నేర్పు ` మార్పు -కె. సుమలత

ఐక్యతారాగం శిక్షణలో భాగంగా భూమిక సంస్థ పనిచేస్తున్న రాజమండ్రిలోని స్త్రీలు, పురుషులకు శిక్షణ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా జెండర్‌ అసమానతలు, పితృస్వామ్య వ్యవస్థ గురించి చర్చించాము.

అందరి పరిచయ కార్యక్రమమాలు జరిగిన తర్వాత సభ్యులందరిని నాలుగు గ్రూపులుగా చేసాము. గ్రూపు సభ్యులు అచారాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు, సమాజంలో స్త్రీ స్థానం గురించి చర్చించారు.
పితృస్వామ్యాన్ని అర్థం చేయించటానికి సమాజంలో ఉన్న ఆచారాలు, సాంప్రదాయాలను గ్రూపు సభ్యులుగా ఛార్టుమీద వ్రాయించాము. శిక్షణ పొందుతున్న వ్యక్తులు అనేక సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్ల గురించి వ్రాశారు. దీనిలో ఒక ఆచారం చర్చనీయాంశంగా మారింది. భర్త చనిపోయిన తర్వాత మహిళ పువ్వులు, గాజులు, బొట్టు పెట్టుకోకూడదు. ఈ ఆచారం వలన ఒక మహిళ తన కుమార్తెకు పెళ్ళిచేసి రెండు నెలలయిందని, తర్వాత తన అల్లుడు చనిపోయాడని చెప్పింది. రెండు నెలల క్రితం తన కుమార్తె ఆమెకు నచ్చినట్లుగా అందంగా తయారయ్యేదని, తన కూతురికి గాజులు, పువ్వులు చాలా ఇష్టమని కన్నీటితో చెప్పింది. తన భర్త ఎక్కడికి వెళ్ళినా ఆమెకి నచ్చిన గాజులు, పువ్వులు తీసుకురాలేదంటే తన కూతురు కోపగించుకునేదని చెప్పింది. ఇప్పుడు ప్రతిరోజు తన కూతుర్ని చూసి తాను, తన కుటుంబం ఏడుస్తూనే ఉంటున్నామని చెప్పింది. ఇప్పుడు చెప్పండి, నా కూతురుకి గాజులు, పువ్వులు భర్త పట్టుకొచ్చాడా? అతను పోతూ వాటిని తీసుకుపోవటానికి అని ప్రశ్నించింది. ఇది సభ్యుల మధ్య ఒక డిబేట్‌లా నడిచింది. కొంతమంది మరో పెళ్ళి చేసినప్పుడు పెట్టుకుంటుందని, మరి కొందరు వద్దు పాపకు చిన్న వయసే కదా పెట్టండి అని, ఇంకొకరు పెద్దలు తీసుకువచ్చిన ఆచారాన్ని మనమెలా తొలగిస్తామని, అలా తిరిగి పెట్టుకోవడం వల్ల ఇంట్లో వాళ్ళకి కీడు జరుగుతుందని, ఒకవేళ ఆమె మళ్ళీ అన్నీ ధరిస్తే సమాజంలో పెద్దవాళ్ళ నోళ్ళు మూయించగలమా అంటూ హిందూ సంప్రదాయం పాటించాలని… ఈ విధంగా సభ్యుల మధ్య కొంత సంభాషణ జరిగిన తర్వాత చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. ఇది పూర్వం నుండి (పితృ పారంపర్యంగా) వస్తున్న ఆచారం కాబట్టి దాన్ని కొనసాగించాలన్నా, తొలగించాలన్నా కుటుంబ సభ్యుల ఇష్టంపై ఆధారపడి ఉంటుందనే నిర్ణయానికి వచ్చారు. ఈ విధంగా చాలా కట్టుబాట్లు, ఆచారాల గురించి మాట్లాడుకున్నప్పుడు సభ్యులందరి ఆలోచనా విధానం మారటాన్ని శిక్షణ ఇస్తున్న నేను గ్రహించటం జరిగింది.
