స్ఫూర్తిదాయకమైన ప్రయాణం – ఓ. మంజుల

మంజుల అనే నేను 2010 నవంబర్‌ 15కి హైదరాబాద్‌కి వలస రావడం జరిగింది. రెండు బ్యాగులల్లో, ఒక బ్యాగులో బట్టలు ఇంకొక బ్యాగులో వండుకునే పాత్రలతో వచ్చాము. నేను ఎడమ చంకలో బాబుని, కుడి చేతిలో ఒక కిరోసిన్‌ డబ్బా మా హస్బెండ్‌ నెత్తి

మీద ఒక బ్యాగు చేతిలో ఇంకొక బ్యాగు తీసుకుని ఒక చిన్న ఇంట్లో అద్దెకు దిగాము. మా దగ్గర వంట చేసుకోవడానికి స్టవ్‌ కూడా లేదు. మా పక్కింటి వాళ్ళు ఒక కిరోసిన్‌ స్టవ్‌ ఒక చిన్న బకెట్‌ ఇచ్చారు. తెల్లవారు పొద్దున్నే లేచి పంపు స్టవ్‌లో కిరోసిన్‌ పోసి పొయ్యి వెలిగిద్దాం అంటే నాకు రాలేదు. మళ్ళీ పక్కింటి వాళ్లను పిలిచాము. ఆమె నిద్ర లేస్తూ ఒళ్ళు విరుచుకుంటూ బయటకి వచ్చి పంపు స్టవ్‌ బయటకి తెమ్మంది. బయటకు తెచ్చిన తర్వాత పంపుస్టవ్‌ ఎలా వెలిగించాలో చూపించింది. అప్పుడు అన్నము, ఊరు నుండి తెచ్చుకున్న కందిపప్పు చేశాను. బాబుకి పాలు వేడి చేశాను. మా హస్బెండ్‌కి అన్నం వడ్డించాను. టిఫిన్‌ కట్టాను అలాగే నేను బాబు కూడా తినేసాము. హస్బెండ్‌ 6000కి ఒక ప్రైవేట్‌ కంపెనీ జాబ్‌లో జాయిన్‌ అయ్యాడు మా హస్బెండ్‌. టిఫిన్‌ బాక్స్‌ ఒక కవర్లో పెట్టుకొని జాబుకి వెళ్ళాడు. అలా ఒక వారం రోజులు గడిచిపోయింది. వారం రోజుల తర్వాత తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నెల గడిస్తే గాని కంపెనీ వాళ్ళు జీతం ఇవ్వరు.
మా బస్తీలో డెకరేషన్‌ పనులు చేస్తారు. డెకరేషన్‌కి సంబంధించిన పువ్వులు కుచ్చుతారు. నాకు ఏదో ఒక పని చేయాలి డబ్బులు సంపాదించుకోవాలి అని ఒక తపన ఉండేది. కానీ ఒకటిన్నర సంవత్సరం బాబుని తీసుకొని ఏం పనికి వెళ్లాలి ఎవరు పనికిరానిస్తారు అని ఆలోచించుకొని బాధపడేదాన్ని. బాబుకి పాల ప్యాకెట్‌ కూడా కొనడానికి డబ్బులు లేవు. ఏదో ఒక పరిష్కారం వెతుక్కోవాలి. రోజు ఖర్చుల కన్న డబ్బులు సంపాదించుకోవాలి అని కిందకు దిగి ఒక మహిళా అందరికీ పువ్వులు ఒక గంపతో కొలిచి అందరికీ బస్తాలలో పోసి ఇస్తుంది. అలాగే నిలబడి చూస్తూ అడగాలా వద్దా నేను కొత్తగా వచ్చాను కదా అని అందరిని చూస్తూ అక్కడే నిలబడిపోయాను. లాస్ట్‌కు ఒక గంప పువ్వులు మిగిలాయి. అప్పుడు ధైర్యం చేసుకొని వెళ్లి ఆంటీ నాక్కూడా పువ్వులు పోస్తావా నేను కుచ్చుతాను అని అడిగాను. ఆమె ముఖమంతా ఏదో రకంగా పెట్టి నువ్వు కొత్తగా వచ్చావు కదా నీకు కుచ్చడం వచ్చా పువ్వులు పాడు చేస్తావేమో అని అన్నారు. అలా ఏం చేయను అప్పుడు గంప ఇచ్చి చూడండి సరిగ్గా కుచ్చకపోతే రేపటి నుండి ఇవ్వకండి అని చెప్పాను. ఒక గంప పువ్వులు కొలిచి ఒక కవర్లో పోసి ఒక దారం ఉండ ఒక పెద్ద సూది ఇచ్చింది. కుడి చేతిలో కవర్‌ పట్టుకొని ఎడమ చంకలో బాబుని ఎత్తుకొని పైకి వెళ్లాను. బాబుని పక్కన కూర్చోబెట్టుకొని పాడైన పువ్వులను బాబు ముందర వేసి ఆడుకోమని భయపడుతూ సూదిలో దారం ఎక్కించి పువ్వులు మెల్లగా కుచ్చాను. ఒక గంట టైం పట్టింది దండ అల్లి కిందికి వెళ్లి ఆంటీకి ఇచ్చేశాను. సరేనమ్మా బాగా తెచ్చావు. మళ్లీ రేపు వస్తే చెప్తాను అని చెప్పారు. అప్పుడు ఒక గంప పువ్వులుకు రెండు రూపాయలు నా చేతిలో పెట్టింది. ఎంతో సంతోషంతో మా బాబుకి చిన్న బిస్కెట్‌ ప్యాకెట్‌ తీసుకొని ఇంట్లోకి వెళ్లి తినిపించాను. అలా మళ్లీ రెండవరోజు రెండు గంపల పువ్వులు ఇచ్చింది. అలా రోజు రోజుకి పెరుగుతూ వచ్చాయి. ఒక వారం రోజుల తర్వాత 30, 40 కిలోలు బ్యాగుల పువ్వులు ఇవ్వడం స్టార్ట్‌ చేసింది. అలా రోజుకి 10 నుండి 15 రూపాయల వరకు సంపాదించుకునే దాన్ని. వచ్చిన డబ్బులతో పాలు బిస్కెట్లు కొనేదాన్ని. మా హస్బెండ్‌ని అడిగేదాన్ని కాదు. అలా నాకు సొంతంగా డబ్బులు సంపాదించుకుంటే భర్తని అడగవలసిన అవసరం లేదు కదా అని ఆలోచన వచ్చింది. మా ఇంటి పక్కన మహిళ పనిచేసే బొట్ల కంపెనీకి వెళ్లి తనని అడగాలని ఆలోచన వచ్చింది. అడిగాను బాబు ఉన్నాడు కదా ఎలా చేసుకుంటావు, బాబు చేసుకొనిస్తాడా అక్కడ ఖరీదైన మెటీరియల్స్‌ ఉంటాయి. బాబు ఏమైనా పాడు చేస్తాడేమో అని అన్నారు.
నేను బాబు పాడు చేయకుండా చూసుకుంటాను అని చెప్పాను. సరే ఒక రోజు రండి మా సార్‌తో మాట్లాడిస్తాను అని చెప్పారు. పొద్దున ఐదు గంటలకు లేచి వంట చేసి మా బాబుకి స్నానం చేయించుకుని భర్తకి టిఫిన్‌ కట్టి రెడీ అయి కవర్లో బాబుకి ఒక టిఫిన్‌ బాక్స్‌ పెట్టుకొని ఎడమ చంకలో బాబుని ఎత్తుకొని ఆమెతో కలిసి కంపెనీకి వెళ్లాను. అక్కడ సార్‌ని తను పరిచయం చేయించింది. బాబు
ఉన్నాడు కదమ్మా ఎలా చేస్తావు ఖరీదైన మెటీరియల్స్‌ ఉంటాయి అని సారు అన్నాడు. నేను చూసుకుంటాను సార్‌ నేను మెటీరియల్‌ ఏం పాడు చేయనీయను బాబుని పక్కన కూర్చోబెట్టుకుని మెటీరియల్స్‌ ముట్టుకొనీయకుండా చేసుకుంటాను. ఒక అవకాశం ఇచ్చి చూడండి ఒకవేళ మెటిరియల్‌ పాడైతే నేనే మానేసి తెలుసా అని చెప్పాను. సరేనమ్మా ఒక వారం చూస్తాను అని సారు అక్కడున్న ఇంచార్జ్‌కి చెప్పాడు. ఆమె నన్ను లోపలికి తీసుకెళ్లి అన్ని జాగ్రత్తలు చెప్పారు. అక్కడ ఒక 20, 30 మంది ఆడవాళ్లు ఉన్నారు. వాళ్ళందరూ నన్ను ఏ ఊరు ఎక్కడ నుండి వచ్చావు, ఎంతమంది పిల్లలు, నీ భర్త ఏం పని చేస్తాడు ఇంత చిన్న బాబును తీసుకొని ఎందుకు పనికి వచ్చావు అని గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేశారు. వాళ్ళందరికీ నవ్వుతూ సమాధానం చెప్పాను. నాకు సొంతంగా డబ్బు సంపాదించుకోవాలని ఇష్టంతోనే పనికి రావడం జరిగింది. ఖాళీగా కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు అని చెప్పాను. బాత్రూం పక్కన కొంచెం ప్లేస్‌ ఖాళీగా
ఉంటే అక్కడ కూర్చొని పని చేసుకో అని ఇంచార్జ్‌ చెప్పారు. బాబుకి పక్కన టవల్‌ పరచుకొని అందులో పడుకోబెట్టి మెటీరియల్‌ చెవిలో, ముక్కులో ఏమన్నా పడతాయన్న భయానికి కప్పాను. ఇంచార్జ్‌ కొన్ని స్టిక్కర్లు, గమ్ము ఇచ్చి ఎలా చేయాలో చూపించింది. అలా ఫస్ట్‌ డే 60 రూపాయల పని చేశాను. అలా రోజు రోజుకి ఎక్కువ డబ్బులు సంపాదించుకునే దాన్ని. రోజుకి 100 రూపాయల వరకు సంపాదించడం మొదలు నెలకి 3000 వరకు డబ్బులు సంపాదించాను. ఫస్ట్‌ జీతం 2100 రూపాయలు సంపాదించాను. మొదటి జీతం తీసుకున్నాక ఆ ముఖంలో తెలియని ఆనందం వచ్చింది. చాలా సంతోషంగా పొద్దున్నే లేచి తొందర తొందరగా పని చేసుకుని కంపెనికి వెళ్లిపోయి పనిచేయడం మొదలుపెట్టాను. వర్క్‌ కూడా ఇంకా పెద్ద మెటీరియల్‌ ఇచ్చారు. అలా నెలకి 4000 నుండి 5000 వరకు సంపాదించడం స్టార్ట్‌ చేశాను. నా మీద నాకు ఎంతో గౌరవం, ధైర్యం అనిపించేది. మా రిలేషన్‌లో ఆడవాళ్ళు అంత చిన్న బాబుని తీసుకొని పనికి వెళ్లడం అవసరమా అని అడిగేవాళ్లు. వాళ్లకి నేను పని చేసుకుని నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. నాకు పని చేయడం ఇష్టం నేను వెళ్తాను నేను చేసుకుంటాను. నాకు ఇంట్లో కూర్చోవడం ఇష్టం లేదు. కష్టపడి డబ్బులు సంపాదించుకోవడమే నాకు ఇష్టం అని గట్టిగా సమాధానం ఇచ్చాను.
8 నెలల వరకు బొట్టు బిల్లల కంపెనీలో వర్క్‌ చేశాను. నాలుగైదు నెలల తర్వాత కూర్చోవడానికి మంచి ప్లేస్‌, ఖరీదైన బొట్టు బిళ్ళలు చేయడానికి ఇచ్చారు. భాషింగాలు, తిలకాలు చేయడానికి ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. 8 నెలలకి సెకండ్‌ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్‌ అయింది. అప్పుడు హాస్పిటల్‌కి వెళ్లి చెకప్‌ చేయించుకుంటే రెస్ట్‌ చెప్పారు. కంపెనీకి వెళ్లడం మానేశాను. వారంకి ఒకసారి వెళ్లి వర్క్‌ తెచ్చుకొని ఇంటిదగ్గర నాకు కుదిరిన టైంలో వర్క్‌ చేసుకునే దాన్ని, అలా వారంకి 300, 400 వరకు డబ్బులు సంపాదించుకునేదాన్ని. తర్వాత పూర్తి బెడ్‌ రెస్ట్‌ తీసుకున్నాను. 5 నెలలు డెలివరీ తర్వాత పెద్దబాబును ఇంటి దగ్గర ఉన్న స్కూల్‌లో వేశాను. బాబుని 3 గంటలకు ఇంటికి పంపిస్తారు. బొట్ల కంపెనీలు ఐదు వరకు ఉండాలి. ఏం చేయాలి అని ఆలోచించి అప్పుడు మా కింది ఫ్లోర్లో ఒక అమ్మాయి ఆఫీసులో టెలికాలర్‌గా పనిచేసేది. తనని వెళ్లి అడిగాను నాకు 9:30 నుండి 3 వరకు వర్క్‌ చేసుకుంటాను. ఒక్కసారి మీ ఆఫీసులో అడగండి అని ఆ అమ్మాయితో చెప్పాను. ఆ అమ్మాయి వాళ్ళ సార్‌తో మాట్లాడి పనిచేయడానికి అక్కడ అవకాశం కల్పించింది. అక్కడ పనిచేసి డబ్బులు సంపాదించాను. పెద్దబాబును స్కూల్‌లో దింపి, చిన్న బాబుని కంపెనీకి తీసుకెళ్ళెదాన్ని. పని చేసుకునేటప్పుడు బాబుని ఒళ్ళో పడుకోబెట్టుకొని, పాలిస్తూ పనిచేసేదాన్ని, అలా బాబుకి మూడు సంవత్సరాలు వచ్చే వరకు పని చేసాను. ఒకరోజు మా ఇంటికి మా మేనత్త కొడుకు వరుసకి బావ మా ఇంటికి వచ్చాడు. ఆయన ఒక ఎన్జీవోలో వర్క్‌ చేస్తాడు. నాకు