అనూషను చంపిన కులానికి అంతమెపుడో!

జూపాక సుభద్ర
విల్లా మేరి కాలేజీలో బి.కాం చదువుతున్న అనూష తన తోటి విద్యార్ధినుల వేధింపులు భరించలేక కాలేజీ బంగ్లా పై నుంచి దూకి చనిపోయిందనే వార్తలో ఎలాంటి వేధింపులనేవి లోతుగా వెళ్తే అన్ని విషయాలు బైటకొస్తయి. కాని ఆధిపత్యయాల మాన్య మీడియాలకు, ఆధిపత్య కుల మహిళా సంఘాలకు అనూష కుల వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు తీసుకుందనే విషయం పట్టదు. అనూష తల్లిదండ్రులు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నవారు. పేదవారు కాదు. అయినా ఏమి తక్కువ అంటే కులం తక్కువ.
అనూష కులం తమ కులం కన్నా తక్కువదని తోటి విద్యార్థినులు దూరంగా జరగడం, నీచజాతి అని ప్రత్యేకంగా చూడడం, వూర్లో యీ కులం వాల్లు మా కింద పనులు  చేస్తారు. మేమిచ్చిన పాసిది బోసిది తిని బతికే కులమని హేళనగా మాట్లాడడం, సూటీపోటీగా నవ్వుకోడం మాలది అని, అంటరానిదని చేసే కుల వేధింపులు అమానుషను చంపేశాయి. అనూష దూకి చనిపోయిందనే కంటే చంపబడిందనేది వాస్తవం. కుల వేధింపులు ఎంత నరకంగా వుంటాయో ఆధిపత్య కులాలకు అర్ధం కాదు. అది ఏ బాధకు సాటిరాదు.
అనూష పడింది కుల నరకం, కులం బాధ, అది కడుపునొప్పి కాలు నొప్పికాదు మందేస్తే తగ్గనీకి, దుక్కం కాదు ఏడిచి ఆపేయడానికి. కడుపులో కత్తి బెట్టి తిప్పిన బాధకంటే తలబండకేసి కొట్టుకున్న బాధకంటే కులం చీదరింపుల బాధముందు తక్కువే. యిది అనుభవించి నోల్లకే తెలుస్తుంది. వూల్లు వాడలు కొట్క పోయినట్లు కులం గూడ కొట్కపోతే బాగుండు. కులంను తప్పించుకుందామని మతమ్మారినా, వూరు విడిచి పట్నమచ్చినా, పట్నం నుంచి పాశ్చాత్యదేశాలు బోయినా అక్కడ కూడా కులం ఆక్టోపస్‌ కొత్త రూపాలతో చిగుర్లు బెడ్తుంది.
కాలేజీల్లో కుల వేధింపులనేవి ఒక్క అనూష అనుభవం కాదు. దళిత విద్యార్ధినీ విద్యార్థులంతా ప్రత్యక్షంగా పరోక్షంగా నిత్యం ఎదుర్కుంటున్నావే. కుల సమాజంలో డక్కా ముక్కీగ ఎట్లా బత్కాలో తెలవని వయసు. తోటి విద్యార్ధినుల వేధింపులకు ఎంత విధ్వంసానికి గురయ్యి ఎన్ని నిద్ర బట్టని రాత్రుల్లో కుంగిపోయిందో, ఎంత హింస పడుంటదో ఆధిపత్య కాలేజీ యాజమాన్యాలకర్థమైతదా!
