సెల్‌ఫోన్ వాడు… కానీ…
` రమాదేవి చేలూరు
కుడి ఎడమైతే పొరపాటే!
సాంకేతిక విజయం హిమాలయాలపైన,
దాని ఫలితం పాతాళంలో ఏరుకోకు!
నిప్పును వాడుకో, చెలగాటం ఆడకు!
సెల్ ఫోన్ అరచేతిలో స్వర్గమే!
గమ్యాన్ని తీరాన్ని నరకం చేసుకోకు!
సెల్‌తో…
విద్యను అభ్యసించి తరించు తెలివిగా!
వినోదాన్ని ఆస్వాదించు నీతిగా!
ఎంత వరకో అంతే!
బానిసవ్వకు బలహీనపడకు!
సెల్‌ఫోన్ పంజరంలో చిక్కకు!
నెట్ సాలీడు గూడులో ఇరుక్కుపోకు!
చాపకింద నీరులా నీ నాశనం నీ అరచేతిలో ఉంది.
అతి సర్వత్రా వర్జయేత్!
పువ్వులు వికసించి పరిమళిస్తున్నాయి చూడు!
మలయమారుతం నిన్ను తాకి మురిపిస్తుంది అవునా!
నీ చుట్టూ పరిసరాలున్నాయి కదా!
బంధాలున్నాయి బాధ్యతలున్నాయి అవునా!
నువ్వు మనిషివే! అవునా! అయితే…
నీ దృష్టిలో మానవత్వం నింపుకో!
నీ చేతితో దీనులకు సేవచెయ్యి!
నువ్వు ఎక్కడున్నావో నిన్ను నువ్వు వెతుక్కో!
సెల్‌తో వికసనం పొందు!
నాశనం అవ్వకు!