చిన్నప్పటి నుండి ఎన్జీవో అంటే చాలా అభిమానం ఎందుకంటే నేను చదువుకుంటున్నప్పుడు బ్రెయిన్‌ ఫీవర్‌ వస్తే నన్ను బ్రతికించి వాళ్లే పెళ్లి చేసారు. తర్వాత అత్త వాళ్ళ ఇంట్లో గొడవలు అయినప్పుడు నాకు సపోర్ట్‌గా ఉండి, వాళ్లే నాకు ప్రెగ్నెంట్‌ వచ్చినప్పుడు హాస్పిటల్‌లో చూయించి వాళ్లే 8వ నెలలో చెకప్‌కు వెళ్తే అక్కడ పెయిన్స్‌ స్టార్ట్‌ అయ్యాయి, అప్పుడు ఎన్జీవోల వర్క్‌ చేసే స్టాప్‌ వాళ్ళ ప్యాకెట్‌ మనీ తీసి నాకు ఆటో మాట్లాడి వికారాబాద్‌ నుండి హైదరాబాద్‌ నిలోఫర్‌ హాస్పిటల్‌ పంపించారు. మేము ఐదుగురం ఆడపిల్లలం, నాన్న చిన్నప్పుడే చనిపోయాడు, మా ఇంట్లో ఎవరు పెద్దగా చదువుకోలేదు.
ఒక ఎన్జీవో వల్ల నేను బ్రతికాను. పెళ్లి తర్వాత వాళ్ళు ఉన్నారని నాకు ఒక భరోసా. ఇప్పటికి ఆ ఎన్‌ జి ఓ అంటే నాకు చాలా అభిమానం అందుకని మా బావ కూడా ఒక ఎన్జీవోల వర్క్‌ చేస్తాడు. టెన్త్‌ చదువుకున్న ఇంగ్లీష్‌ రాదు. ఈ హైదరాబాదులో నాకు ఎవరు ఎన్జీవోలకు తీసుకుంటారు అని అనుకున్నాను. కానీ అడిగి చూద్దామని మా బావకి తెలిసిన వాళ్ళ డైరెక్టర్‌తో మాట్లాడి నన్ను పెట్టించాడు. డ్యూటీలో జాయిన్‌ అయినా రెండు మూడు రోజులకే నాకు అక్కడ ఉన్న స్టాప్‌ ఊరి నుండి వచ్చావు ఏమీ తెలియదు ఎట్లా తీసుకున్నాడు అమ్మా సారు అని నాతో కొలీగ్స్‌ అన్నారు. నిజంగానే నాకు ఒక ఆఫీసులో ఏ కుర్చీలో ఎవరు కూర్చుంటారు, ఎలాంటి ప్రాసెస్‌
ఉంటుందో ఏమి తెలియదు. మనసులో బాధపడ్డాను కానీ ఎన్జీవోల వర్క్‌ చేయాలి అని ఒక పట్టుదలతో సంవత్సరమున్నర కాలం పని చేశాను. తర్వాత భూమికలో వేకెన్సీ ఉన్నాయని తెలిసి అప్లై చేసాను. భూమికలో సెలెక్ట్‌ అయ్యాను. భూమికలో జాయిన్‌ అయినప్పుడు నాకు అసలు ఆడవాళ్లకు చట్టాలు ఉంటాయని కూడా తెలియదు. అందులో జాయిన్‌ అయిన తర్వాత చట్టాల గురించి తెలుసుకున్నాను. భూమికలో జాయిన్‌ అయిన తర్వాత చాలా ట్రైనింగ్సు, బుక్స్‌ చదవడం, బస్తీలోకి వెళ్లి బస్తీ వాసులతో మాట్లాడుతున్న సమయంలో ఎవరైనా నాకు సమస్య చెప్పినప్పుడు నా అనుభవాలు మరియు నేను తీసుకున్న ట్రైనింగ్స్‌లో అనుభవాల వల్ల బస్తీ మహిళలతో చాలా చురుగ్గా పనిచేసుకోగలుగుతున్నాను. నాకు భూమికలో జాబ్‌ రావడం వల్ల చిన్నప్పటి కోరిక నెరవేరిందని చాలా సంతోషంగా అనిపిస్తుంది. హైదరాబాదుకి వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. నా సంపాదన రెండు రూపాయల నుంచి ఇప్పుడు 22,000 సంపాదించుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏ పనినైనా, ఎక్కడైనా పని చేయగలనన్న ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతో నేను నా జీవనాన్ని ముందుకు తీసుకెళ్తూ పిల్లల అభివృద్ధిలో మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నాను.

Share
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.