పితృస్వామ్యంలో నుండి ఉన్న వ్యవస్థల గురించి శిక్షణలో ఫోటో ఫ్రేమ్‌ ద్వారా చూపించటం జరిగింది. న్యాయ వ్యవస్థ చర్చనీయాంశంగా మారింది. ఆడపిల్ల పుట్టిన దగ్గర నుండి ఇంట్లో పెంపకంలో న్యాయం లేదు, చదువులో న్యాయం లేదు. ఎక్కువ చదివి ఏం ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు, భర్త ఉద్యోగం చేస్తే సరిపోతుందంటారు. పెళ్ళి చేసి కట్నం ఇవ్వాలి, సారె పెట్టాలి. అత్తగారి ఇంటికి వెళ్తుంది, పేరుకు మాత్రమే ఇంట్లో ఉంటుంది. మంచం, సామాన్లు అన్నీ కోడలే తెచ్చుకోవాలి. గర్భవతైతే పుట్టింటివారే మందులు వాడిరచాలి, పురుడు పోయించాలి. ఏదైనా గొడవయితే పుట్టింటికి పంపించేస్తారు. కట్నం అంటే, డబ్బు ఇచ్చి మరీ పనిమనిషిని చేస్తున్నారు మన ఆడపిల్లని. అదే అబ్బాయిని మా ఇంటికి (ఆడపిల్ల ఇంటికి) రమ్మనండి ఎంత కట్నం తెస్తాడో, ఎంత పని చేస్తాడో. అబ్బాయిని పంపించమంటే పంపిస్తారా? ఇది న్యాయమా అని కొంతమంది సభ్యులు చర్చించారు. మరి కొంతమంది సభ్యులు అబ్బాయి సంపాదిస్తాడు, పోషిస్తాడు, అమ్మాయిని కూడా సమానంగా చదివిద్దాం, చదువుతుంది, ఉద్యోగం చేస్తుంది, సంపాదిస్తుంది, అప్పుడు ఇద్దరికీ సమానత్వం ఉంటుంది. ఇక కట్నకానుకలతో సంబంధమేముంది. వాటికోసం గొడవలు, చంపుకోవటాలు, కక్షలు ఉండవు. సమానత్వం వస్తుంది. ఈ విధంగా మన కుటుంబ వ్యవస్థలో జరిగే న్యాయ వ్యవస్థపై సభ్యుల ఆలోచనా విధానం మారటాన్ని గమనించటం జరిగింది.
ఈ విధంగా చర్చ జరుగుతుండగా స్త్రీ శిరస్సు (తల) నుండి పాదాల వరకు ఏ విధంగా అణచివేయబడుతోంది. మన సమాజంలో పాతుకుపోయి ఉన్న పితృస్వామ్య భావజాలం ఎలా ఉంది, అది స్త్రీలను ఏ విధంగా అనిచివేతకు, కట్టడికి గురి చేస్తుంది అని చర్చించారు. దాని నుండి ఏ విధంగా బయటకు రావాలని ఆలోచన చేసే విధంగా అర్థం చేయించటం జరిగింది.
ఆమె తల: స్త్రీ తల అంటే బుర్రలో జ్ఞానం, ఆలోచనా సామర్ధ్యం, నైపుణ్యం అన్నీ ఉన్నా వీటికి విలువ ఉండదు. ఆమె జ్ఞానానికి, నైపుణ్యాలకు విలువ ఇవ్వడం లేదు. సొంత అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కాబట్టి స్త్రీని ఎటువంటి విషయంలో ప్రోత్సహించాలి అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. నేను తెలివితక్కువ దానిని సరైన నిర్ణయం తీసుకోలేను అనే బలహీన స్థితి నుండి సామర్థ్యం కలిగిన స్థితికి రావాలని ఆలోచించాలి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు.
