ఆరు వరకు ఆయన ఇంటికి వెళ్ళి సంగీత సాధన చేసింది లత. ఆమెపట్ల హుస్న్‌లాల్ చూపిస్తున్న శ్రద్ధ నచ్చక హుస్న్ లాల్ భార్య అభ్యంతరం వ్యక్తం చేస్తే, ఆయన లతకు పాట నేర్పడం మానేశాడు. అంతేకాదు లత పాటల రికార్డు కూడా తన బదులు భగత్ రాంతో చేయించాడు. దీన్ని అవమానంగా, తన వ్యక్తిత్వంపై మచ్చలా భావించిన లత తరువాత హుస్న్ లాల్, భగత్ రామ్‌లకు పాడటం తగ్గించింది. కొన్నేళ్ళ తర్వాత, తమ అసిస్టెంట్లుగా ఆరంభించి అగ్రశ్రేణి సంగత దర్శకులైన శంకర్, జైకిషన్‌ల వద్ద వాయిద్యకారులుగా పనిచేసే స్థితికి దిగజారారు హుస్న్‌లాల్, భగత్ రామ్‌లు. అంటే, ఒకరు తన ప్రవర్తనపై వేలెత్తి చూపితే సహించదన్నమాట లత. అయితే అప్పటినుంచీ మరణించేవరకూ తనను ఎవరు ఏమన్నా, ఎంతగా దూషించినా, ఎన్నెన్ని నేరారోపణలు చేసినా లత ఒక్క విషయంలో కూడా నోరెత్తి ఒక్క మాటా అనలేదు, ఎలాంటి స్పందనా ప్రదర్శించలేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక అమ్మాయి మాట్లాడితే తప్పు, మాట్లాడకుంటే తప్పు. మాట్లాడితే ఎదుటివారి పనికిరాని ఆరోపణలకు ప్రామాణికత కల్పించినట్లవుతుంది. కాబట్టి మౌనంగా ఉండటమే ఉత్తమమని, ఎవరెన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా లత మౌనాన్నే ఆశ్రయించింది. ఈ మౌనాన్ని కూడా వివాదాస్పదం చేయాలని ప్రయత్నించారు కొందరు.
లత మౌనాన్ని అత్యద్భుతంగా వివరిస్తుందీ ‘అదాలత్’ సినిమాలో లత పాడిన గజల్…
ఉన్ కో యే షికాయత్ హై కె హుం కుచ్ నహీ కెహతే
అప్నీ తో యే ఆదత్ హై కె హం కుచ్ నహీ కెహతే
కుచ్ కెహనేసే తూఫాన్ ఉఠాలేతి హై దునియా
అబ్ ఇస్ పే కయామత్ హై కె హం కుచ్ నహీ కెహతే…
ఆమె సినిమా పాటలు పాడే కొత్తల్లో ఓ అగ్రశ్రేణి సంగీత దర్శకుడు ఆమె మెడలోని గొలుసు గురించి ఏదో వ్యాఖ్య చేశాడన్న మాట లతకు ఎవరో చెప్పారు. దాంతో ఆమె రికార్డింగ్ వదిలి వెళ్ళిపోవడమే కాదు, కొన్నాళ్ళు ఆ సంగీత దర్శకుడి పాటలు పాడలేదు. తరువాత ఇది ఎవరో కావాలని చెప్పిన మాయమాటలని తెలియటంతో మళ్ళీ ఆ సంగీత దర్శకుడి పాటలు పాడిరది. అప్పటినుంచీ ఆమె తన మెడ కూడా కనబడకుండా కొంగు నిండుగా కప్పుకోవటం ఆరంభించింది. అంత సెన్సిటివ్ లతా మంగేష్కర్. అలాంటి లత ఓ లాహోర్‌కు చెందిన అద్భుత గాయకుడి దగ్గర పాట నేర్చుకుంటూ అతని పాటంటే వెర్రి పెంచుకుని, అతడితో వివాహానికి సిద్ధమయిందన్న ఊహ రావటమే అత్యంత నీచమయిన విషయం.
