అత్తయ్య వెళ్ళిపోయాక ఇల్లంతా ఖాళీ అయిపోయిన ఫీలింగ్. రోజూ ఆవిడకి ఏమి పెట్టాలి, ఏమి వండాలి అనే ఆలోచనతో బుర్ర కూడా బిజీగా ఉండేది. ప్రతిరోజూ సైరాతో సునీతతో ఒక అరగంట డిస్కషన్స్ ఉండేవి. ఇవేమీ లేకపోయేసరికి బుర్ర కూడా ఖాళీ అయిపోయిన ఫీలింగ్…
అత్తయ్య ఆవిడ జీవితాన్ని తన చేతుల్లోకి తీసేసుకుని ఎలా కావాలో అలా మలుచుకున్నారు. అసలు helplessness అనే పదం ఆవిడ డిక్షనరీలోనే లేదు. అలా అని ఆవిడ జీవితం సాఫీగా ఏమీ జరగలేదు. టీవీ సీరియళ్ళలో ఉండే కష్టాలన్నీ పడ్డారు. కానీ ఎప్పుడూ జంకలేదు. అన్నిటినీ ధైర్యంగా హ్యాండిల్ చేసుకున్నారు. చాలా ఛార్మింగ్ లేడీ. ఎక్కడికి వెళ్ళినా మనుషులతో ఎలా మాట్లాడాలో తెలుసు. అనర్గళంగా మాట్లాడే వాక్చాతుర్యం ఉన్న మనిషి. తనకి ఏమి కావాలో అది సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి మరీ సాధించుకున్నారు. నా definition of ‘successful person’ ఈవిడే. ఆఖరికి డెత్‌ని కూడా ఆవిడ టర్మ్స్‌లోనే యాక్సెప్ట్ చేశారు. ఎప్పుడూ చదువుకుంటూ, రాసుకుంటూ, పాడుకుంటూ
ఉండేవారు. నాకు కష్టం వచ్చినప్పుడల్లా పాటలు పాడుకునేదాన్ని అని చెప్పేవారు. లాస్ట్‌లో ఆవిడ సరిగ్గా పాడలేకపోతున్నారు అని మేం బెంగపడ్డాం కానీ అది కూడా sportive గానే తీసుకున్నారు… ఈ వయసులో అది సహజమే కదా అంటూ. ఇంత positive mindset తో జీవితాన్ని పరిపూర్ణంగా జీవించిన అత్తయ్యకి ఇంకొంచెం మంచి ending ఇవ్వాలని మేమందరం కలిసి ఆవిడ బాడీని మెడికల్ కాలేజీకి డొనేట్ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ విధంగా ఆవిడ జీవితం ఇంకొంచెం అర్థవంతంగా ముగిసింది. ఇంకొక్క మాట… బాడీని ఇచ్చేసి వచ్చేసే ముందు అందరం ఆవిడ చుట్టూ నిలబడి ఆవిడకి, మా అందరికీ కూడా ఇష్టమైన పాట ‘ఆచల్ కె తురేa మై లేకే చలూం ఏక్ ఐసే గగన్ కే తలే…’ అని పాడడం ఒక గ్రాండ్ ఫినాలే. గుడ్‌బై అత్తయ్యా…