ఆమె చేతులు: సమాజంలో స్త్రీ పనులకు విలువ ఉండదు. వేతనాలు తక్కువ, సంపాదించిన ఇంట్లో భర్త లేదా తండ్రి చేతికి ఇవ్వాలి. పని గంటలు గుర్తించి, పనికి సమాన వేతనాలు వచ్చేలా ప్రోత్సహించాలి.
ఆమె గర్భసంచి (పొట్ట భాగం): పునరుత్పత్తి విషయంలో ఈమెకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. ఒకవేళ ఆడపిల్లను కంటే స్త్రీకి హింస. ఎంత మంది పిల్లలును కనాలి, అసలు కనాలా, వద్దా? పిల్లలను కనే విషయంలో నియంత్రణ, నిర్ణయం తీసుకోవడానికి ఉండదు. పిల్లలు కనే యంత్రంలా అణగారే స్థితి నుండి బయటపడే మార్గాలు ఆమెకు స్వేచ్ఛ స్వాతంత్య్రం ఉందని గ్రహించేలా చేయటం.
ఆమె యోని (లైంగికత): స్త్రీ లైంగిక కోరికపై, భావోద్వేగాలపై ఆంక్షలు, నియంత్రణలు. స్త్రీకి లైంగిక కోరికలు ఉండకూడదు, ఉన్నా బయటికి రానియ్యకూడదు. భర్త లైంగిక కోరికలను గౌరవించాలి.
ఆమె పాదాలు: స్త్రీ తండ్రి లేదా భర్త అనుమతితోనే బయటికి వెళ్ళాలి, లేకుంటే వెళ్ళకూడదు. ఇతర ప్రాంతాలకు వెళ్ళి
ఉద్యోగం చేయకూడదు. వాహనాలు నడపరాదు.
ఇలా శరీర భాగాలలో ఏ విధంగా స్త్రీ అణచివేయబడుతుందో గ్రహించేలా చేయటం, ఈ విధంగా శిక్షణ పూర్తి కాగానే ముందు ప్రత్యేక శిక్షణ తీసుకున్న సభ్యుల నుండి వారు ఈ శిక్షణలో గ్రహించిన అంశాలను, భావాలను ఈ క్రింది విధంగా తెలియచేశారు. స్త్రీ లేకపోతే జన్మ లేదని ప్రసంగాలు చేస్తారు. స్త్రీని ప్రతి ఇంట్లో మరియు వారి మనసుల్లో కూడా తక్కువ భావనతో చూస్తారు. మనం భేదం లేకుండా ఆడపిల్లని, మగపిల్లలని సమానంగా పెంచాలి. రాబోయే తరంలో సమానత్వం తీసుకురావాలని ఒకామె చెప్పారు.
నిజానికి స్త్రీలుగా ఇటువంటి వాటిని మనమే ప్రోత్సహిస్తున్నాము. ఇంత గ్రహింపు మనలో లేదు. ఈ ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లలో ముందు మనలో మార్పు రావాలి. మానవ హక్కులు అంటారు కానీ, స్త్రీ హక్కులు, పురుష హక్కులు అనరు. స్త్రీలకు పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్య్రం, హక్కు ఉంది. దాన్ని మనం గ్రహించాలి. పిల్లలు పాఠశాల నుండి ఇంటికి రాగానే ఆడపిల్లలకు ఇంటి పనులు చెప్తాము. కానీ మగపిల్లలు ఆడుకోవడం, టివి చూడడం చేస్తుంటారు. మన పెంపకంలో మార్పు రావాలి.
అన్ని వ్యవస్థలు స్త్రీ మనోభావాలు దెబ్బతినేలాగానే పనిచేస్త్తున్నాయి. స్త్రీకి న్యాయం లేదు. ఈ స్థితి నుండి మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. ఈ నేర్పు`మార్పు సమాజంలో తీసుకురావాలని కొంత మంది సభ్యులకు శిక్షణ ఇవ్వడం ద్వారా చాలా సంతోషిస్తున్నారు. సమాజం మార్పు దిశగా వెళ్తుండడాన్ని బాధ్యతగా భావిస్తున్నారు.

Share
This entry was posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.