స్త్రీ వాద రచనలు చదవాలని కోరుకుంటున్న మొదటి రోజుల్లో మానుషి వచ్చేది. అది ఇంగ్లీష్, హిందీలలో ఉండేది. అటువంటి పత్రిక తెలుగులో కూడా ఉంటే బాగుంటుంది అనుకునే రోజుల్లో భూమిక వచ్చింది. చిన్న చిన్న అంతరాయాలని దాటుకుని 30 ఏళ్ళు భూమిక నిలబడిరది.
ఇప్పుడు నాకు వెంటనే భూమిక గుర్తు వస్తుంది తప్ప మానుషి గుర్తు రాదు. భూమికని మరింత బలంగా తయారు చేయడానికి ఏమి చేయాలి అనేది ఆలోచించాల్సిన విషయమే. రచయిత్రుల కోసం ఒక వర్క్‌షాప్ నడపడం చేయవచ్చు. నెలకి ఒకసారి తమ రచనలను ఎడిట్ చేసుకునే, మెరుగు పరచుకునే మీటింగ్‌లు భూమిక ఆధ్వర్యంలో జరపవచ్చు. భూమిక తన రచయితలని తాను తయారు చేసుకుంటూ, మంచి రచయితలని తయారు చేసే బాధ్యత కూడా తీసుకోవాలని నా కోరిక. భూమిక టీంకి బోలెడంత ప్రేమ, మనసారా కౌగిలింత.
` సుధా గోపరాజు