భూమిక జన్మదిన సంచిక (మార్చి, ఏప్రిల్) ఎన్నో ఉపయోగకరమైన విశేషాలతో సర్వాంగ సుందరంగా వుంది. ప్రముఖుల అభిప్రాయాలు, చట్టాల వివరాలు నిజంగా అందరికీ ఉపయోగం. కథల విషయాల కోస్తే-వరద గోదావరి కళ్ళ నీళ్ళు తెప్పించింది. వాయిదాలు
గురించి, గోదావరి వివరించారు, జడ్డిగారు(ఆడ జడ్జి) స్పందించి, న్యాయమైన తీర్పు ఇవ్వటం అభినందించ దగ్గ విషయం. ఇలాంటి కథల వల్ల అందరికీ తమ హక్కులు ఏమిటో తెలుసుకోటానికి అవకాశ ముంటుంది. మరో కథ-జాయిన్ ది మీటింగ్ ఉద్యోగం చేసే కోడలైనా సరే… అన్నీ సమకూర్చాలట ఇంటి ఆడపడుచులకు. నేను చూశాను, పుట్టింటి కొచ్చిన ఆడపడుచులు మంచి నీరు కూడ స్వయంగా తెచ్చుకోరు. ఆ కోడలు తెచ్చి ఇవ్వాలట ఈ మహారాణులు కూర్చొన్న చోటికి…
నేను ‘‘అల్టిమేటం’’ అనే కథలో 6నెలల చంటి బిడ్డను అత్త గారి వద్దకు వదలి ఉద్యోగానికి వెడితే, ఆవిడ సరిగా చూడరు. అందుకే ఆ గృహిణి అల్టిమేటం ఇచ్చింది. తన తల్లి తండ్రులను పిలిపించటం, తను ఉద్యోగానికి రాజీనామా చేయటం, లేదా తను అమ్మ వారి వూరికి ట్రాన్స్‌ఫర్ చేయించుకొని వెళ్ళిపోవటం. అంతే… నిజం తెలుసుకొన్న భర్త తన తల్లిని తక్షణం మరో తమ్ముడి ఇంటికి పంపాడు. ఇలాంటి కథలు స్త్రీలలో ధైర్యాన్ని కలిగిస్తాయి. ` మంగళ కందూర్
…. ఙ ….