ఒక పరిపూర్ణ స్త్రీవాద పత్రిక ‘భూమిక’
ముందుగా ‘భూమిక’ 30వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మరియు అభినందనలు.
‘భూమిక’లో నాకు అత్యధికంగా నచ్చేది ఆలోచింపచేసే సంపాదకీయం. స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను సమాజానికి నిర్భయంగా ఎలుగెత్తి చాటుతూ, వాటి నివారణకు అధ్యయనం చేస్తూ సూచించడం ‘భూమిక’ ప్రత్యేకత. స్త్రీల యొక్క హక్కులను కథలు, వ్యాసాలు, పద్యాల రూపంలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా వివరిస్తుంది భూమిక. స్త్రీల కోసం వచ్చిన చట్టాలను, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుపుతూ, ఏ సమస్యకి ఎక్కడ, ఎలాంటి సహాయం దొరుకుతుందో వంటి విషయాలు చక్కగా వివరంగా ‘భూమిక’ అందిస్తుంది. ఒక పక్క స్త్రీల సమస్యలను, వివక్షను ఎలుగెత్తి చాటుతూ సమాజంలో జరుగుతున్న హింసను ఎండగడుతూ మరోపక్క కథలు, పద్యాల రూపంలో ఆహ్లాదాన్నిస్తూ ఆలోచింపచేసే పత్రిక భూమిక. ఒక పరిపూర్ణ స్త్రీవాద పత్రిక ‘భూమిక’ 30 సంవత్సరాల ప్రయాణంలో ఒడిదుడుకులకు వెన్నంటి ఉండి, విజయం దిశగా నడిపించిన సంపాదకీయులకు, రచయిత్రులకు మరియు భూమిక సభ్యులందరికీ పేరుపేరునా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరింత మంది స్త్రీలకు, పురుషులకు కూడా చేరువై మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తూ…
` మీ శేషవేణ