తీయనైనది తెలుగు
తీయనైనది తెలుగు
మన జీవితానికి తెస్తుంది వెలుగు
గొప్ప గొప్ప కవులను కలిగి ఉన్నది
పేరు ప్రఖ్యాతలు పొంది ఉన్నది
తెలుగుదనానికి మించిన ఘనత లేదు
మన తెలుగు భాషకు తిరుగే లేదు
త్యాగయ్య కృతులతో
అన్నమాచార్యుని రచనలతో
ఎన్నో సామెతలతో
మరెన్నో పొడుపు కథలతో
తెలుగు భాష కొరకు ఊపిరులూదిన పిడుగు
దేశమంటే మనుషులేనని చాటి చెప్పిన అప్పారావు
ఇవన్నీ తెలుగు జ్ఞాపకాలే
` ఎన్.జ్ఞానేశ్వరి, 8వ తరగతి
వచ్చింది వచ్చింది తెలుగు రోజు
వచ్చింది వచ్చింది తెలుగు రోజు
మన గిడుగు రామ్మూర్తి గారి పుట్టిన రోజు
కఠిన భాషను తొలగించి
మాతృభాష అయిన తెలుగులో
ఎంతోమంది తెలుగు యోధులు
అమ్మ ప్రేమలా అచ్చమైనది
పాలలా స్వచ్ఛమైనది
దేశభాషలందు తెలుగు లెస్స అంటూ
ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనిపించుకుంటూ
అమ్మలాడు భాష
అమృతం వంటి భాష
ఇదే మన తెలుగు భాష!
` తనుశ్రీ, 8వ తరగతి
నా దేవత అమ్మ
కనిపించే దేవత అమ్మ
దేవుడిచ్చిన వరం అమ్మ
నా తొలి మిత్రురాలు అమ్మ
తీర్చలేని రుణం అమ్మ
అంతులేని ప్రేమ చూపేది అమ్మ
మొదట పలికిన పలుకు అమ్మ
మొదట చూసిన చూపు అమ్మ
కష్టంలో తోడు అమ్మ
వెన్నంటి నడిపేది అమ్మ
అమ్మ లేనిదే నేను లేను
అమ్మ లేనిదే ఈ లోకం లేదు
` వి.ఆశ్రిత శ్రీవర్ష, 7వ తరగతి