లత వెర్రిగా అభిమానించే ఆ లాహోర్ గాయకుడు సలామత్ అలీఖాన్ జన్మించింది డిసెంబరు 12, 1934లో. అంటే దేశవిభజన సమయానికి అతనికి పదమూడేళ్ళు. ఈయన విలాయత్ అలీఖాన్ కొడుకు. ఈయనకు పన్నెండేళ్ళ వయసులోనే సోదరుడితో కలిసి పాట పాడటం నేర్పటం ఆరంభించాడు తండ్రి. తరువాత వీరు ‘అలీ బ్రదర్స్’గా ఖ్యాతి పొందారు. పన్నెండేళ్ళకు పాట నేర్చుకోవటం ఆరంభించిన సలామత్ అలీఖాన్ లతకు ఎప్పుడు పాట పాడటం నేర్పించాడు? ఎప్పుడు అతని పాట విని లత వెర్రి అభిమాని అయింది? దేశ విభజన సమయంలో పదమూడేళ్ళ సలామత్ అలీఖాన్ పద్దెనిమిదేళ్ళ లతను పెళ్ళి చేసుకోవాలని ఎలా అనుకున్నాడు? పన్నెండేళ్ళకే అతనికి పెళ్ళయి పిల్లలున్నారా? దేశ విభజన సమయంలో హిందూ, ముస్లిం ఉద్విగ్నతల వల్ల వివాహం ఆలోచనను విరమించుకున్నాడా? ఇంతకీ ఈ హిందూ ముస్లిం ఉద్విగ్నత అన్న సన్నాయి నొక్కు ముస్లింలకు ఈ దేశంలో జరుగుతున్న అన్యాయం, వారెంత అభద్రతా భావంలో బ్రతుకుతున్నారో చూపించి అభ్యుదయ లౌకిక మైనారిటీ భావాల ముద్ర, ఆమోదం పొందేందుకా? ఇంతకీ ‘సాక్షి’ ప్రస్తావించింది ఈ 13 ఏళ్ళ సలామత్ అలీఖాన్‌యేనా అన్న సందేహం లేకుండా బొమ్మ కూడా వేశారు. ఈయన తన జీవితంలో బొంబాయికి 1956లో తొలిసారి వచ్చాడు.
లత జీవితంలో కలవని సలామత్ అలీఖాన్‌తో ఆమె ప్రేమ వ్యవహారాన్ని ఊహించి, మసాలా చల్లి రాసిన ఈ అనృత ప్రేమ కథకు ఆ జర్నలిస్టు సమాధానమిస్తాడా? సాక్షి సంపాదకవర్గం సంజాయిషీ ఇస్తుందా? యాజమాన్యం సమాధానమిస్తుందా? ఇలాంటి తప్పుడు కూతల రాతలు రాయటం వల్ల ఎవరికి ఏం లాభం వచ్చింది? ఒక వికృత మానసికానందం తప్ప, ఓ ఉన్నత స్థాయి వ్యక్తిని దిగజార్చుదామనే తుచ్ఛ, పైశాచిక ఆనందం తప్ప ఓ మహా కళాకారిణి, భారతరత్న లతా మంగేష్కర్ గురించి ఇలాంటి పనికిరాని రాతలు రాసి ఏం సాధించారు? అంటే ఒక కళాకారిణి మరణిస్తే ఆమె కళను అనుభవించి ఆనందించే సౌకుమార్యం, సున్నితత్వం లేని బండ హృదయాలు, ఆమెకు లేని అధూర ప్రేమ కహానీలు, ఎవ్వరికీ తెలియని, లేని ప్రేమ గాథలను ఊహించి సృష్టించి రాసేస్తారన్న మాట! ఇది తెలుగు జర్నలిజం పట్ల, పత్రికల పట్ల గౌరవం, నమ్మకాలను సడలిస్తుంది. లత పాట కన్నా ఆమె ప్రేమ ఆటలపైనే వీరి దృష్టి అన్నమాట! గ్రద్ధ ఆకాశంలో ఎంత ఎత్తు ఎదిగినా, దాని దృష్టి నేలపైని తిండిపైనే ఉంటుందన్నట్టు వ్యక్తులు ఎంత ఎదిగినా వారి మెదళ్ళు అధోస్థాయి దాటలేదని నిరూపిస్తాయి ఇలాంటి రచనలు. లేక ప్రపంచానికి తెలియని సలామత్ అలీఖాన్ లతను ప్రేమించాడని సాక్షి జర్నలిస్టులు ఏదయినా స్కూప్ లాగితే ఆ ఋజువులు ప్రపంచానికి ప్రకటిస్తే లత ఎప్పుడూ ప్రస్తావించని, సీక్రెట్‌గా ఉంచిన ఓ ప్రేమికుడిని ప్రపంచానికి పరిచయం చేసిన ఖ్యాతి ఆ జర్నలిస్టు, సంపాదకవర్గం పొందవచ్చుగా??
