ముప్పై ఏళ్ళ స్త్రీవాద పత్రిక భూమిక
2008 లోనో లేదా 2009 లోనో కవయిత్రి శిలాలోలిత హైదరాబాద్ ఆకాశవాణిలో నేను పర్యవేక్షించే విభాగంలో రికార్డింగ్ కోసం వచ్చినప్పుడు తన ఇనిషియేటివ్‌తో ‘భూమిక’ పత్రికకు చందా కట్టాను. అయితే, కొత్త సంచిక వచ్చిందో, పాత సంచిక చదివానో తెలీని రీతిలో ఆఫీస్
పనిలో కూరుకుపోయిన రోజులవి. అట్లని ‘భూమిక’ తెలియదని భావించకూడదు. (2006`07 ప్రాంతంలో అప్పటి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక యువ రచయిత్రి గురించి ఒక వ్యాసం రాస్తే ప్రచురించారు కూడా! హ్యాండీక్యాప్డ్ అయిన యువతి సామర్థ్యం గమనించి రాయాలనిపించి రాశా. అయితే కొద్ది నెలలకే ఆవిడ గతించడం విషాదం, ఆవిడ పేరు గుర్తుకు రావడం లేదు.)
తెలుగు జర్నలిజపు ధోరణులు, వర్తమాన సాహిత్యపు వ్యవహారాలు జాగ్రత్తగా గమనిస్తున్న ఎవరికైనా ‘భూమిక’ పేరు తప్పక గుర్తుంటుంది! మూడున్నర దశాబ్దాలకు ముందు తెలుగు దినపత్రికల రంగంలోకి ఒకవైపు పెట్టుబడి, మరోవైపు టెక్నాలజీ, ఇంకోవైపు రాజకీయాలు పెద్ద స్థాయిలో ప్రవేశించడంతో క్రమపద్దతిలో పంచాంగాలు, క్యాలెండర్లు, నవలలు ప్రచురించే ప్రచురణ కర్తలూÑ జిల్లాస్థాయి పత్రికలు, వివిధ వర్గాలకు సంబంధించిన వార, మాసపత్రికల ప్రచురణ సంస్థలు అదృశ్యమయ్యాయి. కరోనా కబళించడంతో రాజకీయ పార్టీలతో నేరుగా సంబంధ బాంధవ్యాలున్న కేవలం నాలుగు పెద్ద తెలుగు పత్రికలే ఇప్పుడు రెండు రాష్ట్రాలో మిగిలాయి!
ఈ నేపథ్యంలో స్త్రీల కోసం ప్రధానంగా స్త్రీలు నడిపే అందరి పత్రిక ‘భూమిక’ మూడు దశాబ్దాలుగా సాగడం గర్వం కల్గించే విషయం! చిన్న పత్రికే గాని ‘భూమిక’ సాధించిన విజయాలు గానీ, దాని ముందున్న బాధ్యతలు గానీ చిన్నవి కాదు!
నాకెందుకో మూడు దశాబ్దాలుగా ఢల్లీి నుంచి పర్యావరణం, ఆరోగ్యం, అభివృద్ధి మొదలైన విషయాలతో ముడిపడి నడుస్తున్న ‘డౌవున్ టు ఎర్త్’ ఆంగ్ల మాసపత్రిక గుర్తుకొస్తోంది.
‘భూమిక’ మరిన్ని విషయాలతో, మరింత ప్రొఫెషనల్‌గా, మరింత మంది తోడ్పాటుతో, మరింత జీవకళ సంతరించుకుని, మరింతగా తెలుగు వారిని జాగృతం చేయాలి! ` డా. నాగసూరి వేణుగోపాల్