ఏ కాలేజీ బోయి అడిగినా దళిత విద్యార్థులు, విద్యార్థినులు తమ వేధింపుల్ని కథలు కథలుగా చెప్తారు. యి కార్పోరేట్‌ కాలేజీల్లోనైతే  కుల హింస కార్పోరేట్‌ స్థాయిలోనే బీభత్సంగా వుంటుంది. ఆ మధ్య నాకు తెల్సిన దళితబ్బాయి విజయవాడలో ఒక కార్పోరేట్‌ ఇంజనీరింగు కాలేజీలో చేరాడు. ఆ కాలేజీ  కమ్మ స్టూడెంట్స్‌ ‘ఒరే నీకెందుకురా ఇంజనీరింగు, వూర్లో గొడ్లు సచ్చిపోతే అవెవరు లాగెయ్యిలి? నీ కోసం రోడ్లు, టాయ్‌లెట్స్‌ ఎదురు చూస్తుంటయిరా యిక్కడికెందుకొచ్చావురా బాబూ మాకు పోటీగా, మాతో సమానంగా’ అని బనాయించేదట. హాస్టల్‌ పనివాల్లు రాకుంటే  బాత్రూమ్స్‌ కడిగేవాల్లు రాకుంటే ‘ఒరే ఆ పనేదో చూడరా అని పురమాయించేదట. మంచి బట్టలేస్కున్నా భయమే, మంచిగా చదివినా భయమే. స్నానం జేస్తే ‘నువ్వు స్నామెప్పుడలవాటు చేస్కున్నవ్‌’ అని హేళన చేసేదట. సెమిస్టర్‌లో మార్కులు తక్కువోస్తే ‘మీకు చదువులబ్బవు’ ఎక్కువొస్తే ‘ నీకెందుకురా మార్క్స్‌’ యిట్లాంటి వేధింపుల్ని భరించలేక టీసికూడా తీసుకోకుండా ఆ అబ్బాయి బెదురుకొని యింటికొచ్చాడు. తన కెరియర్‌ని, చదువుకును బందువెట్టి బతికుంటే బలుసాకు తినొచ్చని పారిపోయొచ్చాడు. మల్లా  కాలేజీకి పోలేదు. బాగా డిప్రెస్‌ అయి మొత్తం చదువులంటేనే భయానికి గురయ్యే పరిస్ధితిని ఎదుర్కొండు. యిప్పుడు అక్కడిక్కడ చిన్న చిన్న పనులు చేస్కుంటూ బతుకుతుండు.. యిలాంటి ఉదాహరణలు కోకొల్లలుగా వున్నాయి. యూనివర్సిటీల్లో లాగ కాలేజీల్లో, కార్పోరేట్‌ కాలేజీల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘాలుగానీ కనీసం యూనిట్స్‌గానీ వుంటే యీ పరిస్థితుల్ని కొంత అధిగమించడానికి వీలవుతుందోమో!
రాజ్యంగ నిర్మాత డా. అంబేద్కర్‌కి, 33 ఏండ్లు పార్లమెంటేరియన్‌గా, డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌గా చేసిన జగ్జీవన్‌రామ్‌కే తప్పలేదు కుల వివక్ష. గుడిని సందర్శించాడని మైలపడిందని పెద్ద ఎత్తున గుడి, శుద్ది చేసిన అవమానాలు జగ్జీవన్‌రామ్‌నుంచి డిప్యూటీ స్వీకర్‌, మినిస్టర్‌ సదాలక్ష్మిదాకా యింకా కొనసాగుతూనే వున్నయి. సమాజం దళితుల్ని చూసే దృష్టిలో మార్పు రావాలి.
 దళిత పిల్లలు చదువుకోడమే అంతంత మాత్రం. చదువుకునే ఒకరిద్దరిని కూడా ‘కులం’ మహమ్మారి బలి తీసుకుంటే వాళ్లెట్లా బతికి బట్ట కట్టేది? కనీసం చదువుకున్న తల్లిదండ్రులైనా తమ పిల్లలకు ‘కుల సమస్య’ అనేది కుల వివక్షకు గురి చేస్తున్న వాల్లు సిగ్గు పడాల్సిన సమస్య, గురవుతున్న వాళ్ళు సిగ్గు పడాల్సినది కాదనే అంబేద్కర్‌ చైతన్యమందిస్తే అనూషలాంటి పిల్లల చావుల్ని ఆపగలిగేవారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 80 లక్షల దళిత స్త్రీలున్నారు. వీరంతా చదువుల్లో ,ఉద్యోగాల్లో, రాజకీయాల్లో, అధికారాల్లో లేరు. కనీసం మనుషులుగా కూడా లేరు. వీరంతా మాన్యువల్‌ స్కావెంజర్లుగా, జోగినీలుగా, అసంఘటితరంగాలుగా,  సమాజంచిన్న చూపు చూసే పనులన్ని చేస్తున్నవారు. మానవ హక్కులు దరిచేరనివారు. దళిత మహిళల అభివృద్ధి దిశగా  ఎదిగే సమాజం కావాలి. 80 లక్షలుగా వున్న దళిత మహిళలకు దళిత మహిళా కమీషన్‌ ఏర్పాటు చేసి వారెదుర్కొంటున్న అన్ని రకాల హింసల్నించి,చావుల్నించి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. సమాజానిది.

Share
This entry was posted in మాక్క ముక్కు పుల్ల గ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.