అయితే ఈ రచనలలో వారు ప్రస్తావించిన ఇతర వ్యక్తులతో లత ప్రేమ కథల గురించి సందర్భాన్ని బట్టి ప్రస్తావిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది. మాస్టర్ వినాయక్ మరణం తర్వాత మళ్ళీ లత పరిస్థితి మొదటికి వచ్చింది. అంతవరకూ ఆమెకు మాస్టర్ వినాయక్ కంపెనీ నుంచి జీతం అందేది. ఆయన మరణం తర్వాత లత ఇప్పుడు స్టూడియోల చుట్టూ, సంగీత దర్శకుల చుట్టూ అవకాశాల కోసం తిరగాల్సి వచ్చింది. అయితే తెలిసినవారి కంపెనీలో కలిసి పనిచేయటం వేరు. అనామకురాలిగా, పరిచయం లేని వ్యక్తులను అవకాశం అడగటం వేరు. పైగా ఆ కాలంలో నేపథ్యగానం అప్పుడప్పుడే ఆరంభమవుతోంది. ఇంకా నటీనటులు తమ పాటలు తామే పాడుకుంటున్న కాలం. నేపథ్యగాయనిగా శంషాద్ బేగం సంచలనం సృష్టిస్తున్న కాలం అది. నటిగా, గాయనిగా నూర్జహాన్ ఏకఛత్రాధిపత్యం ఏలుతున్న కాలం. దీనికి తోడు ఆ కాలంలో సినీ పరిశ్రమ వాతావరణం ఇప్పటిలా ఉండేది కాదు. స్టూడియోల కాలం అది. స్టూడియో అధినేత ఇష్టాయిష్టాల ఆధారంగా వ్యక్తులకు అవకాశాలు దొరుకుతుండేవి.
ఆజ్ నహీ తో కల్ బిఖర్ జాయేంగే యే బాదల్
హస్తే హువే చల్, మేరే మన్ హస్తే హువే చల్
ఇస్ దేశ్ కీ నారీ కో కోయీ కెహ నా దే దుర్బల్
హస్తే హువే చల్, మేరే మన్ హస్తే హువే చల్
కవి ప్రదీప్ అత్యద్భుతమైన భావాలతో కూర్చిన ఈ స్ఫూర్తివంతమైన పాట ‘మషాల్’ (1950) సినిమాలోనిది. ఎస్డీ బర్మన్ సంగీత దర్శకుడు. ఆగస్టు 19, 1947న మాస్టర్ వినాయక్ మరణంతో భవిష్యత్తు అంధకారమైనప్పుడు బహుశా ఇలాంటి భావాలే లత మనస్సులో చెలరేగి ఉంటాయి. ఈ దేశపు మహిళను ఎవ్వరూ అబల అని అనకూడదని నిరూపించాలని నడుం కట్టినట్టు పదిహేనేళ్ళ యువతి, ఎలాంటి సహాయం ఎవరినుంచీ ఆశించక తన కుటుంబాన్ని పైకి తేవటమే కాకుండా పురుషాధిక్య ప్రపంచమైన సినీ ప్రపంచంపై చెరగని ముద్ర వేసి తిరుగులేని రీతిలో ప్రభావం చూపించటమన్నది సామాన్యమైన విషయం కాదు. ఈ రోజు కాకుంటే రేపైనా అలముకున్న మేఘాలు తొలగిపోతాయి, కాబట్టి ధైర్యంతో ముందుకు సాగాలి అని తనకు తాను ఎంతగా ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగిందో ఊహకందని విషయం. పట్టుదల, మొండితనం, ఆత్మవిశ్వాసాలతో, నిరాశ నిస్పృహలను, వేదనలను తట్టుకుని నిలబడి ముందుకు సాగింది లత. మాస్టర్ వినాయక్ మరణం లత కుటుంబానికే కాదు ఆయన నిర్మాణ సంస్థను నమ్ముకుని బొంబాయి వచ్చిన వారందరికీ పెద్ద షాక్. ఆయన మరణించే సమయానికి అసంపూర్తిగా ఉన్న సినిమాని దినకర్ పాటిల్ పూర్తి చేశాడు. మాస్టర్ వినాయక్ మరణించిన కొద్దిరోజులకు ప్రఫుల్ల పిక్చర్స్ మేనేజర్ నానాచౌక్‌లో ఆ నిర్మాణ సంస్థ వాళ్ళుంటున్న ఇళ్ళ దగ్గరకు వచ్చాడు. ‘కంపెనీ మూత పడిరది. మీరంతా ఇళ్ళు ఖాళీ చేయాలి’ అని ఆజ్ఞలు జారీ చేశాడు.
ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే పరిస్థితి తీవ్రత బోధపడుతుంది. లత వాళ్ళింట్లో చెల్లెళ్ళు, అమ్మతో పాటు ఇందిర అనే బంధువు, వాళ్ళ ఇద్దరు పిల్లలూ ఉండేవారు. వీరంతా ఎక్కడికి పోతారు? పైగా వినాయక్ మరణంతో లతకు బొంబాయిలో తెలిసినవారు, సహాయం చేసేవారు ఎవ్వరూ లేని పరిస్థితి. సినీ పరిశ్రమలో అవకాశాలు రావటం ఎంతో కష్టం. కొన్ని వేలమంది స్టూడియోల చుట్టూ, నిర్మాత, దర్శకుల చుట్టూ సంవత్సరాల తరబడి తిరుగుతున్నా, పడిగాపులు కాస్తున్నా అవకాశాలు దొరకటం కష్టం. అవకాశం కోసం నానా గడ్డీ కరవాల్సి ఉంటుంది. కరుణా కటాక్ష వీక్షణాలు తమపై పడేందుకు చకోర పక్షిలా ఎదురు చూడాల్సి ఉంటుంది. పైగా లత సినిమాల్లో నటించేందుకు కాదు, నేపథ్య గానం కోసం ప్రయత్నిస్తోంది. ‘ఆలంఆరా’ సినిమాలకు గొంతు వచ్చింది. కానీ ఆరంభంలో నటీనటులు తమ పాటలు తామే పాడుకునేవారు. పైగా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి కాకపోవడంతో పాటలను రికార్డు చేయటానికి నానా తంటాలు పడేవారు. Iఅ ్‌ష్ట్రవ వaతీశ్రీవ ంశీబఅస వతీa, ంశీఅస్త్రం షవతీవ టఱశ్రీఎవస షఱ్‌ష్ట్ర ంవఅషష్ట్రతీశీఅశీబం ంశీబఅస, షష్ట్రఱషష్ట్ర షaం తీవషశీతీసవస శీఅ ్‌ష్ట్రవ శీజ్‌ూఱషaశ్రీ ్‌తీaషస శీట ్‌ష్ట్రవ అవస్త్రa్‌ఱఙవ షఱ్‌ష్ట్ర ్‌షశీ ఎఱషతీశీజూష్ట్రశీఅవం, శీఅవ సఱతీవష్‌వస a్ ్‌ష్ట్రవ ంఱఅస్త్రవతీ aఅస ్‌ష్ట్రవ శ్‌ీష్ట్రవతీ a్ ్‌ష్ట్రవ ంఎaశ్రీశ్రీ అబఎపవతీ శీట శీటట ంషతీవవఅ ఎబంఱషఱaఅం – (A దీతీఱవట నఱర్‌శీతీవ శీట దీశీశ్రీశ్రీవషశీశీస ూశీఅస్త్రం పవ చీaంతీవవఅ వీబఅఅఱ ఖaపవవతీ)
అందుకనే ఆ కాలంలో నటీనటులు ఒకచోట నుంచునో, కూర్చునో పాటలు పాడేవారు. దేవదాసులో సైగల్ ‘బాలమ్ ఆయో బసోమోర మన్ మే’ ఓ చెట్టుక్రింద కూర్చుని పాడతాడు. నటుడు కదుల్తూ పాడటం పెద్ద తంటా. ‘స్ట్రీట్ సింగర్’ సినిమాలో సైగల్ ‘బాబుల్ మొరా’ అనే పాటను హార్మోనియం వాయిస్తూ నడుస్తూ పాడతాడు. ఆయనతో పాటుగా కెమెరా కంట పడకుండా, పక్కనే నడుస్తూ వాయిద్యాలు వాయిస్తుంటారు వాయిద్యకారులు. ముందుగా పాట రికార్డు చేసి తరువాత చిత్రీకరించే పద్ధతి అప్పటికి రాలేదు. కాబట్టి, పాట రికార్డింగ్ దృశ్యం చిత్రీకరణ ఒకేసారి అవ్వాల్సి వచ్చేది. అందుకని ఆ రోజుల్లో పాటల్లో వాయిద్యాలు తక్కువగా ఉండేవి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తెలుసుకుంటే హాస్యంగా, అప్పుడు కష్టంగా అనిపించే సంఘటనలెన్నో సంభవించేవి. అలాంటి ఒక సంఘటన కేదార్ శర్మ జీవిత చరిత్ర ుష్ట్రవ ూఅవ aఅస ూశీఅవశ్రీవ ఖఱసaతీ ూaతీఎa వసఱ్‌వస పవ ణతీ.పఱసతీaఎ ూaతీఎa లో పొందుపరచారు.
ఒకసారి స్టూడియో వెనుక ఉన్న అడవిలో రాత్రి పాట చిత్రీకరణ జరుగుతోంది. ఉమాశశి అనే నటి ఒక పూలచెట్టు దగ్గర నిలబడి పాట పాడాలి. అది ట్రాలీషాట్ కావటంతో వాయిద్యకారులు కెమెరా దృష్టిలో పడకుండా స్థలం దొరకటం కష్టమయింది. సంగీత దర్శకుడు ఆర్‌సీ బోరాల్ ఎంతో వెతుకగా దగ్గరలో నీరు నిండిన గుంటలో వాయిద్యకారులు ఉండేందుకు స్థలం దొరికింది. అయితే ఫ్లూట్, క్లారినెట్ వాయించేవారికి మోకాలు లోతు నీళ్ళల్లో నించుని వాయించటం కష్టం కాలేదు. కానీ తబలా, హార్మోనియం వాయించే వారికి వాయిద్యాలను నడుముకు కట్టుకుని నీటిమట్టంపై ఉంచుతూ వాయించటం ఎంతో కష్టం. అయినా సరే అది తప్ప మరో మార్గం లేకపోవటంతో పాట చిత్రీకరణ ఆరంభించారు. అంతా సవ్యంగా సాగిపోతోంది. చివరలో నాయిక పాట ముగింపుగా లయను మంద్రంచేసి పాడాలి. అందుకు తగ్గట్టుగా వాయించే బదులు తబలా వాయించే అలీహుస్సేన్ లయ వేగాన్ని పెంచుతూ పోయాడు. ఆర్‌సీ బోరాల్ సూచనలను అతను పట్టించుకోలేదు. పాట చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు సంతృప్తి చెందాడు. కానీ, ఆర్‌సీ బోరాల్ కోపంగా చివరలో లయ పెంచినందుకు అలీ హస్సేన్‌పై విరుచుకుపడ్డాడు. అంతా అయిన తర్వాత అలీ హుస్సేన్ అసలు విషయం చెప్పినప్పుడు నవ్వీ నవ్వీ అందరికీ కన్నీళ్ళు వచ్చాయి. చివరివరకూ బాగానే ఉంది కానీ, పాట చివరికి వచ్చేసరికి ఒక చేప అతని ధోవతీలోకి దూరింది. దానికోసం ఆయన తబలా అపితే అంతవరకూ చిత్రించింది వ్యర్థమై మళ్ళీ మొదలుపెట్టాలి. కాబట్టి లోపల ఆ చేప కదలికలను సహిస్తూ తబలా వాయిస్తున్నాడు. అయితే అతని తబలా లయ పాటకు తగ్గట్టు కాకుండా, లోపల చేప కదలికలను అనుసరించింది. అదీ కథ!!! ఈ సంఘటనను బట్టి తెలుసుకోవచ్చు ఆ కాలంలో ఎలాంటి కష్టాలను సహిస్తూ పాటలను అందించేవారో!!!